సంచలన తీర్పు; 180 ఏళ్ల జైలు శిక్ష | US Football Couch Get 180 Years Prison For Sexually Harrsment On Boyes | Sakshi
Sakshi News home page

కోచ్‌కు 180 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

Published Sat, May 4 2019 7:04 PM | Last Updated on Sat, May 4 2019 7:34 PM

US Football Couch Get 180 Years Prison For Sexually Harrsment On Boyes - Sakshi

వాషింగ్టన్‌: బాలురుపై లైంగిక వేధింపులకు పాల్పడిన బాస్కెట్‌బాల్ కోచ్‌కు అమెరికాలోని ఓ కోర్టు 180 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. గ్రెగ్ స్టీఫెన్.. అమెరికాలోని లోవాకు చెందిన ఓ ప్రముఖ బాస్కెట్‌బాల్ క్లబ్‌కు కోచ్‌గా వ్యవహిస్తున్నాడు. బాస్కెట్‌ బాల్‌ కోచ్‌గా అతనికి మంచిపేరు ఉంది. దీంతో ఎక్కువ మంది అతని వద్దకే కోచింగ్‌కు వస్తుంటారు. ఆటలో పిల్లల్ని మెరికల్లా తీర్చిదిద్దగల సామర్థ్యం అతని వద్ద ఉంది.  కానీ అతని అసలు స్వరూపం తెలిస్తే షాకవ్వల్సిందే.. అతనికి అబ్బాయిలంటే పిచ్చి. అమ్మాయి పేరిట సోషల్ మీడియాలో ఓ ఖాతా తెరిచి, అబ్బాయిలతో చాటింగ్‌ చేసేవాడు. తనను ప్రేమించాలంటూ వేధించేవాడు.

తాను కోచ్‌గా ఉన్న బాస్కెట్‌బాల్ టీమ్ మెంబర్స్.. హోటళ్లలో నిద్రపోతున్నపుడు, వారి దుస్తులు విప్పి, పక్కనే పడుకొని సెల్ఫీలు తీసుకొనేవాడు. తర్వాత ఆ ఫోటోలు చూపించి వారిరి బెదిరింపులకు గురిచేసేవాడు. ఇలా 20 ఏళ్లపాటు ఎవరికీ తెలియకుండా రహస్య కార్యకలాపాలు సాగించిన 43 ఏళ్ల గ్రెగ్ స్టీఫెన్ చివరకు జైలుపాలయ్యాడు. గ్రెగ్ దాచుకున్న ఓ పెన్‌డ్రైవ్‌లో అతడు అబ్బాయిలతో ఉన్న చిత్రాలుండటం చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోచ్‌ వద్ద పాఠాలు నేర్చుకున్న పిల్లలు కూడా అతడి ప్రవర్తపై ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

గ్రెగ్ ఇప్పటివరకూ దాదాపు 440 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించినట్లు ఆధారాలు లభించాయి. వారి ఫిర్యాదు మేరకు కేసును విచారించిన న్యాయమూర్తి ఆధారాలు చూసి ఖంగుతిన్నారు. గ్రేగ్‌ చేసిన నేరం క్షమించదగినది కాదని భావించిన కోర్టు.. అతనికి ఏకంగా 180 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అతడు జైలు నుంచి విడుదల కావడం అసాధ్యమని, ఈ కేసులో ఇంతకుమించి శిక్ష విధించలేమని కోర్టు వ్యాఖ్యానించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement