Leader arrested
-
ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. 24 గంటల్లోపే అరెస్ట్
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర మంత్రి రాజా పటేరియా అరెస్ట్ అయ్యారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మధ్యప్రదేశ్ హోం శాఖ స్పందించింది. పటేరియా మీద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పన్నాలోని పవాయ్ పోలీస్ స్టేషన్లో సోమవారం మధ్యాహ్నాం కేసు రిజిస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం పన్నా జిల్లాలోని పవాయ్ పట్టణంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి సోమవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ‘ఇక త్వరలో మోదీ ఎన్నికల తంతుకు మంగళం పాడుతారేమో. భాష, కులం, మతం ప్రాతిపదికన జనాలను విడగొడతారు. రాజ్యాంగ నియమాలను కాలరాస్తూ దళితులు, గిరిజనులు, మైనారిటీల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తున్నారు. ఇకనైనా రాజ్యాంగ పరిరక్షణ జరగాలంటే మోదీని చంపేందుకు సిద్ధంకండి. చంపడమంటే ఓడించడమే’ అని పటేరియా చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. సోమవారం ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. పటేరియాపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని ఆదేశించారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు, దళితులు, మైనారిటీల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యాఖ్యలు చేశారంటూ పలు సెక్షన్ల కింద పవాయ్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను సీఎం శివరాజ్ సింగ్ సైతం తీవ్రంగా ఖండించారు. Congress leader & former minister Raja Pateria incites people to kill PM Modi - earlier too Cong leaders spoke about death of PM Modi (Sheikh Hussain) But now a death threat! After “Aukat dikha denge” “Raavan” this is Rahul Gandhi’s Pyaar ki Rajniti? Will they act on him? No! pic.twitter.com/wH6LSi63g2 — Shehzad Jai Hind (@Shehzad_Ind) December 12, 2022 ఇక ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ విభాగం సైతం ఖండించింది. అయితే.. ‘ నా ఉద్దేశం బీజేపీని, మోదీని ఓడించాలని. చంపాలని కాదు. నా వ్యాఖ్యలను వక్రీకరించారు’ అని తర్వాత పటేరియా వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కేసు నమోదు కావడంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
గత 2 నెలలుగా బాలికను వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడు: ఏసీపీ
సాక్షి, విజయవాడ: విజయవాడ విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లోని ఒక అపార్ట్మెంట్ పైనుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో కలకలంగా మారిన విషయం తెలిసిందే. బెంజి సర్కిల్ వద్ద గల ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక నిన్న(శనివారం) ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక సూసైడ్ నోట్లో పేర్కొందని స్థానిక ఏసీపీ హనుమంతరావు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 306 సెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్టు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. లైంగిక వేధింపుల వల్లే బాలిక చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడిని, అతని కుటుంబ సభ్యుల్ని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టామని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని సెక్షన్ల కింద కేసులను నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా వినోద్ జైన్ ఇంటిని ఇప్పటికే సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. గత 2 నెలలుగా బాలికను.. వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఈ క్రమంలో బాలిక ఎవరికీ చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించిందని అన్నారు. నిందితుడు వినోద్‌జైన్.. ఎలాంటి ఇబ్బందులకు గురిచేసేవాడో బాలిక సూసైడ్ నోట్లో రాసిందని ఏసీపీ తెలిపారు. బాలిక.. లిఫ్ట్‌లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బాలికను వేధించేవాడని సూసైడ్ నోట్లో రాసింది. కాగా, రెండు పేజీల్లో బాలిక తన బాధను తెలియజేసిందని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు. చదవండి: బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది: వాసిరెడ్డి పద్మ -
