యండమూరి చేతుల్లో మెగాస్టార్ జీవిత చరిత్ర
మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్రను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్కు అప్పగించారు చిరంజీవి. ఈ విషయాన్ని వైజాగ్‌లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఎఎన్ఆర్ శత జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చిరంజీవి ఈ ప్రకటన చేశారు. లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో యండమూరితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులకు అవార్డులు అందించారు ఫౌండేషన్ ప్రతినిధి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
ఎన్టీఆర్, ఎఎన్ఆర్ల గురించి ప్రశంసాపూర్వక ప్రసంగం చేసిన చిరంజీవి తన బయోగ్రఫీ గురించి మాట్లాడుతూ.. తన బయోగ్రఫీ రాసేంత సమయం తనకు లేదని.. నా బయోగ్రఫీ రాసే సామర్ధ్యం ఒక్క యండమూరికి మాత్రమే ఉందని.. అందుకే ఆ బాద్యతను యండమూరికి అప్పగిస్తున్నాను అని అన్నారు. సమకాలీన రచయితల్లో యండమూరికి సాటి మరెవరూ లేరు.
తెలుగులో ఉన్న ఏకైక స్టార్ రచయిత ఎవరన్నా ఉన్నారా అంటే అది యండమూరి మాత్రమే. అలాంటి గొప్ప రచయిత ఈ రోజు నా బయోగ్రఫీ రాస్తాను అనడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆయన రాసిన అభిలాష చిత్రంతోనే సినీ పరిశ్రమలో నా స్థానం పధిలమని అప్పుడే నిర్ణయించుకున్నాను అంటూ యండమూరిపై ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి.