స్వయం నియంత్రణ ముఖ్యం
మీడియాకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచన
బెంగళూరు: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మాధ్యమాలు స్వ యం నియంత్రణను కలిగి ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. గ్లోబల్ క మ్యూనికేషన్ అసోషియేషన్ ఆధ్వర్యంలో గురువారమిక్కడ నిర్వహించిన ‘మాధ్యమ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు-పరిష్కారా లు’ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. మీడియా చేసే విమర్శలను ప్రభుత్వం పూర్తిగా సకారాత్మకంగా స్వీకరిస్తుందని అన్నారు. మీడియాకు సై తం తనదైన స్వాతంత్య్రం ఉండాలని తాను కూడా నమ్ముతానని, అయి తే అదే సందర్భంలో మీడియా సైతం వాస్తవ అంశాలను ప్రజలకు చెప్పేందుకే ఎక్కువ ఆ సక్తి చూపాల్సిన అవస రం ఉందని పేర్కొన్నారు. ఇక పత్రికలతో పోలి స్తే ఎలక్ట్రానిక్ మీడియా తన బ్రేకింగ్ న్యూస్‌లతో సమాజంలో అశాంతిని రేకెత్తిస్తోందని అన్నారు. ఇక ఇదే సందర్భంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా సైతం మీడియా పట్ల తన మార్గనిర్దేశకాలను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కార్యక్రమంలో ప్రసార భారతి అధ్యక్షుడు సూర్యప్రకాష్, మంత్రి రోషన్‌బేగ్ పాల్గొన్నారు.
శెట్టర్‌పై విరుచుకుపడ్డ సిద్ధు
సమావేశం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్‌పై విరుచుకుపడ్డారు. అత్యాచార నిందితులను ఆయన పక్కనే పెట్టుకొని ప్రభుత్వం అత్యాచారాలను సమర్థిస్తోందం టూ విమర్శ లు చేయడం పూర్తిగా హాస్యాస్పదమని అన్నారు. బీజేపీలోని హరతాళ్ హాల ప్ప, జీవరాజ్, రామదాస్ వీరంతా అత్యాచార నిందితులు కాదా అని ప్రశ్నించారు. వారిని పక్కనే పెట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చే యడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ముందుగా తమ పార్టీలోని వ్యక్తులను సరిచేసి తర్వాత మాట్లాడాలని సూచించారు.