lingamanthula swamy jathara
-
వైభవంగా లింగన్న కల్యాణం (ఫొటోలు)
-
నల్గొండ జిల్లా : తెలంగాణలో రెండవ అతిపెద్ద లింగమంతుల స్వామి జాతర (ఫొటోలు)
-
నేటి నుంచి పెద్దగట్టు జాతర
సూర్యాపేట: తెలంగాణలో రెండో అతి పెద్దదైన శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం గంపల ప్రదక్షిణతో ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులో ఐదురోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. ఇప్పటికే జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాదవుల ఆరాధ్య దైవంగా భావించే లింగమంతుల స్వామి జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర మొదటి రోజు అత్యంత కీలకమైన ఘట్టం గంపల ప్రదక్షిణ. కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ, రెడ్డి కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న గొల్లగట్టు (పెద్దగట్టు)కు చేరుకుంటారు. రెండో రోజు సోమవారం చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. మూడో రోజు మంగళవారం స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా చంద్రపట్నం వేస్తారు. నాలుగో రోజు జరిగే కార్యక్రమం నెలవారం. కేసారం నుంచి పాలు తీసుకొచ్చి రెండు కొత్త బోనం కుండల్లో పాలు పొంగిస్తారు. జాతరలో ఐదోరోజైన గురువారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచుతారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు జాతర సమయంలో పోలీసులు వాహనదారులకు దూరభారం తగ్గించేలా ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు. ఇందుకోసం ఇటీవల నిర్మించిన జాతీయ రహదారి 365 బీబీని ఉపయోగించుకుంటున్నారు. ►హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లించి రాఘవాపురం స్టేజీ, నామవరం నుంచి గుంజలూరు స్టేజీ మీదుగా విజయవాడ వైపు పంపనున్నారు. ►విజయవాడ వైపు వెళ్లే భారీ, ట్రాన్స్పోర్ట్ వాహనాలను టేకుమట్ల నుంచి జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లించి నాయకన్‌గూడెం మీదుగా కోదాడ వైపు పంపనున్నారు. ►హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ రోడ్డు మీదుగా రోళ్లబండ తండాకు మళ్లించి రాయినిగూడెం వద్ద యూట ర్న్ చేసి హైదరాబాద్ వైపు పంపనున్నారు. nవిజయవాడ వైపు నుంచి హైదరా బాద్ వైపు వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్నగర్, నార్కట్‌పల్లి మీదుగా పంపనున్నారు. -
28 నుంచి లింగమంతుల జాతర
సాక్షి, సూర్యాపేట: పెద్దగట్టు జాతరకు వేళయింది. యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర ఈ నెల 28వ తేదీ రాత్రి ప్రారంభమై వచ్చే నెల 4వ తేదీన ముగియనుంది. జాతరకు ప్రధాన ఆలయం రంగులతో ముస్తాబైంది. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, గట్టు కింద భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులు పూర్తయ్యాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కనే దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై లింగమంతుల స్వామి ఆలయం ఉంది. భారీ ‘జన’జాతర.. సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతిపెద్దది.. లింగమంతుల స్వామి జాతర. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. పెద్దగట్టు జాతర (ఫైల్) గంపల ప్రదక్షిణతో జాతర షురూ.. లింగమంతుల స్వామి జాతర తొలి ఘట్టం గంపల ప్రదక్షిణతో ప్రారంభం కానుంది. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న పెద్దగట్టుకు ఆదివారం రాత్రి చేరుకుంటారు. గంపలతో ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. మెంతబోయిన, గొర్ల, మున్న వంశస్తుల సమక్షంలో రెండు బోనాలు వండి పూజలు నిర్వహిస్తారు. రెండో రోజు బోనాలు, మూడో రోజు చంద్రపట్నం, నాలుగో రోజు నెలవారం, ఆతర్వాత ఐదోరోజు మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుంది. రూ.3.7 కోట్లతో అభివృద్ధి పనులు.. కాగా, జాతరలో ఏర్పాట్ల కోసం రూ.3.7 కోట్లను ఖర్చు చేశారు. జాతరకు ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా రూ. 2 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పాటు సూర్యాపేట మున్సిపాలిటీ, ఇతర శాఖలు రూ.1.7 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశాయి. కోవిడ్ నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు మున్సిపల్ యంత్రాంగం 600 మంది సిబ్బందిని కేటాయించింది. జాతర ప్రాంతంలో ఏడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 200 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహించనున్నారు. నల్లగొండ, కోదాడ మీదుగా విజయవాడకు.. ఈసారి జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో జాతీయ రహదారి 65పై ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. సూర్యాపేట మీదుగా హైదరాబాద్, విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి మీదుగా మళ్లించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్.. కోదాడ మీదుగా వెళ్లాలి. అలాగే విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా నార్కట్‌పల్లి జాతీయ రహదారి 65కు చేరుకోవాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. జాతరకోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 40 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల నుంచి 70 బస్సులను జాతరకు ప్రత్యేకంగా నడపనున్నారు. -
జాతరకు పెద్దగట్టు ముస్తాబు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: యాదవుల ఆరాధ్య దైవం కొలువుండే గొల్ల (పెద్ద) గట్టు.. లింగమంతులస్వామి జాతరకు ముస్తాబైంది. ఆదివారం నుంచి ఈనెల 28 వరకు జాతర జరగనుంది. గట్టుపై లింగమంతులస్వామి ఆలయానికి రంగులు వేయడం, ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, గట్టు కింద భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులు పూర్తయ్యాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కనే దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై లింగమంతులస్వామి ఆలయం ఉంది. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యాదవులు తరలిరానుండటంతో అధికార యంత్రాంగం జాతరకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సమ్మక్క జాతర తర్వాత అతిపెద్దది.. సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతిపెద్దదిగా గొల్లగట్టు లింగమంతులస్వామి జాతరకు పేరుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. పూర్వకాలంలో యాదవరాజులు ఉండ్రుగొండ గుట్ట మీద శివాలయం, లక్ష్మీనర్సింహస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, ఆంజనేయుడి దేవాలయాలు కట్టించారని పెద్దలు చెబుతుంటారు. ఆదివారం రాత్రితో ప్రారంభం.. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ, రెడ్డి కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న గొల్లగట్టు (పెద్దగట్టు)కు ఆదివారం రాత్రి చేరుకుంటారు. అనంతరం పూజలతో మొదటి రోజు ఘట్టం పూర్తవుతుంది. రెండో రోజు బోనాలు, మూడో రోజు చంద్రపట్నం, నాలుగో రోజు నెలవారం, ఆతర్వాత ఐదోరోజు జాతర ముగుస్తుంది. రూ.1.71 కోట్లతో అభివృద్ధి పనులు.. జాతరకు ప్రభుత్వం ఈ సారి ప్రత్యేకంగా రూ.1.71 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో నూతనంగా కల్యాణ కట్ట, పూజారుల గదులు, విశ్రాంతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు. భక్తులు మంచినీటికి ఇబ్బందులు పడకుండా జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ నుంచి పెద్దగట్టుకు ప్రత్యేకంగా పైపులైన్ వేశారు. గుట్ట కింద ఖాసీంపేట దారిలో గత ఏడాది కోనేటిని నిర్మించారు. కాగా, మూసీ కాలువ పరిధిలో గట్టుకు చుట్టు పక్కల ఉన్న చెరువుల్లో నీళ్లు అడుగంటాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ చెరువులను మూసీ కాలువతో నింపాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాజెక్టు అధికారులను రెండు రోజుల క్రితం ఆదేశించారు. దీంతో ఈ చెరువులకు నీటిని విడుదల చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ పారిశుధ్య నిర్వాహణకు 240 మంది సిబ్బందిని కేటాయించింది. జాతర ప్రాంతంలో మొత్తం ఏడు వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కన ఆర్టీసీ బస్టాండ్.. గుట్ట కింద జాతీయ రహదారి పక్కనే ఆర్టీసీ బస్సులను నిలిపేందుకు బస్టాండ్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల నుంచి 85 బస్సులను జాతరకు స్పెషల్‌గా నడుపనున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి పార్కింగ్ సమస్య లేకుండా మొత్తం మూడు చోట్ల 50 ఎకరాల్లో ప్రైవేటు వాహనాలకు పార్కింగ్ స్థలాలను గుర్తించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకుగాను 1200 మంది పోలీసులు బందోబస్తు చేపడుతున్నారు. 46 సీసీ కెమెరాలతో జాతరను పోలీస్ అధికారులు పర్యవేక్షించనున్నారు. -
పెద్దగట్టుకు పీట
⇒ రూ.2.10 కోట్లు మంజూరు ⇒సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటన ⇒హర్షం వ్యక్తం చేస్తున్న యాదవులు ⇒ వచ్చే ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీదాకా ⇒లింగమంతులస్వామి జాతర సూర్యాపేట : రాష్ట్రంలోనే మేడారం తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు మహర్దశ పట్టనుంది. ఈ ఏడాది జాతర నిర్వహణకు రూ.2.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం రాష్ట్ర రాజధానిలో జాతరపై నిర్వహించిన సమీక్షసమావేశంలో ఈమేరకు ఆయన ప్రకటన చేశారు. దీంతో లక్షలాది మంది యాదవుల ఆరాధ్య దైవమైన దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగింది. ప్రతి రెండేళ్లకోసారి లక్షలాది మంది తరలివచ్చి ఘనంగా నిర్వహించుకునే ఈ జాతరలో అరకొర వసతులతో భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. గత రెండు జాతర్లకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ మంజూరు కాలేదు. సూర్యాపేట స్థానిక ఎమ్మెల్యే రెండు విడతలుగా రూ.5 లక్షల చొప్పున తన నిధుల నుంచి కేటాయించి, చిన్నగా దేవాలయాల స్థానంలో పెద్ద దేవాలయం నిర్మాణం, మహామండపం నిర్మాణాన్ని చేపట్టారు. వేలం పాట నిధులతోనే జాతర నిర్వహణ.. జాతరలో నిర్వహించే వేలం పాటలతో వచ్చే నిధులతోనే అరకొర వసతులు ఏర్పాటు చేసేవారు. తలనీలాలు, కొబ్బరికాయలు, దుకాణాల కేటాయింపు తదితర వాటి వేలంపాటకు వచ్చిన డబ్బులతోనే జాతర నిర్వహించేవారు. శాశ్వత నిర్మాణాలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అనేక మంది మేధావులు, భక్తులు దురాజ్‌పల్లి జాతరలో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ వస్తున్నారు. దీంతోపాటు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో చర్చించి పెద్దగట్టు జాతరకు నిధులు కేటాయించేందుకు తన వంతు కృషిచేశార. ఆ నిధులతో జాతరలో మహిళలకు స్నానాల గదులు, మరుగుదొడ్లు, శాశ్వత తాగునీటి వసతి ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. అదే విధంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా గుట్ట చుట్టూ స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది. 20 లక్షలకుపైగా భక్తులు వచ్చే అవకాశం వచ్చే ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు జరిగే జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షలకు పైగా భక్తులు తరలిరానున్నారు. గతంలో 3 రోజులు మాత్రమే నిర్వహించే జాతరను ఈసారి 5 రోజులు నిర్వహించనున్నారు.