liquor shoaps
-
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడో విడత లాక్డౌన్లో మినహాయింపులపై కేంద్రం మరింత స్పష్టతనిచ్చింది. కోవిడ్ కంటైన్మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం(ఆరడుగుల ఎడం) పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు. ఈ మినహాయింపు ఈ నెల 4వ తేదీ నుంచి వర్తించనుంది. (ఇన్ఫెక్షన్లు తేల్చేందుకే ఎక్కువ పరీక్షలు) మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు, రెడ్ జోన్లలోని మాల్స్‌లో ఉన్న వాటికి ఈ వెసులుబాటు వర్తించదు. దీంతోపాటు గ్రీన్, ఆరెంజ్ జోన్లున్న ప్రాంతాల్లో సెలూన్లు తెరవొచ్చనీ, అత్యవసరం కాని వస్తువులను కూడా ఈ–కామర్స్ సంస్థలు బట్వాడా చేయవచ్చని వివరించింది. అయితే, రెడ్ జోన్లలో అత్యవసర వస్తువులను మాత్రమే సరఫరా చేసేందుకు ఈ–కామర్స్ సంస్థలకు అనుమతి ఉంటుంది. రెడ్జోన్లలో నివాసితులు తమ పని మనుషుల విషయంలో ఆ ప్రాంత సంక్షేమ సంఘాల అనుమతి ప్రకారం నడుచుకోవాలని, వారికేమైనా జరిగితే యజమానులదే బాధ్యత. 17వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన హోం శాఖ కొన్ని ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే. (లాక్డౌన్ : మాకు వర్క్ ఫ్రం హోమ్ బాగుంది) కరోనా సాధికారత బృందాల పునర్వ్యవస్థీకరణ కరోనాపై పోరాటానికి ఏర్పాటు చేసిన 11 ఉన్నతస్థాయి అధికారిక బృందాలను కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. ఈ బృందాల్లోని కొందరు అధికారులు రిటైర్ కావడమో లేక బదిలీ కావడమో జరిగినందున ఈ మార్పు చేపట్టినట్లు తెలిపింది. ఈ బృందాల విధులు, పరిధులు యథా ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేసింది. (‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’) -
అర్ధరాత్రి 1 గంట వరకూ మద్యం
అనంతపురం సెంట్రల్: తాగినోళ్లకు తాగినంత...అడ్డూలేదు..అదుపూలేదు..అర్ధరాత్రి వరకూ తాగండి...ఊగండంటోంది ప్రభుత్వం. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకూ బార్ అండ్ రెస్టారెంట్లు, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ మద్యం షాపుల్లో అమ్మకాలు చేపట్టుకోవచ్చునన్లి ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ శ్యామ్‌ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం అమ్మకాల సమయ వేళలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. అయితే డాబాలు, హోటళ్లు, లాడ్జీల్లో మద్యం తాగేందుకు అనుమతిస్తే వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ నెలలో 22 కేసులు నమోదు చేసి 420 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 22 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన మహిళలు
► జనావాసాల మధ్య మద్యం షాపులపై హిందూపురం మహిళల కన్నెర్ర ► ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు ముట్టడి, రాస్తారోకో హిందూపురం అర్బన్: ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొద్దంటూ హిందూపురం మహిళలు కదం తొక్కారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి సమీపంలోని కాలనీకి వెళ్లే రోడ్డు పక్కనే మద్యం షాపు ఏర్పాటు చేయటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాము ఇళ్లు విడిచి వెళ్లిపోవాలా అంటూ బాలకృష్ణ పీఏ కృష్ణమూర్తితో పాటు టీడీపీ నాయకులను నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ హిందూపురం మహిళలు శనివారం పెనుకొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వారిని అక్కడ్నుంచి బలవంతంగా పంపించేశారు. దీంతో మహిళలు నేరుగా బాలకృష్ణ ఇంటికి వెళ్లి అక్కడ బైఠాయించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే పీఏ, టీడీపీ నాయకులు బయటకు వచ్చి వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. చివరకు ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి ఆ మద్యం దుకాణాన్ని మరోచోటకు మారుస్తామని చెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఆందోళనలో వార్డు కౌన్సిలర్ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.