‘నిర్భయ’ ప్రేరణతో గులాబి
‘‘ఇటీవల కాలంలో స్త్రీలపై అత్యాచారాలు అధికమైపోయాయి. నిర్భయ సంఘటన తర్వాత ఆడవాళ్లు దుర్గామాతలుగా మారారు. ఆ ప్రేరణతో సందేశాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలచడం అభినందనీయం’’ అని మాదాల రవి అన్నారు. గోగిశెట్టి క్రియేషన్స్ పతాకంపై మాదాల కోటేశ్వరరావు స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గులాబి’ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి పాటల సీడీని, నిర్మాత యెక్కలి రవీంద్రబాబు ప్రచారం చిత్రాలను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘నిర్భయ సంఘటన తర్వాత నేను, నా మిత్రుడు కలిసి ఎంతో చర్చించి ఈ కథ తయారు చేశాం. చిత్రీకరణ పూర్తయింది. పవన్‌శేష మంచి సంగీతం ఇచ్చారు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా బసిరెడ్డి, బాపిరాజు, వైభవ్, యశోకృష్ణ పాల్గొన్నారు.