Low turnout
-
Iran presidential election 2024: సంస్కరణవాదా ? అతివాదా?
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్‌తో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో నేడు రెండో దఫా ఎన్నికలకు ఓటర్లు సిద్ధమయ్యారు. జూన్ 28న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులందరినీ తిరస్కరిస్తూ, ఎవరికీ కీలక 50 శాతం ఓటింగ్‌ను ఓటర్లు కట్టబెట్టకపోవడంతో రన్ఆఫ్(రెండోసారి ఎన్నికలు)కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. మతబోధకుడి పాలనను జనం ఎంతగా తిరస్కరిస్తున్నారనేది జూన్ 28నాటి అత్యల్ప ఓటింగ్ సరళి కళ్లకు కట్టింది. కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, యువతలో అసహనం, మతఛాందసవాదం, ఉద్యమాలు, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, అమెరికాలతో కయ్యంతో ఇంటాబయటా ఇబ్బందులు పడుతున్న దేశాన్ని ఎవరు ఏలుతారన్న విషయం నేటి ఎన్నికలతో తేలిపోనుంది. తొలి రౌండ్లో ఏం జరిగింది? మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ ఆజ్ఞలు పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు, ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు. తొలి రౌండ్లో సంస్కరణవాది డాక్టర్ మసూద్ పెజెష్కియన్ అందరికంటే ఎక్కువగా 42.5 శాతం ఓట్లు సాధించారు. అతివాది సయీద్ జలిలి 38.6 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. దేశంలో 6 కోట్ల మంది ఓటర్లుంటే కేవలం 2.5 కోట్ల మంది ఓటేశారు. దేశ చరిత్రలోనే అత్యల్పంగా 40 శాతం పోలింగ్ నమోదైంది. ఎవరికీ 50 శాతం ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండోదశ పోలింగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ లెక్కన మసూద్, జలిలి మాత్రమే ఈరోజు జరిగే ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పిడివాదుల్లో పొరపొచ్చాలు? అతివాద నేతల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపాయి. అతివాదం నుంచి దేశాన్ని సంస్కరణల బాట పట్టిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సీనియర్ సభ్యుడు, అతివాది సర్దార్ మొహసీన్ రషీద్ తన మద్దతు మసూద్‌కే అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తొలి రౌండ్లో పోటీపడి ఓడిన గలీబాఫ్కు ప్రచారసారథ్యంవహించిన సమీ నజారీ తర్కరానీ సైతం మసూద్‌కే తన ఓటు అని ప్రకటించారు. మసూద్ గెలిస్తే? తొలి రౌండ్లో పోలింగ్ కేంద్రందాకా రాని 60 శాతం ఓటర్లపైనే ఈ ఇద్దరు అభ్యర్థులు దృష్టిసారించారు. తొలి రౌండ్లో సమీప అభ్యర్థి జలిలి కంటే 3.9 శాతం ఓట్లు ఎక్కువ సాధించడం ద్వారా జనాల్లో తనకు ప్రజాదరణ ఎక్కువ ఉందని మసూద్ పెజెష్కియన్ ఇప్పటికే నిరూపించుకున్నారు. కొన్ని అంశాల్లో మసూద్‌ను సమరి్థస్తున్నట్లు ఎన్నికలపర్వం మొదలవడానికి ముందు జలిలి కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మైనారిటీలు, యువత, మహిళల సమస్యలను ప్రచారం సందర్భంగా ప్రస్తావిస్తూ జనాన్ని మసూద్ తనవైపునకు తిప్పుకుంటున్నారు. మసూద్ గెలిచి దేశాధ్యక్షుడైతే నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో మరుగునపడిన 2015నాటి అమెరికా–ఇరాన్ అణుఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కృషిచేయొచ్చు. పశి్చమదేశాలతో దోస్తీకి ప్రయతి్నంచవచ్చు. దీంతో ఆంక్షలు తొలగి, విదేశీ పెట్టుబడులు పెరిగి దేశారి్థకం బాగుపడే అవకాశముంది.జలిలి గెలిస్తే? సయీద్ జలిలి గెలిస్తే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. దేశాభివృద్ధి కోసం పశి్చమదేశాలపై ఆధారపడాల్సిన పనిలేదని సుప్రీంలీడర్ ఖమేనీ అన్న మాటలనే జలిలి వల్లెవేస్తున్నారు. ‘‘ అసలు ఇరాన్‌పై ఎందుకు ఆంక్షలు విధించాం? అని పశి్చమ దేశాలే బాధపడాలి. ఆంక్షలను సైతం మనం అవకాశంగా మలచుకోవాలి’ అన్న జలిలి మాటలు చూస్తుంటే ఈయన గెలిస్తే దేశంలో మతచాంధస పాలనను కొనసాగిస్తారని అర్థమవుతోంది.స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే మార్గముందా? దేశ కీలక అంతర్గత వ్యవహారాలు అన్నీ సుప్రీంలీడర్ ఖమేనీ కనుసన్నల్లో జరుగుతాయి. అలాంటపుడు అధ్యక్షుడిగా ఉండి కూడా మసూద్గానీ, జలిలిగానీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరా? అనేది భేతాళ ప్రశ్నగా మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే విదేశీవ్యవహారాల్లో అధ్యక్షుడు, మంత్రివర్గం నిర్ణయాలే ఎక్కువగా చెల్లుబాటు అవుతాయని తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాలతో శతృత్వం విషయం పక్కనబెడితే ఇతర పశి్చమ దేశాలతో మైత్రికి నూతన అధ్యక్షుడు ప్రయతి్నస్తే దేశంలో ప్రగతి సాధ్యమే. మసూద్ అధ్యక్షుడైతే ఈ మార్పుకు బాటలు పడొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ‘మార్పు’కు ఖమేనీ ఒప్పుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Iran presidential election 2024: ఫలితం తేల్చని ఇరాన్ ఎన్నికలు
దుబాయ్: ఇరాన్ అధ్యక్ష పదవికి శుక్రవారం జరిగిన పోలింగ్‌లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దేశ చరిత్రలోనే అతి తక్కువ ఓటింగ్ నమోదైన నేపథ్యంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్‌కు గానీ ఛాందసవాది సయీద్ జలీలీకిగానీ మెజారిటీ దక్కలేదు. దేశ రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో 50 శాతం పైగా సాధించిన వారే అధ్యక్షుడవుతారు. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో అతి తక్కువగా 39.9 శాతం మందే ఓటేశారు. 60 శాతం మందికి పైగా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. మొత్తం 2.45 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా శనివారం వెలువడిన ఫలితాల్లో పెజెష్కియాన్‌కు 1.04 కోట్ల మంది, జలీలీకి 90.4 లక్షల మంది ఓటేశారని అధికారులు ప్రకటించారు. వీరితోపాటు బరిలో నిలిచిన పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘెర్ ఖలిబాఫ్కు 30.3 లక్షల ఓట్లు, షియా మత పెద్ద మొస్తాఫాకు 2.06 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఫలితాలు వెలువడ్డాక అధ్యక్ష బరి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఖలిబాఫ్ రెండో విడత పోలింగ్‌లో తన మద్దతు జలీలీకే ఉంటుందని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో జులై 5వ తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో ఎక్కువ మందిని తన వైపు తిప్పుకోగలిగితేనే పెజెష్కియాన్‌కు గెలిచే అవకాశాలుంటాయి. లేకుంటే, సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మద్దతున్న జలీలీదే పైచేయి అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాన్లో మరోసారి ఛాందసవాదులే అధికారంలోకి వస్తారని అంటున్నారు. ‘నిరసన తెలపడం ప్రజల హక్కు. ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండటం ద్వారా ఇరాన్ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్ష అభ్యర్థులతోపాటు ప్రస్తుత వ్యవస్థతను సైతం వారు తిరస్కరించారు’ అని లండన్‌లోని చాతం హúస్లో మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రోగ్రాం డైరెక్టర్ సనమ్ వకీల్ విశ్లేషించారు. అక్కడి వ్యవస్థల పట్ల ప్రజల్లో ఏ మేరకు ఉదాసీనత, నిరాశ గూడుకట్టుకునే ఉన్నాయనేందుకు ఇదే ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. -
ఓటేయండి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చదువుకున్నవారు ఎక్కువే ఉన్నప్పటికీ.. ఓటేసే వారు తక్కువే అని చెప్పాలి. నేతల తీరుపై విసుగు.. అలసత్వం.. ఉదాసీనత.. కారణమేదైనా ఓటింగ్‌లో పాల్గొనే సిటీజనులు స్వల్పమే. పలు ఎన్నికల్లో ఈ విషయం వెల్లడైంది. గత అసెంబ్లీ ఎన్నికలనే తీసుకుంటే అనేక నియోజకవర్గాల్లో 30 శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగింది. 22 శాతమే జరిగిన ప్రాం తాలూ ఉన్నాయి. ప్రజల చేతిలో పాశుపతాస్త్రమైనప్పటికీ, ఓటు విలువ తెలిసిన వారు తక్కువే కావడంతో, ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటు ఆయుధాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఓటు వేయకుంటే ఇబ్బందులు పడతారని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. భారీగా ప్రచారం గత (2009) సార్వత్రిక ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ జరగడంతో.. ఈసారి ప్రజలంతా పోలింగ్‌లో పాల్గొనేలా చూసేందుకు గ్రేటర్ ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. ఓటు హక్కు గురించి ఓటర్లకు తగు అవగాహన కల్పించేందుకు వివిధ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఎన్నికల సిబ్బంది స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి తప్పనిసరిగా ఓటు వేయాల్సిందిగా సూచిస్తున్నారు. ‘ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారానే సకాలంలో సదుపాయాలు సమకూరుతాయి. రేషన్ సరుకులు అందలన్నా.. సమయానికి గ్యాస్ రావాలన్నా.. తాగునీరు, విద్యుత్, ఇతరత్రా సమస్యలు తీరాలన్నా ఓటేసి తగిన అభ్యర్థిని గెలిపించుకోవాలి’ అని చెబుతున్నారు. ఓటు వేయకుండా మాత్రం ఉండవద్దని ప్రచారం చేస్తున్నారు. తక్కువ పోలింగ్ జరిగిన స్థానాలపై దృష్టి గత ఎన్నికల్లో చాలా తక్కువ శాతం మాత్రమే పోలింగ్ జరిగిన ప్రాంతాలను గుర్తించి, ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజల ఇళ్లకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఓటు ఆవశ్యకతను తెలిపే కర పత్రాలను పంపిణీ చేస్తున్నారు. సదరు కరపత్రాల్లో ‘ఓటు విలువ తెలుసుకో- విజ్ఞతతో ఎన్నుకో’ శీర్షికతోపాటు ‘స్వచ్ఛందంగా ఓటేద్దాం- కార్యసాధకులను గెలిపిద్దాం’ తదితర నినాదాలు పొందుపరిచారు. ప్రలోభాలకు లొంగకూడదనే హెచ్చరికలూ చేశారు. ఇప్పటికే వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎక్కువమంది ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకున్న యంత్రాంగం.. ఓటర్లుగా ఉన్నవారు తప్పనిసరిగా ఓటు వేయాలనే అంశాన్నీ చాటి చెబుతున్నారు. పోలింగ్ తేదీ.. సమయం తదితర వివరాలు కరపత్రంలో పొందుపరిచారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఆయా నియోజకవర్గాల్లోని మొత్తం పోలింగ్ కేంద్రాల్లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైన కేంద్రాల్లో తొలి వరుసలోని పది కేంద్రాలను గుర్తించి, సదరు కేంద్రాల పరిధిలోని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓటు ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోనున్న రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల పరిధిలో 30 శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగిన కేంద్రాలను గుర్తించి, ఆ ప్రాంతాల ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. ఇలా.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేయడం ద్వారా .. గతం మాదిరిగా తక్కువ పోలింగ్ జరగకుండా ఉండేందుకు అధికారులు యత్నిస్తున్నారు.