లీడింగ్ మ్యాన్
హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ స్క్వాజెనెగ్గర్ ఇన్నేళ్ల తరువాత తన అంతరంగాన్ని బయటపెట్టాడు. తానెప్పుడూ లీడింగ్ మ్యాన్‌గా ఉండాలనే కోరుకునేవాడినని... ఆ ఆలోచనా ధోరణే నేడు ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పాడు. ఉన్నట్టుండి వచ్చిన స్టార్డమ్ కాదన్నాడు. ‘ఆలోచనలు గొప్పగా ఉంటే గొప్పగా ఎదుగుతారనే సూత్రాన్ని విశ్వసిస్తాను. కావల్సిందల్లా... స్పష్టమైన లక్ష్యం, ఆ లక్ష్యం కోసం పాటుపడటం. నా చూపు ఎప్పుడూ టాప్ పొజిషన్‌పైనే ఉండేది. అది నన్ను సక్సెస్ కోసం పరితపించేలా చేసింది’ అన్నాడు మాజీ మిస్టర్ యూనివర్స్.