మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని నారంవారిగూడెంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
ఖమ్మం(అశ్వారావుపేట): మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని నారంవారిగూడెంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం... నారంవారిగూడెం(కొత్తూరు)కు చెందిన సంగం శివాజీ, శంకా వీర్రాజు కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
వీర్రాజు మద్యం మత్తులో శివాజీ ఇంటికి వచ్చి.. గొడవపడి క త్తితో దాడి చేశాడు. ఈదాడిలో శివాజీ నడుము, తుంటె, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన బంధువులు కేకలు వేయడంతో వీర్రాజు పరారయ్యాడు. బాధితుడిని అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సత్తుపల్లి తరలించాలని వైద్యులు సూచించారు.