మాయదారి మల్లిగాడితో రొమాన్స్
‘సీమ టపాకాయ్’, ‘అవును’ తదితర చిత్రాల్లో నటించి తెలుగులో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న పూర్ణ, సుధీర్‌బాబుకి జోడీగా చేయబోతున్నారు. ‘మాయదారి మల్లిగాడు’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 28న మొదలు కానుంది. హనుమ ముప్పరాజు దర్శకత్వంలో యం.రేవన్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్ కలబోతతో పూర్తిస్థాయి వినోదభరితంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు, పూర్ణల రొమాన్స్ ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రతన్, కెమెరా: బీఎల్ సంజయ్.