LIVING STANDARDS
-
‘మూసీ’ ప్రజల జీవనప్రమాణాలు పెంచుతాం
సాక్షి, హైదరాబాద్: మురుగునీటితో నిండిన మూసీని బాగు చేస్తున్నట్టే.. పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజల జీవితాలను బాగు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దోమలు, ఈగలు, దుర్గంధంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ప్రజలను గత ప్రభుత్వం మాదిరి గాలికి వదిలేయబోమని, వారి జీవన ప్రమాణాలు మారుస్తామన్నారు. అక్కడ నివసించే ప్రజల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బస్తీల్లో ఉండే పెద్ద మనుషులు, రాజకీయపక్షాల నాయకులు, సామాజిక నాయకుల సలహాలు, సూచనలు కూడా వింటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు మణిహారంగా మూసీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ రిహాబిలిటేషన్‌పై పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. మూసీ ప్రక్షాళన, అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలు, అభివృద్ధి విజన్‌ను మూసీ పరీవాహక ప్రాంతవాసులకు వివరించా లని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూసీలో నివాసముంటున్న వారికి పట్టాలు ఉన్నా. లేకున్నా వారంతా తెలంగాణ బిడ్డలేనని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మూసీకి దగ్గరున్న ప్రభుత్వ భూముల్లోనే వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మూసీ నిర్వాసితుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళాసభ్యులకు వడ్డీ లేని రుణాలు, వ్యాపారం చేసుకోవడానికి ఒక అధ్యయన బృందం ఏర్పాటు చేసి సహాయ, సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని వారికి చెప్పాలన్నారు. ప్రజలకు మేలు జరిగే సూచనలు ఇస్తే అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్,జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్ ఉన్నారు. ఆదాయం పెంచే ప్రణాళికలతో రండి ఆదాయ శాఖల ఉన్నతాధికారుల సమీక్షలో భట్టి ధరలు పెంచకుండా, రాష్ట్ర ఖజానా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేíÙంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదాయం పెంపునకు నిర్దిష్ట ప్రణాళికతో రావాలన్నారు. లొసుగులను అరికడుతూ ఆదాయం పెంచేందుకు వాణిజ్య పన్నుల కమిషనర్, జాయింట్ కమిషనర్ ఆయా విభాగాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. మద్యం దుకాణాల్లో గరిష్ట ధర కంటే ఎక్కువ రేట్లతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా, పనుల ఎగవేతను కట్టడి చేయడానికి వాణిజ్య పన్నులు, రవాణా అధికారులు సమావేశమై ఓ నివేదిక రూపొందించాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన రాజీవ్ స్వగృహ, గృహ నిర్మాణ శాఖ పరిధిలోని ఇళ్ల విక్రయాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఇసుక రీచ్‌ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరాలంటే ఏం చేయాలో సీనియర్ అధికారులు ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, వాణిజ్య పన్నుల ముఖ్య కార్యదర్శి రిజ్వీ, గనుల శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ వచ్చాకే దళితులు, గిరిజనులకు రక్షణ
సాక్షి, అమరావతి : ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అంటూ ముఖ్యమంత్రి వంటి అత్యున్నత పదవిలో ఉన్న నారా చంద్రబాబు రాష్ట్రంలోని దళిత జాతిని తూలనాడిన ఘటనను ఈనాడు రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. బాబు హయాంలో రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరిగిన దమనకాండను, టీడీపీ నేతల అవహేళనలను రామోజీ కనీసమాత్రంగానైనా ఖండించలేదు. ఈనాడు పత్రికలో ఒక్క ముక్కా రాయలేదు. అదే దళిత జాతిని, గిరిజనులను, బీసీలను, మైనార్టీలను తన వాళ్లుగా భావించి, వారి అభ్యున్నతికి పాటుపడుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలతో కథనాలు రాస్తారు. దళితులు, గిరిజనులపై రామోజీరావు మరోసారి మొసలి కన్నీరు కార్చారు. రాష్ట్రంలోనే కాదు.. దేశ చరిత్రలోనే విప్లవాత్మక రీతిలో దళిత, గిరిజనులకు సంపూర్ణ భద్రత కల్పించి, వారి సంక్షేమం, అభ్యున్నతికి పాటుపడుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగబడ్డారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదికను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. కనికట్టు కథనంతో విషం చిమ్మారు. కానీ వాస్తవం ఏమిటో దళితులకు, గిరిజనులకు తెలుసు. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు తమను తూలనాడిన విషయాన్ని మరచిపోలేదు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా అధికారిపై చేసిన దాష్టీకం వారి కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. వర్ల రామయ్య వ్యాఖ్యలూ వారి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే దగాపడ్డ దళితులు, గిరిజనులను అక్కున చేర్చుకొన్నారు. ఆ కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టారు. సీఎం జగన్ ఇచ్చిన చేయూతతో ఈరోజు దళితులు, గిరిజనులు పూర్తి ఆత్మగౌరవంతో దర్జాగా జీవిస్తున్నారు. ఇది వారే చేప్పే వాస్తవం. రామోజీరావుకు మింగుడు పడని విషయమూ ఇదే. అందుకే వక్రీకరించిన కథనాలతో మానసిక సంతృప్తి చెందాలన్న వ్యథలు. రామోజీరావు కథనంలో అన్నీ అసత్యాలేనని తెలిపే వాస్తవాలతో ఫ్యాక్ట్ చెక్.. బాబు హయాంలో ఫిర్యాదు చేయాలంటేనే హడల్ టీడీపీ ప్రభుత్వ హయాంలో బాధిత ఎస్సీ, ఎస్టీలు పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోయేవారు. ధైర్యం చేసి బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే బెదిరించి వెనక్కి పంపించేవారు. ఎందుకంటే అప్పుడు దళితులు, గిరిజనులపై దాడులు చేసిన వారిలో అధిక శాతం టీడీపీ నేతలు, వారి అనుచరులే. అందుకే బడుగు వర్గాల ప్రజలు ఫిర్యాదు చేయడానికి భయపడే పరిస్థితి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిస్థితి వేరు. సీఎం వైఎస్ జగన్ వారిలో భరోసా కల్పించారు. పలు కార్యక్రమాల ద్వారా వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దీంతో వారిపై దాడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఒకవేళ ఎక్కడైనా దాడులు జరిగినా, ఎస్సీ, ఎస్టీలు ధైర్యంగా ఫిర్యాదు చేసే పరిస్థితులను ప్రభుత్వం కల్పించింది. కేసుల సంఖ్య పెరిగినట్టు కనిపించినా పర్వాలేదు.. బాధితులకు న్యాయం జరగాలి.. దోషులకు శిక్షలు పడాలి అనే విధానాన్ని అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వేధింపులకు పాల్పడేవారి పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆధారాల సేకరణ కోసం వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా 2020 ఆగస్టులోనే ప్రవేశపెట్టింది. ఇవన్నీ సత్ఫలితాలిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలపై కేసుల దర్యాప్తులోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపడుతోంది. టీడీపీ హయాంలో 2014 – 2019 మధ్య దర్యాప్తు పూర్తిచేయడానికి సగటున 206 రోజులు పడితే.. ఇప్పుడు ఆ సరాసరి 86 రోజులకు తగ్గింది. టీడీపీ హయాంలో 44 శాతం కేసుల్లోనే చార్‌్జషీట్లు దాఖలు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చార్్జషీట్ల నమోదు 73 శాతానికి పెరిగింది. శిక్షలూ గణనీయంగా పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బాధితులకు మెరుగైన పరిహారం దాడులు, వేధింపుల కేసుల్లో బాధితులైన ఎస్సీ, ఎస్టీలను ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. బాధితులకు పరిహారాన్ని భారీగా పెంచింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో దాడులు, వేధింపులకు గురైనవారికి కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిహారాన్ని పంపిణీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లలో కేవలం రూ.54.60 కోట్లే బాధితులకు పరిహారంగా ఇచ్చింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే మొత్తం రూ.159.30 కోట్లు పరిహారంగా అందించి బాధితులను ఆదుకుంది. బాబు హయాంలో దమనకాండ.. వైఎస్సార్సీపీ హయాంలో భరోసా చంద్రబాబు ప్రభుత్వ హయాంను ఎస్సీ, ఎస్టీలపై యథేచ్ఛగా సాగిన దమనకాండ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను ఎప్పటికీ వెన్నాడే పీడకలే. 2014–19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో దేశంలోనే ఎస్సీ, ఎస్టీలపై దాడులు అత్యధికంగా జరిగిన టాప్–10 రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై దాడులు గణనీయంగా తగ్గాయి. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆపన్నహస్తం టీడీపీ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేవారు. దాంట్లో రూ.1.5 లక్షల్ని అప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. ఎప్పుడో ఐదేళ్లకో, పదేళ్లకో ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే సీఎం వైఎస్ జగన్ ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఆ మొత్తాన్ని ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నారు. వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునే కౌలుదారుల కుటుంబాలకు కూడా రూ.7 లక్షలు పరిహారం నేరుగా వారి ఖాతాకు జమ చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు 1,270 రైతు కుటుంబాలకు రూ. 88.90 కోట్లు పరిహారం చెల్లించారు. ఇందులో 485 మంది కౌలు రైతులుండగా, ఆ కుటుంబాలకు రూ.33.95 కోట్లు సాయం అందించారు. 2014 – 19 మధ్య జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ.23.70 కోట్లు పరిహారం చెల్లించగా, వీరిలో కూడా 212 మంది కౌలు రైతులున్నారు. వీరికి రూ.10.60 కోట్ల పరిహారం చెల్లించారు. ఈ వాస్తవాలను విస్మరించి రామోజీరావు అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. -
ప్రపంచంలో బెస్ట్ సిటీ ‘వెలెన్సియా’.. టాప్ 10 నగరాలివే..
న్యూయార్క్: మూడు ఖండాల నుంచి మూడు నగరాలు ఇంటర్నేషన్స్ సంస్థ తాజా సర్వేలో అత్యుత్తమ సిటీల జాబితాలో నిలిచాయి. ప్రవాసులు నివసించడానికి 2022లో ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో స్పెయిన్‌లోని వెలెన్సియా టాప్‌లో నిలిచింది. అద్భుతమైన జీవన ప్రమాణాలుంటాయని జీవన వ్యయం భరించే స్థాయిలో ఉంటుందని, ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని సర్వేలో అత్యధికులు వెలెనికా నగరానికి ఓటు వేశారు. ఆ తర్వాత స్థానంలో దుబాయ్, మూడో స్థానంలో మెక్సికో సిటీ నిలిచాయి. 181 దేశాల్లో నివసిస్తున్న 11,970 మంది ప్రవాసుల అభిప్రాయాలను తెలుసుకొని ఈ జాబితాకు రూపకల్పన చేశారు. టాప్ 10 నగరాలివే.. 1. వెలెన్సియా (స్పెయిన్): జీవన ప్రమాణాలు, అల్ప జీవన వ్యయం, మంచి వాతావరణం. 