'టీఆర్ఎస్తో పొత్తు ఉండదు'
హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా కింద జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు పాల్పడుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీలను అధికార పార్టీ బెదిరింపులకు గురిచేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని... టీఆర్ఎస్తో ఎలాంటి అవగాహన ఉండదని భట్టి తేల్చి చెప్పారు. మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని వీడతారనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దానంకు కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఇచ్చిందని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు.