Maa Inti Mahalakshmi
-
‘మా ఇంటి’కి రావా.. ‘మహాలక్ష్మి’!
సాక్షి, మచిలీపట్నం : బాలిక భవితకు బాటలు వేయాలన్న తలంపుతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ చేసిన బంగారు తల్లి (ప్రస్తుతం ‘మా ఇంటి మహాలక్ష్మి’) పథకానికి బాలారిష్టాలు వీడటం లేదు. ప్రభుత్వాలు మారా యి.. పథకం పేరు మారింది.. కానీ బాలిక భవి ష్యత్ మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పథకానికి మంగళం పాడే దిశగా అడుగులు పడ్డాయి. వెరసి మూడున్నరేళ్లుగా పథకంలో లబ్ధి పొందేందుకు దరఖాస్తులు చేసుకునే వెబ్సైట్ తెరుచుకోకుండా పోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. దీంతో జిల్లావ్యాప్తంగా 22 వేల మంది దరఖాస్తు చేసి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. బంగారు తల్లి పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలో ఒక్కొక్కరికి రూ.2,500 జమ చేసిన డబ్బులు మినహా మళ్లీ నయా పైసా కూడా ఇవ్వలేదు. పథకం ఉద్దేశం ఏంటంటే.. బాలికా శిశు మరణాలు, బాల్య వివాహాలను అరికట్టి బాలికల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాలికా సంరక్షణ పథకం ప్రవేశపెట్టారు. ఒక ఆడపిల్లతో ఆపరేషన్ చేయించుకున్న పేదలకు రూ.లక్ష, ఇద్దరు ఆడ పిల్లలకు ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు రూ.30 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన మరణాంతరం పలు ఘటనలు, మార్పులు చోటు చేసుకున్నాయి. మహానేత పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2013 మే 1 వ తేదీన బంగారు తల్లి బాలికా అభ్యుదయ సాధికారిత చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఒకే తల్లికి జన్మించిన మొదటి ఇద్దరు ఆడ పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. అర్హులు.., అందే సాయం! పుట్టిన పాప జనన ధ్రువీకరణ పత్రం, తల్లి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఐసీడీఎస్, ఐకేపీ ద్వారా అర్హులను ఎంపిక చేసి పాప పుట్టిన మరుక్షణమే తొలి విడతగా రూ.2,500, రెండేళ్ల రెమ్మూనరేషన్, వైద్య సేవల కోసం ఏడాదికి రూ.వెయ్యి మంజూరు చేస్తారు. పాపకు 3, 4, 5 ఏళ్ల వయసుకు రాగానే పౌష్టికాహారం నిమిత్తం ఏడాదికి రూ.1,500, విద్యాభ్యాసం నిమిత్తం ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి రూ.2 వేలు అందజేస్తారు. విద్యాభ్యాసం నిమిత్తం 6, 7, 8 తరగతుల్లో రూ.2,500.. 9, 10 తరగతుల్లో రూ.3,000, ఇంటర్లో ఏడాదికి రూ.3,500, డిగ్రీలో ఏడాదికి రూ.4 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. డిగ్రీ పూర్తయిన తర్వాత రూ.లక్ష, ఇంటర్‌లోనే చదువు ఆపేస్తే రూ.50 వేలు చొప్పున జమ చేయాలని నిర్ణయించారు. నాలుగేళ్లుగా ముప్పుతిప్పలు.. పథకం ప్రారంభ సమయంలో జిల్లాలో 22 వేల మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదటి విడత పారితోషికంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున జిల్లావ్యాప్తంగా రూ.5.50 కోట్లు మంజూరు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అనంతరం ఎన్నికలు నిర్వహించడం.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పథకం అమలు విషయమై పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పథకం ప్రారంభంలో దరఖాస్తు చేసుకున్న వారికే సాయం అందే సూచనలు కనిపిం చడం లేదు. మూడున్నరేళ్లుగా వేలాది మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన వారు వెబ్సైట్ ఎప్పుడు తెరుచుకుంటుందా? తమ పిల్లల పేర్లు నమోదు చేసుకుందామా? అని ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులపై స్పష్టత కరువు.. తొలుత ఐకేపీ ఆధ్వర్యంలో పథకం అమలవుతుందని అధికారులు స్పష్టీకరించారు. అనంతరం ఐసీడీఎస్ ద్వారా సాయం అందుతుందని, ఆ మేరకు విధి విధానాలను సైతం రూపకల్పన చేశామని పాలకులు, అధికారులు సెలవిచ్చారు. తీరా చూస్తే నాలుగేళ్లుగా వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. ఐకేపీ అధికారులను ప్రశ్నిస్తే తమ పరిధిలో లేదని, ఐసీడీఎస్ అధికారులు సైతం అది తమ పథకం కాదని సమాధానమిస్తుండటంతో లబ్ధిదా రులు తమ గోడు ఎవరి వద్ద వెళ్ల బోసుకోవాలా? అని ఆందోళన చెందుతున్నారు. విధి విధానాలురూపొందాల్సి ఉంది పథకం ఏ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయాలి, తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి విధి విధానాలు విడుదల కావాల్సి ఉంది. ఈ ఏడాది లబ్ధిదారులకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. నిధులు విడుదలైన వెంటనే అర్హులకు అందేలా చూస్తాం. – కృష్ణకుమారి, ఐసీడీఎస్ పీడీ -
‘మా ఇంటి మహాలక్ష్మి’కి మంగళం..!
విజయనగరం ఫోర్ట్: డ్వాక్రా మహిళలను రుణాల భారంతో ముంచేసిన చంద్రబాబు సర్కారు.. ఆడపిల్లలకు ఆధారమైన బంగారు తల్లి పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా పేరుమార్చి మంగళం పాడేసింది. నాలుగేళ్లుగా ఒక్క పైసాను కేటాయించకుండా ఆడబడ్డలకు ఆదరవు లేకుండా చేసేసింది. పిల్లల తల్లిదండ్రులను ఆవేదనలోకి నెట్టేసింది. ఆడ పిల్లలను కన్న తల్లిదండ్రులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బాలికా సంరక్షణ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఒక ఆడపిల్ల పుడితే రూ.లక్ష, ఇద్దరు పిల్లలు పుడితే రూ.60 వేలు చొప్పన ఇచ్చేవారు. అయితే, వైఎస్సార్ మరణానంతరం గద్దెనెక్కిన కిరణ్ సర్కార్ బాలికా సంరక్షణ పథకాన్ని బంగారుతల్లి పథకంగా మార్చింది. చట్టాన్ని సైతం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం మాఇంటి మహాలక్ష్మి పథకంగా పేరు మార్చి ఒక్క పైసా నిధులు విదల్చకుండా మరుగున పడేసింది. నాలుగేళ్లుగా పథకానికి విధివిధానాలు ఖరారు చేయలేదు. దరఖాస్తు చేసేందుకు వీలులేకుండా చేసేసింది. పథకం అమలైతే... బంగారు తల్లి పథకం అమలులో ఉన్న సమయంలో ఆడపిల్లల జనన ధ్రువపత్రంతో దరఖాస్తు చేసుకున్న వెంటనే రూ.2500 చెల్లించేవారు. ఇలా రెండేళ్ల వరకు ఇస్తారు. 3 నుంచి 5 ఏళ్లు లోపు వారికి అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఏటా రూ.1500 చెల్లించాలి. 6 నుంచి 10 ఏళ్ల వరకు ఏటా ప్రభుత్వ పాఠశాలల ద్వారా రూ.2 వేలు ఇవ్వాలి. 11 నుంచి 13 ఏళ్ల వరకు 6,7 తరగతి చదివే సమయంలో ఏటా రూ.2500 చెల్లించాలి. 14 నుంచి 15 ఏళ్లలోపు వారికి ఏటా రూ.3,500, 16 నుంచి 17 ఏళ్లు వరకు ఇంటర్ చదివే సమయంలో ఏటా రూ.3,500, 18 నుంచి 21 ఏళ్ల వరకు ఏటా రూ.4 వేలు, 21 ఏళ్లు వచ్చిన అనంతరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధిస్తే రూ.5 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే రూ.1,55,500 అందించాలి. 30 వేల మంది ఎదురు చూపు ఈ నాలుగు ఏళ్ల కాలంలో జిల్లాలో సుమారు 30 వేలు మంది ఆడపిల్లలు జన్మించారు. వారంతా పథకోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా వారికి పథకం అందకుండా పోయింది. విధివిధానాలు లేవు.. మా ఇంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం నుంచి రాలేదు. దరఖాస్తుల స్వీకరణకు అవకాశం లేదు.– ఏఈ రాబర్ట్స్, పీడీ, ఐసీడీఎస్ -
పత్తాలేని పథకం
♦ ‘మా ఇంటి మహాలక్ష్మి’ ఎక్కడున్నావమ్మా..? ♦ బంగారుతల్లి పథకం పేరు మార్పుతో సరిపెట్టిన టీడీపీ ప్రభుత్వం ♦ ఇంత వరకు విధివిధానాలు ఖరారు చేయని వైనం ♦ దరఖాస్తులు స్వీకరించే నాథుడు లేడు.. ♦ ఆడపిల్లలకు చేకూరని లబ్ధి ♦ పథకాన్ని నీరుగార్చొద్దంటున్న తల్లిదండ్రులు కారంచేడు : ఆడ శిశువులను పురిట్లోనే చిదిమేస్తున్న దారుణ ఘటనలను నివారించేందుకు.. బాలికల జీవితానికి భరోసా కల్పిందుకు ఉద్దేశించిన ప్రభుత్వ పథకం జాడ కనిపించడం లేదు. బాలికల వివాహ సమయం వరకు వివిధ దశలుగా తల్లిదండ్రులకు ఆర్థిక చేయూతనివ్వడం ఈ పథక ం ఉద్దేశం. 2013లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించిన బంగారుతల్లి పథకం టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమలుకు నోచుకోలేదు. 2014లో పథకం పేరును ‘మా ఇంటి మహాలక్ష్మి’ అని మార్చిన చంద్రబాబు సర్కారు కనీసం ఇప్పటి వరకు విధివిధానాలు ప్రకటించలేదు. ఆడపిల్లల లబ్ధి కోసం అర్జీలు స్వీకరించే నాధుడు లేరు. కనీసం ఈ పథకం ఏశాఖ పర్యవేక్షణలో అమలవుతుందో కూడా తెలియని అయోమయ స్థితి ఉందంటే బాలికల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్ధమవుతుంది. ఆందోళనలో తల్లిదండ్రులు.. ఈ పథకం మొదటి రెండు కాన్పులలో జన్మించిన ఆడపిల్లలకు వర్తిస్తుంది. బాలికలు డిగ్రీ పూర్తి చేసే వరకు అంటే 21 ఏళ్లు నిండే వరకు మొత్తం తొమ్మిది విడతలుగా రూ. 2.16 లక్షలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధ చేసింది. గత రెండేళ్లుగా ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదు. కనీసం అర్జీలు ఏ శాఖ అధికారులకు అందజేయూలో కూడా తెలియడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలను చదివించేందుకు ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా వుండేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం నీరుగారిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఐసీడీఎస్‌కు బదిలీ చేశారు.. బంగారుతల్లి పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మార్చారు. 2014 నుంచి ఈ పథకం ఐసీడీఎస్‌కు బదిలీ చేశారు. అర్జీలు కూడా అంగన్వాడీల ద్వారా సేకరిస్తారని మాకు చెప్పారు. అప్పటి నుంచి మేం అర్జీలు స్వీకరించడం లేదు. - తేళ్ళ మోహనరావు,ఏపీఎం, కారంచేడు జీవో రాలేదు.. మా ఇంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఆర్జీలు ఐసీడీఎస్ కార్యాలయంలో ఇవ్వమని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దానికి సంబంధించిన సాప్ట్వేర్ గానీ, జీవో కానీ మాకు పంపలేదు. అందుకే మేం అర్జీలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందితే స్వీకరిస్తాం. - సీడీపీవో విజయగౌరి, పర్చూరు. -
మా ఇంటికి రాని మహాలక్ష్మి
భ్రూణహత్యలను నివారించేందుకు, బాలికలకు రక్షణ కల్పించేందుకు, వారు ఉన్నత చదువులు చదువుకొనేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రస్తుతం ఆడబిడ్డలకు అక్కరకు రావటం లేదు. పథకాన్ని టీడీపీ ప్రభుత్వం సక్రమంగా అమలుచేయలేకపోతుంది. ఈ పథకానికి ‘మా ఇంటి మహాలక్ష్మిగా’ పేరు మార్చినప్పటికీ పథకం నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. ఫలితంగా వేలమంది ఆడపిలల్లకు రక్షణ లేకుండా పోతుంది. * బంగారు తల్లి పథకానికి మా ఇంటి మహాలక్ష్మిగా పేరుమార్చిన టీడీపీ ప్రభుత్వం * ఆన్లైన్లో లోగోకే పరిమితం ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్టమెంట్ ద్వారా పథకం అమలు చేయాలని వచ్చిన ఉత్తర్వులను పట్టించుకోని వైనం * కమిషనర్ల స్థాయిలోనే ఉత్తర్వులు నిలిచిపోయాయని చెబుతున్న ఐసీడీఎస్ సిబ్బంది పొందూరు: మా ఇంటి మహాలక్ష్మి పథకంపై నీలి నీడలు అలముకొన్నాయి. మే 5, 2013 తర్వాత పుట్టిన బాలికలకు మా ఇంటి మహాలక్ష్మిగా మారిన బంగారు తల్లి పథకం వర్తిస్తుంది. సమర్థంగా అమలు జరగాల్సిన ఈ పథకం ప్రభుత్వం చేతిలో బందీగా ఉంది. నిర్వహణ సరిగా లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. దీనిపై స్పందించాల్సిన మంత్రులు, అధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరించడం దురదృష్టకరం. మా ఇంటి మహాలక్ష్మి పథకంలో చిన్నారుల నమోదు బాధ్యత ఎవరిది అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పుట్టిన బాలికల వివరాలను వెలుగు కార్యాలయంలో నమోదు చేసేవారు. ప్రస్తుతం వారు కొనసాగించటం లేదు. ఆ పథకం వెలుగు నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు బదిలీ చేశారని వెలుగు అధికారులు జీవోలు చూపిస్తున్నారు. 2015 ఫిబ్రవరి 18న బంగారు తల్లి పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా మార్చినట్టు సింగిల్ ఫైల్ నంబర్ 15 తెలుపుతుంది. 2015 ఏప్రిల్ 30న విడుదల చేసిన జీవోఎంఎస్ నంబర్ 50 ప్రకారం వెలుగు నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలెప్మెంట్ డిపార్టమెంట్‌కు బదిలీ చేసినట్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇవన్నీ పక్కాగా ఆన్లైన్లో పొందుపరచినప్పటికీ ఉమెన్ అండ్ చైల్డ్ డవలప్మెంట్ అధికారులు మాత్రం ఉత్తర్వులు కమిషనర్లు వరకే పరిమితమయ్యాయని, పథకంలో ఆడపిల్లల నమోదుపై ఎటువంటి ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మహాలక్ష్మిలకు భరోసా ఏది? పుట్టిన ఆడబిడ్డలకు భరోసా లేకుండా పోయింది. మా ఇంటి మహాలక్ష్మి పథకం ఉన్నప్పటికీ అరకొరగానే బాలికల నమోదు జరిగింది. నమోదు చేసిన వారిలో కొందరి ఆధార్ కార్డు అప్లోడ్ జరగలేదని, ఏపీఎం, డీపీఎంలు అప్లోడ్ చేయాల్సి ఉందని వారిని అర్హత లేకుండా చేశారు. బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టిన నుంచి ఇప్పటివరకూ శ్రీకాకుళం జిల్లాలో 15,658 బాలికలను నమోదు చేశారు. వారిలో 14,865 మందిని అర్హులుగా గుర్తించారు. 793 మందిని వివిధ కారణాలతో అర్హత లేదని పెండింగ్‌లో పెట్టారు. గత రెండేళ్లలో పుట్టిన బాలికలను ఈ పథకంలో నమోదు చేసేందుకు వేలాది మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. వెలుగు, ఐసీడీఎస్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆడ శిశువు పుట్టిన నుంచి డిగ్రీ చదువుకొనేంత వరకు ఈ పథకం కింద వారికి రూ. 2.15 లక్షలను ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఆడబిడ్డను పథకంలో నమోదు చేసేందుకు తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరగా ఈ పథకం పని చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను ఆడపిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘ఆడపిల్ల’ పథకమంటే అంత చులకనా..!
విజయనగరం అర్బన్ : ఆడపిల్లల సంక్షేమం కోసం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బంగారు తల్లి’ పథకం అమలు తీరు అధ్వానంగా తయారైంది. జిల్లాలో ఆది నుంచీ అంతంతమాత్రంగానే అమలవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ పథకం పూర్తిగా మూలకు చేరింది. పథకం పేరును ‘మా ఇంటి మహాలక్ష్మి’గా మార్చుతామన్న ప్రస్తుత ప్రభుత్వం, కనీసం దరఖాస్తులు తీసుకోవడానికి ముందుకురావడం లేదు. సర్వర్లు పనిచేయకపోవడంతో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. బంగారు తల్లి పథకం కోసం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 12 వేల 103 మంది పేర్లు నమోదు అయ్యాయి. వాటిలో తొలివిడతగా కేవలం 7,020 మంది మాత్రమే నగదును బ్యాంక్ ఖాతాలో జమచేశారు. వీరిలో దాదాపు సగం మందికి ఇంకా బాండ్లు రాలేదని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లా వ్యా ప్తంగా 5,083 దరఖాస్తులను స్వీకరించి పెండింగ్‌లో ఉంచారు. నాలుగునెలలు అయినా వాటిపై స్పందన లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 2013 మేలో పుట్టిన పాపకు రెండో ఏడాది నిధులు రావా ల్సి ఉంది. అయితే నాలుగునెలలు గడిచినా ఇంకా ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ పథకా న్ని ఉంచుతారోలేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలు నిబంధనలతో అవస్థలు గతంలో ఏ పథకానికి విధించని నిబంధనలను బంగారు తల్లి పథకానికి అమలు చేస్తుండటంతో ఆడ పిల్లల తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. నిబంధనల ప్రకా రం... ఈ పథకం కోసం తల్లుల పేరుమీద బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలి. అందుకోసం రెండు గుర్తింపు పత్రాలను బ్యాంక్‌లో అందించాలి. అయితే మహిళల కు పెళ్లికాకముందు ఒక ఇంటి పేరు, పెళ్లి తరువాత మరో ఇంటిపేరు ఉండటంతో వారు బ్యాంక్ ఖాతా ప్రారంభించడం కష్టంగా మారింది. అంతేగాకుండా లబ్ధిదారులు కచ్చితంగా తెల్లరేషన్ కార్డుదారులై ఉండాలి. ఆధార్‌కార్డు కూడా కలిగి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ఇటీవల కాలంలో తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో తెల్లకార్డులేని కారణంగా అర్హులైనవారు కూడా బంగారు తల్లి పథకాన్ని పొందలేకపోతున్నారు. అన్నీ ఉన్నప్పటికీ ఐకేపీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణం, అదే విధంగా జనన ధ్రువీ కరణపత్రాల మంజూరులోకూడా పలు సమస్యలు ఎదురవుతుండడంతో మరికొంత మంది ఈపథకానికి దూరమవుతున్నారు. ప్రతి ఆడపిల్లకూ బంగారు భవిష్యత్ అం దించాలనే ఉద్దేశ్యంతో గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా 2013 జూన్ 19వ తేదీన బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టారు. 2013 మే ఒకటో తేదీ నుంచి జన్మించిన ఆడపిల్లలకు ఈ పథకం వర్తించేలా చర్యలు చేపట్టారు. లబ్ధిదారులు తెల్లకార్డుదారులైన ఉండాలి. ఈ పథకం కింద ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తిచేసేంత వరకూ (21 సంవత్సరాలు వచ్చేంత వరకూ) ఏటా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. శిశువు పుట్టగానే రూ.2,500 టీకాల నిమిత్తం వెయ్యి రూపాయలు, 1, 2 సంవత్సరాలకు ఏడాదికి వెయ్యి రూపాయలు, 3, 4, 5 సంవత్సరాలకు ఏడాదికి రూ.1,500 అందిస్తారు. బాలికను పాఠశాలకు పంపితే 5వ తరగతి వరకు ప్రతి ఏడాది 2వేల రూపాయలు అందిస్తారు. 6,7,8 తరగతుల్లో ప్రతి ఏడాది రూ.2,500, అదేవిధంగా 9,10 తరగతుల్లో ప్రతి ఏడాది రూ.3 వేలు, ఇంటర్ వరకు చదివిస్తే ఏడాదికి రూ.3,500 అకౌంట్లో జమచేస్తారు. ఇంటర్ పూర్తి చేస్తే రూ.50 వేలు, డిగ్రీ పూర్తయిన తరువాత లక్ష రూపాయలు అందిస్తారు.అయితే, చెప్పుకునేందుకు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మత్రం ఆశించిన స్థాయిలో పథకం అమలు జరగడం లేదు.