mahaanadu
-
టీడీపీ మహానాడు ఓ పెద్ద మాయ
-
టీడీపీ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు..
సాక్షి, అమరావతి : మంగళగిరి ఎమ్మార్వో అమరావతి టీడీపీ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు జారీచేశారు. మహానాడు సందర్భంగా కరోనా వైరస్ నివారణ చర్యలు తీసుకోవాలని బుధవారం నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు కార్యాలయ కార్యదర్శి రమణికి ఆత్మకూరు వీఆర్వో నోటీసులు అందజేశారు. ఈ నోటిసులో ‘‘ రాజకీయ ఫంక్షన్లు, ఇతర సమావేశాలపై ప్రస్తుతం నిషేదం ఉంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా చర్యలకు అర్హుల’’ ని ఎమ్మార్వో పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్‌ను అరికట్టేందుకు విధించిన లాక్డౌన్లో భాగంగా అన్ని సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, విద్య, సాంస్కృతిక, మత వేడుకలు, సమావేశాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చదవండి : బాబు లాక్డౌన్ ఉల్లంఘన పిల్‌పై హైకోర్టులో విచారణ -
బాబు స్పీచ్‌లో... తమ్ముళ్లు బీచ్‌లో
-
బాబు స్పీచ్‌లో... తమ్ముళ్లు బీచ్‌లో
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ విశాఖలో నిర్వహించుకుంటున్న మహానాడుకు వచ్చిన తమ్ముళ్లకు మహానాడు ప్రాంగణం, చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు విరక్తి పుట్టిస్తున్నాయి. దీంతో వారు సాగరతీరానికి వెళ్లిపోతున్నారు. శనివారం నుంచి విశాఖలో జరుగుతున్న మహానాడులో మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. దాదాపు గంటన్నర సేపు సుదీర్ఘంగా ఉపన్యసించారు. చంద్రబాబు ప్రసంగం ఆరంభించిన కాసేపటికే సభ నుంచి కార్యకర్తలు, నాయకులు బయటకు రావడం మొదలెట్టారు. దీంతో సభలో కుర్చీలు చాలావరకు ఖాళీ అయిపోయాయి. బయటకు వచ్చిన వారు భోజనాలు చేసి సాగరతీరానికి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ పరిస్థితిని గమనించిన చంద్రబాబు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమై ‘తమ్ముళ్లూ..! ఇప్పుడే బయటకు వెళ్లకండి.. సాయంత్రం వేళ బీచ్‌కు వెళ్లండి.. మహానాడు ముగిశాక ఒకట్రెండు రోజులు ఇక్కడే ఉండి బీచ్‌తో పాటు అరకు, బొర్రాగుహలు వంటివి చూడండి.. అంతేగాని సభ జరుగుతున్నప్పుడు బయటకు వెళ్లిపోకండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. అయినా అధినేత విన్నపాన్ని ‘తమ్ముళ్లు’ పట్టించుకోలేదు. కార్యకర్తలందరూ తొట్లకొండ, రుషికొండ, భీమిలి తదితర ప్రాంతాలకు వెళ్లిపోయి చీకటిపడే వరకూ అక్కడే గడిపారు. సాక్షాత్తూ అధినేత ప్రసంగాన్నే పట్టించుకోకుండా కార్యకర్తలు వెళ్లిపోతుండడంతో ఆ పార్టీ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు కనిపించడం వారికి మింగుడు పడడం లేదు. ఆది, సోమవారాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తనుందన్న అనుమానంతో ‘తమ్ముళ్ల’ను కట్టడి చేసే పనిలో పడ్డారు. మరోవైపు తొలిరోజు మహానాడుకు చాలా తక్కువ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 30 వేల మంది జనం నిలబడేందుకు వీలుంది. ఈ మైదానంలోని సగం స్థలంలోనే ఏర్పాట్లు చేశారు. అంటే ఈ స్థలంలో గరిష్టంగా చూసుకున్నా 15 వేల మందికి మించి కూర్చునే అవకాశం లేదు. మహానాడు ప్రాంగణంలో కుర్చీలన్నీ ఖాళీగానే కనిపించాయి. మొత్తమ్మీద మహానాడు ఆరంభమైన తొలిరోజున 12, 13 వేలకు మించి పార్టీ శ్రేణులు హాజరు కాలేదని అంచనా వేస్తున్నారు. ఏపీ నేతల రుసరుసలు ఇటీవలే హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ తెలంగాణ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరై ప్రసంగించారు. విశాఖలో జరుగుతున్న మహానాడుకు తెలంగాణ నేతలతో సహా 3,500కు పైగా పార్టీ ప్రతినిధులు హాజరుకావడం.. తెలంగాణ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టడంతో ఏపీకి చెందిన పలువురు నేతలు రుసరుసలాడారు. హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు జరిగింది కదా? దానికి బాబు కూడా వెళ్లారు కదా? మళ్లీ ఇక్కడెందుకు వారి మెహర్బాని అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఇది నానాజాతి నేతల మహానాడు
-
ఇది నానాజాతి నేతల మహానాడు
► మంత్రివర్గంలో నాలుగో వంతు పొరుగు పార్టీల నేతలే ► క్రమశిక్షణ కరువు, అన్ని జిల్లాల్లో వేరు కుంపట్లు ► లోకేష్ ప్రాధాన్యతకే పెద్దపీట సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మహోన్నత ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని వివాదాల వేదికగా మార్చిన, దెయ్యాల కొంపగా అభివర్ణించిన తెలుగుదేశం అక్కడే మూడు రోజులు కొలువుదీరి పార్టీకి దిశాదశ నిర్దేశించుకోనుంది. ద్వంద ప్రమాణాలతో, హామీలకు తిలోదకాలతో, ఓటుకు కోట్లు కేసుతో పలాయనవాదంతో, అవినీతి అక్రమాలతో, పార్టీల ఫిరాయింపుదారులతో జాతీయ తెలుగుదేశం పార్టీ రెండు నాల్కల ధోరణితో తీవ్ర విమర్శల సుడిలో కొట్టుమిట్టాడుతూ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికకు సిద్ధమవుతోంది. తెలంగాణలో పార్టీకి దాదాపు చాపచుట్టేసుకున్న పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు అధికారం కట్టబెట్టి అన్ని జిల్లాల్లో వేరు కుంపట్లకు తావిచ్చింది. 2004కు ముందు వరకు ఎలా ఉన్నా 2014లో అధికారం చేపట్టిన తరువాత, మరీ ముఖ్యంగా భారీ మొత్తాలతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి వారికి పదవులను కట్టబెట్టడం మొదలు చంద్రబాబు క్రమంగా పార్టీపై పట్టుకోల్పోతున్నారని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి కొనుగోలుచేసిన ఆదినారాయణరెడ్డి, అమరనాథరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, అఖిలప్రియలతో పాటు ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం, మండలి బుద్ధప్రసాద్, జూపూడి ప్రభాకర్‌రావు, కారెం శివాజి, పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులతో పాటు మాజీ ఐఏఎస్, తదితర అధికారులకు పదవులు కట్టబెట్టడంపై పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్‌ను ఎమ్మెల్సీ చేయడం, నాలుగు రోజుల్లోనే కీలక శాఖలను అప్పగించడం, ప్రతి అంశాన్ని లోకేష్‌తో ముడిపెడుతూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటాన్ని పార్టీలో అనుభవజ్ఞులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపి అధికారాన్ని కొట్టేసిన చంద్రబాబు ఇప్పుడు లోకేష్‌కు తన స్థానాన్ని కట్టబెట్టడానికి నానా పాట్లు పడుతున్నారని గుసగుసలాడుతున్నారు. రూ.రెండు లక్షల కోట్ల అవినీతితో చెడ్డపేరు... ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాజధాని జపం చేస్తుండటంతో పాటు రూ.రెండు లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడటం పార్టీకి చెడ్డపేరు తెచ్చిందని పార్టీశ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. లోకేష్‌తో పాటు భూకబ్జాలకు పెద్ద ఎత్తున పాల్పడ్డారనే అపవాదులున్న పి.నారాయణ, నక్కా ఆనందబాబు తదితరులకు భూసంబంధిత కమిటీల్లో చోటు కల్పించడం పార్టీలో చర్చనీయాంశాలు అయ్యాయి. పట్టిసీమలో రూ.400 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కాగ్ కడిగేసిన విషయం తెలిసిందే. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన వాటి గురించి చంద్రబాబు పెదవి విప్పకపోవడం ఆ పార్టీలోనే చర్చకు తావిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను వదిలేసుకోవడమంటే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనే పార్టీ శ్రేణులకు అధిష్ఠానం వద్ద స్పష్టమైన జవాబు కూడా లేదు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని హైదరాబాదును ఉన్నఫళంగా వదిలేసి రావడమన్నది పార్టీకి, ఆర్థికంగానూ రాష్ట్రానికి నష్టదాయకమని నాయకులు విశ్లేషిస్తున్నారు. -
పార్టీకే పంగనామాలు...
-
సామాజిక తెలంగాణ కోసం కృషి: ఎల్ రమణ