Live broadcasts
-
మీరిక వెళ్లొచ్చు
కోల్‌కతా: రోజంతా హైడ్రామా తర్వాత బెంగాల్ ప్రభుత్వం, జూనియర్ డాక్టర్లకు మధ్య శనివారం చర్చలు అసలు ప్రారంభమే కాలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్థన మేరకు ‘ప్రత్యక్ష ప్రసారం’ డిమాండ్‌ను పక్కనబెట్టి చర్చలకు సిద్ధపడ్డ జూనియర్ డాక్టర్లను ఆకస్మాత్తుగా సీఎం నివాసం దగ్గర నుంచి పంపేశారు. చాలా మొరటుగా మీరికి వెళ్లిపోవచ్చని చెప్పారని జూడాలు ఆరోపించారు. ‘చర్చలకు ఆహ్వానించడంతో సీఎం నివాసానికి వచ్చాం. ప్రత్యక్షప్రసారం లేదా వీడియో రికార్డింగు ఉండాలని డిమాండ్ చేశాం. సీఎం మమతా బెనర్జీ బయటకు వచ్చి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం మినిట్స్‌ను మాకు ఇస్తామని హామీ ఇచ్చారు. మాలో మేము చర్చింకున్నాం. సీఎం విజ్ఞప్తి మేరకు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఇదే విషయాన్ని ఆరోగ్యమంత్రి చంద్రిమ భట్టాచార్యకు తెలుపగా.. ఇక చాలు మీరు వెళ్లిపోండని ఆమె చెప్పారు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, మీకోసం మూడు గంటలుగా వేచిచూస్తున్నామని తెలిపారు. అర్ధంతరంగా మమ్మల్ని పంపేశారు’ అని సీఎం నివాసం వద్ద జూనియర్ డాక్టర్లు మీడియాతో వాపోయారు. చర్చలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ‘ఈ ఉదంతం ప్రభుత్వం అసలు రంగును బయటపెట్టింది. చర్చలపై ఎవరికి చిత్తశుద్ధి లేదో తెలుపుతోంది’ అని ఒక జూనియర్ డాక్టర్ కన్నీరుపెట్టుకుంటూ అన్నారు. ‘ఈ రోజుకు ఇక ముగిసినట్లే. మూడు గంటలుగా మేం వేచిచూస్తున్నాం. మీరు సీఎం నివాసం లోపలికి రాలేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది (రాత్రి అయిందని)’ అని ఆరోగ్యమంత్రి చంద్రిమ అంటున్న వీడియోను జూడాలు మీడియాకు షేర్ చేశారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లు నెలరోజులకు పైగా విధులను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. సెపె్టంబరు 10న సాయంత్రానికల్లా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. జూడాల డిమాండ్ మేరకు స్వయంగా చర్చల్లో పాల్గొనడానికి మమత అంగీకరించారు. ప్రత్యక్షప్రసారంపై పీటముడి పడినా.. చివరకు శనివారం జూడాలు దానిపై వెనక్కితగ్గారు. అయినా సర్కారు వైఖరితో చర్చలు సాధ్యపడలేదు. ఎన్నిసార్లు నన్నిలా అవమానిస్తారు: మమత అంతకుముందు సీఎం నివాసం వద్దకు చేరుకొని జూనియర్ డాక్టర్లు చర్చల ప్రత్యక్షప్రసారం డిమాండ్‌తో బయటే నిలబడిపోయా రు. వర్షంలో తడుస్తూ అలాగే నిలబడ్డారు. దాంతో సీఎం మమత బయటకు వచి్చ.. ‘మీరందరూ లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొనాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. వైద్యురాలి హత్యాచారం కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రత్యక్షప్రసారం సాధ్యం కాదు. చర్చలను వీడియో రికార్డు చేసి.. సుప్రీంకోర్టు అనుమతితో మీకొక కాపీ అందజేస్తాం. ఈ రోజు సమావేశమవుదామని మీరే కోరారు. మీకోసం వేచిచూస్తున్నా. మీరెందుకు నన్నిలా