‘మీ ఎల్పీజీ వంట గ్యాస్‌పై సబ్సిడీ కొనసాగాలా? అయితే మీ వార్షిక ఆదాయంపై తక్షణమే హామీ (డిక్లరేషన్) పత్రాన్ని డిస్ట్రిబ్యూటర్‌కు సమర్పించండి.
సాక్షి, హైదరాబాద్: ‘మీ ఎల్పీజీ వంట గ్యాస్‌పై సబ్సిడీ కొనసాగాలా? అయితే మీ వార్షిక ఆదాయంపై తక్షణమే హామీ (డిక్లరేషన్) పత్రాన్ని డిస్ట్రిబ్యూటర్‌కు సమర్పించండి. లేదంటే www.mylpg.in లో లాగిన్ అయి ఆన్‌లైన్‌లో డిక్లరేషన్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు మించి ఉన్న కుటుంబాలకు వంట గ్యాస్ రాయితీని నిలిపివేయాలని ఆదేశించింది’... అంటూ ప్రధాన ఆయిల్ కంపెనీల నుంచి గ్యాస్ వినియోగదారుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారం అందుతోంది.
తాజా నిబంధనలతో వార్షికాదాయం రూ.10 లక్షలు మించిన కుటుంబాలకు వంటగ్యాస్‌పై రాయితీకి కత్తెర పడనుంది. ఆయిల్ కంపెనీలు ఆధార్ సీడింగ్, ఐటీ శాఖ సహకారంతో అధిక ఆదాయ వర్గాలను గుర్తించాయి. వినియోగాదారుల నుంచి డిక్లరేషన్ రాబట్టేందుకు చర్యలు చేపట్టాయి.