Mahadeva
-
ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు
ఈరోజు (మంగళవారం) విజయదశమి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దసరా ర్యాలీ నిర్వహించింది. సంఘ్ సభ్యులు నాగ్‌పూర్‌లో ‘పథ సంచాలన్’ (రూట్ మార్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గాయకుడు శంకర్ మహదేవన్ పాల్గొన్నారు. #WATCH | Maharashtra | RSS chief Mohan Bhagwat paid tribute to the founder of the organisation K. B. Hedgewar in Nagpur, at the RSS Vijayadashami Utsav event. Singer-composer Shankar Mahadevan who is the chief guest of the function is also with him. pic.twitter.com/joytMQ3aN6 — ANI (@ANI) October 24, 2023 సంఘ్ ప్రధాన కార్యాలయంలో భగవత్ గాయకుడు మహదేవన్‌కు స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఈ దసరా వేడుకల కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు ఆర్ఎస్ఎస్ సంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్రేవాల్‌కు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నివాళులర్పించారు. -
మహదేవో భవ!
పేరెంట్స్, టీచర్లు, స్కూలు యాజమాన్యాలు.. చదువుల చుట్టూ పరిభ్రమిస్తున్నారే కానీ, పిల్లల చుట్టూ ఎవరూ తిరగడం లేదు. ఇందుకు భిన్నంగా ఒక సరికొత్త మార్గం ఎంచుకున్నాడు మాంజా మహదేవ అనే ఉపాధ్యాయుడు. ఒకప్పుడు వానాకాలం చదువులు అనేవారు. వర్షం వస్తే ఇల్లే స్కూల్. ఇల్లే ఆటస్థలం. ఆ రోజుల్లో పిల్లలని స్కూల్స్‌కి తీసుకు వెళ్లడానికి మాస్టార్లు ఇంటికి వచ్చేవారు. గుమ్మంలో నిలబడి పిల్లల్ని పిలిచి వాళ్లకి తాయిలాలు పెట్టి, పిల్లల్ని చంకనేసుకుని తీసుకెళ్లేవారు. కన్నతండ్రి కంటే ఎక్కువ బాధ్యత తీసుకుని వాళ్లని ఉత్తమ పౌరులుగా తీర్చేవారు. విద్యార్థులు కూడా గురువుల పట్ల గౌరవంగా ఉండేవారు. గురుశిష్యులు ఒకరితో ఒకరు అభిమానంతో కూడిన ప్రేమతో ఉండేవారు. రోజులు మారుతూ వస్తున్నాయి. స్కూల్ బస్సులలో పిల్లల్ని పాఠశాలలకు మోసుకెళ్తున్నారు. దీనివల్ల పిల్లలు గురువుల మధ్య అనుబంధం కొరవడింది. ‘మేము లక్షల ఫీజులు కడుతున్నాం. మా పిల్లల్ని తిట్టే కొట్టే అర్హత లేదు’ అంటున్నారు తల్లిదండ్రులు. పేరెంట్స్, టీచర్లు, స్కూలు యాజమాన్యాలు.. చదువుల చుట్టూ పరిభ్రమిస్తున్నారే కానీ, ఎవరూ పిల్లల చుట్టూ తిరగడం లేదు. ఇందుకు భిన్నంగా ఒక సరికొత్త మార్గం ఎంచుకున్నాడు మాంజా మహదేవ అనే టీచరు. కర్ణాటక ఉడిపి జిల్లా రగిహకలు గ్రామానికి చెందిన మాంజా మహదేవ తను పని చేస్తున్న పాఠశాలలో రోజురోజుకీ విద్యార్థులు తగ్గిపోవడం గమనించాడు. పిల్లలు స్కూల్ కి రావడానికి సరైన రవాణా సౌకర్యం లేదని, అందువల్ల పిల్లలు చదువుకోలేకపోతున్నారని అర్థం చేసుకున్నాడు. ఇంత చిన్న కారణంతో పిల్లల భవిష్యత్తు కుంటు పడడం ఆయనకు బాధ కలిగించింది. రానురాను ఆ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 90 దగ్గర ఆగిపోయింది. తల్లిదండ్రులు కూడా మా ప్రాప్తం ఇంతే అని ఊరుకున్నారు. కానీ నిజమైన గురువుల మనసు ఇందుకు అంగీకరించదు. అందులోనూ మాంజా మహదేవ మరింత బాధపడ్డారు. ఎలాగయినా వారిని పాఠశాలకు రప్పించాలనుకున్నారు. అందుకోసం తన మారుతి వాన్‌ను బయటకు తీసి డ్రైవర్ అవతారం ఎత్తారు! ప్రతి ఉదయం విద్యార్థులని తన కారులో స్కూలుకు తీసుకు వచ్చి, సాయంత్రం మళ్లీ వాళ్లను ఇంటి దగ్గర దింపడం మొదలుపెట్టారు. క్రమంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం మొదలైంది. మాంజా సంతోషానికి అవధులు లేవు. ఇదంతా పరిశీలించిన స్కూల్ డెవలప్మెంట్ మానిటరింగ్ కమిటీ త్వరలోనే ఈ పాఠశాలకు ఒక వ్యాన్ మంజూరుకు ఆలోచిస్తోంది. మాంజాను ఇప్పుడు గ్రామస్థులు దేవుడిగా భావిస్తున్నారు. బడి మానేసిన 20 మంది పిల్లలు.. ఆయన చొరవతో మళ్లీ ఇప్పుడు హాయిగా చదువుకోగలుగుతున్నారు. సాధారణంగా శిష్యులు గురుదక్షిణ చెల్లిస్తారు. ఇందుకు భిన్నంగా ఈ గురువు శిష్య వాత్సల్యం చూపుతూ అపర విశ్వామిత్రుడు అయ్యారు. ఆచార్య దేవో భవ అంటారు. మహదేవో భవ అనాల్సిందే మనం. – రోహిణి -
నిండుకుండ వంటిది నిరాడంబరత
హైందవం నిరాడంబరత అనేది దేహ బాహ్య స్వరూపానికి సంబంధించింది కాదు. అది అంతర్గతమైన లక్షణం. నిరాడంబరత అంటే ఏమీ తెలియని ఒక నిర్లిప్త స్థితి కాదు, అన్నీ తెలిసిన సంపూర్ణ స్థితి. శివుడు, ఆంజనేయుడు, షిర్డీసాయిల నిరాడంబర అభివ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మహాదేవుడు: నివాసం శ్మశానం. కంఠహారం సర్పం. ఆయుధం త్రిశూలం. ఆసనం పులిచర్మం. ఇదీ శివుడి నిరాడంబర బాహ్యరూపం. కానీ, దీని అంతరార్థం వేరు. శివుడు ధరించిన త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు సంకేతం. శరీరంపై సర్పాలు జీవాత్మలు. భస్మం పరిశుద్ధతకు ప్రతీక. ఆసనమైన పులిచర్మం కోరికలను త్యజించమనే సూచిక. వినయ హనుమ: అతి బలవంతుడు హనుమంతుడి జీవన విధానం కూడా ఎంతో నిరాడంబరమైంది. ఎంత శక్తి సంపన్నుడైనా ఎంతో నిరాడంబరంగా ఉన్నాడు. సుగ్రీవుడు, జాంబవంతుల ముందు కూడా వినయంతోనే మెలిగాడు. ‘జై హనుమాన్’ అని ఎక్కడా తనకు జేజేలు కొట్టించుకోలేదు. ‘జై శ్రీరామ్’ అంటూ తన నిరాడంబరతను ప్రకటించుకున్నాడు. బాబా ప్రేమ తత్వం: షిర్డీ సాయిబాబా అత్యంత నిరాడంబర జీవితం గడిపారు. ఒక జుబ్బా, కఫనీ, సట్కా, తంబరి మాత్రమే ఆయన ఆస్తులు. భక్తులు ఇచ్చిన కానుకలను కూడా తిరిగి వారికే అత్యంత ప్రేమగా పంచేసేవారు. బాబాని దర్శించుకునేందుకు నిత్యం వందలమంది భక్తులు వచ్చేవారు. అయినా, పనులన్నీ సొంతంగానే చేసుకునేవారు. భిక్షాటన చేసి భోజనం చేసేవారు. లెండి బావి నుంచి స్వయంగా నీళ్లు తోడి మొక్కలను పెంచేవారు. ఎక్కడికి ప్రయాణమైనా కాలినడకే తప్ప, ఎలాంటి వాహనాలనూ ఉపయోగించలేదు. ఫకీరులా కనిపించే బాబాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కరతలామలకం. తన ముందు నిలబడ్డవాడు భక్తుడా మూర్ఖుడా అనే తేడా లేకుండా అందరికీ ప్రేమతత్వాన్ని పంచారు బాబా. సాయి నిరాడంబర జీవన సందేశం కూడా అదే. నిండుకుండ తొణకదు అంటారు. నిరాడంబరత కూడా నిండు కుండలాంటిదే. విజ్ఞానమూ, బలమూ పెరుగుతున్న కొద్దీ మనిషి నిండుకుండలా మారిపోవాలి. నిరాడంబరత అలవర్చుకోవాలి. - సురేష్‌బాబా