Low pressures
-
నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు
-
అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఉండదు
సాక్షి, అమరావతి/విశాఖ దక్షిణ: వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారి గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతాల్లో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదిలావుండగా.. రుతు పవనాల కదలిక జోరుగా ఉందని, ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
కొత్త రకం వానలివి!
సాక్షి, హైదరాబాద్: అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి.. కేరళ నుంచి గుజరాత్ వరకు వానలు పడితే.. అది నైరుతి రుతుపవనాలు అని చెప్పుకొంటాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపానులు, అల్పపీడనాలతో వానలు కురిస్తే ఈశాన్య రుతుపవనాలు.. మరి ఎక్కడో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో పశ్చిమ తీరంలోని గుజరాత్లో వానలు కురిస్తే..! ఇదిగో ఇలాంటి అరుదైన, వింత వర్షాలు కురుస్తున్నాయి ఈ ఏడాది. ఈ పరిణామానికి పేరేమీ లేదు కానీ.. వాతావరణ విచిత్రాల్లో ఇదీ ఒకటిగా మాత్రం చూడాల్సి ఉంటుంది. గత 20 ఏళ్లలో 2 సార్లు మాత్రమే ఇలా జరిగిందట. రెండు రుతుపవనాలకు కాస్త భిన్నం.. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ప్రభావం చూపే నైరుతి రుతుపవనాలు పశ్చిమ తీరంతో పాటు ఈశాన్య, మధ్య భారతాన్ని వానలతో నింపితే.. ఆ తర్వాత తూర్పు తీరం వెంబడి వానల ప్రభావం చూపేందుకు ఈశాన్య రుతుపవనాలు వస్తాయి. గాలి వీచే వేగం, దిశల్లో మార్పుల్లేని కారణంగా ఈ దృగ్విషయాల్లో తేడాలు చాలా తక్కువే. కానీ ఈ ఏడాది చాలా ఏళ్ల తర్వాత ఈశాన్య రుతుపవనాల ప్రభావం గుజరాత్, రాజస్తాన్‌ల వరకూ విస్తరించింది. వాతావరణ వ్యవస్థలు (అల్పపీడం, తుపానులు వంటివి) బలంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంటాయని, కాకపోతే చాలా అరుదుగా జరుగుతుందని దేశంలో తొలి వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్‌కు చెందిన శాస్త్రవేత్త పల్వట్ మహేశ్ ‘సాక్షి’కి తెలిపారు. 2007లో యామిన్ తుపాను చూసుకుంటే.. బంగాళాఖాతంలో పుట్టి.. గుజరాత్ మీదుగా అరేబియా సము ద్రం దాటి పాకిస్తాన్‌లోని కరాచీ వరకూ సా గింది. జూన్ 17న దీన్ని తొలిసారి గుర్తించా రు. ఆ తర్వాత ఏపీలోని కాకినాడ వద్ద తీరం దాటడంతో బలహీనపడుతుందని వాతావర ణ నిపుణులు అంచనా వేశారు. కానీ జూన్ 26 నాటికి ఇది కరాచీ చేరుకుని అక్కడ భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుపాను కారణంగా భారత్‌లో దాదాపు 140 మంది ప్రాణాలు కోల్పోగా.. పాక్‌లో 213 మంది చనిపోయా రు. యామిన్ తర్వాత అంతటి బలమైన వా తావరణ వ్యవస్థ ఏర్పడటం ఇదే తొలిసారి. గాలి దిశలో మార్పు ప్రభావం.. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రభా వం తెలంగాణ, విదర్భ ప్రాంతాల వరకు కన్పిస్తుంది. ఈ కారణంగానే సెప్టెంబర్, అక్టోబర్ తొలి 2 వారాల్లో అడపాదడపా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. నేలపై గాలి వాయవ్య దిశగా వీస్తూ ఉండటం వల్ల.. వాతావరణ వ్యవస్థ నేలపై ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఫలితం గా బలహీనపడేందుకు అవకాశాలు ఎక్కు వగా ఉంటాయి. అయితే ఈ ఏడాది గాలి వా యవ్యం వైపు కాకుండా పశ్చిమం వైపు తిరగడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగని అన్ని అల్పపీడనాలు గుజరాత్ వర కు ప్రయాణిస్తున్నాయా.. అంటే అదీ లేదు. ఆగస్టులో దాదాపు 5 అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ వాటిల్లో బలమైనవి ఏవీ లేవు. కొన్ని తెలంగాణ వరకూ ప్రయాణించాయి. మరికొ న్ని విదర్భ అంచులు తాకాయి. కానీ అక్టోబర్ లో ఏర్పడ్డ అల్పపీడనం మాత్రం గుజరాత్ వ రకు ప్రయాణించింది. 2007, 2020 రెండిం టిలోనూ సూర్యుడిపై ఏర్పడే మచ్చల (పే లుళ్ల ఫలితంగా నల్లగా కనిపించే ప్రాంతాలు) తక్కువగా ఉండటం కొసమెరుపు! -
అల్పపీడనాలే ఆదుకున్నాయ్!
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో అల్పపీడనాలే ఆదుకున్నాయి. సీజన్ ఆరంభమైనప్పట్నుంచి ముగిసే వరకు బంగాళాఖాతంలో ఐదు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఒక్క వాయుగుండంగానీ, తుఫాన్గానీ ఏర్పడకుండానే సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ ఆఖరు వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కనీసం రెండు వాయుగుండాలుగానీ, ఒకట్రెండు తుఫాన్లుగానీ వస్తుంటాయి. కానీ ఈసారి అలా జరగలేదు. అల్పపీడనాలే పుష్కలంగా వర్షాలు కురిపించి రైతులకు, రాష్ట్రానికి మేలు చేశాయి. వీటితో పాటు ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ద్రోణులు వంటివి మరో 12 వరకూ ఏర్పడ్డాయి. ఇవి కూడా రాష్ట్రంలో వర్షాలకు దోహదపడ్డాయి. కోస్తా కంటే సీమలోనే అత్యధిక వర్షపాతం సబ్ డివిజన్‌వారీగా చూస్తే కోస్తాంధ్ర కంటే ఈ సారి రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అక్కడ 411.6 మి.మీల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 756.1 మి.మీల వర్షం కురిసింది. సీమలో అత్యధికంగా కడప జిల్లాలో 401.3 మి.మీలకు గాను 843.6 మి.మీలు నమోదైంది. ఇక కోస్తాంధ్ర (యానాంతో కలిపి)సబ్‌డివిజన్‌లో సాధారణ వర్షపాతం 586.9 మి.మీ కాగా, 725.3 మి.మీల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా మినహా.. రాష్ట్రంలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే లోటు వర్షపాతం నమోదైంది. అక్కడ 742.4 మి.మీలకు 558.5 మి.మీల వర్షపాతమే రికార్డయింది. నెలలవారీగా చూస్తే జూలైలో అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టులో స్వల్పంగానే వానలు పడా ్డయి. జూన్‌లో 32 శాతం, జులైలో 74 శాతం, ఆగస్టులో 6 శాతం, సెప్టెంబర్‌లో 58 శాతం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. పొంగుతున్న వాగులు, వంకలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యా ప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, ఓర్వకల్లు మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పాపాఘ్ని నది ఉప్పొంగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో గరిష్టంగా 76.8 మి.మీ. వర్షం కురిసింది.విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంతపురం, జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలతో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు పలుచోట్ల కోతకు గురైంది. ఇక్కడి జియోట్యూబ్ రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమైంది. కృష్ణమ్మకు మళ్లీ వరద ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 38,516 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. రాత్రి 7 గంటలకు రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి మొత్తం 56,058 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 215.8070 టీఎంసీల నీరు నిల్వగా ఉండగా, డ్యామ్ నీటిమట్టం 885 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంలోకి ఆదివారం దాదాపు 52 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ముందు జాగ్రత్తగా 16 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
ఇక చలి పంజా..!
-
ఇక చలి పంజా..!
సాక్షి, విశాఖపట్నం: కొన్నాళ్లుగా చలికి దూరంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక శీతాకాలాన్ని చవి చూడనున్నారు. వాస్తవానికి నవంబర్ మూడో వారం నుంచే చలి మొదలవుతుంది. కానీ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావంతో ఈ ఏడాది చలి కాస్త ఆలస్యమైంది. అల్పపీడనాలు, ద్రోణుల వల్ల ఆకాశంలో మేఘాలేర్పడతాయి. అందువల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టక చలి తీవ్రత కనిపించదు. కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనద్రోణి కూడా బలహీనపడుతోంది. మరోవైపు అధిక పీడనం ప్రభావంతో విదర్భ, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తాల వైపు చల్లటి వాయవ్య గాలులు వీస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇన్నాళ్లూ ఆయా ప్రాంతాల్లో సాధారణంకంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పుడు 1 నుంచి 2 డిగ్రీలు తక్కువగా రికార్డవుతున్నాయి. ‘ఆకాశంలో మేఘాల్లేకపోతే పగటి పూట భూమి త్వరగా వేడెక్కుతుంది. మబ్బులుంటే వేడి పైకి వెళ్లకుండా కిందకు వస్తుంది. ప్రస్తుతం ఆకాశంలో మేఘాలు లేక సత్వరమే భూమి వేడెక్కి, రాత్రి అయ్యే సరికి వేగంగా చల్లబడిపోతుంది. అందువల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ చలి తీవ్రత పెరగడానికి కారణమవుతోంది’ అని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం వీస్తున్న వాయవ్య గాలుల ప్రభావంతో ఉత్తర తెలంగాణ, ఉత్తరకోస్తాలపై చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందని ఆయన వివరించారు. గురువారం అత్యల్పంగా ఏపీలోని లంబసింగిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారంతో పోల్చుకుంటే ఒక్కరోజులోనే రెండు డిగ్రీలు పడిపోయింది. మరోవైపు గడచిన 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. -
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
* ఊపందుకున్న రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు * మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వానలు సాక్షి, విశాఖపట్నం, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంపై ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి ఆవల కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడనుంది. శనివారం నాటికి ఇది వాయుగుండంగా మారనుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. మరోవైపు అల్పపీడనం వల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి, తెలంగాణలోనూ బలంగా మారాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. దీంతో రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో.. అలాగే ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమతో పాటు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో దక్షిణ కోస్తాలో పశ్చిమ దిశగా, ఉత్తర కోస్తాలో వాయవ్య దిశగా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్‌లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంథనిలో 13, డోర్నకల్, గూడూరు, నర్సంపేటల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. చెన్నారావుపేట, ఏటూరునాగారం, ఆత్మకూర్‌లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కొత్తగూడెం, చింతకాని, ములుగు, భూపాల్పల్లి, చంద్రుగొండ, నల్లబెల్లిలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. వెంకటాపూర్, ములకలపల్లి, బూర్గంపాడు, శ్యాంపేట్, బోనకల్, గుండాల, గోవర్థన్‌పేటల్లో 7 సెంటీమీటర్ల చొప్పున పడింది. ఇక ఏపీలోని అమలాపురంలో 11, అవనిగడ్డ, అంబాజీపేట, నర్సీపట్నం, విజయవాడల్లో 7, నందిగామ, నూజివీడులలో 6, గుడివాడ, తిరువూరులలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇది రుతుపవనాల వాయుగుండం ఈ సీజన్లో సముద్ర తీరానికి ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండంగా బలపడతాయి. అయితే అవి భూమికి సమీపంలో ఏర్పడడం వల్ల తుపానుగా మారే అవకాశం ఉండదు. అందుకే వాతావరణ నిపుణులు వీటిని రుతుపవనాల వాయుగుండం(మాన్సూన్ డిప్రెషన్)గా వ్యవహరిస్తారు. శనివారం నాటికి ఏర్పడబోయే వాయుగుండం ఇలాంటిదేనని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త ఆర్.మురళీకృష్ణ తెలిపారు. ఈ వాయుగుండం వాయవ్య దిశగా సముద్రం నుంచి భూమిపైకి వచ్చి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ వైపు పయనిస్తుందన్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వచ్చే మూడురోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి కూడా వెల్లడించారు. -
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
-
బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు
తెలంగాణ, ఉత్తర కోస్తాల్లో చలి తీవ్రత సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఒకటి శుక్రవారం సాయంత్రం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి వెనువెంటనే బలపడింది. దీనికి ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. ప్రస్తుతం ఇది శ్రీలంక తీరానికి ఆనుకుని ఉంది. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇది బలపడి వచ్చే 48 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఈ నెల 29, 30 తేదీల్లో వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలలో చలి తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చలి విజృంభిస్తుందని వివరించింది. హైదరాబాద్‌లో వచ్చే రెండ్రోజులు 11 డిగ్రీల కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలుంటాయని తెలిపింది.