London Doctor
-
Jasmin Paris: ఒకే ఒక్కరు!
100 మైళ్ల దూరం.. 60 గంటల వ్యవధి. మధ్యలో ఎవ్వరూ మనకు సాయపడరు. పరుగెత్తుతూనే ఉండాలి. ట్రెజర్ హంట్ తరహాలో అక్కడక్కడా ఉన్న పుస్తకాలను వెతికి పట్టుకుంటూ పరుగు ఆపకుండా గమ్యం దిశగా దూసుకెళ్లాల్సిందే. మారథాన్‌లో భాగంగా పార్క్ చుట్టూతా మొత్తంగా దాదాపు 60,000 అడుగుల ఎత్తును ఎక్కి దిగాలి. అలసటతో ఆగితే ఔటే ఇక. ధృఢ శరీరం మాత్రమే కాదు అంతకుమించిన మనో సంకల్పం తోడుంటేనే మారథాన్‌లో జయకేతనం ఎగరేయగలం. ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన మారథాన్లలో ఒకటిగా పేరొందిన ప్రతిష్టాత్మక బాక్లీ మారథాన్స్‌లో పురుషులకు దీటుగా మొట్టమొదటిసారిగా ఒక అతివ ఈ రేసులో గెలిచి అబ్బురపరిచింది. అమెరికాలోని టెన్నిస్సీ రాష్ట్రంలోని ఫ్రెజెన్ హెడ్ స్టేట్ పార్క్ ఈ మారథాన్‌కు వేదికైంది. బ్రిటన్‌కు చెందిన జాస్మిన్ ప్యారిస్ అనే 40 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలు ఈ ఫీట్ సాధించి చరిత్రలో నిలిచిపోయారు. 55 మైళ్లుగా ఉన్న మారథాన్‌ను 1989 సంవత్సరంలో 100 మైళ్లకు పెంచాక ఇన్నేళ్లలో నిరీ్ణత గడువులోగా మారథాన్‌ను కేవలం 20 మంది మాత్రమే పూర్తిచేయగలిగారు. వీరిలో జాస్మిన్ ప్యారిస్ ఒక్కరే మహిళ కావడం విశేషం. మారథాన్‌ను 60 గంటల్లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఇంకా 99 సెకన్లు ఉండగానే ఆమె విజయతీరాన్ని తాకారు. 59 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో జాస్మిన్ ఈ రేసును శుక్రవారం పూర్తిచేశారు. రాత్రంతా సరైన దారీతెన్నూ లేకున్నా ముళ్లు, పొదల గుండా పరుగెడుతూ ఫినిషింగ్ లైన్‌ను చేరుకున్న జాస్మిన్ను వేలాది మంది ఔత్సాహికులు తమ హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. ఈ సంవత్సరం 20 మంది బరిలో దిగగా జాస్మిన్‌తో కలిపి మొత్తంగా కేవలం ఐదుగురే మారథాన్‌ను పూర్తిచేయగలిగారు. ‘ ఈ రేసు ఉత్సాహం, ఆందోళనల కలబోత. దాదాపు అసాధ్యమైన రేసు అని తెలుసు. ఆ అసాధ్యమనే భావనే నన్ను ఈ రేసులో పరుగెత్తేలా చేసింది’ అని జాస్మిన్ అన్నారు. అథ్లెట్ గాయాలపాలైనా మధ్యలో ఎవరూ ఎలాంటి సాయం చేయరు. ఫోన్లు ఉండవు, జీపీఎస్ ట్రాకింగ్ ఉండదు. ఎలాంటి నావిగేషన్ వ్యవస్థలు ఉండవు. రెండు చోట్ల మాత్రం తాగు నీరు సదుపాయం ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జాస్మిన్ వృత్తిరీత్యా పశువైద్యురాలు. బ్రిటన్‌లోని మిడ్లోటియన్లో ఉండే జాస్మిన్ వైద్యవృత్తిని కొనసాగిస్తూనే ఎడిన్బర్గ్లో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆఫ్రికన్–అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకేసులో దోషి అయిన జేమ్స్ ఎర్ల్ రే అనే ఖైదీ 1977 ఏడాదిలో అమెరికా జై లు నుంచి పారిపోతూ ఆగకుండా 12 మైళ్లు పరుగెత్తిన ఘటన నుంచి స్ఫూర్తి పొ ంది ఈ మారథాన్‌ను గ్యారీ క్యాంట్రెల్, కార్ల్ హెన్లు 1986లో ప్రారంభించారు. -
వైద్యుడినంటూ మాట్రి‘మోసం’!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరో మాట్రిమోనియల్ మోసం వెలుగులోకి వచ్చింది. భారత్ మాట్రిమోనీ వెబ్సైట్ కేంద్రంగా ఇది చోటు చేసుకుంది. లండన్‌లో వైద్యుడిగా పని చేస్తున్న ఎన్‌ఆర్‌ఐనంటూ నమ్మించిన మోసగాడు ఓ మహిళ నుంచి రూ.3 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. భారత్ మాట్రిమోనీ సైట్‌లోని ‘డివోర్సీ’ కేటగిరీలో సిటీకి చెందిన 42 ఏళ్ల మహిళ రిజిస్టర్ చేసుకున్నారు. అందులో తన ప్రొఫైల్ సైతం అప్లోడ్ చేశారు. దీనిని చూసిన ఓ వ్యక్తి డాక్టర్ అశోక్ జేమ్స్ అంటూ ఆమెతో పరిచయం చేసుకున్నాడు. తాను లండన్‌లో ఉంటున్న ఎన్ఆర్ఐనని నమ్మించి, మీ ప్రొఫైల్ నచ్చిదంటూ పెళ్లి చేసుకుందామని సందేశం ఇచ్చాడు. నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్న ఇద్దరూ కొన్ని రోజుల పాటు వాట్సాప్‌లో చాటింగ్, కాల్స్ చేసుకున్నారు. ఆమె తనను పూర్తిగా నమ్మిందని నిర్థారించుకున్న తర్వాత ‘డాక్టర్ అశోక్’ అసలు కథ ప్రారంభించాడు. లండన్ నుంచి కొన్ని బహుమతులు పంపిస్తున్నానంటూ మెసేజ్ పంపాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఆమెకు ‘రిలయబుల్ అసీస్ కొరియర్ ఎక్స్‌ప్రెస్ అండ్ ఫ్లైట్’ సంస్థ న్యూఢిల్లీ బ్రాంచ్ నుంచి అంటూ ఓ ఫోన్ వచ్చింది. లండన్ నుంచి వచ్చిన విలువైన బహుమతులు తమ సంస్థలో నిలిచిపోయాయని, కస్టమ్స్ క్లియరెన్స్ చేయాల్సి ఉందని ఓ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆమె అశోక్‌కు ఫోన్ ద్వారా సంప్రదించగా... నిజమేనని చెప్పిన అతగాడు పన్నులు చెల్లించి ఆ బహుమతులు తీసుకోవాలని, చెల్లించిన మొత్తాన్ని సైతం తాను పంపిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో సదరు మహిళ గుర్తుతెలియని వ్యక్తులు చెప్పినట్లే కస్టమ్స్, పౌండ్స్ ఇన్సూరెన్స్, జీఎస్టీ, వ్యాట్ క్లియెరెన్స్ తదితరాల కింద దాదాపు రూ.3 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. డబ్బు లేకపోవడంతో తన వద్ద ఉన్న బంగారం విక్రయించి మరీ చెల్లించారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి మంగళవారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసునమోదైంది. నిందితుడు వినియోగించినబ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఫోన్‌నెంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జయ
-
ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జయ
లండన్, ఎయిమ్స్ వైద్యుల రాక వదంతులపై మరో ఇద్దరు అరెస్ట్ సెల్‌ఫోన్ టవర్ ద్వారా నిఘా జయ ఆరోగ్యం కోసం ఇద్దరు ఆత్మాహుతి అపోలోకు ‘రిలయన్స్’ నీతూ అంబానీ రాక తమిళనాడు వ్యాప్తంగా కొనసాగుతున్న పూజలు రాష్ట్రానికి త్వరలోనే కొత్త గవర్నర్! సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో 23 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు లండన్, ఎయిమ్స్ వైద్యుల బృందం గురువారం చెన్నైకి చేరుకుంది. ఆమెకు చికిత్స అందించేందుకు గతంలో వచ్చిన అంతర్జాతీయ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఎయిమ్స్ వైద్యులు గిల్‌నానీ(ఊపిరితిత్తుల నిపుణుడు), అంజన్ టిరిక్కా(అనస్తీషియన్), నితీష్‌నాయక్(హృద్రోగ నిపుణులు) మరోసారి అపోలోకు చేరుకుని వైద్య చికిత్సలు ప్రారంభించారు. సీఎం జయను పరామర్శించేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతూ అంబానీ గురువారం రాత్రి అపోలో ఆస్పత్రికి వచ్చారు. జయకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, తమిళనాడు మాజీ గవర్నర్ కే రోశయ్య సీఎం జయలలితను పరామర్శించేందుకు నేడు చెన్నై రానున్నారు. ఇదిలాఉండగా తమిళనాడుకు కొత్త గవర్నర్‌ను త్వరలోనే ఏర్పాటుచేయాలని కేంద్రం యోచిస్తోంది. ఆగస్టు చివరలో రోశయ్య పదవీ విరమణ చేసినప్పటి నుంచి.. ఆ బాధ్యతలను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. అపోలో పరిసరాల్లో సెల్ఫోన్ల నిఘా జయలలితకు చికిత్స గురించి అనేక రకాలుగా వదంతులు వ్యాపిస్తుండడంతో.. వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అపోలో ఆస్పత్రి పరిసరాలకు వచ్చే అన్ని సెల్ఫోన్ల సంభాషణలపై నిఘా పెట్టారు. ఈ మేరకు ఆస్పత్రిలోనే ఒక కంట్రోల్ రూంను ఏర్పాటుచేసుకున్నారు. జయకు వైద్యం చేసే నర్సుల నుంచి సెల్ఫోన్లను సేకరించిన తరువాతనే లోనికి అనుమతిస్తున్నారు. నిఘా విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నేతలు తమకు వచ్చే కాల్స్‌ను కట్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, తన ఆధీనంలోని శాఖలను మంత్రి పన్నీర్‌సెల్వంకు అప్పగించాల్సిందిగా ముఖ్యమంత్రి జయలలిత ఎలా సూచించారో గవర్నర్ విద్యాసాగర్‌రావు స్పష్టం చేయాలని పీఎం అధ్యక్షుడు డాక్టర్ రాందాస్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ గురువారం వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రి వద్దే అభిమానుల పడిగాపులు అమ్మ ఆరోగ్యంపై ఆందోళనతో గురువారం సైతం పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అపోలో ఆస్పత్రి వద్దనే పడిగాపులు కాశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు అపోలో వద్దకు వచ్చి వెళుతున్నారు. మంత్రి వేలుమణి నేతృత్వంలో కోయంబత్తూరు సుగుణాపురం శక్తి మారియమ్మన్ ఆలయంలో 336 రకాల పూలతో మూడు రోజుల పాటూ భారీ ఎత్తున నిర్వహించే మహాయాగం గురువారం ప్రారంభమైంది. గుమ్మిడిపూండి సాయిబాబా ఆలయంలో అన్నాడీఎంకే శ్రేణులు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని 68 దర్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. జయ అనారోగ్యానికి గురయ్యారని కలత చెందిన ఇద్దరు అన్నాడీఎంకే కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతితో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపై వదంతులు సృష్టించిన కేసులో మరో ఇద్దరిని చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఫేస్బుక్, ట్వీట్టర్లో వదంతులు రేపిన చెన్నైకి చెందిన బాలసుందరం(42), తూత్తుకూడికి చెందిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగి తిరుమణిసెల్వం(28)లను అదుపులోకి తీసుకున్నారు. వదంతుల ఆరోపణలపై ఈనెల 10న ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
పుష్కరాల్లో వైద్యుడి కారు, నగలు చోరీ
తూర్పుగోదావరి (రాజమండ్రి) : పుష్కర స్నానం ఆచరించడానికి కుటుంబంతో వచ్చిన ఓ లండన్ వైద్యుడి కారు, నగలు తీసుకుని డ్రైవర్ పరారైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన డాక్టర్ రెడ్డి నారాయణచౌదరి లండన్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో ఇండియాకు వచ్చారు. పుష్కర స్నానం చేసేందుకు మండపేట నుండి శనివారం ఉదయం 6.30 గంటలకు కారులో భార్య, తల్లి, స్నేహితుడితో కలిసి బయలుదేరి 8 గంటలకు రాజమండ్రి చేరుకున్నారు. నగరంలోని టి.నగర్ ఉడిపి అక్షయ హోటల్ వద్ద కారు నిలిపారు. కారు వద్ద రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లికి చెందిన డ్రైవర్ గౌతమ్‌కృష్ణను ఉంచి వీఐపీ ఘాట్‌కు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు. తిరిగి 10.30 గంటలకు వచ్చి చూడగా ఏపీ 28 డీఆర్ 4408 నంబరు గల కారు కనిపించలేదు. డ్రైవర్ నంబర్‌కు ఫోన్ చేయగా.. రెండుసార్లు రింగైన అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కారు గురించి బైక్‌పై రాజమండ్రిలో వెతికారు. కారు, డ్రైవర్ జాడ తెలియకపోవడంతో నారాయణ చౌదరి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో లండన్ నుంచి తీసుకువచ్చిన సుమారు రూ.5.50 లక్షల విలువైన డైమండ్ రింగులు, చెవి కమ్మలు, నగలు, రూ.60 వేల నగదు, సెల్ఫోన్లు ఉన్నాయని తెలిపారు. గౌతమ్‌కృష్ణ ఈ నెల 13 నుంచి తమ కారుకు ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అదే రోజు అతడి ఫొటో, లెసైన్స్ వాట్సప్‌లో తీశామని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.