lova
-
సంచలన తీర్పు; 180 ఏళ్ల జైలు శిక్ష
వాషింగ్టన్: బాలురుపై లైంగిక వేధింపులకు పాల్పడిన బాస్కెట్‌బాల్ కోచ్‌కు అమెరికాలోని ఓ కోర్టు 180 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. గ్రెగ్ స్టీఫెన్.. అమెరికాలోని లోవాకు చెందిన ఓ ప్రముఖ బాస్కెట్‌బాల్ క్లబ్‌కు కోచ్‌గా వ్యవహిస్తున్నాడు. బాస్కెట్ బాల్ కోచ్‌గా అతనికి మంచిపేరు ఉంది. దీంతో ఎక్కువ మంది అతని వద్దకే కోచింగ్‌కు వస్తుంటారు. ఆటలో పిల్లల్ని మెరికల్లా తీర్చిదిద్దగల సామర్థ్యం అతని వద్ద ఉంది. కానీ అతని అసలు స్వరూపం తెలిస్తే షాకవ్వల్సిందే.. అతనికి అబ్బాయిలంటే పిచ్చి. అమ్మాయి పేరిట సోషల్ మీడియాలో ఓ ఖాతా తెరిచి, అబ్బాయిలతో చాటింగ్ చేసేవాడు. తనను ప్రేమించాలంటూ వేధించేవాడు. తాను కోచ్‌గా ఉన్న బాస్కెట్‌బాల్ టీమ్ మెంబర్స్.. హోటళ్లలో నిద్రపోతున్నపుడు, వారి దుస్తులు విప్పి, పక్కనే పడుకొని సెల్ఫీలు తీసుకొనేవాడు. తర్వాత ఆ ఫోటోలు చూపించి వారిరి బెదిరింపులకు గురిచేసేవాడు. ఇలా 20 ఏళ్లపాటు ఎవరికీ తెలియకుండా రహస్య కార్యకలాపాలు సాగించిన 43 ఏళ్ల గ్రెగ్ స్టీఫెన్ చివరకు జైలుపాలయ్యాడు. గ్రెగ్ దాచుకున్న ఓ పెన్‌డ్రైవ్‌లో అతడు అబ్బాయిలతో ఉన్న చిత్రాలుండటం చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోచ్ వద్ద పాఠాలు నేర్చుకున్న పిల్లలు కూడా అతడి ప్రవర్తపై ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. గ్రెగ్ ఇప్పటివరకూ దాదాపు 440 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించినట్లు ఆధారాలు లభించాయి. వారి ఫిర్యాదు మేరకు కేసును విచారించిన న్యాయమూర్తి ఆధారాలు చూసి ఖంగుతిన్నారు. గ్రేగ్ చేసిన నేరం క్షమించదగినది కాదని భావించిన కోర్టు.. అతనికి ఏకంగా 180 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అతడు జైలు నుంచి విడుదల కావడం అసాధ్యమని, ఈ కేసులో ఇంతకుమించి శిక్ష విధించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. -
చల్లనమ్మపై సప్తనదుల ధార
-తలుపులమ్మకు వైభవంగా సహస్ర ఘటాభిషేకం –లోవలో ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు తుని రూరల్ : ఆషాఢమాసోత్సవాల ముగింపు సందర్భంగా లోవ దేవస్థానంలో తలుపులమ్మతల్లికి వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఆదివారం, అమావాస్య, ఆషాఢమాసం చివరిరోజును పురస్కరించుకుని వేదపండితులు ముష్టి వెంకటపురుషోత్తమ శర్మ, రాణి సుబ్రహ్మణ్యశర్మ, శశాంక్ త్రిపాఠి, అర్చకులు 1008 కలశాలలో సప్తనదీ జలాలు, సుగంధ ద్రవ్యాలను ఆవాహనం చేశారు. భక్తులు, ధర్మకర్తల సమక్షంలో వేదమంత్రోచ్చరణలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. ప్రధాన గర్భాలయంలో తలుపులమతల్లికి, పంచలోహ విగ్రహాలకు, అద్దాలమండపంలో అమ్మవారికి విశేషాలంకరణ చేసి భక్తులకు దర్శనాలను కల్పించారు. ఆలయంలో అన్నివిభాగాలనూ వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించారు. ధర్మకర్తల చైర్మన్ కరపా అప్పారావు, అసిస్టెంట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్, ఆలయ ఇన్స్పెక్టర్లు నాయుడు, గుబ్బల రామకృష్ణ, ధర్మకర్తలు నారాయణాచార్యులు, అత్తి అచ్చుతరావు, కిల్లి శ్రీను, యాదాల లోవకృష్ణ, పలువురు భక్తులు పాల్గొన్నారు. 60 వేల మంది భక్తుల రాక ఆషాఢమాసం, ఆఖరి ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తలుపులమ్మ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. కోస్తాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. కాటేజీలు నిండుకోవడంతో భక్తులు చెట్ల కింద, ప్రైవేట్ పాకల్లో వంటలు, భోజనాలు చేశారు. 60 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు అసిస్టెంట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల నుంచి రూ.5,27,705 ఆదాయం లభించిందన్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన కళాకారిణి ‘గౌరికల్యాణం’ హరికథను గానం చేశారు. -
లోవకు భక్తజన వెల్లువ
