ఉక్రెయిన్‌లోని పలు పట్టణాలు, నగరాలపై పట్టును సాధించే ప్రయత్నం చేస్తున్న రష్యన్ బలగాలు ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ దేశపు విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఆరోపించారు.
ఇప్పటికే రష్యా ఆధీనంలో ఉన్న పలు ఉక్రెయిన్ పట్టణాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. సామాన్య జనావాసాలపై రష్యా బలగాల దాడి పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలా రష్యన్ సైనికులు తమ దేశ ప్రజలపై తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే చాలా మంది అమాయక ప్రజలను వారు కాల్చి చంపారని కూడా కులేబా పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లో రష్యా అకృత్యాలు రానున్న రోజుల్లో మరింతగా తీవ్రతరం కావొచ్చంటుంది అమెరికా. కొన్ని నగరాల్లో మినహా రష్యాకు ఉక్రెయిన్‌పై ఇప్పటి వరకూ పూర్తి పట్టు చిక్కని నేపథ్యంలో రష్యన్ బలగాలు అసహనంతో ఇలాంటి మరిన్ని దుశ్చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని అమెరికా వైపు నుంచి పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కులేబా రష్యా బలగాలపై చేసిన ఆరోపణలకు సంబందించి ఎలాంటి ఆధారాలను ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment