Life Prisoner
-
పెరోల్‌పై వచ్చాడు.. టిఫిన్ షాపు పెట్టాడు
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మహిళ హత్యకేసులో జీవిత ఖైదీగా జైలు పాలయ్యాడు.. సోదరి వివాహం కోసం పెరోల్‌పై వచ్చి ఎస్కార్ట్ కళ్లుగప్పి పరారయ్యాడు. ఒడిశా రాష్ట్రంలో తలదాచుకుంటూ టిఫిన్‌షాపు సైతం పెట్టేశాడు. సుమారు ఏడేళ్లుగా పోలీసులు గాలిస్తున్నా ఎక్కడా పట్టుబడలేదు. ఎట్టకేలకు స్వగ్రామంలో భూతగాదా విషయమై కాశీబుగ్గ వచ్చి పోలీసులకు చిక్కాడు. కాశీబుగ్గ సీఐ జి.శ్రీనివాసరావు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన సార దుర్యోధనరావు 2007లో పాతపట్నానికి చెందిన జి.పార్వతి అనే మహిళను హత్య చేశాడు. కేసు రుజువు కావడంతో 2013 ఆగస్టు 3న జిల్లా కోర్టు జీవితఖైదు విధించడంతో విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. నాలుగు నెలల తరువాత దుర్యోధనరావు సోదరికి వివాహం నిర్ణయించడంతో హాజరయ్యేందుకు అనుమతి కోరగా రెండురోజుల పాటు పెరోల్ ఇచ్చారు. ఎస్కార్ట్ సహాయంతో కాశీబుగ్గ వచ్చి పరారయ్యాడు. బతుకు తెరువు కోసం ఒడిశాలోని కొంధమాల్ జిల్లా బల్లిగుడలో టిఫిన్ షాపు నిర్వహిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఆయన సోదరుడికి చెందిన ఇళ్లస్థలాల గొడవ జరుగుతుండడంతో అతనికి మద్దతుగా దుర్యోధనరావు తరచూ పోలీసులు కళ్లుగప్పి కాశీబుగ్గ వచ్చివెళ్తుండేవాడు. బుధవారం కూడా అతను రావడంతో ఎంపీడీవో కార్యాలయం రోడ్డులో చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసినట్టు సీఐ చెప్పారు. అతన్ని గురువారం పలాస కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్ఐ మధుసూదనరావు పాల్గొన్నారు. క్రైం టీంకు అభినందనలు పరారీలో ఉన్న జీవితఖైదీ దుర్యోధనరావును పట్టుకోవడంలో కీలకభూమిక పోషించిన క్రైం టీం సభ్యులు హెడ్‌కానిస్టేబుల్ బి.ఢిల్లీశ్వరరావు, కానిస్టేబుళ్లు బి.లోకనాథం, ఎం.ఢిల్లీశ్వరరావులను కాశీబుగ్గ డీఎస్పీ శివరామరెడ్డి, సీఐ జి.శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. -
గుండెపోటుతో జీవిత ఖైదీ మృతి
రాజమహేంద్రవరం క్రైం: గుండె పోటుతో సెంట్రల్ జైల్ జీవిత ఖైదీ మృతి చెందాడు. పోలీసులు, జైలు అధికారులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామచంద్రపురం మండలం, వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన తాతపూడి సత్యనారాయణ (49) గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం ఉదయం ఆరు గంటలకు లేచిన సత్యనారాయణ గుండెల్లో నొప్పిగా ఉందని అనడంతో జైలులో ఉన్న వైద్యులకు చూపించారు. వారి సూచనల మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా జైలు గేటు వద్దకు తీసుకువచ్చే సరికి మృతి చెందాడు. మృతుడు 2017 మే నెలలో భార్య హత్య కేసులో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి జీవిత ఖైదీ విధించడంతో శిక్ష నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్యను హత్య చేయడంతో శిక్షపడి జైలుకు వచ్చినప్పటి నుంచి కుమారులు, కుటుంబ సభ్యులు, బంధువులు పట్టించుకోకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై అస్వస్థతతో ఉండేవాడని జైలు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెపోటు రావడంతో గురువారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందాడు. జైలు అధికారులు మృతుడి కుమారుడు తాతపూడి శ్రీను కు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి బంధువులకు అప్పగించారు. సబ్ కలెక్టర్ సమక్షంలో పంచనామా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ సమక్షంలో సెంట్రల్ జైల్ ఖైదీ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. సబ్ కలెక్టర్ మృతుడి కుమారుడు శ్రీను, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. సెంట్రల్ జైల్లో మృతుడు ఉన్న బ్యారక్‌లో ఉన్న ఖైదీల నుంచి వివరాలు సేకరించారు. గుండు నొప్పి వచ్చినపుడు హాస్పిటల్‌కు తరలించినప్పుడు అంబులెన్స్ డ్రైవర్ నుంచి వివరాలు సేకరించారు. మృతుడి బంధువులు చెప్పిన వివరాలు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజారావు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం వన్‌టౌన్ ఎస్సై జుబేర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుండె పోటుతో జీవిత ఖైదీ మృతి
రాజమహేంద్రవరం క్రైం : గుండె పోటుతో జీవిత ఖైదీ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నెహ్రూనగర్‌కు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు(41) గుండె పోటుతో శుక్రవారం మృతి చెందాడు. ఉదయం ఆరు గంటలకు పెట్రోల్ బంక్‌లో పని చేసేందుకు వచ్చిన వెంకటేశ్వరరావు పది గంటల సమయంలో గుండె నొప్పిగా ఉందని పెట్రోల్ బంక్‌లో పడిపోయాడు. ఇతడిని సెంట్రల్ జైలులో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్సలు అందించిన అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.తన భార్య ఆత్మహత్య కేసులో ముద్దాయిగా ఉన్న మృతుడికి 2014 జనవరి 14న కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు శిక్ష నిమిత్తం వచ్చాడు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఓపెన్ ఎయిర్ జైల్‌కు వేస్తారు. దీనిలో భాగంగా 2017 జనవరి ఏడో తేదీన ఓపెన్ ఎయిర్ జైలుకు వెంకటేశ్వరరావును మార్చారు. జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లో పని చేస్తుండేవాడు. సత్ ప్రవర్తన కలిగి ఉండేవాడు. మృతుడు జైలుకు రాకముందు సెల్స్ టాక్స్ శాఖలో క్లర్కుగా పని చేయడంతో అకౌంట్లు బాగా రాసేవాడు. దీంతో బంక్‌లోని రికార్డులు సక్రమంగా రాసేవాడని తోటి ఖైదీలు పేర్కొంటున్నారు. ఎంతో సౌమ్ముడిగా ఉండే వెంకటేశ్వరరావు అకాల మృతికి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన బావమరిదిని సకాలంలో జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవాడని మృతుడి బావ రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ రాజేశ్వరరావు, సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ గిరీష్ పంచనామా నిర్వహించారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండు నెలలో విడుదల ఉండగా.. సత్ ప్రవర్తనతో ఉండే వెంకటేశ్వరరావు మరో రెండునెలలో విడుదల అవుతాడనగా ఆకస్మికంగా మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు. సకాలంలో వైద్య సదుపాయం అందక మృతి చెందాడని పేర్కొంటున్నారు. చికిత్స అందించడంలో జాప్యం లేదు జైలులో చికిత్స అందించడంలో జాప్యం చేయలేదు. ఉదయం బీపీ డౌన్ అయ్యిందని జైలులో ఉన్న ఆసుపత్రికి వచ్చాడు. వెంటనే జైలు వైద్యులు చికిత్స అందించారు. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంలో అంబులెన్స్‌తో హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. ఖైదీకి వైద్య చికిత్సలు అందించడంలో ఎక్కడా జాప్యం జరగలేదు. – రఘు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ -
జీవిత ఖైదీకి డిగ్రీలో ‘గోల్డ్ మెడల్ ’
