lighting the lamp
-
ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్‌కు గిఫ్ట్ ఇస్తాడట
న్యూఢిల్లీ: దీపావళి అనేది కార్తీక మాసంలో జరుపుకునే ఐదు రోజుల పండుగ. ఈ పండుగ ఆధ్యాత్మికంగా "చీకటి పై వెలుగు అంటే.. చెడు పై మంచి సాధించినందుకు ప్రతికగా చేసుకునే పండుగ. అంతేకాదు ఈ పండుగ ప్రధానంగా ఏం చెబుతుందంటే అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని వెలుగులు మయం చేసుకునేలా జీవించమంటూ వివరిస్తుంది. (చదవండి: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..) ఈ మేరకు ఈ పండుగ ధన్‌తేరస్‌తో ప్రారంభమై రెండవరోజు నరక చతుర్దశి, మూడవ రోజు లక్ష్మీ పూజ. నాల్గవ రోజు గోవర్ధన పూజ, భైదూజ్ వంటి ఉత్సవాలతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఐదు రోజుల పండుగ. అయితే ఈ పండుగ సందర్భంగా చిరాగ్ బర్జాత్యా అనే వ్యక్తి తన ఇంటికి వచ్చి డెలివరీ చేసే ప్రతి డెలివరీ బోయ్‌కి తాను స్వీట్ ప్యాక్‌ను గిఫ్ట్‌గా ఇస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ మేరకు నెటిజన్లు "ఇది చాలా మంచి ఆలోచన ఈ దీపావళి పండుగకి అందరికీ మిఠాయిలతో ఆనందాన్ని పంచుదాం" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: అత్యంత ఎతైన భవనం పై ఇలా కనిపించడం మూడోసారి) -
ఆ దీపాలన్నీ స్త్రీలవే.. ఆ దీపాలూ స్త్రీలే
తమిళనాడులో కరువు ఊరు అది. సరిగా భుక్తి లేదు. చేయడానికి స్త్రీలు చేయదగ్గ పని లేదు. భర్త ఎలక్ట్రీషియన్. నీ పనే నేను చేస్తాను అంది ధనలక్ష్మి. ‘కరెంటు పని నువ్వు చేయలేవు’ అన్నాడు భర్త. ఆమె వినలేదు. వెదురుపుల్లలతో కట్టిన బొమ్మలకు సీరియల్ సెట్లు అమర్చడం నేర్చుకుంది. జాతరలు, తిరునాళ్ళు, పండగలకు సీరియల్ సెట్ల వెదురుబొమ్మలు కావాలి. ఆ పనిలో విపరీతమైన నైపుణ్యం సంపాదించింది. మిగిలిన ఆడవాళ్లకు కూడా ఆ పని నేర్పించింది. నేడు ‘అరసర్కుళం’ అనే ఊరు సీరియల్సెట్ల బొమ్మలకు ప్రసిద్ధి. ఆ దీపాలన్నీ స్త్రీలవే. ఆ దీపాలూ స్త్రీలే. తమిళనాడు తిరునల్వేలి ప్రాంతంలోని ఎండను, కరువును భరించడం కష్టం. ఉన్నట్టుండి జలుబు చేసినట్టు కొన్ని మేఘాలు చీదుతాయి. వాటికి ఏమైనా పండితే పండినట్టు. అయినా ముక్కు కారితే పంటలు పండుతాయా? ‘మా ఊరి పేరు అరసర్కుళం. అది మారుమూల. పంటలు లేక చాలామంది వలస పోతుంటారు. ఉన్నవారికి పని ఉండదు. రోజూ పట్నానికి పోయి పని చేసుకురావడానికి బస్సులు కూడా తిరగవు’ అంటుంది ధనలక్ష్మి. ఆమె ఇప్పుడు ఆ ఊరిలోని ‘ధనలక్ష్మి వైరింగ్ వర్క్స్’కు అధిపతి. ఆమె దగ్గర 50 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆమె వల్ల ఉపాధి మార్గం తెలుసుకొని మరో 500 మంది జీవిక పొందుతున్నారు. ఇది ఇప్పటి పరిస్థితి. పదేళ్ల క్రితం కాదు. పదేళ్ల క్రితం... ధనలక్ష్మిది అరసర్కుళం ఊరే. అక్కడే పుట్టి పెరిగింది. ‘మాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. కాని వానలు లేకపోతే ఏమిటి చేయడం. అదంతా ఉత్త మట్టిగడ్డే కదా’ అంటుంది. తండ్రి ఆమెకు ప్రాయం రాగానే అదే ఊళ్లో ఉన్న అశోక్ అనే ఎలక్ట్రీషియన్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. ముగ్గురు కూతుళ్లు పుట్టారు. ‘మా ఆయన ఎలక్ట్రీషియన్. ఏదైనా డెకరేషన్ వస్తే లైట్లు వేస్తాడు. కాని రెండు మూడు