విగ్రహం మలినం కేసు: టీడీపీ నేత అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్: వినాయకుని విగ్రహానికి మలినం పూసిన కేసులో టీడీపీ నాయకుడిని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వల్లేపల్లి ప్రసాద్‌బాబు ఎలియాస్ బాబూఖాన్ చౌదరికి స్థానిక వెంకటగిరి ప్రాంతంలో ఇల్లు ఉంది. దానికి వీధి శూల ఉండడంతో ఇంటి గేటు వద్ద వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు మలినం పూశారని, హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని బాబూఖాన్ చౌదరి గత ఏడాది సెప్టెంబర్ 12న విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగత పీఏ చిటికిన సందీప్, బీజేపీ నాయకులు అడపా వరప్రసాద్, కరుటూరి శ్రీనివాసరావులు ఫేస్బుక్, ప్రసార మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై బాబూఖాన్ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ లక్ష్మణరెడ్డి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. వినాయక విగ్రహానికి మలినం పూసి, ప్రజలను తప్పుదోవ పట్టించి, తప్పుడు ప్రచారం చేసింది బాబూఖాన్‌చౌదరేనని నిర్ధారించారు. దీంతో గురువారం రాత్రి అతడిని అరెస్టు చేసి, శుక్రవారం ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అతడికి 15 రోజులు రిమాండ్ విధించి, కాకినాడ సబ్‌జైలుకు తరలించారు. ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన చిటికిన సందీప్, అడపా వరప్రసాద్, కరుటూరి శ్రీనివాసరావులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ లక్ష్మణరెడ్డి తెలిపారు. -
రైల్వే పోలీసుల అదుపులో టీడీపీ నాయకుడు
కావలి: మండలంలోని చెన్నాయపాళేనికి చెందిన టీడీపీ నాయకుడు మర్రి రవిని శనివారం వేకువన నెల్లూరు రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారు బిస్కెట్ల దందాకు సంబంధించిన రూ.50 లక్షలను నకిలీ రైల్వే పోలీసులు మాయం చేశారు. బంగారు వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రైల్వేపోలీసులు చెన్నాయపాళెం చేరుకుని రవిని అదుపులోకి తీసుకోవడం గ్రామంలో కలకలం రేగింది. ఈ విషయాన్ని టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా విషయం తెలుసుకుని తొందరపడి జోక్యం చేసుకుంటే అభాసుపాలవుతామని మిన్నకుండిపోయినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు.. కావలిలో కొందరు బంగారు వ్యాపారులు జీరో దందా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. చెన్నైలో బంగారాన్ని బిల్లులు లేకుండా కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. స్థానిక వ్యాపారి ఒకరు రూ.50లక్షలు చెన్నై నుంచి బంగారాన్ని తీసుకొచ్చే సీజన్ బాయ్‌కి అప్పగించాడు. పోలీసులు, ఐటీ అధికారుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు మహిళలను అతనికి తోడుగా పంపాడు. బుధవారం నవజీన్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన వీరు నెల్లూరుకు చేరుకోగానే రైల్వే పోలీసులమని కొందరు వ్యక్తులు వచ్చి రూ.50లక్షలు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీజన్ బాయ్ కావలిలోని బంగారు వ్యాపారికి తెలియజేశాడు. వెంటనే సదరు వ్యాపారి తనకు పోలీసు వర్గాల్లో ఉన్న పరిచయాల ద్వారా నగదు తీసుకెళ్లింది నకిలీ పోలీసులని నిర్ధారించుకుని నెల్లూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు సీజన్ బాయ్‌తో పాటు ఇద్దరు మహిళలను విచారించారు. మహిళల్లో ఒకరి ఫోన్ నుంచి టీడీపీ నాయకుడు రవి ఫోన్‌కు పెద్ద సంఖ్యలో కాల్స్ వెళ్లిన విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు రవిని అదుపులోకి తీసుకుని నెల్లూరు తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. కాగా టీడీపీ నాయకుడైన రవికి దూరపు బంధువు వెంకయ్య చెన్నాయపాళెం వీఆర్ఏగా వ్యవహరిస్తున్నాడు. వెంకయ్య విడవలూరు మండలం రామతీర్థంలో నివాసం ఉంటున్నాడు. దీంతో రవి వీఆర్ఏగా గ్రామంలో హల్చల్ చేస్తుంటాడు. వివాహితుడైన రవి రాత్రి వేళల్లో గ్రామంలో ఉండడు. తనకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక విధులు అప్పగించారని, అందుకే రాత్రి వేళల్లో డ్యూటీలు చేయాల్సి వస్తోందని గ్రామస్తులకు చెబుతుండేవాడు. కాగా జీరో దందాలో పనిచేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నేరం జరగడానికి ముందు, వెనుక ఆమెతో ఫోన్లో పలుమార్లు మాట్లాడడంతో రవిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. -
ఆప్ కార్యాలయంపై దాడి
సాక్షి, న్యూఢిల్లీ: కౌశంబీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాల యం పై హిందూ రక్షా దళ్‌కు చెందిన కొందరు వ్యక్తులు బుధవారం ఉదయం దాడిచేశారు. ఎర్ర జెండాలు, లాఠీలతో ఆప్ కార్యాలయానికి వచ్చిన కొందరు వ్యక్తులు ఆప్ కార్యాలయం బయట ఉన్న పూల కుం డీలు ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ కాశ్మీర్ైలో సైన్యం ఉపసంహరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడినవారిలో ఒకడైన పింకీ చౌదరిని సాహిబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కౌశంబీలో ఆప్‌కు మూడంతస్తుల కార్యాల యం ఉంది. ఇది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చాలా దగ్గరలో ఉంది. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో నాలుగైదు వాహనాలలో వచ్చిన వ్యక్తులు ప్రశాంత్‌భూషణ్‌కు, అరవిం ద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జైశ్రీరామ్ అంటూ కార్యాలయంపై దాడిచేశారు. ఆ సమయంలో కార్యాలయంలో కొద్దిమంది మాత్రమే కార్యకర్తలు ఉన్నారు. కానీ దాడిలో వారెవరికీ గాయాలు కాలేదు. దాడికి వచ్చిన వారిని చూసిన కార్యకర్తలు వెంటనే లోపలికి వెళ్లి తలుపులు మూసుకున్నారు. సుమారు 50 మంది లాఠీలు, కర్రలతో హఠాత్తుగా కార్యాలయంలోకి ప్రవేశించి దాడిచే శారని ఆప్ ప్రతినిధి దిలీప్ పాండే చెప్పారు. మరికొందరు ఇటుకలు, రాళ్లు కూడా విసిరారని ఆయన చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆప్ కార్యాకర్తలు లోపలకు పరుగెత్తి తలుపులు మూసుకుని పై అంతస్తుకు వెళ్లిపోయారని ఆయన చెప్పా రు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన చెప్పారు. సీసీటీవీ పుటేజ్ ద్వారా ఆప్ కార్యాలయంపై దాడిచేసిన వారి ని గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకునేందు కు ప్రయత్నిస్తున్నామని ఘజి యాబాద్ ఎస్ఎస్పీ ధర్మేందర్ సింగ్ చెప్పారు. దాడికి పాల్పడినవారు వచ్చిన వాహనాల నంబర్ల ను కూడా నమోదు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. దాడి ఘటనలో ప్రధాన నిందితుడైన పింకీ చౌదరితో పాటు మరో 12మందిని సాహిబాబాద్‌లో యూపీ పోలీసులు అరెస్టుచేశారు. కాగా, కార్యాలయంపై దాడిని తామే చేసినట్లు హిందూ రక్షా దళ్ అధ్యక్షుడు విష్ణు గుప్తా అంగీకరించారు. కాశ్మీర్‌పై ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాము ఈ దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పారు. ప్రశాంత్ భూషణ్‌ను వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా తాను ప్రశాంత్‌భూషణ్‌పై దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పారు. స్థానిక భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన కార్యకర్తలు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు గుప్తా చెప్పారు. అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని భజరంగ్ దళ్ తెలిపింది. కాశ్మీర్లో సైన్యం ఉండా లా వ ద్దా అన్న దానిపై ప్రజాభిప్రాయసేకరణ జరపాలని, సైన్యం ఉండనవసరం లేదని కాశ్మీరీలు అభిప్రాయపడినట్లయితే సైన్యాన్ని అక్కడ నుంచి తొలగించాలని భూషణ్ ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో చెప్పారు. కాగా, అది ప్రశాం త్ భూషణ్ వ్యక్తగత అభిప్రాయమని, కాశ్మీర్లో ఎలాంటి ప్రజాబిప్రాయ సేకరణను ఆమ్ ఆద్మీ పార్టీ కోరడం లేదని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇదివరకే స్పష్టం చేశారు. భద్రత పెంపు ఆప్ కార్యాలయంపై జరిగిన దాడితో కౌశంబీలోని అరవింద్ కేజ్రీవాల్ నివాసం, పార్టీ కార్యాలయాల వద్ద యూపీ పోలీసులు భద్రత పెంచారు. ప్రశాంత్ భూషణ్ కార్యాలయం వద్ద సైతం భద్రతను పటిష్టం చేశా రు. ఢిల్లీ సచివాలయంలో ఎస్ఎస్బీ జవాన్లను మోహరించారు. జనతా దర్బార్ కోసం తెరచిన గేట్ నంబర్ 4 వద్ద ఎస్ఎస్బీ జవాన్లను మోహరించడంతో పాటు బారికేడ్లను అమర్చారు. ఇదిలా ఉండగా దాడి తర్వాత కూడా భద్రతను స్వీకరించడానికి కేజ్రీవాల్ నిరాకరించారు. తనకు భద్ర త అవసరం లేదని, ఇలాంటి దాడుల ముసుగులో భద్రతను పెంచుకోవడాన్ని తాను వ్యతిరేకిస్తానని ఆయన స్పష్టం చేశారు.