liquor sale
-
తణుకు సంతలో ఏరులై పారుతున్న మద్యం..
-
తెలంగాణ: మద్యం షాపుల లైసెన్స్‌ల పొడిగింపు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 31తో ముగియనున్న రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువును మరికొంతకాలం పొడిగించాలని మద్యం షాపుల యజమానులు చేసిన విజ్ఞప్తి పట్ల రాష్ట్ర ప్రభుత్వం విముఖతతో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 1 నుంచి రానున్న రెండేళ్ల కాలానికి కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకొచ్చి లాటరీ ద్వారా కొత్తగా లైసెన్స్‌లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా సెప్టెంబర్ 30తో ముగియనున్న బార్ షాపుల లైసెన్స్‌లకు ఫీజు కట్టించుకుని పునరుద్ధరించే అవకాశాలున్నాయి. ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ గురువారం నిర్వహించిన సమీక్షలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన విధివిధానాలపై ఈ సమీక్షలో చర్చించారు. లాక్డౌన్ కారణంగా 80 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడటంతో తీవ్రంగా నష్టపోయామని, మరో మూడు లేదా ఆరు నెలల పాటు లైసెన్స్‌ల గడువు పొడిగించాలని మద్యం షాపుల యజమానులు చేసిన విజ్ఞప్తిని సమావేశంలో చర్చించగా..దీనిపై విముఖత వ్యక్తమైంది. అయితే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి దీనిపై తుదినిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే దరఖాస్తులతో పాటు లైసెన్స్ ఫీజుల పెంపు విషయాన్ని సైతం సీఎంతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమీక్షలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్ రావు, డిప్యూటీ కమిషనర్ హరికిషన్ పాల్గొన్నారు. -
'ముందు' బాబులు
తెల్లారక ముందే మద్యం దుకాణాల వైపు అడుగులు ► ‘ఉతార్ సుక్క’ పడ్డాకే పనులకు.. ► దుకాణం తెరవక ముందే 20 శాతం విక్రయాలు ► కార్మికులు, వ్యవసాయ కూలీలే అధికం ► నాలుగు నెలల్లోనే 10 లక్షల పెట్టెల అదనపు లిక్కర్ విక్రయం ఒకానొక రోజు సమయం: 5.30 గంటలు (ఉదయం) స్థలం: సంగారెడ్డి పట్టణం. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఓ మద్యం దుకాణం అప్పుడప్పుడే తెల్లవారుతోంది. ఓ మధ్య వయసు వ్యక్తి మద్యం దుకాణం వైపు నడుస్తున్నాడు. షెట్టర్లు మూసే ఉన్నాయి. ఎలాంటి తడబాటు లేకుండా దుకాణం పక్క సందులోంచి పర్మిట్ రూంలోకి వెళ్లాడు. రూ.100 నోటు ఇచ్చి క్వార్టర్ చీప్ లిక్కర్, ఒక నీళ్ల ప్యాకెట్ తీసుకున్నాడు. మూత తీసి సగం లిక్కర్ తాగాడు. తర్వాత ప్యాకెట్ నీళ్లు తాగి ఓచోట కూర్చున్నాడు. కాసేపటికే మరోవ్యక్తి.. మరొకరు.. ఇంకొకరు.. ఇలా వస్తూనే ఉన్నారు! ‘ఉతార్’ సుక్కేస్తున్నారు. గంట వ్యవధిలోనే అంటే ఉదయం 6.30కే పర్మిట్ రూం మందుబాబులతో సందడిగా మారింది. వాస్తవానికి ఉదయం 10 గంటలకు దుకాణం తెరవాలి. కానీ అప్పటికే దాదాపు 150 మందికి పైగా మద్యం తాగి వెళ్లిపోయారు. ...ఇలా ఒక్క సంగారెడ్డి మద్యం దుకాణాల్లో మాత్రమే కాదు. రాష్ట్రంలో చాలాచోట్లా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. తెలతెలవారుతుండగా పనికి వెళ్లాల్సిన జనం ఇలా మద్యం దుకాణం వైపు అడుగులు వేస్తున్నారు. పరగడుపునే ఒకటో.. రెండో పెగ్గులు తాగిన తర్వాతే దినచర్యను మొదలుపెడుతున్నారు. ముందురోజు రాత్రి తాగింది తలకు పట్టి ఇబ్బంది పెడుతుండటంతో(హ్యాంగోవర్) పొద్దున్నే ఉతార్ సుక్కతో ఉపశమనం పొందుతున్నామని చెబుతున్నారు. ఉదయం పూట డిమాండ్ ఉండటంతో దుకాణ యజమానులు అక్రమంగా మద్యాన్ని అందుబాటులో పెడుతున్నారు. ముందు రోజు రాత్రి దుకాణం మూసే సమయంలోనే స్టోర్ రూం నుంచి మద్యం బాటిళ్లను పర్మిట్ రూంలోకి చేర్చి పొద్దున్నే విక్రయిస్తున్నారు. ప్రతిరోజు దుకాణం తెరవక ముందే 20 శాతం మద్యం అమ్ముడు పోతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణం, ఫ్యాక్టరీ కార్మికులు, రోజువారీ కూలీలు ఎక్కువగా ఉండేచోట పొద్దున పూట అమ్మకాలు 25–30 శాతం వరకు ఉన్నాయి. కూలీలు, పలు కంపెనీల్లో పనిచేసే కిందిస్థాయి కార్మికులు అధికంగా ఉండే హైదరాబాద్‌లోని నిజాంపేట, గచ్చిబౌలి, నాగోల్, కాటేదాన్, పటాన్చెరు, ఎల్బీనగర్తోపాటు సంగారెడ్డి, మల్లాపూర్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోంది. ఉదయం పూట ఈ మద్యం దుకాణాల క్రయవిక్రయాల లెక్కలు పరిశీలించగా.. మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు 25 శాతం అధికంగా ఉండటం గమనార్హం. లేవంగనే పడాల్సిందే మల్లేశం, పటాన్చెరు : పొద్దున్నే ‘90’ ఏసుకుంటా. తాగకుంటే తలకాయ రివరివ అంటది. ఏ పని చేతగాదు. తాగినంకనే ఫ్యాక్టరీకి పోతా.. సంజీవ్, సంగారెడ్డి : నా పైసల్ నా ఇష్టం. మీ ఇంట్లె నుంచి ఇస్తుండ్రా.. పొద్దున్నే తాగుతా. 10సంవత్సరాల నుంచి తాగుతున్న. తాగినంకనే పనికి పోతా. శ్రీనివాస్, సూర్యాపేట : లేవంగనే ఉతార్ పడాల్సిందే. లేకుంటే పాణం చేతగాదు. పని చేయలేను. రోజంతా కలిపి అద్దసేరు (ఆఫ్ బాటిల్) తాగుతా. పెరుగుతున్న మందుబాబులు.. ఎక్సైజ్ అధికారుల అంచనాల ప్రకారం ఏటా సగటున 5 శాతం మంది కొత్తగా మద్యానికి అలవాటు పడుతుంటారు. వారిలో 0.5 శాతం దానికి బానిసలవుతారు. కానీ మూడేళ్లుగా మద్యం అలవాటు విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్సైజ్ నివేదికల ప్రకారం ఏటా 12 శాతం కొత్తగా మద్యానికి అలవాటు పడుతుండగా.. వారిలో 2 శాతానికి పైగా బానిసలవుతున్నట్టు తేలింది. గత 4 నెలల మద్యం విక్రయాలు చూస్తే ఈ ఏడాది ఏప్రిల్– జూలై 4 నెలల్లో రూ.5,610 కోట్ల మద్యం వ్యాపారం సాగింది. గతేడాది కంటే 10 లక్షల కేసుల (ఒక కేసు అంటే 12 ఫుల్ బాటిల్స్) మద్యం అదనంగా విక్రయించారు. తెలంగాణ బ్రూవరేజస్ కార్పొరేషన్ 95.04 లక్షల కేసులు విక్రయించింది. గతేడాది ఇదే 4 నెలల కాలంలో 85.47 లక్షల కేసులే అమ్ముడయింది. అంటే ఈ ఏడాది అదనంగా రూ.1,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది! ఇక్కడ సరిపోక.. పక్క రాష్ట్రాల నుంచి.. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో సారా బట్టీలు ధ్వంసం చేయడంతోపాటు గుడుంబాపై బతికే కుటుంబాలకు పునరావాసం కల్పించాలని నిర్ణయించింది. అయితే ఇంతకాలం గుడుంబా తాగిన జనం ఇప్పుడు మద్యం వైపు మళ్లారు. దీంతో నెలకు మూడు లక్షల చీప్, మీడియం లిక్కర్ పెట్టెలు అదనంగా అమ్ముడుపోతున్నట్లు ఎక్సైజ్ లెక్కల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మద్యం సరిపోక పోవటంతో ప్రభుత్వం ఎక్సైజ్ నిబంధనలు సడలించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19 మద్యం ఉత్పత్తి డిస్టిలరీలు ఉన్నాయి. వీటినుంచి ఏడాదికి 2349.05 ఎల్పీఎల్ల మద్యం ఉత్పత్తి అవుతుంది. ఇది చాలక పక్క రాష్ట్రాల నుంచి మీడియం లిక్కర్ దిగుమతికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ..: సాక్షి, హైదరాబాద్ -
అబ్కారీ గ‘మ్మత్తు’
హోటళ్లు, దాబాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు అర్ధరాత్రి వరకూ తాగేందుకు అనుమతులు ప్రాణం..లేదా పరువు పోగొట్టుకుంటున్న మందుబాబులు అనంతపురం సెంట్రల్ : – అనంతపురం నగర శివార్లలో ఉంటున్న శ్రీధర్‌రెడ్డి ఓ దాబాలో స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకూ మద్యం తాగి ఇంటికి బయలు దేరాడు. అయితే మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. – గుత్తికి చెందిన సుధాకర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ డాబాలో మద్యం తాగాడు. అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. కోర్టు ముందు హాజరు పర్చగా జరిమానా విధించి రిమాండ్‌కు పంపించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో సైతం అతనికి పరువు పోయింది. అర్ధరాత్రి మద్యం అమ్మకాల వల్ల జరిగే అనర్థాలకు పైరెండు సంఘటనలు ఉదాహరణలు మాత్రమే..ఇలాంటి నిత్యం ఏదోచోట చేటే చేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత శాఖ మాత్రం తనకేం తెలియనట్టు వ్యవహరిస్తోంది. తప్పు ఒకరిది..శిక్షణ మరొకరికి.. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు చేస్తున్నది మంచిదే అయినా... తప్పు చేస్తున్నది ఒకరైతే.. శిక్ష వేస్తున్నది మరొకరికి అన్నట్లు తయారైంది. హోటళ్లు, దాబాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసుకోవడానికి ఎక్సైజ్ అధికారులు అనధికార అనుమతులు మంజూరు చేశారు. ఎంతైనా అమ్ముకోండి.. నెల మామూళ్లు పంపిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మద్యం దొరకని హోటల్, డాబా ఉందంటే అది అతిశయోక్తిగానే అనిపిస్తుంది. కోరుకున్న బ్రాండ్ ఏదైనా సరే ఇట్టే సరఫరా చేస్తున్నారు. కేవలం మద్యం అమ్మడమే కాదు అర్ధరాత్రి వరకూ తాగేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రాణాలు పొగొట్టుకుని భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. హోటల్, డాబాలు వదిలి ప్రజలపై కేసులా? ఏపీ ప్రొహిబిషన్ చట్టం 1995, సెక్షన్ 9 ప్రకారం దాబాలు, హోటల్స్‌లో మద్యం సేవించడం, విక్రయించడం చట్ట విరుద్ధం. కానీ ఈ చట్టం జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. ఎక్సైజ్, పోలీస్ అధికారులకు వైన్‌షాపుల నుంచే కాకుండా దాబాల నుంచి కూడా నెలనెలా మామూళ్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వైన్ షాపుల్లో అధిక ధరలకు అమ్ముకున్నా... డాబాల్లో అర్ధరాత్రి వరకూ తప్ప తాగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్ల రోడ్డు ప్రమాదాల వివరాలు సంవత్సరం ప్రమాదాలు మృతులు 2012–13 89 23 2013–14 133 24 2014–15 102 35 2015–16 73 41 2016–ఇప్పటి వరకూ 28 12 తాగి నడిపితే కేసులు నమోదు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో నగరంలో ద్విచక్ర వాహనాలు ఢీకొని మృతి చెందిన ఘటనలు ఇటీవల ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు కారణం తాగి వాహనాలు నడపడమే. ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నాం. అంతేకాదు..తీవ్రతను బట్టి రిమాండ్‌కు కూడా పంపుతున్నాం. – నరసింగప్ప, డీఎస్పీ, అనంతపురం ట్రాఫిక్ ∙ దాడులు నిర్వహిస్తాం దాబాలు, హోటళ్లలో మద్యం విక్రయించడం, తాగడం చట్ట రీత్యా నేరం. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దాడులు చేసిన సమయంలో దాబాల్లో మద్యం ఉన్నట్లైతే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం. –అనసూయదేవి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
మద్యం మత్తులో కత్తితో దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ఖమ్మం(అశ్వారావుపేట): మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని నారంవారిగూడెంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం... నారంవారిగూడెం(కొత్తూరు)కు చెందిన సంగం శివాజీ, శంకా వీర్రాజు కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీర్రాజు మద్యం మత్తులో శివాజీ ఇంటికి వచ్చి.. గొడవపడి క త్తితో దాడి చేశాడు. ఈదాడిలో శివాజీ నడుము, తుంటె, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన బంధువులు కేకలు వేయడంతో వీర్రాజు పరారయ్యాడు. బాధితుడిని అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సత్తుపల్లి తరలించాలని వైద్యులు సూచించారు. -
అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
విజయనగరం(రామభద్రాపురం): రామభద్రాపురం మండలం కొత్తక్కి గ్రామంలో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న అత్తికొండ వీరన్న నాయుడు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి 40 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామ గ్రామం ఇక ‘లక్ష్మీ’ గ్రామం
ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమైన కార్యక్రమం అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శంగా వెలిసిన గ్రామమే మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని లక్ష్మీనగర్ గ్రామం. ఒకప్పుడది ఏ సౌకర్యాలూ లేనిదే.. కానీ అందరూ ఒక్కటై ఆలోచనలు పంచుకొని, ఆధునికతను సొంతం చేసుకొని నిర్మించుకుని, నేడు అన్నీ ఉన్న గ్రామం లక్ష్మీనగర్ గ్రామం. 900 మంది జనాభా ఉన్న ఈ చిన్న గ్రామం నేడు అభివృద్ధితో అందరినీ ఆకర్షిస్తోంది. ఆలయా లు, విద్యాలయాలు, వైద్యశాలలు, సహకార సంఘ భవనం, లక్ష్మీనగర్ వెల్ఫేర్ సొసైటీ, తాగునీటి ప్లాంట్, మిల్క్ సొసైటీ, సోలార్ వీధి లైట్లు, ప్లాస్టిక్ నిర్మూలన, ముఖ్యంగా మద్యం అమ్మకం నిషేధం వంటి ప్రజల సంక్షేమ కార్యక్రమాలతో నేడు ప్రపంచానికి ఆదర్శంగా ఉండటం లక్ష్మీనగర్ గ్రామ గొప్పతనం. కర్తవ్య నిర్వహణలో వెనుకంజ వేయకుండా ఉత్సాహంతో ప్రగతి మార్గంలో ముందుకు నడవ డంలో లక్ష్మీనగర్ గ్రామం నిజంగానే తరతరాలకు ఆదర్శ గ్రామమే. మంచినీటి ప్లాంటు ఏర్పాటు, మ ద్యం అమ్మకాలు నిషేధం, మంజీర పాల సమాఖ్య ఏర్పాటు, మహిళా మండలి భవన నిర్మాణం, గ్రామా భివృద్ధి కమిటీలు, గ్రామంలో జెనరిక్ మందుల దుకా ణం, సౌరశక్తితో గృహ, వ్యవసాయ అవసరాలు తీర్చే విద్యుత్‌ని ప్రోత్సహించడం, ఇంకుడు గుంతల్ని ప్రోత్సహించడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కి పనికొచ్చే డంప్ యార్డు నిర్మాణం, లక్ష్మీనగర్ కమ్యూనిటీ మెడిటేషన్ హాల్, లైబ్రరీ, ఆర్ఎంపీ హాస్పిటల్, స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు, వెటర్నరీ హాస్పిటల్, రైతు మహిళా సంఘా ల ఏర్పాటు..ఇలాంటి సామాజిక ప్రయోజన ప్రణా ళికలు ఎన్నో ఆచరణలోకి రావటం ఈ గ్రామం ప్రత్యే కత. ఫ్లోరైడ్ ఇబ్బందుల్ని అధిగమించే నీటి శుద్ధీకరణ ప్లాంట్. 20 లీటర్ల మంచినీరు కేవలం రూ.3 లకే అందించటం. తక్కువ పెట్టుబడితో ప్రజలకు మంచి నీరందించడం అనేది మామూలు విషయం కాదు. మంజీర పాల సమాఖ్య ఏర్పాటుతో 10 మంది స్త్రీలతో కూడిన సొసైటీ ద్వారా మధ్యవర్తుల ప్రమే యం లేకుండా నేరుగా ప్రభుత్వ డైరీ అయిన ‘విజ య’ డైరీకి పాల సరఫరాతో ఎందరో మహిళలు నేడు ఆర్థిక లాభాలు గడించారు. గ్రామంలో ఆలయాల పునరుద్ధరణ, సేంద్రియ వ్యవసాయం. గ్రామం నిం డా మొక్కలు నాటి పెంచడం. గ్రామాభివృద్ధికి సం బంధించి ఇవి చాలా మంచి పనులు. వీరి కృషికి మన కు చేతనైనంత సహకరిద్దాం. మన గ్రామాన్ని కూడా మరో లక్ష్మీనగర్ గ్రామంగా తీర్చి దిద్దుకుందాం. ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో దివ్యమైన ప్రణాళికలతో ప్రగతి వైపు దూసుకుపోతున్న ఆదర్శ గ్రామం లక్ష్మీ నగర్ గ్రామ అభివృద్ధికై ఎవరైనా ఆర్థికంగా సహ కరించాలనుకుంటే వారి బ్యాంకు ఖాతాకు జమ చేయవచ్చు. Laxmi Nagar Welfare Society. Special Savings Account. A/c. No. 223101000627. IFSC Code: ICIC0002231, Papannapet Mandal, Medak District, Pin: 502125. (వ్యాసకర్త మాజీ ఎంపీ, నిజామాబాద్, సెల్: 7702941017 - ఎం.నారాయణరెడ్డి -
మధ్యం అలవాటును ప్రోత్సహిస్తున్న సర్కారు