Maharaja Express
-
‘ప్యాలెస్ ఆన్ వీల్స్’.. రాజ భోగాల ప్రయాణం.. రెండేళ్ల తర్వాత కూత..!
ఇది రైలు మాత్రమే కాదు రాచరికపు ఆనవాళ్లను కళ్లకు కట్టే అద్భుతమైన ప్యాలెస్. రాయల్ ఎక్స్‌ప్రెస్... రాజస్థాన్ రాచరికపు హంగులకు వేదిక. సకల సదుపాయాలనూ పరిచిన పట్టు తివాచీ. ఇండియన్ రైల్వే చేసిన వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’. రాచ మర్యాదలను పొందుతూ, నాటి ముఖ్య ఘట్టాలను కళ్లారా చూస్తూ సాగే ఆ ప్రయాణం మాటల్లో వర్ణించలేని ఓ అద్భుతం. ఈ రైలులో ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే రాజస్థాన్ రాయల్ అనుభూతి! జైపూర్: కరోనా కారణంగా నిలిచిపోయిన విలాసవంతమైన పర్యాటక రైలు (రాయల్ ట్రైన్) తిరిగి రెండేళ్ల తర్వాత పట్టాలెక్కింది. ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’గా పేరుగాంచిన ఈ ట్రైన్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ శనివారం గాంధీనగర్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. గత 40 ఏళ్లగా రాయల్ ట్రైన్ పర్యాటకులను ఆకట్టుకుంటోందని, ఇది ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైలు సేవలను తిరిగి ప్రారంభించటంతో రాష్ట్రంలో పర్యాటక రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయల్ ట్రైన్‌ను ప్రారంభించేందుకు ముందు.. అందులోని వసతులపై ఆరా తీశారు సీఎం గెహ్లోత్. ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. రైలు సర్వీసును తిరిగి ప్రారంభించటం ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. రైలులో అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని, 2022-23 బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. 40 ఏళ్ల ఘన చరిత్ర..: దేశంలో గత 40 ఏళ్లుగా రాయల్(ప్యాలెస్ ఆన్ వీల్స్) ట్రైన్ సేవలందిస్తోంది. తొలిసారి ఈ రాయల్ ట్రైన్ 1982లో పట్టాలెక్కింది. రైల్ గేజ్‌లను సమయానుసారంగా మారుస్తూ వస్తున్న క్రమంలో రెండో రాయల్ ట్రైన్‌ను 1991లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మూడోది 1995లో పట్టాలెక్కినట్లు అధికారులు తెలిపారు. తర్వాత రాజస్థాన్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌తో కలిసి 2009లో అధునాత సౌకర్యాలతో పునరుద్ధరించింది రైల్వే శాఖ. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనే భావన కోచ్‌ల్లో రాచరిక నేపథ్యం నుంచి వచ్చింది. వాస్తవానికి రాజ్‌పుత్‌లు, బరోడా, హైదరాబాద్ నిజాం సహా బ్రిటిష్ వైస్రాయ్‌ల వ్యక్తిగత రైల్వే కోచ్‌లుగా వీటిని ఉద్దేశించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంటీరియర్ డిజైన్..: ప్రతి బోగిలో ఫర్నిచర్, హస్తకళలు, పెయింటింగ్ వంటి వాటి వాడకం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక నైతికతను హైలైట్ చేస్తుంది. జైపూర్‌కు చెందిన నిష్ణాతులైన ఆర్కిటెక్ట్స్ రైలు ఇంటీరియర్స్ డిజైన్ చేశారు. క్యాబిన్ లోపలి పరిసరాలు ఎటు చూసినా రాచరికపు ఫ్యాషన్‌కి చిరునామాలా ఉట్టిపడుతుంటాయి. అలంకరించిన తోలు ఉత్పత్తులు, మృణ్మయపాత్రలు, ఫొటో ఫ్రేమ్‌లు.. మతులు పోగొడతాయి. రాచకళ అడుగడుగునా విస్మయపరుస్తూనే ఉంటుంది. సౌకర్యాలు..: ఈ రాయల్ ట్రైన్లో మొత్తం 23 కోచ్‌లు ఉంటాయి. 104 మంది టూరిస్టులు ఇందులో ఏకకాలంలో ప్రయాణించవచ్చు. ప్రతి కోచ్‌కు రాజ్‌పుత్‌ల పేర్లు పెట్టారు. ఒక్కో బోగీలో లగ్జరీ సౌకర్యాలు, వైఫై ఇంటర్నెట్ వంటివాటితో నాలుగు క్యాబిన్లు ఉంటాయి. ఈ రైలులో ద మహారాజ, ద మహారాణి అనే రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే.. ఒక బార్ కమ్ లాంజ్, 14 సెలూన్లు, ఒక స్పా ఉన్నాయి. ఏ రూట్లలో వెళ్తుంది..: ఈ రైలు మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీ నుంచి ప్రారంభమై జైపూర్(రెండో రోజు), సవాయ్ మాధోపుర్, ఛిత్తౌర్గఢ్(మూడో రోజు), ఉదయ్ పూర్(నాలుగో రోజు), జైసల్మేర్(ఐదోరోజు), జోధ్‌పుర్ (ఆరో రోజు), భరత్‌పుర్, ఆగ్రా(ఏడో రోజు), తిరిగి ఎనిమిదో రోజు న్యూఢిల్లీకి చేరుకుంటుంది. ఇదీ చదవండి: రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని.. -
ఇక ఖరీదైన రైళ్లలో పెళ్లిళ్లు
న్యూఢిల్లీ: వినూత్నంగా, విలాసవంతంగా వివాహం చేసుకోవాలనుకునే జంటలకు శుభవార్త. భారతీయ రైల్వేకు చెందిన క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ తమ లగ్జరీ రైళ్లను పెళ్లి వేడకులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్పొరేషన్ ప్రపంచ పర్యాటకుల కోసం లగ్జరీ, సెమీ లగ్జరీ రైళ్లను ఇప్పటికే నడుపుతున్న విషయం తెల్సిందే. వీటిలో అత్యంత ఖరీదైన మహారాజా ఎక్స్‌ప్రెస్ 8 రోజుల ప్యాకేజీపైనా ఢీల్లీ, ఆగ్ర, రంథంబోర్, జైపూర్, బికనూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, బెలాసినార్ల కోటలు, చారిత్రక కట్టడాల సందర్శన కోసం పర్యాటకుల కోసం నడుపుతోంది. ఇప్పుడు పెళ్లిళ్ల కోసం మహారాజా ఎక్స్‌ప్రెస్‌తోపాటు ప్యాలెస్ ఆన్ వీల్స్, డెక్కన్ ఒడిస్సీ, గోల్డెన్ చారియట్, రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ రైళ్లను కేటాయించాలని కార్పొరేషన్ నిర్వహించింది. పెళ్లిళ్లకు, వేడికలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రైలు డెకరేషన్‌ను మార్చేందుకు, అతిథులకు పసందైన విందు భోజనాలతోపాటు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు నిపుణులైన ఈవెంట్ మేనేజర్లు ఉంటారని కార్పొరేషన్ సీనియర్ అధికారులు తెలిపారు. రైళ్లలో విహరిస్తూనే పెళ్లి చేసుకోవచ్చని, వధూవరుల హానిమూన్‌కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయని వారు చెప్పారు. ఎన్నిరోజుల బస, ఉపయోగించుకునే వసతులు, ప్యాకేజీల ఆధారంగా రేట్లు ఉంటాయని వారు అన్నారు. విలాసవంతమైన రైళ్లలో ‘స్పా’ లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయని, భారతీయులు, ప్రవాస భారతీయలకే కాకుండా విదేశీ జంటల వివాహాలకు కూడా తాము రైళ్లను కేటాయిస్తామని వారు చెప్పారు. తాము వినూత్నంగా త్వరలోనే ప్రారంభించనున్న ఈ స్కీమ్ విజయవంతమవుతుందన్న విశ్వాసంతో ఉన్నామని వారు చెప్పారు. -
‘మహారాజ ఎక్స్‌ప్రెస్’ వివరాలు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: విలాసవంతమైన మహారాజ ఎక్స్‌ప్రెస్ పర్యాటక రైలు ఆక్యుపెన్సీకి సంబంధించి గడచిన మూడేళ్ల వివరాలను తెలపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఆక్యుపెన్సీతో పాటు ఆదాయ, వ్యయాలను కూడా తెలియచేయాలన్నారు. సామాన్యులు ఆర్థికంగా భరించే విధంగా ఇదే తరహాలో రైలును ప్రవేశపెట్టే ప్రతిపాదనలపై ప్రశ్నించారు. దీనిపై రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా బదులిస్తూ 2012-13, 2013-14, 2014-15 సంవత్సరాల వారీగా ఆక్యుపెన్సీ, ఆదాయం, వ్యయం వివరాలను వెల్లడించారు. మహారాజ ఎక్స్‌ప్రెస్ తరహాలోనే సామాన్యుల కోసం రైలు ప్రవేశపెట్టే ప్రతిపాదనలేవని మంత్రి స్పష్టం చేశారు. -
విలాసవంతమైన ప్రయాణం...పట్టాలపైన ప్యాలెస్...
మహారాజా ఎక్స్‌ప్రెస్... ప్రయాణించేది రైల్వే లైన్ మీద కాదు నాటి చారిత్రక ప్రపంచంలోకి. మహారాజా ఎక్స్‌ప్రెస్... కేవలం రైలు మాత్రమే కాదు రాచరికపు ఆనవాళ్లను కళ్లకు కట్టే అద్భుతమైన ప్యాలెస్. మహారాజా ఎక్స్‌ప్రెస్... రాజస్థాన్ రాచరికపు హంగులకు వేదిక. సకల సదుపాయాలనూ పరిచిన పట్టు తివాచీ. ఇండియన్ రైల్వే చేసిన వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ‘వీల్స్ ఆన్ ట్రెయిన్.’ రాచ మర్యాదలను పొందుతూ, నాటి ముఖ్య ఘట్టాలను కళ్లారా చూస్తూ సాగే ఆ ప్రయాణం మాటల్లో వర్ణించలేని ఓ అద్భుతం. ఈ రైలులో ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే రాజస్థాన్ రాయల్ అనుభూతి! ప్యాలెస్ రైలు పట్టాల మీద పరుగులు తీస్తుంటే ఎలా ఉంటుందో చూడాలంటే రాజస్థాన్ లగ్జరీ టూరిస్ట్ ట్రెయిన్‌ను వీక్షించాలి. ఒక్కరోజైనా ఈ రైలులోని సకల సదుపాయాలను పొందాలని కోరుకుంటారు సంపన్ను లు. రోజుకు లక్షల రూపాయలు చెల్లించే ఈ రైలులో ప్రయా ణం అత్యంత విలాసవంతంగా ఉంటుంది. అడుగడుగునా.. రాచకళ... ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ రైలులో 14 క్యాబిన్లు ఉన్నాయి. వీటిలో అడుగుపెట్టగానే సుశిక్షితులైన నిపుణులు తీర్చిదిద్దిన అందచందాలు వర్ణనాతీతం. వీటిలో ఎక్కువగా హస్తకళా నైపుణ్యంతో తయారుచేసిన కళాకృతులు చూపు తిప్పుకోనివ్వవు. క్యాబిన్ లోపలి పరిసరాలు ఎటు చూసినా రాచరికపు ఫ్యాషన్‌కి చిరునామాలా ఉట్టిపడుతుంటాయి. అలంకరించిన తోలు ఉత్పత్తులు, మృణ్మయపాత్రలు, ఫొటో ఫ్రేమ్‌లు.. మతులు పోగొడతాయి. రాచకళ అడుగడుగునా విస్మయపరుస్తూనే ఉంటుంది. దర్జాగా...విందు భోజనం! 14 క్యాబిన్లలో కొన్నింటికి హవామహల్, పద్మినిమహల్, కిశోరి మహల్, ఫూల్ మహల్, తాజ్‌మహల్.. అని పేరు పెట్టారు. స్వర్ణ్ మహల్, శీష్ మహల్ క్యాబిన్లలో విందుభోజనం ఉంటుంది. స్వర్ణ్ మహల్లో పూర్తిగా బ్రాస్, బంగారు తాపడాలతో రాచఠీవీని ఒలక బోస్తుంది. ఇక శీష్ మహల్ రెస్టారెంట్ ఫ్లోర్ ల్యాంప్స్, క్రిస్టల్ ఫిలమెంట్స్ తో ధగధగలాడుతూ ఉంటుంది. ఈ మహల్స్‌లో ఒక్కసారైనా భోజనం చేయాలని పర్యాటకులు ఉవ్విల్లూరుతుంటారు. దీంట్లో రాజస్థానీ, ఇండియన్, చైనీస్ రుచులు నోరూరిస్తుంటాయి. భటులను తలపించే సేవకులతో పూర్తిగా రాచరికాన్ని అనుభవించవచ్చు. మణి మరకతాల పడకగదులు విశాలమైన, సౌకర్యవంతమైన రాయల్ సూట్లో పట్టు పరుపులు, మఖమల్ బెడ్ షీట్స్ హాయిగొలిపే నిద్రకు ఆసనంగా మారతాయి. బెడ్స్‌తో పాటు సోఫా-కుర్చీలు, రాసుకోవడానికి బల్ల ఉంటాయి. వీటిలో వజ్రం, మరకతాల నేపథ్యాన్ని ఉపయోగించడం ప్రత్యేకత. ఈ సూపర్ డీలక్స్ సూట్ మరింత విలాస వంతంగా రూపొందిం చారు. డీలక్స్ సూట్లో అడుగు పెట్టగానే మీకు మాత్రమే ప్రత్యేకమైన చాంబర్ ఆహ్వానం పలుకుతుంది. పట్టు ఫర్నిషింగ్‌తో తీర్చిదిద్దిన ఫర్నిచర్... రంగులు, డిజైన్లు నాటి కాలంలోకి తీసుకెళతాయి. సకల సదుపాయాలు దీంట్లో లభ్యం. కెంపు, ముత్యం, నీలం రంగుల మేళవింపుతో దీనిని డిజైన్ చేశారు. ఖరీదైన వైన్! భోజనంతో పాటు అత్యంత ఖరీదైన వైన్ ఇక్కడ లభిస్తుంది. అన్ని అంతర్జాతీయ బ్రాండ్ల లిక్కర్‌ను ఇక్కడ సర్వ్ చేస్తారు. శీష్‌మహల్, స్వర్ణ్మహల్లలో ఈ సౌలభ్యం ఉంది. అపెర్టిఫ్, మాల్ట్, విస్కీ, స్కాచ్, రమ్, వోడ్కా, షాంపేన్... లను ఇక్కడ సర్వ్ చేస్తారు. స్పా.. శాటిలైట్.. ఈ రైలులోని రాయల్ స్పా ప్రత్యేకమైనది. అధునాతనమైనది. బయట లగ్జరీ స్పాలలో లభించే మసాజ్, బ్యూటీ థెరపీలు.. అన్నీ వీటిలో లభిస్తాయి. వై-ఫై ఇంటర్నెట్, శాటిలైట్ టీవీ, మ్యూజిక్ సిస్టమ్, ఉష్ణోగ్రతలు నియంత్రించుకోగలిగే సామర్థ్యం ప్రతి క్యాబిన్‌లోనూ ఉంటాయి. ప్రయాణ ప్యాకేజీ... ఏడు పగళ్లు, ఎనిమిది రాత్రులలో ఢిల్లీ నుంచి రాజస్థాన్ అంతా చుట్టి వచ్చేలా దీనిని డిజైన్ చేశారు. న్యూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై 2వ రోజుకు జోధ్‌పూర్, 3వ రోజుకు ఉదయపూర్, 4వ రోజుకు చిత్తోడ్‌ఘడ్, రణథమ్‌బోర్ నేషనల్ పార్క్, జైపూర్, 5వ రోజుకు ఖజురహో, 6వ రోజులకు సారనాథ్, 7వ రోజుకు ఆగ్రా చేరుకొని, అటు నుంచి 8వ రోజుకు తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది. అబ్బురపరిచే హవామహల్, మోతీ మహల్, శీష్ మహల్, రణథమ్‌బోర్ ఉద్యానం, చిత్తాఘడ్ కోట, జగ్ నివాస్ (లేక్ ప్యాలెస్), కియోలాడియో నేషనల్ పార్క్, ఆగ్రా కోట, చివరగా తాజ్‌మహల్‌ను వీక్షించవచ్చు. ఢిల్లీ నుంచి బయల్దేరేటప్పటి నుంచి ఊహలకు అందని ఆనందాన్ని ప్రయాణం పొడవునా ఏడు రోజుల పాటు పొందవచ్చు. రాజస్థాన్‌లోని అటవీ సంపదను, అందులోని వన్యప్రాణులను, ప్రాచీన వారసత్వ కట్టడాలను కళ్లారా వీక్షించవచ్చు. జీవిత కాలంలో అత్యంత ఆనందకర జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి ఈ రాయల్ చక్రాలపై ప్రయాణం చేయాల్సిందే! 8 పగళ్లు/7 రాత్రులకు ప్యాకేజీ! (ఒకరికి) డీలక్స్ క్యాబిన్: రూ. 3,62,328/- జూనియర్ సూట్: రూ. 5,73,181/- సూట్: రూ. 8,36,142 /- ప్రెసిడెన్షియల్ సూట్: రూ. 14,35,983/-