
బ్యాంకాక్: మనుషులకు భయాలు ఉండడం సహజం. కొందరు చిన్నచిన్న విషయాలకు కూడా జంకుతుంటారు.కొందరికి ఎత్తైన ప్రాంతాలంటే భయం, మరికొందరికి పాములు, కుక్కలు, బొద్దింకలు అంటే భయం. భయపడే ప్రాణాలు కళ్ల ముందు కనబడితే వాటి నుంచి ఆమడ దూరం పారిపోతుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనలు చూసే ఉంటాం. తాజాగా ఓ మహిళ ఉడుమును (మానిటర్ లిజర్డ్) విపరీతంగా భయడింది. ఈ ఘటన థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నారాతివాత్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో మహిళ కూర్చీలో కూర్చొని ఉండగా బయట నుంచి అక్కడికి ఓ ఉడుము వచ్చి చేరుతుంది. తోకను ఊపుతూ, నాలుకను బయటకు చూపుతూ భయపెట్టింది. దీంతో మహిళ కెవ్వుమని కేకలు వేస్తూ కూర్చీ మీద నిల్చుంటుంది. అంతేగాక చిన్నపిల్లలా గుక్కపెట్టి ఏడ్చేసింది. ఇంతో షాప్‌లోని ఓ యువకుడు ఆ ఉడుమును పట్టుకునేందుకు పయత్నించినప్పటికీ వీలుపడలేదు. అయినా అది లొంగకుండా అతనిపై ఎదరుదాడికి ప్రయత్నించింది.
చదవండి: Viral Video: రెప్పపాటు ఘటన.. కొంచెం ఆలస్యం అయితే యువకుడి ప్రాణం పోయేది..
మహిళను ఏడుపుని చూడలేక ఇంతలో ఆ యువకుడు ఓ పొడవైన కర్రను తెచ్చి ఉడుము తల మీద బలంగా నొక్కి పెట్టాడు. అలా దానిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. అప్పటికే ఏడుస్తున్న మహిళ కళ్లు తుడుచుకుంటూ కూర్చీ దిగి నవ్వేసింది. దీనికి సంబంధించిన వీడియోని యూట్యూబ్‌లో ఫిబ్రవరి 9న పోస్టు చేశారు. 56 సెకన్ల నిడివి గలఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మహిళ ప్రవర్తనపై నవ్వులు చిందిస్తున్నారు. ‘ఉడుమును చూసి మహిళ బయపడటం కాదు.. పాపం ఉడుమే మహిళను చూసి భయపడి ఉంటుంది.’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.