- ‘మహా’ గవర్నర్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి
ముంబై: మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి విశ్వాసపరీక్షను ఎదుర్కోవలసిందిగా ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును డిమాండ్ చేసింది. మళ్లీ విశ్వాస పరీక్షను ఎదుర్కొనే వరకూ.. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలుపుదల చేయాలని కోరింది.
ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే నేతృత్వంలో శాసనసభ్యుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్నం అందజేసింది. 20 నిమిషాలపాటు గవర్నర్‌తో సమావేశమైన కాంగ్రెస్ సభ్యులు బుధవారం నాటి విశ్వాస పరీక్షలో ఫడ్నవిస్ ప్రభుత్వం అక్రమంగా మూజువాణి ఓటు ద్వారా విజయం సాధించిందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మాణిక్‌రావు ఠాక్రే విలేకరులతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తులను పరిశీలిస్తామని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని చెప్పారు.