2. దుబాయ్: పని చేయడానికి అనుకూలం, ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు. 3. మెక్సికో సిటీ: ఫ్రెండ్లీ నగరం. 4. లిస్బన్ (పోర్చుగల్): అద్భుత వాతావరణం. 5. మాడ్రిడ్ (స్పెయిన్): సాంస్కృతిక అద్భుతం. 6. బాంకాక్: సొంత దేశంలో ఉండే ఫీలింగ్. 7. బాసిల్ (స్విట్జర్లాండ్): ఆర్థికం, ఉపాధి, జీవన ప్రమాణాల్లో ప్రవాసుల సంతృప్తి 8. మెల్బోర్న్ (ఆస్ట్రేలియా): అన్నింటా బెస్ట్. 9. అబుదాబి: ఆరోగ్యం రంగట్లో టాప్. ప్రభుత్వోద్యోగుల పనితీరు అద్భుతం. 10. సింగపూర్: మంచి కెరీర్. రోమ్ (ఇటలీ), టోక్యో (జపాన్), మిలన్ (ఇటలీ), హాంబర్గ్ (జర్మనీ), హాంగ్‌కాంగ్ ప్రవాసుల నివాసానికి అనుకూలంగా ఉండవని సర్వే పేర్కొంది. -
బాల్యం పెరుగుతోంది
గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నవలలో బుచ్చమ్మకి బాల్య వివాహం చేస్తాడు తండ్రి అగ్నిహోత్రావధాని. బాల్యంలోనే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి చేరుతుంది బుచ్చమ్మ. కాళ్లకూరి నారాయణరావు ‘వరవిక్రయం’లో కాళింది నూతిలో దూకి మరణిస్తుంది. ముక్కు పచ్చలారని పసిపిల్లలను ఆరు పదులు నిండిన వృద్ధులకిచ్చి వివాహం చేయడం అప్పట్లో ఓ దురాచారం. జీవితం అంటే ఏంటో తెలిసే లోపుగానే వారి జీవితం ముగిసిపోయేది. సుమారు యాభై ఏళ్ల క్రితం వరకు కూడా బాల్య వివాహాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఎంతోమంది సంస్కర్తలు ఈ ఆచారానికి వ్యతిరేకంగా పోరాడి, రూపుమాపేందుకు కృషి చేశారు. ప్రభుత్వాలు కూడా చట్టాలు తెచ్చాయి. ఫలితంగా బాల్యవివాహాలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య మరింత తగ్గిందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అక్షరాస్యత, జీవన ప్రమాణాల స్థాయి వంటివి పెరగడం కూడా ఇందుకు కారణం. బిహార్, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 15–19 మధ్య వయస్సు ఉన్న ఆడపిల్లల వివాహాలు 6.4 శాతానికి తగ్గిపోయాయి. పశ్చిమ బెంగాల్లో ఈ శాతం మరింత తక్కువగా ఉంది. బాల్యంలోనే వివాహాలు కావడం వల్ల టీనేజ్‌లోకి వచ్చేసరికి గర్భం ధరించి, మాతృత్వం అంటే ఏమిటో తెలియని వయస్సులోనే తల్లులైపోతున్నారు. ఈ కారణంగా ఆడపిల్లలు చదువుకోలేకపోతున్నారు, ఉన్నత పదవులు అలంకరించలేకపోతున్నారు. ఆడపిల్లలు ఉన్నతవిద్యలు అభ్యసించాలి, జీవితాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి. వారికి జరుగుతున్న అన్యాయం ఏంటో అర్థం చేసుకోవాలి. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. అవన్నీ జరగాలంటే.. బాల్య వివాహాల నుంచి వారిని కాపాడే చట్టాలు మాత్రమే కాదు, మనుషులూ ఎప్పుడూ నిఘావేసి ఉంచాలి. – రోహిణి -
ఆక్వాపార్క్‌తో జీవన ప్రమాణాలకు దెబ్బ
భీమవరం : గొంతేరు డ్రెయిన్‌ను కాలుష్యకారకంగా మార్చి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీసేలా తుందుర్రులో గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్‌ను నిర్మిస్తున్నారని న్యాయవాది, మానవహక్కుల వేదిక నాయకురాలు ఎం.విమల, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సభ్యుడు బి.