అవమానిస్తున్నారు. దయచేసి నన్నిలా అవమానించొద్దు. ఇదివరకు కూడా మూడుసార్లు మీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ మీరు రాలేదు’ అని మమత జూడాలతో అన్నారు. జూడాల శిబిరం వద్ద ప్రత్యక్షం శనివారం ఉదయం అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీఎం మమతా బెనర్జీ స్వయంగా జూనియర్ డాక్టర్ల వద్దకు వచ్చారు. ఐదురోజులుగా జూడాలు బైఠాయించిన స్వాస్థ్య భవన్ (ఆరోగ్యశాఖ కార్యాలయం) వద్దకు చేరుకున్నారు. జూడాల డిమాండ్లను పరిశీలిస్తానని, ఎవరైనా తప్పుచేశారని తేలితే వారిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మెడికోలు వర్షాలకు తడుస్తూ రోడ్డుపై ఆందోళనలు కొనసాగిస్తుంటే తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. తానిక్కడి రావడం సమస్య పరిష్కారం దిశగా చివరి ప్రయత్నమని తెలిపారు. సమ్మె చేస్తున్న జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుత ఆందోళనను అణిచివేయడానికి ఇది ఉత్తరప్రదేశ్ కాదు, బెంగాల్ అని సీఎం వ్యాఖ్యానించారు. -
Junior doctors: ప్రత్యక్షప్రసారం చేయాలి
కోల్‌కతా: నెలరోజులకు పై గా విధులను బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చలకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం వరుసగా రెండోరోజు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి సమక్షంలోనే చర్చలు జ రగాలని జూనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. అలాగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, తమ తరఫున 30 మంది ప్రతినిధుల బృందాన్ని చర్చలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. సచివాలయం నబన్నాలో బుధవారం సాయంత్రం 6 గంటలకు చర్చలకు రావాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ జూనియర్ డాక్టర్లకు ఈ–మెయిల్ ద్వారా ఆహా్వనాన్ని పంపారు. 12 నుంచి 15 మంది రావాలని కోరారు. సీఎం మమతా బెనర్జీ నేరుగా చర్చల్లో పాల్గొనే విషయాన్ని సీఎస్ మెయిల్లో ధృవీకరించలేదు. చట్టానికి బద్ధులై ఉండే పౌరులుగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం ప్రతి ఒక్కరి విధి అయినప్పటికీ జూనియర్ డాక్టర్లు దానికి కట్టుబడలేదని పంత్ పేర్కొన్నారు. దీనిపై సాయంత్రం 5:23 గంటలకు జూనియర్ డాక్టర్లు విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే చర్చలు జరగాలి. టీవీల్లో ప్రత్యక్షప్రసారం ఉండాలి. పలు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు చెందిన జూనియర్ డాక్టర్లు ఆందోళనలో పాలుపంచుకొంటున్నందున కనీసం 30 మందిని చర్చలకు అనుమతించాలి’ అని జుడాల ఫోరం ప్రకటించింది. షరతులకు ఒప్పుకోం బేషరతుగా చర్చలకు రావాలని, జూనియర్ డాక్టర్లు పెట్టిన ఏ షరతునూ అంగీకరించాడానికి బెంగాల్ సర్కారు సిద్ధంగా లేదని ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య స్పష్టం చేశారు. షరతులు పెట్టారంటే వారు మనస్ఫూర్తిగా చర్చలకు సిద్ధంగా లేరని అర్థమన్నారు. -
వైరల్: లైవ్‌లో రిపోర్టర్; ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగ
అర్జెంటినా: అర్జెంటినాలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్న రిపోర్టర్ సెల్‌ఫోన్‌ను దొంగలించిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వీపరితంగా వైరల్ అవుతోంది. డియోగో డెమార్కో సరండి నగరం నుంచి లైవ్ న్యూస్ అందించేందుకు సిద్దంగా ఉన్న రిపోర్టర్ ఫోన్‌ను ఓ వ్యక్తి అకస్మాత్తుగా లాక్కుని పారిపోతున్న వీడియో అదే లైవ్ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అక్కడి స్థానిక న్యూస్ ఛానల్లో రిపోర్టర్‌గా పని చేస్తున్న డెమార్కోను మంగళవారం న్యూస్ స్టేషన్ నుంచి యాంకర్ రిపోర్టింగ్ ఇవ్వాల్సిందిగా చెప్పారు. దీంతో అతడు లైవ్ న్యూస్ అందించేందుకు సిద్దంగా ఉన్న రోలింగ్ కెమారాతో మాట్లాడబోతుండగా ఆకస్మాత్తుగా దొంగ వచ్చి అతడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కెల్లాడు. (చదవండి: వైరల్ వీడియో.. 60 గుడ్లతో ఆమ్లెట్) వెంటనే రిపోర్టర్ లైవ్ వదిలేసి దొంగ వెనక పరుగెత్తాడు. ‘నా ఫోన్ దొంగించాడు.. ఫోన్ ఇచ్చేయ్’ అంటూ స్పానిష్‌లో అరుస్తూ దొంగ వెనక పరుగెత్తాడు. అయితే అదృష్టవాత్తు ఆ స్థానికులు సహాయంతో రిపోర్టర్ తన ఫోన్‌ను తిరిగి పొందాడు. ఆ దొంగ స్థానికుడే కావడంతో రిపోర్టర్‌కు అక్కడి ప్రజలు దొంగ ఆచూకి తెలిపారు. దీంతో కాసేపటికే తన ఫొన్ తిరిగి పొందడంపై రిపోర్టర్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘అదృష్టవశాత్తు నా ఫోన్ నాకు దొరికిందని, ఇందుకు తాను కృతజ్ఞుతుడి అని పేర్కొన్నాడు. అయితే తను దొంగను పట్టించాలనుకోవడం లేదని, ఫోన్ దొరికితే చాలు అని చాలు అనుకునకున్నానని చెప్పాడు. (చదవండి: ఒళ్లంతా తేనెటీగలతో.. షాకింగ్ వీడియో) -
నెట్టింట్లో పెళ్లిసందడి
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : ఒకప్పుడు నగరాలకే పరిమితమైన సాంకేతిక విప్లవం ఇప్పుడు పట్టణాలు, గ్రామాలకూ విస్తరించింది.ఇంటర్నెట్ ఉంటే ప్రపంచం గుప్పిట్లోకి వచ్చినట్లే కదా మరి. మారుమూల గ్రామాల్లో జరిగిన శుభకార్యాలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఏర్పడింది. ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి రావడంతో విదేశాల్లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పెళ్లి పిలుపునకు కొత్త పుంతలు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు నేటి తరం వారు. వివాహ ఆహ్వానాలకు కొత్త పుంతలు తొడుగుతున్నారు. పెళ్లి కార్డులిచ్చి పెళ్లికి రావాలని ఆహ్వానించే రోజులు పోయాయి. సెల్ఫోన్లో మెసేజ్‌లు, ఇంటర్నెట్లో ఆహ్వానాలు పలుకుతున్నారు. పూర్వం స్వయంగా పెళ్లికి పిలుస్తే తప్ప వెళ్లే వారు కాదు. అంత పంతం ఉండేది. అందుకే స్వయంగా ఆహ్వానించే వారు. కానీ ఇప్పుడు సెల్‌ఫోన్, ఈ మెయిల్, ఫేస్బుక్లో ఆహ్వానం పలకగానే పెళ్లికి హాజరవుతున్నారు. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వాగతిస్తున్నారు. ఇంటర్నెట్లో ప్రత్యక్ష ప్రసారం ఒకప్పుడు ఎన్ని పనులున్నా దగ్గరి వారి పెళ్లికి వ్యయ ప్రయాసలకోర్చి హాజరయ్యేవారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారు తప్ప చాలా మంది వివాహ శుభ కార్యాలయాలకు హాజరు కావడం లేదు. ముఖ్యంగా విదేశాల్లో, ఇతర రాష్ట్ర్రాల్లో స్థిరపడిన వారి పరిస్థితి చెప్పనక్కరలేదు. విదేశాల్లో ఉన్న వారు వివాహ వేడుకలకు రావాలని ఆశ పడినా యజమానులు అనుమతి ఇవ్వకపోవడం, ఇచ్చినా విమానం టికెట్ రిజర్వేషన్ లభించకపోవడం జరుగుతుంది. ఒకవేళ అన్నీ అనుకూలించినా రానుపోను వ్యయం తడిసి మోపెడవుతుందనే కారణంతో రాలేని వారున్నారు. అలాంటి వారికి ఇంటర్నెట్ సౌలభ్యంగా మారింది. వివాహం వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్నా క్షణాల్లో ప్రత్యక్షంగా పెళ్లి తంతును చూసే వీలుంది. పెళ్లి మండపంలో కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా పెళ్లిని ప్రత్యక్షంగా చూసి ముచ్చటపడవచ్చు. ఇప్పుడు గ్రామాలకు కూడా ఈ సౌకర్యం విస్తరించడ ంతో విదేశాల్లో ఉన్న వారి కోసం ఇంటర్నెట్ పెళ్లిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా వీక్షించవచ్చు.. పెళ్లిని ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలంటే అందుకు కావలసింది2 ఎంబీపీఎస్ వేగం గల ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్. వివాహ వేడుకలను వీడియో తీసే కెమెరాకు సర్వర్‌ను(కేబుల్)ద్వారా కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. ప్రత్యేకమైన సైట్లో లైవ్‌గా ప్రసారం చేస్తారు. రెండు, మూడు క్షణాల తేడాతో ప్రపంచం అంతా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. నేరుగా వివాహం చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఖర్చు కూడా తక్కువే.... ఇంటర్నెట్లో పెళ్లి వీక్షణం సౌలభ్యం ఏర్పాటుకు ఖర్చు కూడా ఎక్కువేమీ కాదు. తక్కువ డబ్బుకు ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రత్యక్ష ప్రసారాలు చేసే సాంకేతిక నిపుణులకు బాధ్యతలు అప్పగిస్తే చాలు వారే అన్నింటినీ పొందుపరుస్తారు. వివాహ తంతు ఆసాంతం ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు. ఇంటి నుంచే మాట్లాడుకోవచ్చు అమ్మా ఏం కూర చేశావు... చెల్లె ఏమి చేస్తుంది.. నీవు కట్టుకున్న చీర బాగుంది.. అంటూ వంటావార్పు చేసుకుంటూ కూడా ప్రత్యక్ష ప్రసారాలతో మాట్లాడుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వారు ఇక్కడి వారిని అక్కడి వారిని ఇక్కడ వారు ఇలా ఒకరిని రోజు పలకరించుకోవచ్చు. దీంతో ఎంత సుదూరంలో ఉన్నా నేరుగా కలుస్తున్నామనే ధీమా ఏర్పడుతుంది. ఒక్క వివాహ వేడుకలే కాకుండా విదేశాల్లో ఉన్న, లేక స్థానికంగా ఉన్న వారు పుట్టిన రోజు, సత్యనారాయణ వ్రతాలు అన్నింటిని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో విదేశీ సంబంధాలు చాలా బలపడ్డాయి. విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురుతో మాట్లాడే వారి సంఖ్య పెరిగింది. ఇంట్లో కంప్యూటర్, బుల్లి కెమెరా ఏర్పాటు చేసుకుని ఇంటర్నె ట్ సౌలభ్యంతో ప్రత్యక్ష ప్రసారాలు మాటా ముచ్చట జరుగుతున్నాయి.