► నేడు అవార్డు అందుకోనున్న యుగంధర్ కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న గునకల యుగంధర్ (29) చదువులో సత్తా చాటాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ పాసై గోల్డ్ మెడల్ అందుకోనున్నాడు. 2013–2015 సంవత్సరాల్లో బీఏలో ఈయన 1600 మార్కులకు 1147 మార్కులు సాధిం చి, టాప్‌లో నిలిచాడు. దీంతో యూ నివర్సిటీ అధికారులు హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో సోమవారం నిర్వహించనున్న యూనివర్సిటీ 21 వ స్నాతకోత్సవంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోనున్నాడు. హత్యకేసులో ముద్దాయిగా... యుగంధర్ది చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం. తల్లిదండ్రులకు ఇతను ఒక్కడే సంతానం. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీఏ డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువుకుంటుండగా ఓ హత్య కేసులో ముద్దాయి అయ్యాడు. చిత్తూరు జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అదే సంవత్సరం ఇతనికి జీవిత ఖైదు విధించడంతో 2011లో కడప కేంద్ర కారాగారానికి శిక్ష అనుభవించేందుకు వచ్చాడు. ఇక్కడి కారాగార అధికారుల ప్రోత్సాహంతో 2013– 2015 సంవత్సరాల్లో ఓపెన్‌గా బీఏ డిగ్రీలో చేరాడు. పట్టుదలతో చదవడంతో అత్యధిక మార్కులు సాధించి, గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యాడు. జైలు అధికారుల ప్రోత్సాహంతోనే తనకు మెడల్ వచ్చిందని ఖైదీ యుగంధర్ ఆదివారం విలేకరులకు తెలిపాడు. ఖైదీకి గోల్డ్ మెడల్ రావడంతో తోటి ఖైదీలు, జైలు అధికారులు అభినందిస్తున్నారు. -
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న సుండు పిచ్చయ్య నాయుడు (64) ఈ నెల 11న సాయంత్రం రిమ్స్‌లో అనారోగ్యంతో చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తమకు శుక్రవారం ఉదయం వరకు తెలియదని, ఇప్పటికీ జైలు అధికారులు తమకు ఏమాత్రం సమాచారమివ్వలేదని, తమంతకు తాము తెలుసుకుని వచ్చామని రిమ్స్ మార్చురీ వద్ద బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని బంధువుల ఫిర్యాదు ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని కృష్ణానగర్‌కు చెందిన సుండు పిచ్చయ్యనాయుడుకు ఓ హత్య కేసులో 2012లో జీవితఖైదు పడటంతో కడప కేంద్రకారాగారానికి తరలించారు. అప్పటినుంచి అక్కడే ఉంటున్నాడు. మూడు నెలల క్రితం పెరోల్‌పై బయటకు వచ్చి బంధువులతో గడిపి వెళ్లాడు. వారంరోజుల క్రితం ఆయన భార్య పిల్లలతో కలిసి కడప కేంద్ర కారాగారంలో ఇంటర్వూ్యలో మాట్లాడారు. ఆయన నాలుగు నెలల నుంచి ఛాతీలో నొప్పి, క్షయవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. కేంద్ర కారాగారం ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా చేరి చికిత్సపొందుతున్నాడు. ఈనెల 11న మధ్యాహ్నం 3:30కు తీవ్ర ఛాతీనొప్పితో బాధపడుతూ ఉండగా వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్సపొందుతూ అదేరోజు సాయంత్రం 4:45కు మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మీనరసమ్మ, కుమారుడు లక్ష్మీనారాయణతోపాటు కుమార్తెలు వెంకటసుబ్బమ్మ, శ్రీదేవి, రమాదేవి ఉన్నారు. శుక్రవారం రిమ్స్ వద్దకు చేరుకున్న బంధువులు జైలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మృతదేహాన్ని తమ వెంట తీసుకువెళ్లారు. -
‘డాక్టర్ బాంబ్’కు జీవితఖైదే
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 43 బాంబు పేలుళ్లకు పాల్పడిన, ‘డాక్టర్ బాంబ్’గా పిలిచే జలీస్ అన్సారీకి జీవితఖైదే సరైందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజస్థాన్‌లో విధ్వంసానికి సంబంధించి అన్సారీ సహా 11 మందికి రాజస్తాన్‌లోని అజ్మీర్ న్యాయస్థానం విధించిన ఈ శిక్షను బుధవారం సుప్రీంకోర్టు సమర్థించింది. తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్(టీఐఎం) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అన్సారీ సృష్టించిన విధ్వంసాలు నగరంలోనూ ఐదు ఉన్నాయి. అన్సారీతో పాటు అప్పట్లో నగరంలో నివసించిన అబ్దుల్ కరీం తుండా సైతం ఇందులో కీలకపాత్ర పోషించాడు. తుండాను 2012లో ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ముంబై ఏటీఎస్ అధికారులు 2010 అక్టోబర్‌లో గోల్కొండ ప్రాంతంలో అరెస్ట్ చేసిన మహారాష్ట్ర వాసి సయ్యద్ ముసద్ధిఖ్ వహీదుద్దీన్ ఖాద్రీ సైతం ఇతడి ప్రధాన అనుచరుడే. ముంబైకి అన్సారీ ముంబాయ్ వర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1992లో బాబ్రీ విధ్వంసానికి ప్రతీకారంగా తుండా, అన్సారీ, కోల్‌కతాకు చెందిన అబ్దుల్లా మసూద్, వరంగల్ వాసి ఆజం ఘోరీ కలసి టీఐఎంను స్థాపించారు. ఈ మాడ్యుల్ 1993-94ల్లో రాజస్తాన్, మహారాష్ట్ర, హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 43 బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ మాడ్యుల్ టార్గెట్ చేసిన వాటిలో రైళ్లు, రైల్వేస్టేషన్లే ఎక్కువ. 1993లో అన్సారీ తన మాడ్యుల్ సాయంతో రాజస్తాన్, మహారాష్ట్రతో పాటు నగరంలోని ఐదు ప్రాంతాల్లో పేలుళ్లకు ఒడిగట్టి.. నలుగురి ప్రాణాలు తీశాడు. తక్కువ ప్రభావం గల బాంబులను తయారు చేయడంలో దిట్ట అయిన అన్సారీని పోలీసు, నిఘా వర్గాలు ‘డాక్టర్ బాంబ్’ అనే పేరుతో పిలుస్తుంటాయి. 1994 జనవరి 12న ముంబై పోలీసులు అన్సారీని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పీటీ వారెంట్‌పై అజ్మీర్ తరలించారు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉండటంతో సిటీలోని కేసులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2012లో రాజస్తాన్‌లోని కేసుల విచారణ పూర్తికావడంతో ఆ పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చి మళ్లీ తీసుకువెళ్లారు. అన్సారీపై హైదరాబాద్‌లో నమోదైన కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. నగరంలో టీఐఎం ఘాతుకాలివి... 12.08.1993: అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ జంక్షన్ బాక్స్‌పై బాంబు విసిరారు. సుబ్బారాయుడు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇదే రోజు హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో మరో బాంబు పేలింది. 12.09.1993: సికింద్రాబాద్‌లోని రైల్వే రిజర్వేషన్ కాంప్లెక్స్ క్యాష్ రూమ్ వద్ద పేలుడు. బాలాజీ, బాలసుబ్రహ్మణ్యం అనే ఇద్దరు మణించారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. 22.10.1993: నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద పేలుడు. ఇందులో మహ్మద్ పాషా అనే వ్యక్తి మరణించగా.. యూసుఫుద్దీన్, మల్లమ్మ తదితరులు గాయపడ్డారు. 6.12.1993: మల్కాజ్గిరి పరిధిలోని మౌలాలీ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్స్‌పై ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను టార్గెట్ చేసుకుని బాంబు పేల్చగా.. ఓ వ్యక్తి మరణించాడు. మరికొందరు గాయపడ్డారు. -
23 ఏళ్ల తర్వాత పట్టుబడిన జీవితఖైదీ
బాపట్ల, న్యూస్‌లైన్: పెరోల్‌పై ఇంటికివచ్చి తప్పించుకు తిరుగుతున్న జీవితఖైదీని 23ఏళ్ల తరువాత అదుపులోకి తీసుకున్న వైనమిది. గుంటూరు జిల్లా చందోలు మండలం గోకరాజుపాలేనికి చెందిన నర్సరాజుకు 30ఏళ్ల కిందట హత్యకేసులో జీవితఖైదు పడింది. సత్ప్రవర్తన కారణంగా జైలు అధికారులు రంగారెడ్డి జిల్లాలోని చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చర్ కాలనీలో ఉంచారు. 1989 సెప్టెంబర్ 25న పెరోల్‌పై స్వగ్రామానికి పంపించారు. అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. కర్ణాటక, హిమాలయ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 19న ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో జైలు సిబ్బంది రైతుల వేషంలో వెళ్లి శుక్రవారం పొలంలో నాట్లువేస్తున్న నర్సరాజును అదుపులోకి తీసుకున్నారు.