రామకృష్ణంరాజు అన్నారు. ఆక్వా ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాలైన తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు, మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లిలో శనివారం వీరు పర్యటించారు. బాధిత ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం భీమవరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆక్వాపార్క్ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే అంశాలు, కాలుష్యంపై జాతీయ మానవహక్కుల వేదిక, పర్యావరణ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనున్నట్టు విమల చెప్పారు. మూడేళ్లుగా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా 40 గ్రామాలకు చెందిన సుమారు రెండు లక్షల మంది ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఫుడ్‌పార్క్ వల్ల ఎటువంటి కాలుష్యం బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పిన ప్రభుత్వం ఫ్యాక్టరీలోని కలుషిత నీటిని సముద్రంలో కలపడానికి రూ.12 కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు మంజూరు చేసిందని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలో రొయ్యలను శుద్ధిచేయడానికి రోజూ 1.15 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తారని, తర్వాత దీనిని బయటకు వదలడం ద్వారా భూగర్భ జలాలకు ముప్పుతప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 1,200 మందికి ఉపాధి కల్పించే ఫ్యాక్టరీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు కేటాయిస్తూ లక్షల మంది భవిష్యత్‌ను విస్మరించడం దారుణమన్నారు. అనర్థాలు తప్పవు ఆక్వా ఫుడ్‌పార్క్ వల్ల అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం అడ్డగోలుగా మద్దతు ఇవ్వడం దారుణమని కృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీతో విచారణ చేయించి ఫ్యాక్టరీ నిర్మాణంపై ముందుకు సాగాలని సూచించారు. ప్రజా ఉద్యమాల జాతీయ కన్వీనర్ మీరా సంగమిత్ర మాట్లాడుతూ ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుంటే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వద్దంటున్న ప్రజలపై నిర్బంధాన్ని ఆపాలని, అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని, 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బృందంలో రోహిత్, రాహుల్ ఉన్నారు. -
హైదరాబాద్.. భిన్నత్వంలో ఏకత్వం
బెంగాలీల అభ్యున్నతికి పాటుపడుతాం హైదరాబాదీల జీవన ప్రమాణాలను పెంచుతాం ఘనంగా హైదరాబాద్ బెంగాలీ సమితి 75వ వార్షికోత్సవం నాంపల్లి: ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు నివసించే విశ్వజననీయమైన నగరంగా హైదరాబాదు కానుందని, అందుకు అనుగుణంగా మహా హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం రాత్రి రవీంద్ర భారతి వేదికపై హైదరాబాద్ బెంగాలీ సమితి 75వ వార్షికోత్సవం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా హాజరైన కేటీఆర్ ముందుగా బెంగాలీలో కాసేపు మాట్లాడి అందరినీ నవ్వించారు. దేశంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇతర నగరాల కంటే భిన్నంగా హైదరాబాదు నగరం ఉంటుందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని అన్నారు. తాను కూడా వంద కిలోమీటర్ల దూరం ఉండే సిద్ధిపేట నుంచి ఆరేళ్ల ప్రాయంలో హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డవాడినేనని చెప్పారు. హైదరాబాదులో నివసించే హైదరాబాదీల జీవన ప్రమాణాలకు అనుగుణంగా మౌళిక వసతులు కల్పిస్తామని చెప్పారు. అంతర్జాతీయ సభలకు వేదికగా మారిన హైదరాబాదును ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ప్లై ఓవర్లు, స్కైవేలు కాదని, సర్వమానవాళి సంక్షేమానికి అనుగుణంగా, వారసత్వం గర్వించేలా మౌలిక వసతులను సమకూర్చడం అన్నారు. అప్పుడే ఇతర నగరాలతో దీటుగా హైదరాబాదు పోటీపడుతుందని అన్నారు. అంతర్జాతీయ సభలకు వేదికగా మారిన హైదరాబాదులో అభివృద్ధికి అనుగుణంగా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఐటీ, హెల్త్, ఫార్మా వంటి కంపెనీలతో దే శ రాజధాని ఢిల్లీని తలదన్నేలా హైదరాబాద్ ఉండబోతోందన్నారు. దేశంలోనే ఏ ఇతర రాష్ట్రానికీ దక్కని 11 శాతం వృద్ధిరేటును సాధించిందని, అదే బడ్జెట్‌ను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారని అన్నారు. ఇప్పుడు చేపట్టే ప్రతి అభివృద్ధి భావి భారత పౌరులకు పరిశుభ్రమైన వాతావరణం, అభివృద్ధిని, మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తున్నారు. హైదరాబాదు గుండా ప్రవహించే మూసీ నదిని గుజరాత్‌లోని సబర్మతి నది తరహాలో సుందరీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ బెంగాలీ సమితికి చెందిన భూమి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. కార్యక్రమంలో కోల్ ఇండియా సీఎండీ సుదిత్యా భట్టచార్య, ఎస్బీహెచ్ సీఎండీ శంతన్ ముఖర్జి, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ హైదరాబాదు కింగ్‌శుక్‌నాగ్, సమితి అధ్యక్షులు రంజన్ రాయ్ చౌదరి, కార్యదర్శి సుమిత్ సేన్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రాగబ్ ఛటర్జీ సంగీత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. -
బెధరహో
పేద, మధ్య తరగతికి ధరల మంట అప్పులపాలవుతున్న చిరుద్యోగులు ఇంకొందరికి అప్పు పుట్టని వైనం జీవన ప్రమాణాలు దెబ్బతింటాయంటున్న నిపుణులు వన్‌టౌన్‌కు చెందిన కుమార్ పాతబస్తీలోని ఒక హోల్‌సేల్ దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతడికి నెలకు సుమారు పది వేల వరకూ జీతం వస్తుంది. గత ఏడాది సరాసరిగా జీతం ఖర్చులకు సరిపోయేది. ఏడాదిగా పెరిగిన ధరలతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది మాసాలుగా అప్పులు కూడా దొరకకపోవడంతో కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామంటూ కుమార్ వాపోతున్నాడు. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. సగటు మానవుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. పప్పుచారు కాదు కదా కనీసం పచ్చడి మెతుకుల్ని కూడా తినలేని పరిస్థితి. మొన్న సన్నబియ్యం.. నిన్న ఉల్లిగడ్డ.. నేడు కందిపప్పు.. ఇలా ఒకటేమిటి! దేన్నీ కొనేట్లు లేదు.. దేన్నీ తినేట్లు లేదు. మార్కెట్లో రోజురోజుకీ పెరిగిపోతున్న ధరల మంటకు పేద, మధ్యతరగతి జీవులు అల్లాడుతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను గడిపేదెలా అని సర్కారును ప్రశ్నిస్తున్నారు. వన్‌టౌన్ : వచ్చే జీతాలు సరిపోక పెరిగిన ఖర్చులతో ఉద్యోగులు అప్పులపాలవుతున్నారు. ఇంటి అద్దె, సరుకులు, పిల్లల ఫీజులు.. ఇలా ఒకదానికొకటి పోటీ పడుతూ పెరిగిపోతుంటే అప్పులు చేయక తప్పడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక ప్రైవేట్ ఉద్యోగులకు పెరిగిన ఖర్చులకు సరిపడా ఆదాయం లభించక, అప్పు పుట్టే పరిస్థితులు లేకుండా పోయాయి. ఏడాది కాలంగా పరిస్థితి దుర్భరంగా మారిందంటూ కార్మికులు, చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతింటున్న జీవన ప్రమాణాలు పెరిగిన ధరలు ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే జీతాల్లో ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, కరెంటు చార్జీలు, పెట్రోల్ ఇలా నిర్దిష్టంగా ఉండే ఖర్చులను తగ్గించుకునే పరిస్థితి ఉండదు. ఇక తినే తిండి, వైద్యం, ఇతర వినోదం వంటి అంశాలను అనివార్యంగా తగ్గించుకోవాల్సిందే. తత్ఫలితంగా మానవ జీవితం ఇబ్బందులపాలుకాక తప్పదు. ధరల పెరుగుదలతో పాటు సరిపడినంత ఆదాయం లభించకుంటే సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.