life science
-
అంతరిక్షంలో వరి మొక్కలను పెంచిన చైనా!... వీడియో వైరల్
Taikonauts conducting life science experiment in space: చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్నినిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి అవుతున్న తరుణంలోనే చైనా పలు సైన్స్ ప్రయోగాలు ప్రారంభించింది. అందులో భాగంగా జీరో గ్రావిటీ ల్యాబ్‌లో వరి మొక్కలను విజయవంతంగా పెంచేసింది కూడా. ఈ విషయాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్(సీఏఎస్) తన లైప్ సైన్సు పరిశోధనల్లో వెల్లడించింది. ఈ ఏడాది జులైలో ఈ ప్రయోగాన్నిప్రారంభించినట్లు పేర్కొంది. ఈ మేరకు తాము రెండు రకాలైన విత్తానాలు...థాలేక్రెస్ అనే క్యాబేజ్ జాతికి చెందిన విత్తనం తోపాటు వరికి సంబంధించిన విత్తనాలతో స్పేస్ స్టేషన్‌లోని వెంటియన్ ల్యాబ్‌లో ఈ ప్రయోగాలు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకుక చైనా వ్యోమోగాములు అంతరిక్షంలోని కృత్రిమ వాతావరణంలో ఈ విత్తనాల నుంచి మొక్కలను విజయవంతగా పెంచింది. ఐతే థాల్స్క్రేస్ నాలుగు ఆకులు ఉత్పత్తి చేయగా, పొడవాటి కాండంతో వరి మొక్కలు సుమారు 30 సెం. మీటర్ల వరకు పెరిగాయి. రేడియోషన్ స్థాయిలు అధికంగా ఉండే అంతరిక్షంలో మొక్కలు ఏవిధంగా ఉంటాయి అనేది తెలుసుకునేందుకే చైనా టైకోనాట్స్(వ్యోమోగాములు) ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు చైనీస్ సెన్స్ అకాడమీకి చెందిన పరిశోధకుడు జెంగ్ హుక్వింగ్ మాట్లాడుతూ..."ఈ రెండు ప్రయోగాలు అంతరిక్షంలోని ప్రతి మొక్క జీవిత కాలాన్ని అధ్యయనం చేసేందుకు ఉపకరిస్తుందన్నారు. అలాగే మొక్కలను పెంచేందుకే కాకుండా మైక్రోగ్రావిటీలో మొక్కల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎలా పెంచాలో పరిశోధనల్లో తెలుస్తుందని చెప్పారు. అంతేకాదు పంటలను భూమి లాంటి వాతావరణంలోనే కృత్రిమంగా పెంచగలమని అన్నారు. మొక్కలు పుష్పించడం జరిగితే అంతరిక్షంలో మరిన్ని పంటలను పండించేందుకు దోహదపడుతుందని జెంగ్ అన్నారు." అయినా చైనా ఏమీ తొలిసారిగా అంతరిక్షంలో మొక్కలు పెంచలేదు. గతేడాది జూలైలో చాంగ్ 5 అనే మిషన్‌తో ఒక వ్యొమోగామి బృందం వరి మొక్కను పెంచింది. ఈ మేరకు చైనా అంతరిక్షంలో తాము మొక్కలను ఏవిధంగా పెంచామో వివరించేలా ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీక్షించండి. (చదవండి: రష్యా సుమారు 50 వేల బలగాలతో సైనిక విన్యాసాలు... టెన్షన్లో యూఎస్) -
కూలిన శ్లాబ్
హెచ్‌సీయూలో ఘటన త్రుటిలో తప్పిన ప్రమాదం నాలుగేళ్లలో రెండో ఘటన సెంట్రల్ యూనివర్సిటీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.13.80 కోట్లతో నిర్మిస్తున్న జాకీర్ హుస్సేన్ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ శ్లాబ్ బుధ వారం కుప్ప కూలింది. నాలుగేళ్ల క్రితం లైఫ్ సైన్స్ భవనం కూలిన ఘటన మరువక ముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. తక్కువ సామర్థ్యం గల ఇనుపరాడ్లు ఉపయోగించడం, శ్లాబ్ భీంను ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. మధ్యాహ్నం సమయంలో భవన నిర్మాణం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 2014 జనవరి నుంచి సీపీడ బ్ల్యూ పర్యవేక్షణలో బెంగుళూరుకు చెందిన ప్రైవేటు సంస్థ ఈ ఈ భవన నిర్మాణ పనులు చేస్తోంది. ఏప్రిల్ 2015 కల్లా పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఈ భవనంలో లెక్చర్ హాల్ కాంప్లెక్స్‌తో పాటు అకడమిక్ సపోర్ట్ సెంటర్, లైబ్రరీ, క్లాస్ రూంలు, సెమినార్ హాల్ వంటి 15 హాళ్లు నిర్మిస్తున్నారు. ఘటన స్థలాన్ని హెచ్‌సీయూ రిజిస్టార్ రామబ్రహ్మం, సీపీడబ్ల్యూ అధికారులు, మాదాపూర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఖురేషీ, విద్యార్థి, ఉద్యోగ సంఘ నాయకులు పరిశీలించారు. ఉన్నత స్థాయి విచారణ కోరతాం... శ్లాబ్ కూలిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కోరతాం. ఇన్చార్జి యూఈ ఏసీ నారాయణ హయాంలో చేపట్టిన అన్ని నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలి. నాసిరకంగా చేపట్టిన ఈ భవనం నిర్మాణం పూర్తయ్యాక కూలి ఉంటే భారీ ప్రాణ, ఆస్తినష్టం జరిగి ఉండేది. - బండి డానియల్, యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాసిరకంగా నిర్మిస్తున్నారు... యూనివర్సిటీ భవన నిర్మాణాల్లో జరుగుతున్న అవకతవకలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి. విద్యార్థుల భవిష్యత్‌ను కాల రాసేలా నాసిరకంగా భవనాలు నిర్మిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. - వెంకటేష్ చౌహాన్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు, హెచ్‌సీయూ