lizard tail
-
వైరల్ వీడియో: రెస్టారెంట్లో ఉడుము ప్రత్యక్షం.. బోరున ఏడ్చిన మహిళ.. చివరికి!
బ్యాంకాక్: మనుషులకు భయాలు ఉండడం సహజం. కొందరు చిన్నచిన్న విషయాలకు కూడా జంకుతుంటారు.కొందరికి ఎత్తైన ప్రాంతాలంటే భయం, మరికొందరికి పాములు, కుక్కలు, బొద్దింకలు అంటే భయం. భయపడే ప్రాణాలు కళ్ల ముందు కనబడితే వాటి నుంచి ఆమడ దూరం పారిపోతుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనలు చూసే ఉంటాం. తాజాగా ఓ మహిళ ఉడుమును (మానిటర్ లిజర్డ్) విపరీతంగా భయడింది. ఈ ఘటన థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నారాతివాత్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మహిళ కూర్చీలో కూర్చొని ఉండగా బయట నుంచి అక్కడికి ఓ ఉడుము వచ్చి చేరుతుంది. తోకను ఊపుతూ, నాలుకను బయటకు చూపుతూ భయపెట్టింది. దీంతో మహిళ కెవ్వుమని కేకలు వేస్తూ కూర్చీ మీద నిల్చుంటుంది. అంతేగాక చిన్నపిల్లలా గుక్కపెట్టి ఏడ్చేసింది. ఇంతో షాప్‌లోని ఓ యువకుడు ఆ ఉడుమును పట్టుకునేందుకు పయత్నించినప్పటికీ వీలుపడలేదు. అయినా అది లొంగకుండా అతనిపై ఎదరుదాడికి ప్రయత్నించింది. చదవండి: Viral Video: రెప్పపాటు ఘటన.. కొంచెం ఆలస్యం అయితే యువకుడి ప్రాణం పోయేది.. మహిళను ఏడుపుని చూడలేక ఇంతలో ఆ యువకుడు ఓ పొడవైన కర్రను తెచ్చి ఉడుము తల మీద బలంగా నొక్కి పెట్టాడు. అలా దానిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. అప్పటికే ఏడుస్తున్న మహిళ కళ్లు తుడుచుకుంటూ కూర్చీ దిగి నవ్వేసింది. దీనికి సంబంధించిన వీడియోని యూట్యూబ్‌లో ఫిబ్రవరి 9న పోస్టు చేశారు. 56 సెకన్ల నిడివి గలఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మహిళ ప్రవర్తనపై నవ్వులు చిందిస్తున్నారు. ‘ఉడుమును చూసి మహిళ బయపడటం కాదు.. పాపం ఉడుమే మహిళను చూసి భయపడి ఉంటుంది.’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
మనిషి వెన్ను సమస్యలకు బల్లితోకతో పరిష్కారం!!
టొరంటో: తోక తెగిన బల్లులను మనం చాలాసార్లు చూసే ఉంటాం. అలా ఎందుకు తెగుతుందో కూడా మనకు తెలిసిందే. కేవలం శత్రువుల నుంచి తనను తాను కాపాడుకునేందుకే బల్లి తన తోకను తెంపుకుంటుందట. ఈ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. తెగిన తోక మళ్లీ ఎలా పుట్టుకొస్తుంది? బల్లి వెన్నెముక తోక వరకు విస్తరించి ఉంటుంది కదా? మరి వెన్నెముక కూడా కొత్తగా ఎలా పుట్టుకొస్తుంది? ఈ విషయమై పరిశోధన జరిపిన కెనడాలోని గెల్ఫ్ యూనివర్సిటీ పరిశోధకులు.. అందుకు కారణం స్టెమ్సెల్సేనని గుర్తించారు. తెగిపోయిన బల్లి తోక ఎలా పెరుగుతోందో తెలుసుకునే విషయమై ఇప్పటిదాకా జరిగిన పరిశోధనలేవీ కచ్చితమైన సమాధానాన్ని ఇవ్వలేకపోయాయని, అయితే తోకవరకు విస్తరించిన వెన్నుపూసలోని రేడియల్ గ్లియా అనే ప్రత్యేక కణాలు స్టెమ్సెల్స్గా మారి, తోక పునరుత్పత్తికి సహకరిస్తున్నాయని తమ పరిశోధనలో గుర్తించామని పరిశోధకుల్లో ఒకరైన మాథ్యు వికారియస్ వెల్లడించారు. తోక తెగిన వెంటనే ఈ రేడియల్ గ్లియా కణాలు క్రియాశీలకంగా మారి, తోక పెరగడానికి కారణమవుతాయని చెప్పారు. అయితే ఈ పరిశోధనతో మానవ వెన్ను సమస్యలను కూడా పరిష్కరించవచ్చని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. -
మనమూ అవయవాలు పెంచుకోవచ్చు!
వాషింగ్టన్: బల్లితోక తెగిపోతే ఏమవుతుంది? రెండు నెలల్లో తిరిగి మునుపటి సైజుకు పెరుగుతుంది. మనకు కూడా అలా అవయవాలు తెగిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు అవి తిరిగి పెరిగితే అద్భుతంగా ఉండేది కదూ! అయితే అన్ని కాకపోయినా.. చెవులు, ముక్కు వంటివాటిలో ఉండే మృదులాస్థి, కండరాలు, వెన్నెముకలోని నాడీకణజాలం వంటివాటివి దెబ్బతిన్నా తిరిగి పెంచుకోవచ్చంటున్నారు అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్రో కుసుమి. బల్లితోకలో పునరుత్పత్తికి అవసరమైన జన్యు ప్రక్రియను తాము పూర్తిగా ఆవిష్కరించామని ఆయన వెల్లడించారు. గ్రీన్ ఆనోల్ లిజార్డ్పై పరిశోధించిన కుసుమి బృందం.. ఆ బల్లి తోకలో కణాల పునరుత్పత్తికి ప్రేరేపించే 326 జన్యువులను కనుగొంది. తోక తెగినప్పుడు మిగిలిన బల్లితోకలో నిర్దిష్టమైన భాగాల్లో ఆయా జన్యువులు క్రియాశీలం అవుతున్నాయని, దాంతో తోక నిర్దిష్ట ఆకారంలో తిరిగి పెరుగుతోందని గుర్తించింది. జన్యుపరంగా బల్లికి, మనుషులకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి కాబట్టి.. బల్లితోక పునరుత్పత్తికి తోడ్పడే జన్యువుల మాదిరిగా మనిషిలోనూ ఉండే జన్యువులను నియంత్రిస్తే పలు అవయవాలను తిరిగి ఉత్పత్తి చేయవచ్చని కుసుమి చెబుతున్నారు. తిరిగి పెంచుకోగలవు కాబట్టే.. తమను ఏవైనా పెద్దజంతువులు పట్టుకున్నప్పుడు బల్లులు తమ తోకలను తెంపేసుకుని పారిపోతాయట. బల్లుల్లా ఉండే సాలమాండర్లు, కప్ప టాడ్‌పోల్ డింభకాలు, చేపలు కూడా తమ తోకల చివర్లు తెగిపోతే పునరుత్పత్తి చేసుకుంటాయట.