అయితే భద్రత తీసుకోవాలా లేదా అనేదానిపై కార్యకర్తల అభిప్రాయం తెలసుకుంటానని, వారు అంగీకరిస్తే కార్యాలయం లో భద్రత కోరుతానని కేజ్రీవాల్ చెప్పారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఖండించాయి. ‘ప్రశాంత్’వ్యాఖ్యలపై భజరంగ్‌దళ్ ఆందోళన జమ్మూకాశ్మీర్ అంశంపై ఆమ్ఆద్మీపార్టీ నాయకుడు ప్రశాంత్‌భూషన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. ప్రశాంత్‌భూషన్ వ్యాఖ్యలను నిరసిస్తూ భజరంగ్‌దళ్ సభ్యులు బుధవారం జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించారు. ప్రశాంత్భూషన్పై చర్యలు తీసుకోవాలంటూ వా రు రాష్ట్రపతికి ఓ లేఖ రాశారు. జంతర్‌మంతర్‌లో ప్రదర్శనలో భాగంగా ఆమ్నేత కే జ్రీవాల్,ప్రశాంత్‌భూషణ్ ఫొటోలను దహ నం చేశారు. భజరంగ్‌దళ్ ఢిల్లీ నాయకులు శివ్‌కుమార్ ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, దాని పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారంతా దేశద్రోహులుగానే పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశప్రజలకు ప్రశాం త్భూషణ్తోపాటు ఆప్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే అంశంపై నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. దుండగులకు బీజేపీతో సంబంధాలు ప్రశాంత్ భూషణ్ విమర్శ ఆప్ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారికి భారతీయ జనతాపార్టీతో సంబంధాలున్నాయి. ఆప్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి భయంతోనే బీజే పీ, సంఘ్‌పరివార్ ఇలా పరోక్షంగా దాడులకు దెగబడుతున్నాయి. ఇప్పటి దాడికి పాల్పడినట్లు చెప్పుకుంటున్న విష్ణు గుప్తా 2011లో తేజేందర్ సింగ్ బగ్గాతో కలిసి సుప్రీం కోర్టులోని నా చాంబర్లోనే నాపై దాడికి పాల్పడ్డారు. బగ్గాకు బీజేపీకి చాలా సన్నిహితమైన వ్యక్తి. బీజేపీ హస్తముంది: కుమార్ విశ్వాస్ దాడిలో బీజేపీ హస్తముంది. ఢిల్లీ ఎన్నికల్లో వారు ఊహించిన దానికి వ్యతిరేకంగా జరగడంతో, ఇప్పు డు లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందనే భయంతోనే ఆప్ కార్యాలయంపై దాడిచేయించారు. ఇది కరెక్ట్ కాదు... ఎవరి వ్యాఖ్యలైనా నచ్చకపోతే ఆందోళనలు చేయొచ్చు.. ధర్నాలు నిర్వహించవచ్చు.. లేదా కోర్టుకు వెళ్లవచ్చు.. అంతేకాని భౌతిక దాడులకు దిగడం వల్ల సమస్య మరింత జటిలమవుతుందే తప్ప పరిష్కారం కాదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: బీజేపీ నే అబ్బాస్ నఖ్వీ ఆప్ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం. నింది తులు ఎవరైనా సరే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. అలాగే ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలపై మేం ఇంతకుముందే స్పందించాం. ఆయన వ్యాఖ్యలు దేశ సమగ్రత ముప్పు అని అప్పుడే వ్యాఖ్యానించాం. దాడి అహేతుకం: కాంగ్రెస్ నేత రాషిద్ అల్వీ ఆప్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా చర్యలు తీసుకోవాల్సిందే. శాంతి భద్రతల విషయంలో యూపీ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరిం చాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎవరిని చంపాలనుకుంటున్నారు..? ఆప్ కార్యాలయంపై దాడి హేతుకం కాదు. హింసతో సమస్యలు పరిష్కా రం కావు. దాడికి పాల్పడిన వారు నాతో చర్చకు రావాలి. వారు ఏం కోరుకుంటున్నారు.. ప్రశాంత్జీని చంపాలనుకుంటున్నారా..లేక నన్ను చంపాలనుకుం టున్నారా.. మమ్మల్ని చంపడం ద్వారా కాశ్మీర్ సమస్య పరిష్కా రం అవుతుందనుకుంటే చావడానికి మేం సిద్ధం. కాశ్మీర్ సమస్యపై ప్రశాంత్ జీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, దానికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదని మేం పార్టీ తరఫున ఎన్నో సార్లు స్పష్టం చేశాం. అయి నా ఇంకా వారు దాడులు కొనసాగిస్తున్నారు అంటే వివాదాన్ని సజీవంగా ఉంచడం కోసమే వారు ఇలా ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. దీనిపై చర్చకు రమ్మంటే ఎక్కడకు రమ్మన్నా రావడానికి నేను సిద్ధం.. -
సమైక్యవాదమే నేరమా?
చింతలపూడి/కామవరపుకోట/టి.నరసాపురం, న్యూస్‌లైన్ : సమైక్యవాదాన్ని వినిపిస్తే సంకె ళ్లు తప్పవా? జిల్లాలో పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. తమ పర్యటనను ఎక్కడ అడ్డుకుంటారోనని కేంద్ర, రా ష్ట్ర మంత్రుల ఆదేశాలతో పోలీసులు మరోసారి వైసీపీ నేతలు, సమైక్యవాదులను గృహ నిర్బంధం, అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణలు ఆదివారం చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరి పర్యటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ సహా 22 మంది వైసీపీ నేతలు, సమైక్యవాదులను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ఆదివారం ఉదయంచింతలపూడిలోని రాజేష్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేస్తున్నట్టు చెప్పారు. గతేడాది డిసెంబర్ 17న చింతలపూడి విచ్చేసిన కావూరిని రాజేష్ నాయకత్వంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కేంద్రమంత్రి సమైక్య వాదులను వెధవలు, సన్నాసులు, లంచగొండులని దుర్భాషలాడటంతో సమైక్యవాదులు ఆయనపై కోడిగుడ్లతో దాడికి దిగారు. అప్పటి ఘటనలో రాజేష్‌తో పాటు 22 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం, మరుసటి రోజు కావూరి ఒత్తిడితో 20 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లోని కామవరపుకోట, టి.నరసాపురంలో కేంద్రమంత్రులు కావూరి, జేడీ శీలం, రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణ పర్యటించారు. సమైక్యవాదులు వారి పర్యటనను అడ్డుకుంటారన్న భయంతో ముందస్తుగా రాజేష్‌తో పాటు సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, వైసీపీ మండల కన్వీనర్ తుమ్మూరి వెంకట్రామిరెడ్డి, సీహెచ్ నరేంద్రరాజు, తోట కుమార్, రామరాజునాయక్లను నిర్బంధంలోకి తీసుకుని సాయంత్రం విడిచిపెట్టినట్టు ఎస్సై బి.మోహన్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సమైక్య ఉద్యమానికి మద్దతు కోరినందుకు తమపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కామవరపుకోట, టి.నరసాపురంలో.. కామవరపుకోటలో వైసీపీ మండల కన్వీనర్ మిడతా రమేష్‌ను పోలీసులు ఆయన ఇంటిలో నిర్బంధించారు. బయటకు రాకుండా ఇంటి బయట నలుగురు కానిస్టేబుళ్లు కాపలా ఉన్నారు. మంత్రుల సభ అనంతరం ఆయనను విడిచి పెట్టారు. తడికలపూడిలో వైఎస్సార్ సీపీ నాయకులు వై శ్రీను, ఈడ్పుగంటి సత్యవర ప్రసాద్, చలమాల సుబ్బారావు, సరికొండ కాళిదాసులను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. వారితో పాటు సమైక్యవాదులు ఆడ మిల్లి లక్ష్మీపతినగర్కు చెందిన మద్దిపాటి శ్రీనివాసరావు, బొకినాల ఏసు, తానంకి శ్రీను, తానేటి జాన్‌రాజు, తానేటి వెంకటేశ్వరరావు, తానేటి రామకృష్ణ అనే ఆరుగురు వ్యక్తులను స్టేషన్లో నిర్బంధించారు. తడికలపూడి, ఆడమిల్లిల్లో మంత్రుల పర్యటన అనంతరం వీరిని విడుదల చేశారు. టి.నరసాపురంలో నలుగురు వ్యక్తులను ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు ఎస్సై డి.రాంబాబు తెలిపారు. బొర్రంపాలానికి చెందిన గుండె ముక్కరామయ్య, గుండె మాణిక్యాలరావు, చల్లా ఆనందరావు, గాది రాంబాబులను అరెస్ట్ చేసి సాయంత్రం బెయిల్‌పై విడుదల చేసిన ట్టు ఆయన వివరించారు.