lock out
-
నెల్లిమర్ల జూట్ మిల్లు లాకౌట్
-
బ్రేకింగ్ : నెల్లిమర్ల జ్యూట్ మిల్లు లాకౌట్
సాక్షి, విజయనగం : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కార్మిక సంఘాలు ఓవైపు రెండ్రోజుల భారత్ బంద్ పాటించగా.. మరోవైపు సంక్రాంతి పండగపూట ఓ జ్యూట్ మిల్లు యాజమాన్యం కార్మికులకు షాక్ ఇచ్చింది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జ్యూట్ మిల్లును లాకౌట్ చేస్తున్నామని మిల్లు యాజమాన్యం గురువారం ఉదయం ప్రకటించింది. దీంతో 2500 మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఈ జ్యూట్ మిల్లు మూతపడడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. -
కష్టాల్లో ‘ఖతర్’ కార్మికులు
మోర్తాడ్ (బాల్కొండ): దివాళా పేరుతో దోహా ఖతర్‌లోని నఫల్ ఖతర్ కంపెనీ లాకౌట్ ప్రకటించి భారతీయ కార్మికులను నట్టేటా ముంచింది. కార్మికులకు నాలుగు నెలల వేతన బకాయిలను చెల్లించకుండా.. కనీసం ఇంటికి వెళ్లడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో మనవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నఫల్ ఖతర్ కంపెనీలో నిర్మాణ రంగానికి సంబంధించిన పనులు చేయడానికి తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన కార్మికులు ఐదేళ్ల నుంచి వెళ్లి వస్తున్నారు. అయితే, నష్టాలను సాకుగా చూపిన కంపెనీ యాజమాన్యం ఇటీవల లాకౌట్ ప్రకటించింది. కంపెనీ నిర్వహించే పనులను పూర్తిగా నిలిపి వేసినా కార్మికులకు సంబంధించిన క్యాంపులను మాత్రం కొనసాగిస్తోంది. ఈ క్యాంపులో దాదాపు 100 మంది కార్మికులు ఉండగా అందులో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 20 మంది ఉండగా, అందులో 16 మంది కామారెడ్డి జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. కంపెనీ క్యాంపులో ఉన్న కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం ఉంటుంది. అయితే గతంలో భోజనం ఖర్చును కంపెనీ భరించేది. ఇప్పుడు లాకౌట్ ప్రకటించిన కారణంగా యాజమాన్యం భోజనం ఖర్చును కార్మికుల పైనే వేసింది. నాలుగు నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో కార్మికులు అల్లాడిపోతున్నారు. ఖతర్‌లో పని లేకపోవడంతో ఇంటికి రావడానికి కార్మికులు ఆసక్తి చూపుతున్నారు. అయితే వారి పాస్‌పోర్టులను తన ఆధీనంలో ఉంచుకున్న కంపెనీ యాజమాన్యం వాటిని ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. అంతేకాక కార్మికులు ఇంటికి వెళ్లడానికి అవసరమైన టిక్కెట్లను సమకూర్చే విషయంలోనూ ఆసక్తి చూపడం లేదు. వేతనాలు ఇవ్వకుండా, ఇంటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేయకుండా, కనీసం రోజువారీ భోజనం విషయంలోనూ నిర్లక్ష్యం వహించడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నఫల్ ఖతర్ కంపెనీ యాజమాన్యంపై అక్కడి లేబర్ కోర్టులో, మన విదేశాంగ శాఖ కార్యాలయంలోనూ వారు ఫిర్యాదు చేశారు. కానీ ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధితులు గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి బసంత్‌రెడ్డికి తమ సమస్యను విన్నవించగా, ఆయన ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి విదేశాంగ శాఖ అధికారులకు సమస్యను విన్నవించారు. విదేశాంగ శాఖ, ఎన్ఆర్ఐ సెల్ అధికారులు స్పందించి ఖతర్‌లోని తమ వారి సమస్యను పరిష్కరించాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేశాం నఫల్ ఖతర్ కంపెనీ తీరుతో విసి గిపోయాం. ఆ కంపెనీకి తగిన గుణపాఠం చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ యాజమాన్యం ఎంతకీ స్పం దించడం లేదు. కంపెనీ క్యాంపులో క్యాం టీన్ ఉన్నా, మా భోజనం మేమే కొనుక్కోవలసి వస్తుంది. గతంలో క్యాంటీన్ ఖర్చును కంపెనీ యాజమాన్యం భరించేది. ఇప్పుడు మొత్తం చేతులెత్తేసింది. – దేవరాజ్ యాదవ్, జంగంపల్లి, కామారెడ్డి జిల్లా (ఖతర్‌లో కార్మికుడు) ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. ఖతర్‌లోని కార్మికుల సమస్యను మంత్రి కేటీఆర్ ద్వారా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకవెళ్లాం. కంపెనీ యాజమాన్యంపై ఖతర్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే, కార్మికులకు మొదట సమస్య పరిష్కారం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖతర్ నుంచి కార్మికులను రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – పాట్కూరి బసంత్‌రెడ్డి, గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి -
జూట్ మిల్లు లాకౌట్: కార్మికుల ఆందోళన
సాలూరు రూరల్: విజయనగరం జిల్లా సాలూరు మండలం జీగ్రామ్లోని జ్యూట్‌మిల్లు సోమవారం ఉదయం ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న సుమారు 1,550 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక్కడ 900 మంది కార్మికులు ట్రైనీలుగా పనిచేస్తున్నారు. వారిలో 600 మందిని రెగ్యులర్ చేయాల్సి ఉంది. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం ఉన్నట్టుండి లాకౌట్ ప్రకటించడంతో కార్మికులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. -
అధినేతకు అక్షరాల విజ్ఞప్తి
కొత్త ఏడాది 2016 కానుకగా కాబోలు నిజాం చక్కెర కర్మాగారం కార్మికులకు ‘లాకౌట్’ బహుమానం ప్రకటించింది యాజమాన్యం. కొత్త రాష్ట్రంలో కార్మిక విధానంగా పరిగణించాలని కాబోలు ఈ సంకేతం! మాంధ్ర పాలనలో ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా వేల కోట్ల ఆస్తులను సుమారు ఎనిమిది కోట్లకే ధారాదత్తం చేశారు. పనిచేసిన మూడు వేల మంది కార్మికులలో స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో, బలవంతపు తొలగింపుతో, రాచి రంపాన పెట్టి మూడు వందల మందికి కుదించి కన్నీళ్ల ఉప్పుటేరుల్ని పారించారు. చేసేదిలేక సుమారు డెబ్బై మంది కార్మికులు బలవంతపు మరణాలు పొందారు. అనారోగ్యాలతో, బెంగలతో కుళ్ళి కుళ్ళి మరణించినవారి ప్రేతాత్మలు నిజామాబాదు జిల్లాలో నడయాడుతున్నాయి. లాభాల్లో నడిచే కర్మాగారాన్ని నష్టాల్లోకి నెట్టి ఆ కర్మాగారం కూకటివేళ్ళతో ముక్కలు ముక్కలుగా అమ్ముకు తినాలని ప్రైవేటీకరణ ప్రణాళికల జాతర మొదలైంది. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కార్మికులందరూ ఉత్సాహంగా పోరాటంలో పాల్గొని తమ వంతు కృషి చేశారు. కాని సమస్య ఇంకా జటిలం అవుతోంది. అంతరించే అంచులలో కర్మాగారమే కాదు, కార్మికులే కాదు, తెలంగాణ వాదుల కలలు కూడా కల్లలయ్యే మతలబు ఏదో జరుగుతోంది. అనేక మాసాల నుండి ఎంతోమంది నిరాహార దీక్షలు చేస్తున్నా తెలంగాణ లోకం కిమ్మనకుండా ఉండడం వారిని బాధిస్తోంది. కొందరు ప్రజాతంత్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగవలసి ఉంది. సుదీర్ఘ న్యాయ పోరాటంలో తీర్పులు కార్మిక పక్షం ఉన్నా- కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వం దన్ను కనుపిస్తున్నా- ఉద్యమ కాలంలో కేసీఆర్ గర్జన ఇంకా అందరి చెవుల్లో మారుమోగుతునే ఉంది. రాబోయే తెలంగాణా ప్రభుత్వం చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని మునుపటి వైభవం తెస్తుందని - మిగిలిన కార్మికుల ప్రాణాలు కాపాడకుండా ఆతరువాత కర్మాగారం స్వాధీనం చేసుకుంటే ఏం లాభం? 22 డిసెంబర్ 2015 నాడు అర్ధరాత్రి రహస్యంగా కంపెనీ ‘లాకౌట్’ ప్రకటించి విభ్రాంతికి గురి చేసింది. ఆసియాకే గర్వకారణంగా ఉన్న తీపి తేనెతుట్టలో పొగలేచింది. అది తెలంగాణ అంతటా కమ్ముతోంది. ఈ సందర్భంగా- యాగాగ్నికి ఆహుతైన వాటిలో కార్మికుల బతుకులు లేవని తెలిస్తే బాగుండు. యాగ ఫలితం కొంతైనా వెచ్చించి తెలంగాణ కడుపు చిచ్చుని చల్లార్చగలిగితే మేలు. అయ్యా! ప్రియతమ అధినేతా! ఎవరి మాటని మీరు పట్టించుకోకండి. వినకండి. మీరు మాట్లాడిన మాటలనే ఓసారి గుర్తు తెచ్చుకోండి! ఒక ఆశ్వాసనకి ఇంతకన్నా మించిన మంచి సమయం మరోటి లేదు! ఒక మీ స్పందన కోసం తెలంగాణ వేచి ఉంది. దేశమే ఊపిరి బిగబట్టి చూస్తున్నది. (నేడు నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని దీక్షా శిబిరానికి వెళ్ళి, పీల్చి పిప్పి చేసిన చక్కెర కర్మాగారం కార్మికులని అక్షరాల దన్నుతో పలకరించాలని బయలుదేరిన సందర్భంగా) - తెలంగాణ రచయితల వేదిక -
విజయనగరంలో జిందాల్ కంపెనీ లాకౌట్