బాపట్ల, న్యూస్‌లైన్: పెరోల్‌పై ఇంటికివచ్చి తప్పించుకు తిరుగుతున్న జీవితఖైదీని 23ఏళ్ల తరువాత అదుపులోకి తీసుకున్న వైనమిది. గుంటూరు జిల్లా చందోలు మండలం గోకరాజుపాలేనికి చెందిన నర్సరాజుకు 30ఏళ్ల కిందట హత్యకేసులో జీవితఖైదు పడింది. సత్ప్రవర్తన కారణంగా జైలు అధికారులు రంగారెడ్డి జిల్లాలోని చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చర్ కాలనీలో ఉంచారు. 1989 సెప్టెంబర్ 25న పెరోల్‌పై స్వగ్రామానికి పంపించారు. అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. కర్ణాటక, హిమాలయ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 19న ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో జైలు సిబ్బంది రైతుల వేషంలో వెళ్లి శుక్రవారం పొలంలో నాట్లువేస్తున్న నర్సరాజును అదుపులోకి తీసుకున్నారు.