Mahajana Padayatra
-
సామాజిక న్యాయానికి సీపీఎం కట్టుబడి ఉంది
-
బడుగులు బాగుపడడమే లక్ష్యం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నకిరేకల్: బడుగుజీవుల బతు కులు బాగుండాలనేదే తమ పార్టీ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మహాజన పాద యాత్ర గురువారం సూర్యా పేట నుంచి నల్లగొండ జిల్లా లోకి ప్రవేశించింది. ఈ సంద ర్భంగా నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడారు. సామా జిక న్యాయమే లక్ష్యంగా తమ పోరాటం సాగుతుందని చెప్పారు. అభి వృద్ధిని ఆకాంక్షించి తమతో కలసి వచ్చే శక్తులను కలుపుకొనిపోతామని, పాలకులపై పోరాటం సాగిస్తామన్నారు. రాష్ట్రంలో అగ్రకుల దోపిడీ సాగు తోందని.. దీనిపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తామన్నారు. పాద యాత్ర బృందం సభ్యులకు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సూర్యాపేట సమస్యలపై స్పందించండి సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణం అనేక సమస్యలకు కేంద్రంగా మారిందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గురువారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. -
మరింత ఉధృతంగా ఉద్యమాలు
సామాజిక న్యాయ నినాదంతో ముందుకు వెళ్లాలని సీపీఎం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 90శాతం వరకు న్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలపై క్షేత్రస్థాయి ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని సీపీఎం నిర్ణయించింది. ప్రస్తుత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధా నాలకు ప్రత్యామ్నాయంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగాల కల్పన తదితర రంగాల్లో బడుగు, బల హీనవర్గాలకు అభివృద్ధిలో తగిన వాటా లభించేలా తమ విధానాలను ప్రజల ముం దుంచాలని ఆ పార్టీ భావిస్తోంది. దీనిలో భాగంగా ఈ వర్గాలకు మేలు చేసే ప్రత్యా మ్నాయ ఆర్థిక ప్రణాళిక ముసాయిదాను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తోంది. విశాల ప్రాతిపదికన వచ్చే సాధారణ ఎన్నికల నాటికి వామపక్షాలు, ప్రగతిశీల శక్తులు, సామాజిక శక్తులు, మేధావులతో కలసి ఒక ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా పార్టీ నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర దోహ దపడుతుందనే ఆశాభావంతో ఉంది. 24కు పాదయాత్రకు వందరోజులు ప్రస్తుతం సీపీఎం ఆధ్వర్యంలో‘ ‘సామాజిక న్యాయంృరాష్ట్ర సమగ్రాభివృద్ధి’ నినాదంతో నిర్వహిస్తున్న మహాజన పాదయాత్రకు అను గుణంగా ఆయా ఉద్యమాలను తీవ్రతరం చేయనుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పార్టీలో వివిధ కార్యరంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 9 మంది నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర ఈ నెల 24తో వందరోజులకు చేరనుంది. ఈ సంద ర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రౌండ్‌టేబుల్ సమావే శాలు, ర్యాలీలను నిర్వహించాలని సీపీఎం నాయకత్వం నిర్ణయించింది. మార్చి 19న భారీ బహిరంగసభ... పాదయాత్ర ముగింపు సందర్భంగా మార్చి 19న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించడం ద్వారా సత్తా చాటాలని సీపీఎం భావిస్తోంది. వచ్చే రెండు నెలల పాటు ఉధృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టి ముగింపుSసభకు భారీగా జనస మీకరణ æజరపాలని నిర్ణయించింది. -
బ్యాలెట్‌తో తప్పిదాలు చేశాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పెద్దపల్లి/జూలపల్లి: మావోయిస్టులు బుల్లెట్‌తో తప్పిదాలు చేస్తే, కమ్యూనిస్టులం బ్యాలెట్‌తో అనేక తప్పిదాలు చేశామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి జూలపల్లికి చేరింది. సభలో తమ్మినేని మాట్లాడుతూ కమ్యూనిస్టులంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు దొంగల పార్టీలని, ఆ పార్టీలకు టీఆర్ఎస్ తీసిపోదని విమర్శించారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాలు అడ్డం పెట్టి పొలాలకు నీళ్లు అందిస్తామని చెప్పినవు..