ఎయిర్ ఇండియా శీతాకాల ఆఫర్లు
ముంబై: ఎయిర్ ఇండియా సంస్థ అంతర్జాతీయ రూట్లలో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. షార్ట్-టెర్మ్ గ్లోబల్ వింటర్ సేల్ బొనాంజా పేరుతో ఎయిర్ ఇండియా ఈ ఆఫర్లనందిస్తోంది. ఎయిర్ ఇండియా చలికాలం ఆఫర్లతో విమానయాన రంగం వేడెక్కనున్నదని, తాజా ధరల పోరుకు తెరలేవనున్నది నిపుణులంటున్నారు. ఎంపిక చేసిన రూట్లలో రాను పోను చార్జీలు కనిష్టంగా రూ.19,999కే ఎయిర్ ఇండియా అఫర్ చేస్తోంది.
అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, చైనా, రష్యా, సింగపూర్, థాయ్లాండ్లలోని మొత్తం 33 నగరాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులందజేస్తోంది. ఈ ఆఫర్లకు టికెట్ల బుకింగ్ బుధవారం నుంచే ప్రారంభమైందని, వచ్చే నెల 2 వరకూ అందుబాటులో ఉంటుందని, వచ్చే ఏడాది నవంబర్ 15 వరకూ జరిగే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఆఫర్ల వివరాలు..., ఢిల్లీ-చికాగో/న్యూయార్క్, ఢిల్లీ-మెల్బోర్న్/సిడ్నీ రూట్లకు చార్జీ రూ.49,999. ఢిల్లీ-రోమ్/మిలన్/ఫ్రాంక్ఫర్ట్/ప్యారిస్/లండన్/బర్మింగ్హామ్ రూట్లకు చార్జీ రూ.39,999. ఢిల్లీ-టోక్యో/ఒసాకా/సియోల్ రూట్లకు చార్జీ రూ.39,999. ఢిల్లీ-బ్యాంకాక్/సింగపూర్ రూట్లకు చార్జీ రూ.19,999గా ఉంది.