LPG cooking gas
-
గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 అవుతుంది..!
కోల్‌కతా: జల్పైగురి జిల్లాలోని ధుప్గురి ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి గ్యాస్ ధర రూ.3000 అవుతుందని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించడంపై స్పందిస్తూ డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపైనా ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఇది రక్షాబంధన్ కానుక అంటారు.. ఏ.. రక్షాబంధన్ ఐదేళ్లకు ఒక్కసారే వచ్చిందా ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రధాని కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. 2024 ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం గ్యాస్ ధర రూ.3000కు చేరుతుందని అన్నారు. అదే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఒక సిలిండర్ ధర కేవలం రూ.500కే అందిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు.. మీకెవరికైనా ఆ డబ్బులు వచ్చాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఆ డబ్బులు ఇవ్వకపోగా ఉపాధి హామీ నిధులను నిలిపివేసిందని అన్నారు. వందరోజుల పని దినాలు పథకం కింద పని చేసిన వారికి కూడా డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపణలు చేశారు. పైగా వారంతా ఇక్కడికొచ్చి బాంగ్లాదేశ్ నినాదమైన 'జోయ్ బెంగాల్' ని ఇక్కడ బెంగాల్లో నినదించి ఈ ప్రాంతాన్ని అవమానిస్తారు. సెప్టెంబర్ 5న జరగబోయే ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఘోరంగా ఓడించాలని ఈ ఓటమికి ఆ అభ్యర్థి ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా సిగ్గుపడాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ దెబ్బతో బీజేపీ పార్టీకి ప్రజల బలం ఏమిటో తెలిసి రావాలని అన్నారు. ఈ సందర్బంగా అభిషేక్ ఈ ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎంతో మాట్లాడి ధుప్గురికి మూడు నెలలో సబ్ డివిజన్ హోదా కల్పిస్తామని అన్నారు. అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష నేత సువెందు అధికారి.. ముందు ఆశా వర్కర్ల జీతాలు, గ్రూపు-డి ఉద్యోగుల జీతాలు ఎందుకంత తక్కువగా ఉన్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంతో సమానంగా డీఏ చెల్లించే విషయమై ఎంతకాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి రాజ్యాంగం పట్ల కొంచెం కూడా గౌరవం లేదని ఉంటే ఎన్నికల సమయంలో ఆచరణసాధ్యం కానీ హామీలు ఇచ్చేవారు కాదని విమర్శించారు. ভোট মরশুমে মানুষের মন জয় করতেই রান্নার গ্যাসের দাম ২০০ টাকা কমিয়েছে কেন্দ্রের জনবিরোধী বিজেপি সরকার। আগামী দিনে কেন্দ্রের সরকার বদলে গেলে গ্যাসের দাম কমে ৫০০ টাকা হয়ে যাবে।#TrinamooleNaboJowar #WestBengal #Jalpaiguri pic.twitter.com/eATYbLdtv8 — Trinamoole Nabo Jowar (@TMCNaboJowar) September 2, 2023 ఇది కూడా చదవండి: ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు -
పెట్రో డిమాండ్ ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా పెట్రోలు వినియోగం భారీగా పడిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యాలు స్థంభించిపోయాయి. దీంతో వంటగ్యాస్ మినహా అన్ని పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ భారీగా క్షీణించింది. ఏప్రిల్‌లో భారతదేశ ఇంధన వినియోగం రికార్డు స్థాయిలో 50 శాతం పడిపోయింది. పరిశ్రమ గణాంకాల ప్రకారం ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఇంధన వినియోగానికి సంబంధించిన పెట్రోల్ అమ్మకాలు 64 శాతం తగ్గాయి, డీజిల్ అమ్మకాలు 61 శాతం కీణించాయి. అంతేకాదు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్) వినియోగం 94 శాతం పడిపోయింది. అయితే వంటగ్యాస్ వినియోగం మాత్రం 21శాతం పుంజుకుంది. ప్రధానంగా ప్రభుత్వం పేదప్రజలకు ఏప్రిల్ 1 నుండి 15 వరకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ప్రకటించిన కారణంగా ఈ వృద్ది నమోదైంది. మొత్తం మీద పెట్రోలియం ఉత్పత్తి అమ్మకాలు 50 శాతం తగ్గాయి. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద క్షీణత అని పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు. కాగా 2019 ఏప్రిల్‌లో భారతదేశంలో 2.4 మిలియన్ టన్నుల పెట్రోల్ విక్రయం నమోదైనాయి. డీజిల్ వినియోగం 7.3 మిలియన్ టన్నులు. 6,45,000 టన్నుల ఏటీఎఫ్ విక్రయాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునే క్రమంలో దేశంలో మార్చి 25 నుంచి 21 రోజుల లాక్డౌన్ ప్రకటించారు. అనంతరం దీన్ని మే 3వ తేదీ వరకు పొడిగించారు. అయితే ఏప్రిల్ 20వ తేదీనుంచి ఇ-కామర్స్ కంపెనీలపై ఆంక్షలను ఎత్తివేయనుంది. అలాగే పోర్ట్, ఎయిర్ కార్గోలాంటి ఇతర కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి. -
గ్యాస్ మంట
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ఎల్పీజీ ధర అమాంతం పెరిగింది. సిలిండర్‌పై ఒక్కసారిగా రూ.144.5 పెంచుతూ కేంద్రం అసాధారణ నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీలో రూ.714గా ఉన్న సిలిండర్ ధర రూ.858.50కి చేరుకుంది. 2014 జనవరి తర్వాత వంటగ్యాస్ ధర ఇంత భారీస్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదలే ఇందుకు కారణమని సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌కు ఇచ్చే సబ్సిడీని పెంచడం కొంతవరకు ఊరటనిచ్చింది. ఇంతకు ముందు రూ.153.86 రాయితీ ఇవ్వగా దాన్ని రూ.291.48కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (పీఎమ్‌యూవై) లబ్ధిదారులకు సబ్సిడీని రూ.174.86 నుంచి రూ.312.48కు పెంచింది. సాధారణంగా ప్రతినెలా ఒకటో తారీఖున ధరలను సమీక్షిస్తుంటారు. అయితే ఈసారి రాయితీని భారీగా పెంచడంతో అనుమతుల ప్రక్రియలో జాప్యంతో రెండు వారాలు ఆలస్యమైందని అధికారులు తెలిపారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే వంటగ్యాస్ ధర పెంచడం గమనార్హం. కాగా, ఈ పెంపుపై విపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. వంటగ్యాస్ ధరను పెంచుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల జేబులకు చిల్లు పెట్టేలా ఉందని కాంగ్రెస్ పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతోనే కేంద్రం వంటగ్యాస్ ధరను పెంచిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను పెంచడం పేద ప్రజలపై తీసుకున్న ‘క్రూరమైన చర్య’అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అభివర్ణించారు. -
షాకింగ్ : వంటగ్యాస్ ధరకు రెక్కలు..
సాక్షి, న్యూఢిల్లీ : సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర బుధవారం వరసగా ఆరోసారి ఎగబాకింది. మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌కు వరుసగా రూ 144.5, రూ 145 వరకూ పెంచినట్టు ఇండేన్ బ్రాండ్ నేమ్‌తో వంటగ్యాస్‌ను సరఫరా చేసే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. తాజా పెంపుతో సబ్సిడీయేతర ఎల్పీజీ రేట్లు ఢిల్లీలో రూ 858, ముంబైలో రూ 829, చెన్నైలో రూ 881, కోల్‌కతాలో రూ 896కు పెరిగాయి. కాగా ఏటా 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీకి అందచేస్తుండగా, అదనపు సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు, రూపాయి మారకం రేటు ఆధారంగా ప్రభుత్వం నెలవారీ సబ్సిడీలను వినియోగదారులకు అందిస్తోంది. -
తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : నూతన సంవత్సర కానుకగా మహిళలకు తీపికబురు అందింది. వంట గ్యాస్ ధరను సిలిండర్‌కు రూ 5.91 మేరకు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. నెలరోజుల వ్యవధిలో వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం ఇది రెండోసారి కావడం గమనార్హం. తగ్గించిన వంట గ్యాస్ ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. డిసెంబర్ 1న సబ్సిడీతో కూడిన వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ 6.52 మేర తగ్గించారు. జూన్ నుంచి ఆరు సార్లు వరుసగా సిలిండర్ ధర పెంపు తర్వాత తొలిసారిగా డిసెంబర్ 1న ధరలు దిగివచ్చాయి. కాగా సబ్సిడీయేతర సిలిండర్ ధరను రూ 120.50 తగ్గించినట్టు ఐఓసీ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి విలువ బలపడటంతో వంట గ్యాస్ ధరలు దిగివచ్చాయని ఐఓసీ వెల్లడించింది. -
బండ బాదుడు
సాక్షి,సిటీ బ్యూరో: మహానగరంలో ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.. సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో రీఫిల్ నిర్ణీత ధరకంటే అదనంగా వసూలు చేస్తున్నారు. వినియోగదారులు సిలిండర్ ధరపై డెలివరీ బాయ్స్‌కు అదనపు చెల్లించేది చిల్లర రూపాయిలు కదా.. అనుకొని తేలికగా తీసుకుటుండంతో అది కాస్తా డిమాండ్‌గా మారింది. ఫలితంగా అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం సిలిండర్ రీఫిల్ ధర రూ.667.50 ఉండగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తోంది రూ.690లు. అంటే నిర్ణీత ధర కంటే రూ.22.50 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇందు కోసమే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు బిల్లుల వసూళ్లలో స్వైపింగ్ మిషన్ జోలికి వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు తూట్లు గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. రీఫిల్ డోర్ డెలివరీ భారాన్ని డెలివరి బాయ్స్‌పై వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ఎల్పీజీ వంట గ్యాస్ నిర్ణీత ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, గ్యాస్, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)లతో కలుపుకొని బిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల నిర్ధేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులకు సిలిండర్ సరఫరా భారాన్ని డెలివరీ బాయ్స్‌పై పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉండగా కొందరు నామమాత్రంగా వేతనాలు అందిస్తున్నారు, మరికొందరు సిలిండర్ డెలివరీపై కమీషన్ మాత్రమే ఇస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడం సర్వ సాధారణంగా మారింది. నిబంధన ప్రకారం బాయ్స్ డోర్ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువు పరిమాణాన్ని వినియోగాదారులకు చూపించాలి. అయితే ఈ విధానం ఎక్కడా అమలవుతున్న దాఖలాలు కానరావడం లేదు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు ధ్యాస తప్ప బరువు చూపించాలన్నా.. నిబంధనలను డెలివరీ బాయ్స్ మరిచి పోయారు. నిబంధనలివీ. వినియోగదారుడు ఆన్లైన్లో గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ చేసి డోర్ డెలివరీ చేయాలి ఏజెన్సీ నుంచి 5 కిలో మీటర్ల వరకు ఉచితంగా డోర్ డెలవరీ ఇవ్వాలి. ఏజెన్సీ నుంచి 6 కిలో మీటర్ల నుంచి 15 కిలో మీటర్లు ఉంటే రవాణ చార్జీల పేరిట రూ.10 వసూలు చేయాలి. 16 –30 కిలో మీటర్లు దూరం ఉంటే రవాణా చార్జీలు పేరిట రూ. 15 వసూలు చేయాలి వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి, గ్రేటర్లో వంటగ్యాస్ వినియోగదారులు ః 29.18 లక్షలు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు ః 115 ప్రతిరోజు గ్యాస్ బుకింగ్ ః 80 వేలు ప్రతిరోజు సిలిండర్ సరఫరా ః 60 వేలు డెలివరీ బాయ్స్ ః 1150 ప్రస్తుతం వంటగ్యాస్ నిర్ణీత ధర ః రూ. 667.50 వినియోగదారుడు చెల్లించాల్సింది ః రూ. 667.50 డెలివరీ బాయ్స్ వసూలు చేస్తోంది ః రూ. 690 వినియోగదారుడిపై అదనపు భారం ః రూ.22.50 -
గ్యాస్ సబ్సిడీకి డిక్లరేషన్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ‘మీ ఎల్పీజీ వంట గ్యాస్‌పై సబ్సిడీ కొనసాగాలా? అయితే మీ వార్షిక ఆదాయంపై తక్షణమే హామీ (డిక్లరేషన్) పత్రాన్ని డిస్ట్రిబ్యూటర్‌కు సమర్పించండి. లేదంటే www.mylpg.in లో లాగిన్ అయి ఆన్లైన్లో డిక్లరేషన్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు మించి ఉన్న కుటుంబాలకు వంట గ్యాస్ రాయితీని నిలిపివేయాలని ఆదేశించింది’... అంటూ ప్రధాన ఆయిల్ కంపెనీల నుంచి గ్యాస్ వినియోగదారుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారం అందుతోంది. తాజా నిబంధనలతో వార్షికాదాయం రూ.10 లక్షలు మించిన కుటుంబాలకు వంటగ్యాస్‌పై రాయితీకి కత్తెర పడనుంది. ఆయిల్ కంపెనీలు ఆధార్ సీడింగ్, ఐటీ శాఖ సహకారంతో అధిక ఆదాయ వర్గాలను గుర్తించాయి. వినియోగాదారుల నుంచి డిక్లరేషన్ రాబట్టేందుకు చర్యలు చేపట్టాయి.