టీఆర్‌ఎస్ అంటేనే తెలంగాణ ‘రావు’ల సమితి | TRS Means Telangana Rao's Samiti | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ అంటేనే తెలంగాణ ‘రావు’ల సమితి

Published Wed, Apr 16 2014 2:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్ అంటేనే తెలంగాణ ‘రావు’ల సమితి - Sakshi

టీఆర్‌ఎస్ అంటేనే తెలంగాణ ‘రావు’ల సమితి

  • తెలంగాణ జాతి రత్నాలం మేమే టీ కాంగ్ ఎంపీల వ్యాఖ్య    
  • సాక్షి, హైదరాబాద్: అసలు సిసలైన తెలంగాణ జాతి రత్నాలం తామేనని టీ కాంగ్రెస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంటు లోపల, బయట తాము ప్రశంసనీయమైన పాత్ర పోషించామన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సహా ఆ కుటుంబానికి చెందిన నలుగురు నేతలు తెలంగాణ విధ్వంసకారులని అభివర్ణించారు.
     
    స్థానిక గాంధీభవన్‌లో మంగళవారం టీ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, జి.వివేక్, సిరిసిల్ల రాజయ్యలతో కలిసి నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ ‘‘మేం నలుగురం తెలంగాణ జాతి రత్నాలం. 2009 నుంచి మా నినాదం తెలంగాణయే. తెలంగాణ ప్రకటన వచ్చే వరకు కేసీఆర్‌కు కబురే లేదు.
     
    ఇప్పుడు ఆ నలుగురు(కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావు) తెలంగాణ విధ్వంసకారులుగా మారారు. తెలంగాణ పునర్నిర్మాణమంటూ దొరల పాలన తేవాలని చూస్తున్నారు. అసలు టీఆర్‌ఎస్ అంటేనే తెలంగాణ రావుల సమితి’’అని విమర్శించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో అవసరం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని నొక్కి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement