అదరగొట్టిన టీసీఎస్: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్ చిట్కాలివిగో!
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. వరుసగా ఈ ఏడాది కూడా భారతదేశంలో అత్యుత్తమ వర్క్‌ప్లేస్‌గా నిలిచింది. ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్ నిర్వహించిన భారతదేశంలోని మొత్తం టాప్ 25 వర్క్‌ప్లేస్‌ల జాబితాలో టీసీఎస్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. టీసీఎస్. ఈ లిస్ట్‌లో అమెజాన్ , మోర్గాన్ స్టాన్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని లింక్డ్ఇన్ నివేదించింది. (ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్?)
ముఖ్యంగా నైపుణ్యాల అభివృద్ధి; సంస్థ స్థిరత్వం; బాహ్య అవకాశాలు; కంపెనీ అనుబంధం; లింగ వైవిధ్యం; దేశంలో విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి లాంటి ఎ నిమిది పారామీటర్లు ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలోని 25 కంపెనీల్లోకొత్తగా 17 చేరాయి. తొలిసారిగా ఇ-స్పోర్ట్స్ అండ్ గేమింగ్ డ్రీమ్11, Games24x7 కంపెనీలు జాబితాలోకి వచ్చాయి. లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్ లిస్ట్ ఆఫ్ ది ఇయర్‌లోగా ఉన్న జెప్టో ఈ జాబితాలో 16వ స్థానం గెల్చుకోవడం విశేషం. ఇంకా ఈ జాబితాలో రిలయన్స్, డెలాయిట్ లాంటి కంపెనీలు టాప్ 10లో ఉన్నాయి. ఇక లొకేషన్ విషయానికొస్తే, టాప్ లొకేషన్‌గా బెంగళూరు నిలిచింది. ఆ తర్వాత ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, పూణే వంటి నగరాలు ఉన్నాయి. (Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ , కంప్యూటర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలను టెక్నాలజీ రంగంలోని కంపెనీలు అభ్యర్థులలో వెతుకుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఫైనాన్షియల్ సెక్టార్లో, కంపెనీలు కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్రోత్ స్ట్రాటజీలలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నాయి. అలాగేఈ టాప్ 25 కంపెనీలు ఇంజనీరింగ్, కన్సల్టింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్, కస్టమర్ సక్సెస్, డిజైన్, ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ వంటి జాబ్ ఫంక్షన్లలో ప్రధానంగా పెట్టుబడులుపెడుతున్నాయని లింక్డ్ఇన్ వెల్లడించింది. (యానివర్సరీ సేల్, ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు)
చిట్కాలు
అలాగే ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులు కంపెనీపై రీసెర్చ్ చేయడం, సమగ్రతను చూపడం, ప్రామాణికంగా ఉండటం, ఉద్దేశాన్ని ప్రదర్శించడం, ఆసక్తిగా ఉండటం, డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలను నేర్చుకోవడం, నిరాశ చెందకపోవడం లాంటి కొన్ని చిట్కాలను పాటించాలని లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పీర్, ఇండియా మేనేజింగ్ ఎడిటర్ నిరజితా బెనర్జీ తెలిపారు.
అత్యుత్తమ కెరీర్‌కు ఇండియాలో టాప్ కంపెనీల లిస్ట్ 2023: టీసీఎస్, అమెజాన్, మోర్గాన్ స్టాన్లీ, రిలయన్స్, మాక్వారీ గ్రూప్, డెలాయిట్,NAV ఫండ్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్, ష్నైడర్ ఎలక్ట్రిక్, వయాట్రిస్, రాయల్ కరేబియన్ గ్రూప్, విటెస్కో టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మాస్టర్ కార్డ్, యుబి, ICICI బ్యాంక్, జెప్టో, ఎక్స్పీడియా గ్రూప్, ఈవై, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో., డ్రీమ్11 (డ్రీమ్ స్పోర్ట్స్) , సింక్రోనీ, గోల్డ్‌మన్ సాక్స్ , వెరింట్, గేమ్స్ 24x7, టీచ్‌మింట్