Lobbyist
-
విమానయాన సంస్థలతో తల్వార్ లింకులపై దర్యాప్తు
న్యూఢిల్లీ: కార్పొరేట్ లాబీయిస్ట్ (వ్యవహారాల నేర్పరి) దీపక్ తల్వార్‌కు దేశ, విదేశాలకు చెందిన 50 సంస్థలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించాయి. తన విదేశీ క్లయింట్లకు అనుకూలంగా ఎయిర్ ట్రాఫిక్ హక్కులను సంపాదించేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయనేతలకు తల్వార్ లంచాలు ఇచ్చినట్టు.. తద్వారా విమానయాన సంస్థల నుంచి తల్వార్‌కు రూ.272 కోట్లు ముట్టినట్టు దర్యాప్తు నివేదిక స్పష్టం చేస్తోంది. యూపీఏ హయాంలో తల్వార్ లాబీయింగ్ వ్యవహారాలు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించిన వాటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం తల్వార్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ఆరోపణలను ఆయన ఖండించడం గమనార్హం. ఎయిర్ఇండియా ప్రయోజనాలకు గండికొట్టి.. 2008–09లో మూడు విదేశీ విమానయాన కంపెనీలకు అనుకూలంగా ట్రాఫిక్ హక్కులను తల్వార్ సంపాదించిపెట్టినట్టు దర్యాప్తు ఏజెన్సీలు అభియోగాలు మోపాయి. -
లాబీయిస్ట్ కోసం పాక్ వెతుకులాట!
ఇస్లామాబాద్: అమెరికాతో తమ దేశం తరఫున దౌత్యం నడపడానికి పాకిస్తాన్‌కు ఓ లాబీయిస్ట్ కావాలట. ఎఫ్-16 యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు అమెరికా తిరస్కరించడం, ఎన్ఎస్జీ (అణు సరఫరాదారుల కూటమి)లో భారత్ సభ్యత్వానికి యూఎస్ బహిరంగంగా మద్దతు తెలిపిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరచుకునేందుకు కొత్త లాబీయిస్ట్ కోసం పాక్ వెతుకులాట ప్రారంభించింది. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను ఎదుర్కొనే విషయంలో విభేదాలు తలెత్తడం, దేశంలోని ఉగ్రవాద గ్రూపులను రూపుమాపడంలో పాక్ విఫలమైందని అమెరికా ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఓ పెయిడ్ లాబీయిస్ట్ కోసం వెతుకులాడుతున్నట్లు వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి నదీమ్ హొతియానా ధ్రువీకరించారని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ‘డాన్’ పత్రిక పేర్కొంది. కాగా, తమ దేశం కోసం అమెరికాతో లాబీయింగ్ చేసేందుకు 2008లో ‘లోక్ లార్డ్ స్ట్రాటజీస్’తో ఒప్పందం చేసుకున్న పాక్ ప్రభుత్వం.. 2013 తర్వాత దాన్ని పొడిగించలేదు.