
బడుగులు బాగుపడడమే లక్ష్యం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నకిరేకల్: బడుగుజీవుల బతు కులు బాగుండాలనేదే తమ పార్టీ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మహాజన పాద యాత్ర గురువారం సూర్యా పేట నుంచి నల్లగొండ జిల్లా లోకి ప్రవేశించింది. ఈ సంద ర్భంగా నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడారు. సామా జిక న్యాయమే లక్ష్యంగా తమ పోరాటం సాగుతుందని చెప్పారు. అభి వృద్ధిని ఆకాంక్షించి తమతో కలసి వచ్చే శక్తులను కలుపుకొనిపోతామని, పాలకులపై పోరాటం సాగిస్తామన్నారు. రాష్ట్రంలో అగ్రకుల దోపిడీ సాగు తోందని.. దీనిపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తామన్నారు. పాద యాత్ర బృందం సభ్యులకు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
సూర్యాపేట సమస్యలపై స్పందించండి
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణం అనేక సమస్యలకు కేంద్రంగా మారిందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గురువారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.