ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్‌కు గిఫ్ట్‌ ఇస్తాడట | This Man Is Gifting Sweets To Delivery Agents On Diwali | Sakshi
Sakshi News home page

ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్‌కు గిఫ్ట్‌ ఇస్తాడట

Published Wed, Nov 3 2021 5:12 PM | Last Updated on Wed, Nov 3 2021 8:28 PM

This Man Is Gifting Sweets To Delivery Agents On Diwali - Sakshi

న్యూఢిల్లీ: దీపావళి అనేది కార్తీక మాసంలో జరుపుకునే ఐదు రోజుల పండుగ. ఈ పండుగ ఆధ్యాత్మికంగా "చీకటి పై వెలుగు అంటే.. చెడు పై మంచి సాధించినందుకు ప్రతికగా చేసుకునే పండుగ. అంతేకాదు ఈ పండుగ ప్రధానంగా ఏం చెబుతుందంటే అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని వెలుగులు మయం చేసుకునేలా జీవించమంటూ వివరిస్తుంది.

(చదవండి: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..)

ఈ మేరకు ఈ పండుగ ధన్‌తేరస్‌తో ప్రారంభమై రెండవరోజు నరక చతుర్దశి, మూడవ రోజు లక్ష్మీ పూజ. నాల్గవ రోజు గోవర్ధన పూజ, భైదూజ్‌ వంటి ఉత్సవాలతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఐదు రోజుల పండుగ. అయితే ఈ పండుగ సందర్భంగా చిరాగ్ బర్జాత్యా అనే వ్యక్తి తన ఇంటికి వచ్చి డెలివరీ చేసే ప్రతి డెలివరీ బోయ్‌కి తాను స్వీట్‌ ప్యాక్‌ను గిఫ్ట్‌గా ఇస్తానంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఈ మేరకు నెటిజన్లు "ఇది చాలా మంచి ఆలోచన ఈ దీపావళి పండుగకి అందరికీ మిఠాయిలతో ఆనందాన్ని పంచుదాం" అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు. 

(చదవండి: అత్యంత ఎతైన భవనం పై ఇలా కనిపించడం మూడోసారి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement