loyalty test
-
కుటుంబానికొక్కరు సైన్యంలోకి
న్యూఢిల్లీ: భారత్‌కు దీటుగా సరిహద్దుల్లో బలాన్ని పెంచుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని డ్రాగన్ దేశం చైనా వినియోగించుకుంటోంది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడమే లక్ష్యంగా టిబెట్ యువతను సైన్యంలోకి తీసుకుంటోంది. టిబెట్‌లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సైన్యంలో చేరాల్సిందేనని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ, చైనా సైన్యం) ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నుంచి టిబెట్‌లోని యువతకు పీఎల్ఏ వివిధ విధేయత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని భారత నిఘావర్గాలు తెలిపాయి. వారికి మాండరిన్ బోధించడం, మిగతా అన్నిటి కంటే చైనా కమ్యూనిస్టు పార్టీయే మిన్న అని వారిలో నూరిపోయడం వంటివి చేపట్టిందని పేర్కొన్నాయి. ఎంపికైన వారికి కొండ ప్రాంతాల్లో, కఠిన శీతల పరిస్థితుల్లో విధి నిర్వహణపై శిక్షణ అందిస్తోందని వెల్లడించాయి. టిబెటన్లను సైన్యంలోకి తీసుకోవడం ద్వారా అనేక అనుకూలతలను సాధించాలని చైనా భావిస్తోంది. మొదటగా, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, పీఎల్ఏ పట్ల యువతలో విధేయతను సాధించడం, టిబెట్ అటానమస్ రీజియన్‌లోని ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడం. రెండోది..లద్దాఖ్ వంటి కఠిన పరిస్థితులుండే ప్రాంతంలో పీఎల్ఏకు భద్రత విధుల భారం తగ్గించడం. మూడోది, ముఖ్యమైంది.. కఠిన పరిస్థితులుండే లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎల్ఏసీ వెంట భారత్‌లోని ప్రవాస టిబెటన్లు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో వారికి దీటుగా టిబెటన్లను అంతే స్థాయిలో ఎల్ఏసీ వెంట శాశ్వత ప్రాతిపదికన రంగంలోకి దించడం అని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది పాంగాంగో సో సరస్సు దక్షిణం వైపు ఎల్ఏసీ వెంట పీఎల్ఏ చొచ్చుకు వచ్చే అవకాశాలున్నాయని అనుమానించిన భారత్ టిటెటన్లతో కూడిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌ను మొఖపరి, బ్లాక్ టాప్, ఇతర కొండ ప్రాంతాల్లో ఆక్రమించి చైనాకు షాకిచ్చింది. అప్పటి ఈ పరిణామమే చైనాను టిబెటన్ యువత వైపు మొగ్గేలా చేసిందని భావిస్తున్నారు. నేడు భారత్–చైనా 12వ రౌండ్ చర్చలు సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో దాదాపు మూడున్నర నెలల తర్వాత ఈనెల 31వ తేదీన భారత్, చైనాల సైనికాధికారులు చర్చలు జరపనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా హాట్ స్ప్రింగ్స్, గోగ్రాల నుంచి సైనికబలగాల ఉపసంహరణలో కొంత పురోగతి సాధించడంపై రెండు వర్గాలు దృష్టి పెడతాయని సైనిక వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా భూభాగంలోని మోల్దో బోర్డర్ పాయింట్లో కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు మొదలు కానున్నాయి. రెండు దేశాల సైనికాధికారుల మధ్య భారత్ భూభాగంలోని చుషుల్ వద్ద ఏప్రిల్ 9వ తేదీన 11వ విడత చర్చలు జరిగాయి. 11వ విడత చర్చల తర్వాత ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా సానుకూలంగా లేకపో వడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గత ఏడాది మే నెల నుంచి తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాలు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్, జేడీఎస్ చలో కేరళ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ.. విశ్వాస పరీక్షలో గెలుపొందేందుకు ‘ఆపరేషన్ కమల్’కి తెరలేపింది. అసెంబ్లీలో బల నిరూపణకు ప్రస్తుతమున్న 104 ఎమ్మెల్యేలు సహా మరో 8 మంది బీజేపీకి అవసరం. దీంతో మిగిలిన వారి కోసం కాంగ్రెస్, జేడీఎస్‌లపై దృష్టి పెట్టింది. దీంతో ఈ ఆపరేషన్‌లో చిక్కుకోకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ రిసార్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. కుమారస్వామి, సిద్దరామయ్య సహా జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్యనేతలు కొచ్చిలోని ‘క్రౌన్ ప్లాజా’ 5స్టార్ హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోటల్ ముందు కేరళ పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటుచేశారు. అయితే.. వీరిని తరలించేందుకు ఏర్పాటుచేసుకున్న ప్రత్యేక విమానానికి డీజీసీఏ అధికారులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రోడ్డుమార్గంలో పుదుచ్చేరికి తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కరొక్కరుగా.. హోస్పేట ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ (కాంగ్రెస్) రిసార్టుకు రాకుండానే అదృశ్యమయ్యారు. దీనికి తోడు.. బుధవారం రాత్రి ఇప్పుడే వస్తానంటూ రిసార్టు నుంచి బయటకెళ్లిన మస్కి ఎమ్మెల్యే ప్రతాప గౌడ తిరిగి రాలేదు. ఆరోగ్యం బాగాలేదంటూ గురువారం రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన హుమ్నబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ కూడా అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత వీరి ఫోన్లు స్విచాఫ్ వస్తుండటంతో కూటమిలో కలవరం మొదలైంది. క్యూలో మరికొందరు! కాంగ్రెస్‌కు చెందిన కొందరు లింగాయత్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎమ్మెల్యేలు వెంకట్రావ్ నాడగౌడ, మహంతేశ్ కౌజల్గి, అమరేగౌడ, డీఎస్ హులగేరితో కమలదళ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరితో పాటు వెంకటరమణప్ప, శివశంకరరెడ్డి, స్వతంత్ర ఎమ్మెల్యేలు నాగేష్, శంకర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
బీజేపీ ప్రభుత్వాన్ని మళ్లీ బలపరీక్ష కోరండి
‘మహా’ గవర్నర్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి ముంబై: మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి విశ్వాసపరీక్షను ఎదుర్కోవలసిందిగా ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును డిమాండ్ చేసింది. మళ్లీ విశ్వాస పరీక్షను ఎదుర్కొనే వరకూ.. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలుపుదల చేయాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే నేతృత్వంలో శాసనసభ్యుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్నం అందజేసింది. 20 నిమిషాలపాటు గవర్నర్‌తో సమావేశమైన కాంగ్రెస్ సభ్యులు బుధవారం నాటి విశ్వాస పరీక్షలో ఫడ్నవిస్ ప్రభుత్వం అక్రమంగా మూజువాణి ఓటు ద్వారా విజయం సాధించిందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మాణిక్‌రావు ఠాక్రే విలేకరులతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తులను పరిశీలిస్తామని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని చెప్పారు.