Lingamaiah
-
Gadikota Srikanth Reddy: లింగయ్యని కిరాతకంగా చంపుతుంటే ఏం చేశారు
-
వైఎస్ జగన్ మాతో చెప్పిన మాట
-
Raptadu Tour: వైఎస్ జగన్ హెలికాప్టర్ విజువల్స్
-
YS Jagan: కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ
-
రాజకీయా కక్షతోనే ... నిజాలు బయటపెట్టిన లింగమయ్య కుటుంబం
-
Sri Sathya Sai Dist: నేడు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు
అనంతపురం, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం(Anantapur) జిల్లా పర్యటన ఖరారైంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి శనివారం ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరిటాల వర్గీయుల చేతిలో ఉగాది నాడు వైఎస్సార్సీపీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్(YS Jagan).. బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడారు. తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య కుటుంబ సభ్యులు జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వాళ్లకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, అవసరమైతే న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో త్వరలో వచ్చి కలుస్తానంటూ మాట ఇచ్చారు.వైఎస్ జగన్ పర్యటన వేళ.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైఎస్సార్సీపీ కీలక నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్
-
లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ఉమ్మడి అనంతపురం, సాక్షి: ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పరామర్శించారు. లింగమయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భగా తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య తనయుడు చెప్పగా.. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయసహాయం అందిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. వచ్చే వారం తానే స్వయంగా వస్తానని ఆయన చెప్పారు.అంతకు ముందు.. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. దాడులను వ్యతిరేకించినందుకే బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు (TDP) పొట్టనపెట్టుకున్నారని వైఎస్ జగన్ ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కురబ లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని అన్నారు. -
Thopudurthi Prakash: సునీత డైరెక్షన్లో లింగమయ్య హత్య
-
కూటమి పాలనలో టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ ఫైర్
-
పోలీసు ఆంక్షల నడుమ.. లింగమయ్య అంత్యక్రియలు
సాక్షి, పుట్టపర్తి/రామగిరి: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య (58) అంత్యక్రియలను పోలీసుల ఆంక్షల నడుమ ఆయన స్వగ్రామంలో సోమవారం నిర్వహించారు. పాపిరెడ్డిపల్లిలో స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు రమేష్, సురేష్, వారి కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో లింగమయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు, కురుబ సంఘం నాయకులు ఆస్పత్రి వద్దకు వెళ్లి లింగమయ్య మృతదేహానికి నివాళులర్పించారు. పోలీసు బందోబస్తుతో మృతదేహం తరలింపు పోస్టుమార్టం అనంతరం లింగమయ్య మృతదేహాన్ని పోలీస్ బందోబస్తు మధ్య ఆయన స్వగ్రామం పాపిరెడ్డిపల్లికి తరలించారు. అనంతపురం నుంచి రామగిరి వెళ్లే మార్గంలోని రాప్తాడు, ఎన్ఎస్ గేట్, చెన్నేకొత్తపల్లి సర్కిళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. మృతుడి కుటుంబ సభ్యులను మాత్రమే పాపిరెడ్డిపల్లికి వెళ్లేలా అనుమతించారు. లింగమయ్య మృతదేహం గ్రామానికి చేరిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని వెంటనే శ్మశానవాటికకు తరలింపజేశారు. మృతుడి భార్య రామాంజినమ్మ, కుమారులు మనోహర్, శ్రీనివాసులు, వారి కుటుంబ సభ్యుల చేత అంత్యక్రియలు త్వరత్వరగా పూర్తి చేయించారు. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అనంతపురంలోని ఆయన ఇంటి వద్దనే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని శ్రీ సత్యసాయి జిల్లాలోకి రాకుండా పోలీసులు కాపు కాశారు. దీంతో కేవలం మృతుడి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచి్చంది. హత్య చేయించి.. పరామర్శకు వస్తారా?టీడీపీ ఎంపీ బీకే పార్థసారథిపై కురుబ లింగమయ్య తనయుడు మనోహర్ ఆగ్రహం ‘పరిటాల సునీత మా నాన్నను హత్య చేయించారు. మీ (టీడీపీ) పార్టీ వాళ్లే హత్య చేయిస్తే... ఖండించకుండా పరామర్శకు ఎలా వస్తారు?’ అని హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథిని కురుబ లింగమయ్య కుమారుడు మనోహర్ నిలదీశారు. కురుబ లింగమయ్య మృతదేహాన్ని సోమవారం అనంతపురం నుంచి పాపిరెడ్డిపల్లికి తీసుకువెళుతుండగా మార్గంమధ్యలో ఎంపీ బీకే పార్థసారథి పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రిని హత్య చేసిన, చేయించిన టీడీపీలో ఉన్న పార్థసారథి తమను పరామర్శించేందుకు ఎలా వస్తారని మనోహర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిటాల సునీత నుంచి మాకు హాని ఉందిమాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత నుంచి తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కురుబ మనోహర్ కోరారు. బీసీ కులాలకు చెందిన వారెవరూ రాజకీయంగా ఎదగకూడదన్న ఉద్దేశంతో పరిటాల కుటుంబం ఉందని చెప్పారు. అందువల్లే వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న తమతో పరిటాల బంధువులు లేనిపోని గొడవలకు దిగి.. తన తండ్రిని హత్య చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. -
అన్యాయాలను ప్రశ్నిస్తే.. పొట్టన పెట్టుకున్నారు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. దాడులను వ్యతిరేకించినందుకు శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కురబ లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు.వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని కచ్చితంగా చట్టంముందు నిలబెడతాం. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు.వ్యక్తుల భద్రతకు భరోసా కొరవడిన పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రామగిరి మండల ఉప ఎన్నికలో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వారి బాధ్యతా రాహిత్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించినా, పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ వైఎస్సార్సీపీ నేతల పైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఏపీలో కక్ష రాజకీయాలకు బలవుతున్న బడుగు, బలహీన వర్గాలు
గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ చేస్తున్న అరాచకాలను, అఘాయిత్యాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. మళ్లీ పగడ విప్పిన ఫ్యాక్షన్ రాజకీయానికి.. తాజాగా రాప్తాడులో బలైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య ఉదంతంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏపీలో చట్టబద్ధపాలన లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలమీద, నాయకులమీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయి. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. .. రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల(TDP Atrocities) దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించారు. అయినా పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ పైగా వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం. లింగమయ్య కుటుంబానికి అండగా.. .. కురబ లింగమయ్య(Kuruba Lingamaiah) హత్యను ఖండిస్తున్నా. అధికారపార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్సార్సీపీకి చెందిన ఓ బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారు. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. కురుబ లింగమయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: హత్య చేయించి పరామర్శకు వస్తారా?.. టీడీపీ ఎంపీకి చేదు అనుభవం -
ఇదేం రాజకీయం?.. ఎంపీ పార్థసారథికి చేదు అనుభవం
అనంతపురం, సాక్షి: రాజకీయ ఆధిపత్యం కోసం కూటమి ప్రభుత్వం అఘాయిత్యాలకు తెగ బడుతోంది. ఈ క్రమంలోనే.. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య(Kuruba Lingamaiah) దారుణహత్యకు గురయ్యారు. అయితే బాధిత కుటుంబానికి పరామర్శ కోసం వెళ్లిన టీడీపీ ఎంపీ బీకే పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. ఓవైపు హత్య చేయించి.. మరోవైపు పరామర్శకు వస్తారా?. టీడీపీ ప్రభుత్వం(TDP Government)లో బీసీలకు రక్షణ లేదా? అంటూ లింగమయ్య కొడుకు మనోహర్ ఎంపీ పార్థసారథి(Bk Parthasarathi)ని నిలదీశారు. దీంతో ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. పరిటాల సునీత నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఈ సందర్భంగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లాడాయన. అంతకు ముందు.. ‘‘టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత(Paritala Sunitha) సోదరులే మా నాన్నను హత్య చేశారు. వైఎస్సార్సీపీలో ఉన్నందుకే చంపారు. బీసీ సామాజికవర్గానికి చెందిన తాము రాజకీయంగా ఎదగ కూడదనే హత్య చేశారు’’ అని లింగమయ్య కొడుకులు మనోహర్, శ్రీనివాసులు మీడియా ముందు వాపోయారు.రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది పూట ఘోరం జరిగింది. గుడికి వెళ్లి వస్తుండగా లింగమయ్యపై టీడీపీ నేతలు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆయన.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. పరిటాల సునీత బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ హత్యా రాజకీయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. పరిటాల సునీతకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్సీపీలో లింగమయ్య కీలకంగా ఉన్నందుకే ఈ హత్య చేయించారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు పరామర్శ కోసం వెళ్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకోగా.. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనపై గోరంట్ల మండిపడ్డారు. ఇదీ చదవండి: జగన్ హయాంలో హింసా రాజకీయాలెక్కడివి? -
పే...ద్ద గంజి గడ్డ
బత్తలపల్లి : మాములుగా గంజిగడ్డలు(చిలకల దుంప) కేజీ వరకు సైజు ఉంటాయి. అలాంటిది ఓ రైతు పొలంలో పది కేజీలు ఒక గంజిగడ్డ పండింది. బత్తలపల్లి మండలంలోని చెన్నరాయపట్నంలోని లింగమయ్య పొలంలో ఈ గంజి గడ్డ పండింది. -
వస్తున్నాం.. లింగమయ్యా!