వేల కంటే ఎక్కువ సంపాదించేవాడు కాదు’ అంటుంది ధనలక్ష్మి. తెలుగులో ప్రసిద్ధ రచయిత శ్రీరమణ ‘ధనలక్ష్మి’ అనే కథ రాశారు. అందులో ధనలక్ష్మి అనే ఇల్లాలు భర్తకు ఉన్న నిర్వహణాలోపాలను గ్రహించి తోడు నిలిచి అతడు వ్యాపారంలో వృద్ధిలోకి రావడానికి సహకరిస్తుంది. సరిగ్గా ఈ ధనలక్ష్మి కూడా భర్త అశోక్‌కు అలాగే అండగా నిలిచింది. ‘ఊళ్లో ఏ పనీ లేదు. నీ పనే నేను చేస్తా’ అందామె. అశోక్ ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పనంటే కరెంటుతో వ్యవహారం. అది ఏమరుపాటుగా ఉంటే ప్రమాదం. అందుకే వద్దు అన్నాడు. ‘కాని నేను పట్టుపట్టాను. సాధించాను’ అంటుంది ధనలక్ష్మి. ఊళ్లో జాతర వస్తే... సరిగ్గా ఆ సమయంలోనే ఊళ్లో జాతర వచ్చింది. జాతరకు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సీరియల్ సెట్లతో వెలిగించిన అలంకరణలు చేస్తారు. వెదురుపుల్లతో దేవతల బొమ్మలు, పూలు, జంతువులు, పార్టీ గుర్తులు, రాజకీయ నాయకుల ముఖాలు కట్టి వాటికి సీరియల్లైట్లు అమర్చి వెలిగిస్తారు. వెదురుపుల్ల కట్టడంలో అశోక్ పని మంతుడు. కాని వాటికి సీరియల్లైట్లు బిగించడం శ్రమతో, నైపుణ్యంతో, ఓపికతో కూడిన పని. సీరియల్ సెట్లలో మధ్యలో ఒక లైట్ కాలిపోయినా మిగిలిన సెట్ వెలగదు. ఆ లైట్‌ను కొత్తది వేయాలి. లేదా వైర్‌ను జాయింట్ చేయాలి. ‘ఆ పనంతా నేను నేర్చుకుని మొదలెట్టాను’ అంటుంది ధనలక్ష్మి. భర్త వెదురు ఫ్రేమ్స్ కడితే ధనలక్ష్మి చకచకా సీరియల్ సెట్లు అమర్చేది. వెలిగిస్తే వెదురు కటౌట్ మిలమిలమని బ్రహ్మాండంగా వెలిగేది. అశోక్ ఆ జాతరలో లైట్లు వెలిగించి పేరు సంపాదించాడు. ధనలక్ష్మి హస్తవాసి మంచిదని నిరూపితం అయ్యింది. అందరు మహిళల కోసం తిరునల్వేలి జిల్లాలో ఆ మాటకొస్తే తమిళనాడులో ప్రతి ఊళ్లో ఏదో ఒక ఉత్సవం వేడుక జరుగుతూనే ఉంటాయి. వాటికి వెదురుపుల్లల సీరియల్సెట్ల కటౌట్స్ అవసరం. అవి తయారు చేసే కార్ఖానా పెడదామని ధనలక్ష్మి భర్తకు సూచించింది. ఊళ్లో ఉన్న ఒక ట్రస్టు సాయంతో లోన్ పొంది పని మొదలెట్టింది. భర్త మరికొందు మగపని వారు ఫ్రేమ్స్ తయారు చేస్తుంటే తను మరికొంతమంది మహిళలతో ఆ ఫ్రేమ్స్‌కు లైట్లు బిగించడం మొదలుపెట్టింది. ధనలక్ష్మి దగ్గరకు వస్తే రెడిమేడ్‌గా కావలిసిన కరెంటు బొమ్మలు దొరుకుతాయనే పేరు వచ్చింది. ఆ తర్వాత ధనలక్ష్మి చెన్నై నుంచి లైట్లు టోకున కొనుక్కొచ్చి సీరియల్ సెట్లను తయారు చేయడం కూడా ఆడవాళ్లకు నేర్చింది. సీరియల్ లైట్లు తామే తయారు చేసుకుని తామే కటౌట్స్‌కు అమర్చి మొత్తం కటౌట్‌ను అమ్మడం వల్ల వారికి లాభం బాగా రావడం మొదలెట్టింది. ‘ఇవాళ మా ఊరు పెద్ద సీరియల్ సెట్ల కేంద్రమే అయ్యింది’ అంటుంది ధనలక్ష్మి. తన వద్ద పనిచేస్తున్న మహిళలతో ధనలక్ష్మి ధనలక్ష్మి ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తెకు పెళ్లయ్యింది. ఆమె కంప్యూటర్ ద్వారా కావలసిన బొమ్మలు తీసి తల్లికి ఇస్తోంది. అల్లుడు ఊళ్లు తిరిగి ఆర్డర్లు తెస్తున్నాడు. ధనలక్ష్మి ధైర్యం లక్ష్మిని తెచ్చింది. మూడు వెలుగులు ఆరు కాంతులుగా ఆమె జీవితం వెలుగుతోంది. ఆరు వందల మంది స్త్రీలూ వెలుగుతున్నారు. చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు కూడా వెలగొచ్చని వీరు చెబుతున్నారు – సాక్షి ఫ్యామిలీ -
