Light affect
-
ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు
Astronomers Detect Light Behind Black Hole: విశ్వంలో మనిషి మేధస్సుకు అంతుచిక్కని రహస్యాలెన్నో. వాటిలో బ్లాక్ హోల్ ఒక సంక్లిష్టమైన సబ్జెక్ట్. అదృశ్య ప్రాంతాలుగా కంటికి కనిపించకుండా.. ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకునే కేంద్రాలివి. అయితే కృష్ణ బిలాల వెనుక ఉన్న ఓ విషయాన్ని తొలిసారి ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగా, ఐన్‌స్టీన్ అంచనా ఆయన మేధోసంపత్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. భూమికి 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణ బిలం(ఐ జ్విక్కీ 1) వెనకాల కాంతి ప్రతిధ్వనుల్ని(తేలికపాటి) గుర్తించారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ(అమెరికా) పరిశోధకులు. మెరుపుల్లా మొదలై అటుపై రంగు రంగుల్లోకి మారిపోయాయి ఆ ఎక్స్‌రే కాంతులు. సాధారణంగా బ్లాక్ హోల్లోకి వెళ్లిన కాంతి ఏదీ బయటకు పరావర్తనం చెందదు. దీంతో ఆ వెనకాల ఏముంటుందో అనేది ఇప్పటిదాకా ఖగోళ శాస్రజ్ఞులు నిర్ధారించుకోలేకపోయారు. అయితే ఈ బిలం చుట్టేసినట్లు ఉండడం, కాంతి వంగి ప్రయాణించడం, అయస్కాంత క్షేత్రాలు మెలిదిరిగి ఉండడం వల్లే ఈ కాంతి ప్రతిధ్వనులను రికార్డు చేయగలిగామని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రో ఫిజిస్ట్ డాన్ విల్కిన్స్ వెల్లడించారు. ఐన్‌స్టీన్ ఏనాడో చెప్పాడు జర్మన్ మేధావి, థియోరెటికల్ ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ విషయాన్ని ఏనాడో గుర్తించాడు. కృష్ణ బిలం వెనకాల కాంతి కిరణాల పరావర్తనాలు సాధ్యమని, అంతరిక్షంలో భారీవేవైనా సరే వక్రీకరణ చెందక తప్పవని ‘జనరల్ రియాల్టివిటీ’ పేరుతో ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ టైంలో ఆ థియరీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజా పరిశోధనల గుర్తింపుతో ఆయన మేధస్సును నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా సాధారణ టెలిస్కోప్‌ల ద్వారా గుర్తించడం విశేషం. నేచర్ జర్నల్‌లో బుధవారం ఈ మేరకు ఈ ఖగోళ అద్భుతంపై కథనం పబ్లిష్ అయ్యింది. -
వరదగూడు.. కనువిందు చేసెను చూడు!
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. ప్రచండ భానుడి చుట్టూ సప్తవర్ణశోభితమైన సుందర వలయం ఏర్పడింది. రాష్ట్రంలో సూర్యుడి చుట్టూ రంగురంగుల ఇంద్ర ధనుస్సు(సన్‌హాలో) బుధవారం మధ్యాహ్నం సుమారు గంట పాటు కనువిందు చేసింది. దీన్ని ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో బంధించి, సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ‘వరదగూడు’గా పిలిచే ఈ పరిణామంతో ఈ వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ జనం చర్చించుకున్నారు. వాతావరణం గురించి తెలియని రోజుల్లో హాలో ఏర్పడితే వచ్చే 24 గంటల్లో వర్షం పడొచ్చని కూడా చెప్పుకొంటున్నారు. సన్ హాలో అంటే? సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడటాన్ని సన్ హాలో లేదా ‘22 డిగ్రీ హాలో’అని పిలుస్తారు. వాతావరణంలో ఉండే లక్షలాది షట్భుజాకారపు మంచు స్ఫటికాల గుండా కాంతి ప్రయాణించినప్పుడు వక్రీభవనం చెందడం వల్ల ఈ వలయాలు ఏర్పడతాయి. సూర్యుడి చుట్టూ దాదాపు 22 డిగ్రీల వ్యాసార్థంతో వలయం ఏర్పడుతుంది కాబట్టి దీనికి ‘22 డిగ్రీ హాలో’అని పేరు. ఎక్కడ ఏర్పడతాయి? ఆకాశంలో సిర్రస్ రకం మేఘాలు ఉన్నప్పు డు సన్‌హాలో ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఈ మేఘాలు పలుచగా, పోగుల్లా ఉంటాయి. వాతావరణంలో దాదాపు 20 వేల అడుగుల ఎత్తులో ఈ మేఘాలు ఉంటాయి. వర్ణ పట్టక ప్రయోగం చిన్నప్పుడు చేసే ఉంటాం. త్రికోణాకారపు గాజు పట్టకం ఒకవైపు నుంచి కాంతి ప్రయాణించినప్పుడు ఇంకోవైపు ఉంచిన తెరపై ఏడు రంగులు కనపడటం గమనిస్తాం. ఇప్పుడు సూర్యుడి కిరణాలు పైనుంచి కిందకు వస్తున్న మార్గంలో సిర్రస్ మేఘాలను ఊహించుకోండి. ఆ మేఘాల్లోని ఒక్కో మంచు స్ఫటికం ఒక పట్టకంలా ప్రవర్తిస్తుంది. అంటే పైనుంచి వస్తున్న సూర్యకాంతి ఏడు రంగులుగా విడిపోతుంది. అదే సమయం లో పక్కపక్కన ఉన్న మంచు స్ఫటికాల ద్వారా ఈ కాంతి ప్రతిఫలిస్తుంది. వక్రీభవనం, ప్రతిఫలించడం అన్న రెండు దృగ్విషయాల కారణంగా కాంతి ఒక నిర్దిష్ట దిశలో ప్రయాణించి హాలో ఏర్పడుతుందన్నమాట. జాబిల్లి చుట్టూ కూడా.. హాలోలు ఏర్పడటం సూర్యుడికి మాత్రమే పరిమితం కాదు. రాత్రివేళల్లో జాబిల్లికీ ఏర్పడుతుంటాయి. వాయు కాలుష్యమో.. లేదా ఇంకో కారణమో స్పష్టంగా తెలియదు కానీ.. ఇటీవల జాబిల్లి చుట్టూ ఏర్పడే హాలోలు చాలా అరుదు. ఇంద్రధనుస్సు మాదిరిగానే హాలోలను కూడా నేరుగా చూడొచ్చు. కొంతవరకు తెల్లగా కనిపించినా తగిన కోణం నుంచి చూసినప్పుడు సప్తవర్ణాలు ఆవిష్కృతం అవుతాయి. -
లైట్ పొల్యూషన్‌తో క్యాన్సర్ ముప్పు
లండన్ : చీకట్లను పారదోలేందుకు మిరుమిట్లు గొలిపే లైట్లను వాడటం ఆధునిక జీవితంలో భాగమైంది. మహానగరాల నుంచి కుగ్రామాల వరకూ అర్ధరాత్రి దాటినా టీవీ తెరల నుంచి ట్యూబ్లైట్ల వరకూ లైట్ల వెలుగు లేనిదే ఎవరూ కునుకుతీయడం లేదు. అయితే కృత్రిమ కాంతులతో అధిక బరువు, డయాబెటిస్, చివరికి క్యాన్సర్ వంటి అత్యంత ప్రమాదకర జీవనశైలి వ్యాధుల బారినపడే ముప్పు ముంచుకొచ్చిందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అర్ధరాత్రి వరకూ టీవీలకు అతుక్కుపోవడం, మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేయడం, ల్యాప్‌టాప్, కంప్యూటర్ స్క్రీన్లపై కుస్తీ పట్టడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మన అలవాట్లే కాకుండా వీధి దీపాలు, కారు లైట్స్ నుంచి విడుదలయ్యే కాంతి కాలుష్యం కూడా ప్రమాదభరితమేనని పేర్కొన్నారు. సహజమైన కాంతి-చీకటి వలయానికి విరుద్ధంగా ఎలక్ట్రిక్ కాంతులకు ఎక్స్పోజ్ కావడం ప్రకృతికి భిన్నమని మన శరీరాలపై కాంతి ప్రభావాన్ని అథ్యయనం చేసిన బోస్టన్ ఉమెన్స్ హాస్పిటల్‌కు చెందిన న్యూరోసైంటిస్ట్ ప్రొఫెసర్ స్టీవెన్ లక్లీ స్పష్టం చేశారు. కృత్రిమ వెలుగుతో బ్రెస్ట్ క్యాన్సర్‌తో పాటు ఒబెసిటీ, డయాబెటిస్, డిప్రెషన్ ముప్పు అధికమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్‌కు చెందిన క్యాన్సర్ నిపుణులు ప్రొఫెసర్ రిచర్డ్ స్టీవెన్స్ పేర్కొన్నారు. రాత్రి వేళల్లో లైట్స్‌ను డిమ్ చేయాలని, స్మార్ట్ ఫోన్ స్క్రీన్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యూరోసైకోబయాలజీ జర్నల్‌లో ఈ అథ్యయనం ప్రచురితమైంది. -
వాతావరణం బాగోలేదు.. బస్సులో వెళ్లండి
లాహోర్: తక్కువ వెలుతురు కారణంగా తమ ప్రాంతాలకు బస్సులో వెళ్లాలని ప్రయాణికులకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) షాకిచ్చింది. పీఐఏకు చెందిన విమానం అబుదాబి నుంచి పాక్‌లోని రహిమ్ యార్ ఖాన్‌కు వెళ్లాల్సి ఉంది. వాతావరణంలో తక్కువ వెలుతురు కారణంగా లాహోర్‌లో ల్యాండ్ చేశారు. రహిమ్ యార్కు బస్సులో వెళ్లాలని పీఐఏ కోరింది. దీనికి నిరాకరించిన ప్రయాణికులు విమానంలోనే కూర్చోవడంతో ఏసీని ఆఫ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాహోర్ నుంచి రహిమ్ యార్ మధ్య దూరం 624.5 కి.మీ. కనీసం ముల్తాన్ ఎయిర్‌పోర్ట్‌లోనైనా తమను విమానంలో దింపాలని కోరారు. ముల్తాన్ నుంచి 292 కి.మీ. దూరంలో రహిమ్ యార్ ఎయిర్పోర్ట్ ఉంది. -
లైట్లతో నిద్రలేమి..
న్యూయార్క్: కాలుష్యం చాలా రకాలు. ప్రపంచానికి పెద్ద సవాల్ గా మారింది. కాంతి కాలుష్యం కూడా ఈ కోవలో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాలలో ఇదో సమస్యగా మారింది. రాత్రి వేళల్లో లైట్ల వల్ల చాలా మంది నిద్ర లేకుండా గడుపుతున్నారని ఓ సర్వేలో తేలింది. దీని ప్రభావం మరుసటి రోజు పని మీద పడుతుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్ని పట్టణాలతో పోలిస్తే నగరాల్లో నివసించే వారిలో ఈ సమస్య మూడు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది. కాలిఫోర్నియాకు చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ వర్సిటీ బృందం 15,863 మందిని 8 ఏళ్ల పాటు అధ్యయనం చేసింది. వారి నిద్ర అలవాట్లు, మానసిక స్థితి వంటి అంశాలను తెలుసుకున్నారు. ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లైట్ల ప్రభావం ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో నిద్ర లేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నట్లు గుర్తించారు. దీనివల్ల పగలు పనిలో త్వరగా అలసిపోవడంతో పాటు నిద్రమత్తులో ఉంటున్నారని వెల్లడించారు. ‘పస్తుత సమాజంలో 24/7 ఉద్యోగాలు వచ్చేశాయి. భద్రత కోసం వీధుల్లో పెద్ద పెద్ద లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. భద్రత సంగతి అలా ఉంచితే వీటి వల్ల చాలా మందికి నిద్రలేమి వస్తోంది. కాంతి కాలుష్యం వల్ల భవిష్యత్తులో అనేక ప్రమాదాలు జరుగనున్నాయి’ అని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకుడు మారిస్ హయాన్ తెలిపారు. ఈ నివేదికను వచ్చే ఏఫ్రిల్‌లో కెనడాలోని వాంకోవర్‌లో జరిగే అమెరికన్ ఎకాడమీ ఆఫ్ న్యూరాలజీ సంస్థ 68వ వార్షిక సమావేశంలో సమర్పించనున్నారు.