- 2నుంచి 6 వరకు సలేశ్వరం ఉత్సవాలు నల్లవుల దట్టమైన అడవి.. చుట్టూ ఎత్తైన కొండలు. మధ్యలో వెయ్యి అడుగుల లోతైన లోయలో కొలువైన సలేశ్వరం లింగమయ్యను దర్శనం చేసుకోవడం ఒక మహత్తర ఘట్టం. నిటారుగా ఉన్న కొండల మీదికి రాళ్లురప్పలతో కూడిన కాలిబాటలో గంటల తరబడి వెళ్లడం గొప్ప సాహసం. ‘వస్తున్నాం.. లింగమయ్య’ అంటూ సలేశ్వరుడి శరణు వేడుతూ ముందుకు సాగడం ఓ మధురానుభవం. రెండుకొండల మధ్య కృష్ణానది పాయలో వెలిసిన శివుడిని దర్శించుకోవడం మహాభాగ్యం.. అచ్చంపేట/లింగాల: భక్తిపారవశ్యంతో కదిలే భక్తులతో నల్లమల ప్రాంతం మూడురోజుల పాటు రావులింగేశ్వర స్వామి నామస్మరణతో మార్మోగుతుంది. ఏటా ఏప్రిల్ వూసం చైత్రపూర్ణిమ రోజున సలేశ్వరం లింగమయ్యను భక్తులు సందర్శించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ దర్శనం అత్యంత సాహసంతో కూడుకున్న పని. అత్యంత ప్రమాదభరితమైన కొండచరియుల మార్గంలో కేవలం పాదం మోపే స్థలంలో ప్రమాదాలను సైతం లెక్కచేయుకుండా వయోభేదం మరిచిదర్శనం చేసుకుని ధన్యులవుతారు. ఇదీ ఇతిహాసం ద్వాపరయుగంలో పాండవవనవాసంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం సలేశ్వరం కొండల నడువు తపస్సు చేసినట్లు ప్రతీతి. ప్రకృతి నుంచి దిగొచ్చిన చందంగా వందడుగుల ఎత్తు నుంచి గలగల పారే జలపాతం కనులపండువగా ఉంటుంది. నల్లమల అటవీప్రాంతంలో లింగవుయ్యు దర్శనం ఘట్టం సుమారు రెండొందల అడుగుల లోతున్న పదుననైన రాళ్లతో కూడిన గుట్టను దిగడంతో సలేశ్వర ప్రయాణం ప్రారంభమవుతుంది. గుట్టను దిగిన తరువాత సుమారు ఐదొందల నుంచి ఆరొందల అడుగుల ఎత్తు ఉండే మరో గుట్టను దాటుకుంటూ ముందుకు సాగుతారు. సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునేందుకు వెన్నెలనీడలో కూడా వేలాదివుంది భక్తులు ఈ కారడవిలో ప్రయాణిస్తారు. పూర్ణిమ రోజున లింగమయ్య దర్శనం ఉంటుంది. మూడురోజుల పాటు లక్షలాది మందితో నల్లమల అడవి తల్లి నిండుగా కనిపిస్తుంది. దాదాపు రెండొందుల అడుగుల ఎత్తు నుంచి జలపాతం గుండంలోకి చేరుతుంది. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ జలధార కూడా ఎక్కువతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ రమణీయ ఘట్టాన్ని చూసేందుకు భక్తులు తరలొస్తారు. ఎలా వెళ్లాలి.. - సలేశ్వర క్షేత్రానికి వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి. - ఒకమార్గం.. అచ్చంపేట నుంచి మన్ననూరు, ఫరహాబాద్ ద్వారా రాంపూర్‌పెంట వరకు వెళ్లితే అక్కడినుంచి క్షేత్రం ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది. - రెండోమార్గం.. బల్మూర్, లింగాల నుంచి అప్పారుపల్లి ద్వారా వెళ్లొచ్చు. ఈ మార్గంలో అధికసంఖ్యలో భక్తులు కాలినడకన బయలుదేరుతారు. ప్రయాణ సౌకర్యాలు భక్తుల రద్దీని గమనించిన అచ్చంపేట ఆర్టీసీ డిపో అధికారులు ప్రత్యేకబస్సులను నడుపుతున్నారు. - అచ్చంపేట నుంచి ఫరహాబాద్ ద్వారా రాంపూర్‌పెంట వరకు, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, తెల్కపల్లి నుంచి లింగాల, అప్పాయిపల్లి వరకు ప్రతి అరగంటకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. - లింగాల