సమర దీపాలు వెలిగించిన ప్రజానీకం
-
దీపకాంతుల్లో వెలిగిన యావత్ భారతం
-
దీపాలు వెలిగిద్దాం.. కరోనాను పారదోలుదాం
-
ఘనంగా కేసీపీ వజ్రోత్సవ వేడుకలు
ఉయ్యూరు : కేసీపీ సేవలు నిరుపమానమని అమరరాజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ జీ రామచంద్రనాయుడు అన్నారు. స్థానిక కేసీపీ కర్మాగార ఆవరణలో బుధవారం వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామచంద్రనాయుడు మాట్లాడుతూ కార్మిక, కర్షక, యాజమాన్యం ఐక్యతతో ముందుకు నడుస్తూ 75 ఏళ్లు కర్మాగారాన్ని ప్రజా ఆమోద్య యోగ్యంతో నడపడం దేశ చరిత్రలోనే గుర్తుంచుకోదగ్గ విషయమన్నారు. ఏబీఎన్ ఎండీ వి. రాధాకృష్ణ మాట్లాడుతూ లాభాపేక్షతో కాకుండా సామాజిక స్ఫూర్తితో యాజమాన్యం పనిచేయడం ఆదర్శనీయమన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న కులజాడ్యం పోవాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చెరుకు రైతుల సంక్షేమం, మద్దతు ధర విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనా ధోరణి మారాల్సి ఉందన్నారు. కేసీపీ ఎండీ ఇర్మ్‌గార్డ్ వెలగపూడి, చైర్మన్ వినోద్ ఆర్ సేథీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్‌రావు, సీవోవో జీ వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ సంస్థ ప్రగతి, రైతు సంక్షేమం, సామాజిక అభివృద్ధి అంశాలను వివరించారు. ఉత్తమ రైతులు, కార్మికులు, ఉద్యోగులను సన్మానించి బంగారు, వెండి పతకాలను అందించారు. రిటైర్డ్ ఉద్యోగ కార్మికులను సత్కరించి నగదు ప్రోత్సాహకాలు అందించారు. విద్యార్థులు, పలువురు పేదలకు ఆర్ధిక సాయం చేశారు. ముందుగా రోటరీ కంటి ఆస్పత్రి, వృద్ధాశ్రమాన్ని అతిథులు సందర్శించి పండ్లు అందజేశారు. ఆకట్టుకున్న ఎగ్జిబిషన్.. వజ్రోత్సవాల సందర్భంగా కర్మాగార ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంది. చెరుకు వంగడాలతోపాటు వ్యవసాయ యంత్రాలు, పశువులు, గొర్రెలు, కోళ్లను రైతులు ఆసక్తిగా తిలకించి సమాచారం తెలుసుకున్నారు. పుంగనూరు జాతి ఎడ్లు, ఆవులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రకాల జాతి కోళ్లు ఆకట్టుకున్నాయి. ఆదర్శప్రాయుడు మారుతీరావు ఉయ్యూరు : కేసీపీ కర్మాగారంలో సాంకేతిక మార్పులను తీసుకువచ్చి నాణ్యతకు పెద్దపీట వేసి కార్మిక, కర్షక సంక్షేమానికి కృషిచేసిన మహనీయులు మారుతీరావు ఆదర్శప్రాయులని అవధాని మాడుగుల నాగఫణిశర్మ కొనియాడారు. స్థానిక కేసీపీ కర్మాగారంలో స్వర్గీయ వెలగపూడి మారుతీరావు 84వ జయంతి, నాణ్యతా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మారుతీరావు విగ్రహానికి నాగఫణిశర్మ, యాజమాన్యం పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. నాణ్యతా దినోత్సవ సభలో ఉత్తమ కార్మికులకు బంగారు, వెండి పతకాలను అందించి సత్కరించారు. పూర్ణాహుతి హోమం కార్యక్రమంలో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కేసీపీ ఎండీ ఇర్మ్‌గార్డ్ వెలగపూడి, చైర్మన్ వినోద్ ఆర్ సేథీ, ఇడీ కిరణ్‌రావు, సీవోవో జీ వెంకటేశ్వరరావు, జీఎంలు వీవీ పున్నారావు (కేన్), సీకే వసంతరావు (ఫైనాన్స్), శ్రీహరిబాబు (ప్రాసెస్), సీతారామారావు (ఇంజనీరింగ్), కే కృష్ణ (అడ్వైజర్), హెచ్ఆర్ మేనేజర్ దాస్, తదితరులు పాల్గొన్నారు.