దళితులకు మూడెకరాల భూమిస్తాం. ఇళ్లులేని వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామన్నవు.. ఇలా నోటికి వచ్చిందే చిత్తంగా మాటల గారడీతో అధికారంలోకి వచ్చినవు. శాంపిల్ కార్యక్రమాలను అభివృద్ధి నమూనాగా ప్రకటించుకుని సిద్దిపేట జిల్లాలో నాలుగైదు వందల ఇళ్లు కట్టి బీరాలు పలుకుతున్నా వు.. సొంత నియోజకవర్గానికి నాలుగు మంచి పనులుచేసి నన్ను మించిన సీఎం లేడని ఫోజు కొడుతున్నావు’అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఎయిర్‌పోర్టు కోసం దళితుల భూములు తీసుకోవద్దు సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో ఎయిర్‌పోర్టు కోసం దళితులు సాగు చేసుకుంటున్న భూముల్ని సేకరించడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. గోదావరిఖని ఏరియాలో సింగరేణి భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు వెంటనే పట్టాలివ్వాలని సీఎం కేసీఆర్‌కు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. సింగరేణికి అవసరమయ్యే ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలు నెలకొల్పే చర్యలు తీసుకోవాలన్నారు. -
'ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్ : సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారానికి 700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ధారూరుకు చేరుకున్న తమ్మినేని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. గత 29 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు. పేరుకు బీసీలు అయినప్పటికీ సమాజంలో అత్యంత వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులాల్లో కొన్ని కులాలు మినహా దాదాపు 106 కులాలు అత్యంత వెనకబడి ఉన్నాయన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి లోన్లు అందడం లేదని పేర్కొన్నారు. ఎంబీసీ కులాలకు చెందిన వారిని ఆర్థికంగా, సామాజికంగా స్థిరపడేందుకు వెంటనే ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.10 వేల కోట్లు కేటాయించాలని తమ్మినేని లేఖలో కోరారు. -
‘ఏవోబీ ఘటనపై జుడీషియల్ విచారణ జరపాలి’
శంషాబాద్: సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర పది రోజులుగా కొనసాగుతోంది. యాత్ర గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ నాయకులు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు. మల్కాన్‌గిరి ఎన్కౌంటర్ బూటకమని, ఆ ఘటనపై జుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే, హింసకు ప్రతీకారం ప్రతిహింస కారాదన్నారు. ప్రజా సమస్యలు ఉద్యమాలతోనే పరిష్కారం కావాలని అన్నారు. జనాభాలో సగం మంది ఉన్న మహిళలకు ప్రభుత్వాలు సరైన ప్రాధాన్యం కల్పించటం లేదని విమర్శించారు. వీటన్నిటిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తాము పాదయాత్ర చేపట్టామని చెప్పారు. ఇందులో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టుల మహాజన పాదయాత్ర
-
మహా అధ్యయన యాత్ర
సీపీఎం పాదయాత్రపై బీవీ రాఘవులు సాక్షి, హైదరాబాద్: సీపీఎం ఆధ్వర్యంలో చేపడుతున్న మహాజన పాదయాత్ర బడుగు, బలహీనవర్గాల సమస్యలపై మహాఅధ్యయన యాత్రగా సాగనుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల 17 నుంచి మార్చి 12 వరకు 4 వేల కి.మీ. మేర నిర్వహిస్తున్న పాదయాత్రలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని.. వారి సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో యాత్రలో పాల్గొననున్న నేతలను మంగళవారం ఎంబీ భవన్లో రాఘవులు పరిచ యం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ర్టంలో అనేక కారణాలవల్ల తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలు వెనకబడ్డారని, ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడినా పాత విధానాలే కొనసాగుతున్నాయని, కార్పొరేటీకరణ మరింత వేగం పుంజుకుందన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి తెలంగాణ కావాలన్న అంశంపై ఓ చర్చాపత్రాన్ని పాదయాత్ర ద్వారా సీపీఎం ప్రజల్లోకి తీసుకెళుతోందన్నారు. అర్థమయ్యేలా చెప్పండి... బంగారు తె లంగాణ అంటే ఎట్లా ఉంటుందో, దాని వల్ల ఏం మేలు జరుగుతుందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. బడుగులు, బలహీనవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోకుండా పాత విధానాలే అవలంబిస్తోందన్నారు. జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్షాన్ని పిలిచేందుకు సీఎం ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జిల్లాలను ప్రకటించినంతనే అభివృద్ధి జరగదన్నారు. జిల్లాల వికేంద్రీకరణ మండల స్థాయి నుంచి జరగాలన్నారు. బడుగుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో లెఫ్ట్, ప్రోగ్రెసివ్, డెమొక్రటిక్, సోషల్ ఫోర్సెస్‌ను కలుపుకుని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా సాగుతామన్నారు.