నుంచి రూ.50, అచ్చంపేట రూ.100 ఒక్కొక్కరికీ చార్జీ అవుతుంది. ప్రత్యేక ఏర్పాట్లు సలేశ్వరంలో విద్యుత్ సౌకర్యం లేదు. మూడురోజుల పాటు జనరేటర్ల సాయంతో విద్యుత్బల్బులు వెలిగిస్తారు. మూడురోజుల పాటు ఇక్కడ వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ఉచిత భోజన ఏర్పాట్లతో పాటు తాగునీటి వసతి కల్పిస్తాయి. అలాగే రెవెన్యూ శాఖ అధికారులు భక్తులకు ఉచితంగా తాగునీటి సౌకర్యం, జిల్లా వైద్యాధికారులు ప్రత్యేకవైద్య క్యాంపులు నిర్వహిస్తున్నారు. సలేశ్వరం జాతరకు ప్రత్యేకబస్సులు ఈనెల 2నుంచి 6వ తేదీ వరకు జరిగే సలేశ్వరం ఉత్సవాలకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకబస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం వసూరాం నాయక్ తెలిపారు. అచ్చంపేట నుంచి సలేశ్వరానికి ప్రతి 20 నిమిషాలకు, తెల్కపల్లి నుంచి అప్పాయిపల్లి వరకు ప్రతి 30 నిమిషాలకు బస్సు సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకబస్సులు వేశామని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆయన కోరారు. -
నాన్న ప్రాణం నిలబెట్టండి
అధిక బరువు, వ్యాధులతో బాధపడుతున్న ఆర్టీసీ ఉద్యోగి లింగమయ్య పిల్లల విజ్ఞప్తి కనీసం లేచి నడవలేని దుస్థితి.. ఆదుకోవాలంటూ వేడుకోలు విజయవాడ: రోజు రోజుకూ మరింతగా బరువు పెరిగిపోయే వ్యాధి ఒకవైపు, శరీరం నిండా మానని గాయాలు మరోవైపు.. నడవలేడు, నిలబడలేడు, సరిగా పడుకోలేడు కూడా. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన 53 ఏళ్ల లింగమయ్య అవస్థ ఇది. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న ఆయన కొన్నేళ్లుగా బరువు పెరుగుతూ.. ఇప్పుడు ఏకంగా 202 కేజీలకు పెరిగిపోయారు. 2009లో ఆయనకు గుండెపోటు రాగా స్టెంట్ అమర్చారు. దానికితోడు మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ వ్యాధుల నుంచి బయటపడడానికి నిమ్స్‌కు వెళ్లినా, పలు కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. ఫలితం లేదు. ఇలాగే అధిక బరువుతో బాధపడి బేరియాట్రిక్ సర్జరీతో ఉపశమనం పొందిన ఒక స్నేహితుడి సహాయంతో లింగమయ్య విజయవాడలోని ఎండోకేర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ లింగమయ్యను పరీక్షించిన వైద్యులు.. శరీరంలో గాయాలు తగ్గిన తర్వాత బేరియాట్రిక్ సర్జరీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం గాయాలు మానడానికి కొద్దిరోజుల పాటు రోజుకు రూ. 10 వేల విలువైన యాంటీ బయాటిక్స్ వాడాల్సి వస్తుందని.. తర్వాత సర్జరీకి దాదాపు రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని లింగమయ్య కుటుంబం ఆవేదనలో మునిగిపోయింది. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని, తమ తండ్రి ప్రాణాలను కాపాడాలని లింగమయ్య కుమారుడు విక్రమ్, కుమార్తె పరిమళ వేడుకుంటున్నారు. దాతలు నేరుగా లింగమయ్య కుమారుడు విక్రమ్ నంబర్ 9963324224కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని, సహాయం అందించవచ్చు. -
భువనగిరిలో విజన్ కౌంటీ!
సాక్షి, హైదరాబాద్: నగరంలో సొంతిల్లు అనేది ఉన్నత శ్రేణి వర్గాలకే కాదు సామాన్య, మధ్యతరగతి ప్రజలకూ ఉండాలి. అలా అని సిటీ కి దూరంగా, రవాణా సదుపాయాలు కూడా సరిగా లేని ప్రాంతాల్లో ఇల్లుండటం కాదు. సిటీకి దగ్గర్లో, అందుబాటు ధరల్లో ఫ్లాట్లు లభించాలి. అప్పుడే అది అఫడబుల్ హౌజింగ్ అవుతుందంటున్నారు విజన్ ఇండియా డెరైక్టర్ లింగమయ్య. అందుకే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్, బెంగళూరు హైవేల్లో అందుబాటు ధరల్లో పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామన్నారు. పూర్తి వివరాలివిగో.. హైదరాబాద్ దక్షిణ దిశ ప్రాంతాల్లో స్థిరాస్తి ధరలు అందుబాటులో లేక నివాస, వాణిజ్య సముదాయాలు తూర్పు దిశకు విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో మెట్రో పనులు శరవేగంగా జరుగుతుండటం, ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీలకు తోడు పోచారంలో ఐటీఐఆర్ ప్రాజెక్టూ రానుండటం వంటి కారణాలతో ఉప్పల్, ఘట్కేసర్, భువనగిరి ప్రాంతాలకు డిమాండ్ బాగా పెరిగింది. సామాన్యులకు సైతం ధరలు అందుబాటులో ఉండేలా భువనగిరిలో 15 ఎకరాల్లో ‘విజన్ కౌంటీ’ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 200- 500 చ.గ. ప్లాట్ల విస్తీర్ణం ఉంటుంది. బెంగళూరు హైవేలోని కొత్తూర్‌లో 18.5 ఎకరాల్లో ‘విజన్ ప్యారడైజ్’ పేరుతో మరో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించాం. 150 - 650 చ.గ. మధ్య మొత్తం 208 ఓపెన్ ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుతున్నాం. దీనికి దగ్గర్లోనే మరో 50 ఎకరాల్లో విజన్ ప్రైడ్‌ను కూడా అభివృద్ధి చేస్తాం. ఫేజ్-1లో 25 ఎకరాల్లో మొత్తం 300 ఓపెన్ ప్లాట్లొస్తాయి. త్వరలోనే షాద్‌నగర్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి ఆనుకొని 70 నుంచి 100 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విజన్ ప్యారడైజ్ ప్రాజెక్ట్‌కు ఆనుకొనే వందల ఎకరాల్లో జాన్సన్ అండ్ జాన్సన్, పీ అండ్ డబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి. దీంతో సమీప భవిష్యత్తులో కొత్తూర్ ప్రాంతంలో వేల కుటుంబాలు నివాసం ఏర్పరుచుకోనున్నాయి. అందుకే ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన 3 నెలల్లోనే 50 శాతం విక్రయాలైపోయాయంటే ఇక్కడి గిరాకీ, భవిష్యత్తు అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు.