Madhu Yashkie
-
పోలింగ్ శాతం ఎలా పెరిగింది?
జగిత్యాల: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలపై పలు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. గంటలోపే 14 శాతం పోలింగ్ ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌లోని ఓ హోటల్లో ఈవీఎంను పట్టుకున్నారని వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరిగిన రోజునే ఈవీఎంలను తరలించాల్సింది పోయి 15వ తేదీ రాత్రి తరలించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. జగిత్యాల, నిజామాబాద్ కలెక్టర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్ ఓడిపోలేదని వ్యాఖ్యా నించారు. లక్ష్మణ్‌కుమార్ ఓడిపోవడంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ‘ప్రజాగొంతుకైన కలానికి సంకెళ్లా?’ అనే పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం జగిత్యాల కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మకు వినతిపత్రాలు అందించారు. -
టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ‘రావు’ల సమితి
తెలంగాణ జాతి రత్నాలం మేమే టీ కాంగ్ ఎంపీల వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: అసలు సిసలైన తెలంగాణ జాతి రత్నాలం తామేనని టీ కాంగ్రెస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంటు లోపల, బయట తాము ప్రశంసనీయమైన పాత్ర పోషించామన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా ఆ కుటుంబానికి చెందిన నలుగురు నేతలు తెలంగాణ విధ్వంసకారులని అభివర్ణించారు. స్థానిక గాంధీభవన్‌లో మంగళవారం టీ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, జి.వివేక్, సిరిసిల్ల రాజయ్యలతో కలిసి నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ ‘‘మేం నలుగురం తెలంగాణ జాతి రత్నాలం. 2009 నుంచి మా నినాదం తెలంగాణయే. తెలంగాణ ప్రకటన వచ్చే వరకు కేసీఆర్‌కు కబురే లేదు. ఇప్పుడు ఆ నలుగురు(కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావు) తెలంగాణ విధ్వంసకారులుగా మారారు. తెలంగాణ పునర్నిర్మాణమంటూ దొరల పాలన తేవాలని చూస్తున్నారు. అసలు టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రావుల సమితి’’అని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్తో అవసరం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని నొక్కి చెప్పారు.