Lending institutions
-
రెలిగేర్ ఫిన్వెస్ట్ వన్‌టైమ్ సెటిల్మెంట్
న్యూఢిల్లీ: సొంత అనుబంధ సంస్థ రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ 16 రుణదాత సంస్థలతో వన్‌టైమ్ సెటిల్మెంట్ పూర్తిచేసుకున్నట్లు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ తాజాగా పేర్కొంది. ఇందుకు పూర్తి తుది చెల్లింపుకింద రూ. 400 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించింది. గడువుకంటే దాదాపు నెల రోజుల ముందుగానే మార్చి 8న సెటిల్మెంట్ను పూర్తి చేసినట్లు తెలియజేసింది. 2022 డిసెంబర్ 30న కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సెటిల్మెంట్ పూర్తికావడంతో గత ప్రమోటర్ల అవకతవకల కారణంగా తలెత్తిన లెగసీ సమస్యలకు ముగింపు పలికినట్లు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్శన్ రష్మి సలుజ పేర్కొన్నారు. కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో 2018 జనవరి నుంచి రెలిగేర్ ఫిన్వెస్ట్ రూ. 9,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు ప్రస్తావించారు. కాగా.. తాజా సెటిల్మెంట్ పూర్తి నేపథ్యంలో తిరిగి ఎంఎస్ఎంఈలకు రుణాలందించడం తదితర బిజినెస్‌లను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. -
వ్యవసాయానికి రుణాల దన్ను!
రుణాల లక్ష్యం మరో రూ.లక్ష కోట్ల పెంపు రూ.9 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లకు న్యూఢిల్లీ: ఈసారి వ్యవసాయ రంగానికి రుణాల విషయంలో అధిక ప్రాధాన్యమివ్వాలని కేంద్రం భావిస్తోంది. రాబోయే బడ్జెట్లో ఏకంగా వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన రుణాల లక్ష్యాన్ని రూ.1 లక్ష కోట్ల మేర పెంచవచ్చని తెలుస్తోంది. గతేడాది బడ్జెట్లో ఈ రంగానికివ్వాల్సిన రుణాల లక్ష్యాన్ని రూ.9 లక్షల కోట్లుగా నిర్దేశించారు. ఈసారి రూ.10 లక్షల కోట్లకు పెంచనున్నట్లు సమాచారం. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నుంచి డిసెంబరు మధ్య బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.7.58 లక్షల రుణాలు మంజూరు చేశాయి. మార్చి 31 నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని దాటిపోవచ్చని కూడా కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ.10,000 కోట్లు కేటాయించవచ్చని ఆ వర్గాలు తెలియజేశారు. ఈ పథకానికి ప్రస్తుత బడ్జెట్లో కేంద్రం రూ.5,500 కోట్లు మాత్రమే కేటాయించింది. తరవాత దీన్ని సవరించి రూ.13,000 కోట్లకు పెంచింది. నాలుగు విభాగాలుగా నిధుల కేటాయింపు