తలుపులమ్మను దర్శించుకున్న లక్ష మంది గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్ తునిరూరల్ : జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢమాస మూడో ఆదివారం కావడం.. వాతావరణం అనుకూలంగా ఉండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక వాహనాల్లో భక్తులు వస్తూనే ఉన్నారు. లక్ష మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్. చంద్రశేఖర్ తెలిపారు. అమ్మవారి ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటలు భక్తులు క్యూల్లో వేచి ఉండాల్సి వచ్చింది. పులిహోర ప్రసాదం మధ్యాహ్నం 12.30 గంటలకే నిండుకుంది. వివిధ విభాగాలు ద్వారా దేవస్థానానికి రూ.6,70,282 ఆదాయం లభించినిట్టు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అవస్థలు భారీగా తరలివచ్చి భక్తులకు వసతి గదులు లభించకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ఒక మోస్తరు వర్షం కురుస్తుండడంతో భక్తులు చిత్తడితో అవస్థలు పడ్డారు. దేవస్థానం అధీనంలో ఉన్న 125 కాటేజీలు, పొంగలి షెడ్లను భక్తులకు ఇచ్చారు. అవి లభించని వారు చెట్లను, కొండ దిగువన ఉన్న మామిడి, జీడి మామిడి తోటలను, ప్రైవేట్ పాకలను ఆశ్రయించారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది ప్రైవేట్ పాకల యజమానులు రూ.800 - రూ.1200 వరకు అద్దెలను డిమాండ్ చేశారు. కొంతమంది తమ వాహనాల్లోనే వంటలు, భోజనాలు చేశారు. స్తంభించిన ట్రాఫిక్ పెద్దసంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లారీలు, బస్సులు, కార్లు, ఇతర భారీవాహనాలపై భక్తులు లోవ దేవస్థానానికి భక్తులు చేరుకున్నారు. లోవ కొత్తూరు ఎర్రచెరువు వద్ద కల్వర్టు నిర్మాణంలో ఉండడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు ఆధ్వర్యంలో తుని రూరల్, కోటనందూరు ఎస్సైలు సుధాకర్, శంకరరావు, 80 మంది పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. బెల్టు షాపుల హవా లోవదేవస్థానంలో తలుపులమ్మతల్లిని దర్శించేందుకు భారీ సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతో మందుబాబులతో మద్యం దుకాణం కిక్కిరిసిపోయింది. మందుబాబులు మంచి జోష్‌మీద ఉండడంతో బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. టోల్‌గేటు వద్ద నుంచి ఘాట్ రోడ్డు వరకు 40 నుంచి 50 బెల్టు షాపులు వెలసినట్టు అంచనా. అయినప్పటికీ ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోలేదు. -
మహాప్రసాదం
సత్తెన్న ప్రసాదానికి పెరిగిన డిమాండ్ ‘లోవ ’ భక్తుల కొనుగోళ్లు తొలిపాంచా, నమూనా ఆలయం కౌంటర్లలో 65 వేల ప్రసాదం ప్యాకెట్ల విక్రయం రూ.9.75 లక్షల ఆదాయం అన్నవరం: ఆషా«ఢమాసం.. ఆదివారం.. తుని రూరలె మండలంలోని లోవ తలుపులమ్మతల్లి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారి తిరుగుప్రయాణంలో భారీ ఎత్తున సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేశారు. కొండదిగువన తొలిపాంచా వద్ద, బైపాస్ రోడ్డులోని సత్యదేవుని నమూనా ఆలయం వద్ద గల ప్రసాదం విక్రయస్టాల్స్ వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. రాత్రి ఏడు గంటల సమయానికి సుమారు 65 వేల ప్రసాదం ప్యాకెట్లు (125 గ్రాములు రూ.15) విక్రయించగా రూ.9.75 లక్షల ఆదాయం సమకూరింది. ఏటా ఆషాఢమాసంలో వచ్చే ఆదివారాలలో భారీ సంఖ్యలో లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానానికి వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే అన్నవరం దేవస్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. కొండదిగువన తొలిపాంచా వద్ద, బైపాస్ రోడ్డులోని నమూనా ఆలయం వద్ద గల ప్రసాదం స్టాల్స్ వద్ద అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది. సుమారు 70 వేల ప్రసాదం ప్యాకెట్లను సిద్ధం చేసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడుగంటల వరకూ సుమారు 65 వేల ప్యాకెట్లను విక్రయించినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన ఐదువేల ప్రసాదం ప్యాకెట్లు కూడా రాత్రి విక్రయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేవస్థానం ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు ఈ ప్రసాదం స్టాల్స్‌ను సందర్శించి అక్కడ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఏఈఓ సాయిబాబా, ఆలయ సూపరిండెంట్ బలువు సత్యశ్రీనివాస్, ఇనస్పెక్టర్ పోల్నాటి లక్ష్మీనారాయణ తదితరులు స్టాల్స్ వద్ద విక్రయాలు పర్యవేక్షించారు. -
పోటెత్తారు..
భక్తులతో కిక్కిరిసిన లోవ దేవస్థానం – రూ.4,19,845 ఆదాయం – గంటలోనే నిండుకొన్న పులిహోర ప్రసాదం – తల్లిని దర్శించుకున్న 40వేల మంది భక్తులు తునిరూరల్ : ఆషాఢమాసం తొలి ఆదివారం తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థాన ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి వచ్చిన భక్తులు, వాహనాలతో లోవ ప్రాంగణం నిండిపోయింది. 40వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటసేపు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. పులిహోర ప్రసాదం విక్రయాలు చేపట్టిన గంటలోనే నిండుకున్నాయి. 25వేల రవ్వ లడ్డూ ప్రసాదాలను విక్రయాలకు అందుబాటులో ఉంచినట్టు ఈఓ తెలిపారు. వివిధ విభాగాల ద్వారా రూ.4,19,845 ఆదాయం లభించినట్టు ఈఓ చెప్పారు. భక్తుల రద్దీకనుగుణంగా వసతిగదులు, కాటేజీలు లేకపోవడంతో చెట్లకింద, ఆరుబయట, కొండదిగువన ఉన్న తోటల్లో భక్తులు వంటలు చేసుకుని భోజనాలు చేశారు. తుని పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాస్, చెన్నకేశవరావుల ఆధ్వర్యంలో 80మంది పోలీసులు బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రానున్న పర్వదినాల్లో భక్తుల సంఖ్య పెరగనుండడంతో మరింత పటిష్టంగా బందోబస్తుకు వంద మంది పోలీసులను కేటాయించాలని డీఎస్పీని కోరునున్నట్టు ఈఓ తెలిపారు. చైర్మన్ కరపా అప్పారావు, ధర్మకర్త యాదాల లోవకృష్ణ భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పర్యవేక్షించారు. అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. శ్రీహరి సేవ భక్తులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సేవలు అందించారు. 25టియుఎన్104 : భక్తులతో రద్దీగా ఉన్న లోవదేవస్థానం ప్రాంగణం 25టియుఎన్105 : అమ్మవారిని దర్శించేందుకు క్యూలైన్లో వేచిఉన్న భక్తులు. 25టియుఎన్106 : వసతిగదుల్లేక చెట్లకింద వంటలు, భోజనాలు చేస్తున్న భక్తులు -
లోవ ఇన్చార్జి సూపరింటెండెంట్ సస్పెన్షన్
తుని రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కాండ్రేగుల వెంకటరమణను సస్పెండ్ చేసినట్టు అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం జారీ చేసిన ఉత్తర్వుల నకళ్లలో సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కేవీ రమణ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం, అధికారుల అనుమతి లేకుండా పనులు చేపట్టడం, అధికార దుర్వినియోగం అభియోగాలపై సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. తొమ్మిది అంశాలపై 30 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని, తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. గతేడాది నవంబరు నెలాఖరిలో అప్పటి సూపరింటెండెంట్ వివిధ ఆరోపణలపై శ్రీనివాస్ సస్పెండయ్యారు. దాంతో ఏర్పడిన ఖాళీలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న కాండ్రేగుల వెంకట రమణకు సూపరింటెండెంట్ బాధ్యతలను అప్పగించారు. అభియోగాలు : ఈఓ అనుమతి లేకుండా ఈ నెల 23న ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించడం. - విధుల్లో నిర్లక్ష్యం, అందుబాటులో లేకుండా చైర్మన్ వద్ద ఉంటూ పరిపాలనలో సమన్వయం దెబ్బతీయడం. - నిబంధనలను వక్రీకరించి ధర్మకర్తలను తప్పుదారి పట్టించుట. - తోటి సిబ్బందిపై ఆరోపణలు చేయుటకు ధర్మకర్తలను ప్రేరేపించడం. - పూర్వపు టెండరుదారులతో చనువుగా వ్యవహరిస్తూ టెండర్ల ప్రక్రియపై అసంబద్ధ సమాచారం ఇవ్వడం - అంతర్గత బదిలీల్లో స్వప్రయోజనాలు కలిగి ఉండడం, తనకు ధర్మకర్తల మండలి రక్షణ ఉందని, తనను ఏమి చేయలేరని, తన కోసం అవసరమైతే ధర్మకర్తలు రాజీనామా చేస్తారని, నేను చెప్పినట్టు వినాల్సిందేని తోటి ఉద్యోగులను వేధించడం - ఈఓ, తోటి సిబ్బందిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదులు పెట్టడం, ఇతరలను ప్రేరేపించడం. - ధర్మకర్తల మండలివారికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై తప్పుడు సమాచారం ఇవ్వడం, ఉద్యోగాలపై వారికి ఆశ కల్పించడం - ఇంజనీరింగ్ విభాగం అనుమతులు లేకుండా దేవస్థానంలో ధర్మకర్తల మండలి వారితో మైనర్, మేజర్ పనులు చేపట్టవచ్చని తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా దేవస్థానం పరిపాలనకు ఆటంకం కలిగించడాన్ని కారణాలుగా చూపించారు. -
రూ.పది కోట్లతో లోవ దేవస్థానం బడ్జెట్
– రూ.80 లక్షలు మిగులు – ఏప్రిల్ 13 నుంచి 26వరకు అమ్మవారి గంధామావాస్య జాతరోత్సవాలు – పాలకమండలిలో తీర్మానాలు తునిరూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.పది కోట్లతో అంచనాల బడ్జెట్‌ను ఆమోదించింది. ఆదివారం చైర్మన్ కరపా అప్పారావు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ప్రతిపాదిత బడ్జెట్లో రూ.80లక్షలు మిగులుగా అంచన వేశారు. హుండీలు, వేలంపాటలు, ఇతర ఆదాయ వనరుల ద్వారా రూ.పది కోట్ల సమకూరుతుందని, జీతాలు, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, అమ్మవారి ఉత్సవాలకు వ్యయం రూ.9.20కోట్ల అవుతుందని అంచనాలు వేశారు. వ్యయం పోగా రూ.80లక్షలు మిగులుగా అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ చూపారు. వేలంపాటలు, బహిరంగా వేలం ద్వారా లైసెన్సులు వసూళ్లును రూ.2.25కోట్లు వస్తుందని పేర్కొని, వేలం పాటలను ఆమోదించారు. గడిచిన మూడు నెలలకు రాబడి, వ్యయాలను ఆమోదించారు. తలుపులమ్మ అమ్మవారి పవిత్ర, ఆచారాలకు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు చైర్మన్ కరపా అప్పారావు, ధర్మకర్తలు పేర్కొన్నారు. 13 నుంచి ఉత్సవాలు.. తలుపులమ్మ అమ్మవారికి పుట్టింట సంబరాలుగా పేర్కొనే గంధామావాస్య జాతర మహోత్సవాలను ఏప్రిల్ 13 నుంచి 26 వరకు నిర్వహించాలని పాలక మండలి సభ్యులు తీర్మానించారు. జాతర ఉత్సవాలను లోవకొత్తూరు గ్రామంలో లోవదేవస్థానానికి చెందిన నాలుగు ఎకరాల స్థలంలో ఆలయం వద్ద నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైన నిధుల వినియోగానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోద ముద్రవేశారు. ధర్మకర్తలు యాదాల లోవకృష్ణ, తర్రా బుల్లెబ్బాయి, కిల్లి శ్రీను, నారాయణాచార్యులు, పుల్లంరాజు, దూలం సత్యనారాయణ, సూపరింటెండెంట్లు కె.వి.రమణ, ఎల్.వి.రమణ పాల్గొన్నారు. -
లోవకు రూ.1.51 కోట్ల ఆదాయం
- నాలుగు అంశాలు వాయిదా - ఈఓ చంద్రశేఖర్ తుని రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి వివిధ హక్కులకు నిర్వహించిన వేలం ద్వారా రూ.కోటి, 51 లక్షల 11 వేల 792ల ఆదాయం లభించిందని అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. దేవస్థానంలో తల నీలాలు పొగు చేసుకోవడ, వివిధ వస్తువులు విక్రయానికి శనివారం టెండర్ కం బహిరంగా వేలం నిర్వహించారు. టోల్గేట్, శీతలపానియాలు, క్యాంటీన్ నిర్వహణ, పాలు, పెరుగు విక్రయాల హక్కులకు ఎవరు ఆసక్తి చూపకపోవడంతో వాయిదా వేశారు. నెలకు తలనీలాలు పొగు చేసుకునేందుకు రూ.3.39 లక్షలు, పూజా సామగ్రి, కొబ్బరి కాయలు విక్రయానికి రూ.3,34,200, వస్త్రాల విక్రయానికి రూ.3.54 లక్షలు, యంత్రాలు, ఫ్యాన్సీ సామాన్లు విక్రయానికి రూ.93,100, అమ్మవారి ఫోటోలు అమ్మకానికి రూ.66,116, భక్తులు ఫొటోలు తీసి విక్రయించేందుకు రూ.55 వేలు, తోపుడు బళ్లపై సామాన్లు విక్రయానికి రూ.11,300, చెప్పుల స్టాండు నిర్వహణకు రూ.12,600కు వేలంను ఖరారు చేశారు. నెలకు వీటి మొత్తం రూ.12 లక్షల 59 వేల 316లు కాగా ఏడాదికి రూ.1.51 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఈఓ వివరించారు. చైర్మన్ కరపా అప్పారావు, పిఠాపురం ఈఓ చందక ధారబాబు, సూపరింటెండెంట్లు కేవీ రమణ, ఎల్వీ రమణ, ధర్మకర్తలు, ఉద్యోగులు, పలువురు పాటదారులు పాల్గొన్నారు. -
‘పోలవరం’ పనులు ప్రాణాంతకం
కుమ్మరిలోవ కాలనీపై పడిన కాలువ బండరాళ్లు తృటిలో తప్పిన పెనుప్రమాదం ఆందోళనలో స్థానికులు తాత్కాలికంగా పనులు నిలిపివేత తునిరూరల్ : తుని మండలం కుమ్మరిలోవ కాలనీని ఆనుకుని ఉన్న కొండపై నుంచి తాండవ నదిమీదుగా నిర్మించనున్న పోలవరం ఎడమ కాలువ అక్విడెక్ట్ పనులతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ యంత్రాలు వెళ్లేందుకు వీలుగా కొండపై రహదారి ఏర్పాటు చేస్తుండగా మంగళవారం బండరాయి అదుపు తప్పి కిందకు దొర్లివచ్చింది. ఈ బండరాయి కొండ దిగువన ఉన్న గోగాడ పైడితల్లి ఇంటి ప్రధాన గోడను ధ్వంసం చేసింది. ఈ ఘటనతో తమ వంటింట్లో సామాన్లు ధ్వంసమయ్యాయని బాధితురాలు బుధవారం వాపోయింది. పాఠశాల నుంచి పిల్లలు రాకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని, వారు వచ్చుంటే ఆ ప్రాంతంలోనే ఆడుకునేవారని ఆందోళన వ్యక్తం చేసింది. 20 అడుగులు ఎత్తునుంచి ఈ బండరాయి పడిందని, కాంట్రాక్టర్ సిబ్బంది వచ్చి పరిశీలించి పనులు నిలిపివేసినట్టు ఆమె వివరించింది. పగుళ్లిచ్చిన ఇంటి గోడ, బండరాయిని ఆమె విలేకరులకు చూపించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఎవరూ లేరు. ఇటీవల పనులు చేసేందుకు పీఎస్‌కె, హెచ్‌ఈఎస్ (జాయింట్ వెంచర్)కు అప్పగించారు. కాలనీ ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా నష్టపరిహారం ఇవ్వలేదని, పనులు చేస్తున్నట్టు కనీస సమాచారం ఇవ్వలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సంభవించగానే పనులు నిలిపివేశారన్నారు. ప్రాథమిక పనులు చేస్తేనే తీవ్రత ఇలా ఉంటే ప్రధాన పనులు చేస్తే ఏవిధంగా ఉంటుందోనని స్థానికులు భీతిల్లుతున్నారు. -
కోటిన్నరకు కన్నం
బినామీ పేర్లతో వేలం సొమ్ము స్వాహా సస్పెండైనా ఆలయంలోనే తిష్ట తిరిగొస్తానంటూ బెదిరింపులు తమ్ముళ్ల తోడ్పాటు ఉండనే ఉంది ఆ అండతోనే అవినీతి’లోవ’లో ఒకే ఒక్కడు.. ! ‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్న సామెత దేవాదాయ శాఖలో నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఇందుకు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం వేదికైంది. ఏటా రూ.8 కోట్ల ఆదాయం కలిగిన తలుపులమ్మ వారిని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలవాసులు ప్రతి వారం పాతిక, 30వేల మంది భక్తులు దర్శించుకుంటారు. అటువంటి అమ్మవారి ఖజానాకే కన్నం పెట్టాడొక సీనియర్ అసిస్టెంట్. లోవ దేవస్థానంలో రాజకీయ పలుకుబడితో పుష్కరకాలం పాతుకుపోయిన ఆ సీనియర్ అసిస్టెంట్ అవినీతి బండారం బయటపడింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : తలుపులమ్మ అమ్మవారికి జమ కావాల్సిన కోటిన్నర ఆదాయాన్ని అడ్డంగా దోచేశాడు ఆ సీనియర్ అసిస్టెంట్. ఇటీవలనే ఆలయంలో ఈఓకు తెలియకుండా లక్షలు విలువైన గ్రావెల్ రోడ్డు వేయిస్తున్న వ్యవహారాన్ని ’సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఆ సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ కాగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండైన సీనియర్ అసిస్టెంట్ తిరిగి దేవస్థానంలోనే పోస్టింగ్ తెచ్చుకుంటానని రెండు రోజులకు ఒకసారి ఆలయానికి వచ్చి బెదిరింపులకు దిగుతున్నాడు. తిరిగొచ్చాక మీ అందరి సంగతి తేలుస్తానంటున్న అతనితో ఉద్యోగులంతా విసుగెత్తిపోయారు. అమ్మవారి ఆలయంలో మొత్తం వివిధ క్యాడర్లకు చెందిన 57 మంది ఉద్యోగులుండగా 37 మంది మూకుమ్మడిగా సీనియర్ అసిస్టెంట్ అవినీతి బాగోతాన్ని రెండు రోజుల క్రితం ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బంధువులే బినామీలుగా... దేవస్థానం నుంచి బకాయిలు చెల్లించాలని నోటీసులు వెళ్లడంతో విస్తుపోయిన ఉద్యోగుల బంధువులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లోవ దేవస్థానంలో 2013–14 సంవత్సరంలో పూజా సామాగ్రి అమ్మకం, తలనీలాల సేకరణ, అమ్మవారికి వచ్చే వస్రా్తలు సేకరణ, తిరిగి అమ్మకం, ఫ్యాన్సీ దుకాణంలో యంత్రాలు, ఉంగరాలు, రక్షణగా వేసుకునే తాళ్లు...ఇలా పలు దుకాణాలను బినామీ పేర్లతో సీనియర్ అసిస్టెంట్ నిర్వహించాడు. ఈ వేలం హక్కుదారుల నుంచి దేవస్థానానికి రూ.1.15 కోట్లు, 2014–15లో వస్రా్తలు సేకరణ హక్కులు రూ.30 లక్షలు కూడా జమ కాలేదు. ఇన్ని సంవత్సరాలు ఆ సీనియర్ అసిస్టెంట్ మేనేజ్ చేస్తూ వస్తుండటంతోనే విషయం బయటకు రాలేదంటున్నారు. మరి మూడేళ్లుగా ఈ బకాయిలపై అప్పటి ఈఓలు, అధికారులు ఏమి చేశారంటే ఎవరూ నోరు మెదపరు. కారణమేమిటంటే రాజకీయ పలుకుబడి అటువంటిది మరి అని సరిపెట్టుకుంటారు.ఆ ఉద్యోగి పేరుకే సీనియర్ అసిస్టెంట్. కానీ దేవస్థానం మొత్తాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఈఓగా ఎవరు వచ్చినా అతను చెప్పిందే వేదం. ఎందుకంటే తుని నియోజకవర్గంలో అధికార పార్టీ తమ్ముళ్ల అండదండలు అంతగా ఉన్నాయి మరి. రూ.కోటిన్నర మాటేమిటి...? వాస్తవానికి దేవస్థానం బకాయిలు మూడేళ్లలోపు జమ చేయాలి. మూడేళ్లు దాటిపోతే ఆ తరువాత ఆ సొమ్ము కోసం న్యాయస్థానానికి వెళ్లినా ప్రయోజనం ఉండదు. ఆ మూడేళ్ల కాలపరిమితి వచ్చే నెల జనవరి 24తో ముగియనుంది. అదే దైర్యంతో రెండున్నరేళ్లకు పైబడే ఈ వ్యవహారాన్ని దాచిపెడుతూ వస్తున్నాడంటున్నారు. 2013–14లో దుకాణాలు వేలాన్ని ఆలయంలో పనిచేసే అగ్రహారపు శ్రీను, రామచంద్రరావు, లోవరాజు తదితర ఉద్యోగుల బంధువుల పేరుతో సీనియర్ అసిస్టెంట్ సొంతం చేసుకున్నాడని సమాచారం. అలా సొంతం చేసుకున్న దుకాణాల ద్వారా ఆలయానికి రూ.1.15 కోట్లు జమచేయాలి. ఈ విషయాన్ని గత రెండేళ్లుగా ఇందుకు సంబంధించిన రికార్డులు తన వద్దనే ఉండటంతో తొక్కిపెట్టారని సమాచారం. ఈ వ్యవహారంలో గతంలో పనిచేసి మృతి చెందిన ఈఓ పాత్రపై కూడా ఆరోపణలున్నాయి. బినామీలో ఒక మహిళకు నోటీసు ఇవ్వడంతో ఆమె అధికారుల వద్ద గొల్లుమందని తెలిసింది. తనకు తెలియకుండా తన పేరున దుకాణం పాడుకున్న విషయం తెలిసి నెత్తినోరు బాదుకుంటే అంతా తాను చూసుకుంటానని విషయం బయటపెట్టవద్దని బెదిరింపులకు దిగారని అధికారులకు ఫిర్యాదు చేశారని సమాచారం. సస్పెండైన సీనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలిపై ఆరు ఆరోపణలతో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. -
లోవకు పోటెత్తిన భక్తులు
25 వేల మంది రాక రూ. 5.21 లక్షల ఆదాయం తలుపులమ్మ లోవ (తుని ) : ఆషాఢమాసం ఆఖరి ఆదివారం లోవకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచే భక్తులు వాహనాల్లో రావడంతో తుని మండలం జగన్నాథగిరి నుంచి తలుపులమ్మ కొండపై వరకు రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. అన్ని విభాగాల ద్వారా రూ.5. 21 లక్షల ఆదాయం సమకూరిందని ఆయన వివరించారు. ట్రాఫిక్ కష్టాలు : లోవకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు. టోల్‌గేటు నుంచి అమ్మవారి కొండ దిగువ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుని రూరల్ ఎస్సై పర్యవేక్షణ లో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. -
దే...వుడా..!
దేవుడికి పూజ చేయించాలా..ప్రసాదం భక్తులకు పంచి పెట్టాలా.. దేవుడికి అలంకరణ చేయాలా..ఉత్సవాలు చేయాలా..అయితే మా వాళ్లతో మాట్లాడండి.. వాళ్లకు చెప్పా పెట్టకుండా సొంత నిర్ణయాలు తీసుకోకండి.. జిల్లాలోని పలువురు దేవస్థానాల కార్యనిర్వహణాధికారుల(ఈవో)కు అధికార టీడీపీ ఎమ్మెల్యేలు జారీ చేసిన హుకుం ఇది. తమపై అజమాయిషీ చేసే అధికారం అసలు ఎమ్మెల్యేలకు ఉందా? రాజ్యాంగంలో అలాగని ఎక్కడా పొందుపరచలేదే! అయినా ఆదేశాల కొరడా ఝుళిపిస్తున్నారెందుకని ఈవోలు రగిలిపోతున్నారు. దీనిపై బయటపడే ధైర్యం చేయలేక.. తెలుగు తమ్ముళ్ల పెత్తనాన్ని భరించలేక.. ఈవోలు ‘అడకత్తెరలో పోక చెక్కల్లా’ నలిగిపోతున్నారు. కొన్ని ఆలయాల్లోనైతే ‘తమ్ముళ్లు’ బరితెగించి ఈవోల కుర్చీలను ఆక్రమించి మరీ వారిపై స్వారీ చేస్తు్తన్నారు. కళ్లెదుటే ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేకపోతున్నామని ఈవోలు వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. పార్టీ నియోజకవర్గ పెద్దలు.. ఎన్నికలప్పుడు ద్వితీయ శ్రేణి నేతలకు పదవుల ఆశలు కల్పించి వెంట తిప్పుకుని ఎమ్మెల్యేలైపోయారు. తీరా చూస్తే జెండా మోసినవారికి పదవులు ఇవ్వలేని పరిస్థితి. అలాగని ఊరకనే వెంట తిరగరనే ఉద్దేశంతో.. పలు ఆలయాలకు తెలుగు తమ్ముళ్లను అనధికారిక చైర్మన్లుగా ఎమ్మెల్యేలే నియమించేశారు. ఇదే అవకాశంగా.. తమ్ముళ్లు ఈవోలను లెక్క చేయకుండా అన్నీ తామే అన్నట్టు ఆలయాలపై పెత్తనం చెలాయిస్తున్నారు. జిల్లాలో వివిధ కేటగిరీల్లో సుమారు వెయ్యి దేవాలయాలున్నాయి. గడచిన రెండున్నరేళ్లలో 200 ఆలయాలకు మాత్రమే చైర్మన్లతో కూడిన కమిటీలు వేశారు. తక్కువ ఆదాయం వచ్చే 200 ఆలయాల నిర్వహణ బాధ్యతలను అర్చకులకే అప్పగించారు. మిగిలిన 600 ఆలయాలకు అధికారికంగా చైర్మన్ల నియామకం జరపలేదు. ఆయా ఆలయాలపై పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులకు పెత్తనం అప్పగించారు. దీంతో అనధికార చైర్మన్లుగా వారు అందినంతా దోచుకుంటున్నారు. చివరకు దేవుడికి నిత్యం జరగాల్సిన ధూపదీప నైవేద్యాలకు ఇవ్వాల్సిన పడితరంలో కూడా వాటాలు గుంజుతున్నారు. గతంలో ఏడాదికి అవసరమైన పడితరాన్ని ఒక నెల ముందుగానే ఈవోలు విడుదల చేసేవారు. ఆలయ ఆదాయాన్నిబట్టి ఈ పడితరం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంటుంది. కొద్ది నెలలుగా పడితరం విడుదల చేయకుండా ఈవోలపై తెలుగు తమ్ముళ్లు ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా పలు ఆలయాల్లో ఐదారు నెలలుగా పడితరం బిల్లులు ఇవ్వడం లేదు. ఉదాహరణలెన్నో.. ∙తుని సమీపాన తలుపులమ్మ లోవ దేవస్థానానికి ఏటా రూ.5 కోట్ల ఆదాయం వస్తుంది. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారి ఉత్సవాలు జరుగుతూంటాయి. రెండేళ్లుగా ఈ దేవస్థానానికి చైర్మన్ నియామకం జరగలేదు. మంత్రి యనమల రామకృష్ణుడు అనుచరుడైన తుని సమీపాన చామవరానికి చెందిన ఒక తెలుగు తమ్ముడు దేవస్థానం కార్యకలాపాల్లో పెత్తనం చెలాయిస్తున్నాడు. తనను త్వరలో చైర్మన్‌గా నియమిస్తారని, అన్నీ తాను చెప్పినట్టే నడవాలని అంటూ ఆలయ అధికారులను రాచిరంపాన పెడుతున్నాడు. బంధువులు, తమ నేతలు వస్తే ఆ ఖర్చులన్నీ అధికారులే భరించాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. హుండీ లెక్కింపు నుంచి కొంత పక్కకు తీయాల్సిందేనని పట్టుబట్టి మరీ గుంజుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ∙పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ నియామకం కూడా ఇంకా జరగలేదు. అక్కడ పెత్తనమంతా ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ముఖ్య అనుచరుడైన దేవస్థానం ఒకప్పటి మాజీ చైర్మన్‌దే. ఈ ఆలయంలో ఏడాదికి రూ.కోటిన్నరకు పైగానే ఆదాయం వస్తుంది. రోజూ ఆలయంలోనే మకాం వేసి అన్నీ తానై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారు చెప్పినట్టు వినకుంటే ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి బెదిరింపులకు దిగుతున్నారు. ∙కాకినాడ బాలత్రిపురసుందరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయానికి కూడా చైర్మన్ నియామకం జరగలేదు. ఇక్కడ కూడా తలుపులమ్మ దేవస్థానంలో మాదిరి తంతే నడుస్తోంది. టీడీపీ వాణిజ్య విభాగానికి చెందిన ఒక ముఖ్య నేత ఆలయ అనధికారిక చైర్మన్‌గా చలామణీ అవుతున్నారు. అయితే ఇక్కడ ఆ ముఖ్యనేత కంటే అతని అనుచరగణం హవానే ఎక్కువగా నడుస్తోంది. ఆలయ పర్వదినాల్లో తెలుగు తమ్ముళ్లే పెత్తనం చెలాయిస్తున్నారు. ∙కాకినాడ జగన్నాథపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జగన్నాథపురానికి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అనుచరుడు చైర్మన్ కాని చైర్మన్‌గా హల్చల్ చేస్తున్నాడు. తమపై అతడి వేధింపులు మితిమీరిపోతున్నాయని ఆలయ ఉద్యోగులు వాపోతున్నారు. హుండీ లెక్కించారంటే చాలు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఆ ‘తమ్ముడి’ చేతిలో పెట్టాల్సిందే. లేదంటే శంకరగిరి మాన్యాలు తప్పవంటూ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నాడు. ∙కాకినాడ భానులింగేశ్వరస్వామి దేవస్థానంలో కూడా దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. ఇక్కడ స్థానిక టీడీపీ నాయకుడొకరు ఉద్యోగుల కార్యకలాపాల్లో తలదూరుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ∙కోనసీమ కేంద్రం అమలాపురం వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అనుచరుడు ఏడాదిపాటు అనధికారికంగా పెత్తనం చెలాయించారు. సుబ్బాలమ్మ దేవస్థానం ఈవోగా ఉన్న సీహెచ్ లక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఇన్చార్జిగా పని చేశారు. నిజాయితీగా పని చేస్తూ సుబ్బాలమ్మ దేవస్థానానికి చెందిన భూములు, కౌలు ఎగవేతదారులపై ఆమె కొరడా ఝుళిపించారు. అటువంటి ఈవో ఇన్చార్జిగా కొనసాగితే తమ ఆటలు సాగవనే ఉద్దేశంతో ఆమెను మంత్రి సిఫారసుతో బదిలీ చేయించేశారు.