Mahatma Jyotirao Poole
-
పూలే బాటలో ప్రభుత్వం
సాక్షి, అమరావతి: సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయా వర్గాలకు మంత్రివర్గంలో 60 శాతం పదవులు ఇచ్చి గౌరవించామని, ఏలూరు బీసీ డిక్లరేషన్ ప్రకారం హామీలను ఎన్నికల ప్రణాళికలో చేర్చి పలు పథకాలు ప్రకటించామని చెప్పారు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పూలే 129వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అధ్యక్షత వహించారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. ఆ పోరాటం స్ఫూర్తిదాయకం.. ‘‘మహాత్మా పూలే సత్యశోధన సమాజాన్ని స్థాపించి సమానత్వం కోసం, మహిళలు చదువుకోవాలని ఆరాటపడ్డారు. అణగారిన వర్గాల కోసం ఎంతో శ్రమించారు. ఆ పోరాటం స్ఫూర్తిదాయకం. కట్టుబాట్లను వ్యతిరేకించి తన భార్యను చదివించడమే కాకుండా టీచర్‌గా కూడా చేశారు. పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ కృషిని నేటికీ గుర్తుంచుకుంటాం. అలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని మంచి చేయాలని తపించిన వారిలో దివంగత వైఎస్సార్ కనిపిస్తారు. పేదలు పేదరికం నుంచి బయపడాలంటే ఆ కుటుంబం నుంచి ఒక్కరన్నా ఇంజనీరో, డాక్టరో కావాలి. ఇంతియాజ్ (కృష్ణా జిల్లా కలెక్టర్) అన్న లాంటి వారి స్థానాల్లో పేదలు కూర్చోవాలని వైఎస్సార్ ఆరాటపడ్డారు. అలా మార్పు తేవాలని తపించిన వారు ఎప్పటికీ గుర్తుంటారు. మీ అందరికీ కనిపిస్తోంది.. చెప్పిన ప్రతి మాట నెరవేర్చాలనే తాపత్రయంతో వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోను తయారు చేశాం. అందులో చెప్పిన అంశాలు అడుగు ముందుకు పడ్డాయా లేదా అనేది మీ అందరికీ కనిపిస్తోంది. దాదాపు 60 శాతం మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను మంత్రివర్గంలోకి తీసుకున్నాం. మాట నిలబెట్టుకున్నాం.. ఇవాళ పొద్దునే వ్యాయామం చేస్తూ టీవీ చూశా. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి స్పీకర్, ఎన్సీపీకి ఒక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవులట. మన మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లున్నారు. ఇందులో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. వెన్నెముక లాంటి వారు. మాట ప్రకారం బీసీల అభివృద్ధి, సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయించాం. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్‌ల్లో 50 శాతం కచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇవ్వాలని చట్టాన్ని తెచ్చాం. కృష్ణా జిల్లాలో 19 మార్కెట్ యార్డులకుగాను 10 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కేలా చట్టం చేశాం. గుడులు, గోపురాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు తెస్తూ చట్టాలు చేశాం. గర్వంగా చెబుతున్నా.. ఇవాళ ఆర్థిక మాంద్యంతో దేశమంతా ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొన్నా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భిన్నంగా ఉంది. రెండు వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర మన రాష్ట్రంలో కనిపిస్తోంది. నాలుగు లక్షల ఉద్యోగాల్లో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నాలుగు నెలలు తిరగకముందే ఇవ్వగలిగాం. వీరిలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు 70 శాతం వరకు ఉన్నారని గర్వంగా చెబుతున్నా. ఆర్థిక ఇబ్బందులున్నా వెనుకంజ లేదు.. చంద్రబాబు ప్రతి చోటా అప్పులు మిగిల్చి దిగిపోయారు. అయితే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని సంక్షేమ పథకాలు ఎగొట్టే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. దాదాపు 46 లక్షల మంది రైతులకు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం ఇవ్వగలిగాం. వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా దాదాపు 2.36 లక్షల మందికి ఆర్థిక సాయం చేయగలిగామంటే దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలే కారణం. మత్స్యకారులకు కూడా సాయం చేశాం. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కింద సగటున నెలకు రూ. 500 కోట్లు ఇచ్చేవారు. ఈరోజు పెన్షన్ల కింద సగటున నెలకు రూ.1,400 కోట్లు ఇస్తున్నాం. వారి పిల్లలు చదివేది ఎక్కడ? ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పెద్ద పెద్ద నాయకులు, పత్రికాధిపతులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమం స్కూళ్లలోనే చదివిస్తున్నారు.మన పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలట. అదేమంటే సంస్కృతి పోతుందంటున్నారు. మరి వాళ్ల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవడం లేదా? పేదల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదివితేనే సంస్కృతి పోతుందా? ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థ ఉన్నప్పుడు బాధనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు ముందుకు.. ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగా ఇస్తున్న పరిస్థితులను పూర్తిగా మార్చి ప్రతి పేద విద్యార్థికి తోడుగా ఉంటాం. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు నువ్వు చదువు, నేను తోడుగా ఉంటానని గతంలో వైఎస్సార్ స్వరం వినిపించేంది. మళ్లీ అలాంటి స్వరమే ఈరోజు నాలుగు అడుగులు ముందుకు వేసి వినిపిస్తోంది. పిల్లలను చదివించడమే కాదు ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద ప్రతి పిల్లాడికి రూ. 20 వేలు చొప్పున అందిస్తాం. నా పుట్టినరోజు చేనేతలకు సాయం డిసెంబరు 21న నా పుట్టిన రోజు సందర్భంగా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఉగాది నాటికి పేదలకు 24 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతాం. దేవుడి దయతో రాబోయే రోజుల్లో మీ బిడ్డ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ముందడుగు వేస్తున్నాడు’. పూలే వర్థంతి సభలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, గుమ్మనూరు జయరాం, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, మల్లాది విష్ణు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.రామారావు, బీసీ కార్పొరేషన్ ఎండీ ఎం.రామారావు, కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రతిచోటా అప్పులు మిగిల్చి దిగిపోయారు. అయితే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని సంక్షేమ పథకాలు ఎగ్గొట్టే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. – సీఎం వైఎస్ జగన్ -
మరువలేని సంఘసంస్కర్త జ్యోతిరావుపూలే
నెల్లూరు(సెంట్రల్): మహాత్మా జ్యోతిరావు పూలే మరువలేని గొప్ప సంఘసంస్కర్తని నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్ పేర్కొన్నారు. జ్యోతి రావుపూలే 190వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని మినీబైపాస్‌రోడ్డులో విజయమహల్‌గేటు సమీపంలో ఉన్న జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు సోమవారం వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి పూలే సేవలను కొనియాడారు. వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ మహిళా విద్యను ఎంతగానో ప్రోత్సహించారని గుర్తుచేశారు. అమరావతిలో స్మృతి వనం ఏర్పాటు చేయాలి: సంఘసంస్కర్తగా జ్యోతిరావు పూలే దేశానికి అందించిన సేవలు మరువలేనివని నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే స్మృతి వనాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. - పీ అనిల్‌కుమార్‌యాదవ్, నగర ఎమ్మెల్యే మహాత్ముని ఆలోచనలను సాకారం చేద్దాం: మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలను , ఆలోచనలను సాకారం చేద్దామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. పూలే కలలను సాకారం చేసేందుకు బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,రూరల్ ఎమ్మెల్యే మహిళా విద్యకు ప్రోత్సాహం: మహాత్మా జ్యోతిరావుపూలే మహిళా విద్యను ఎంతగానో ప్రోత్సహించారని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఇంతియాజ్ అహ్మద్, బీసీ సంక్షేమ అధికారి సంజీవయ్య, కార్పొరేషన్ ప్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, కార్పోరేటర్లు గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్‌అహ్మద్, ఊటుకూరు మాధవయ్య, ఓబిలి రవిచంద్ర, నాయకులు కొణిదల సుధీర్, శ్రీనివాసులురెడ్డి, సత్యానందం, నారాయణ యాదవ్, విశ్వరూపాచారి, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. - ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్ -
సంఘటితమైతేనే బడుగుల మనుగడ సాధ్యం
► నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ► ఘనంగా మహాత్మజ్యోతిరావు పూలే, ► బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి నెల్లూరు(బృందావనం) : సంఘటితంగా పోరాటాలు సాగిస్తేనే బడుగుల మనుగడ సాధ్యమవుతుందని, నాడే మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలు నెరవేరుతాయని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. నగరంలోని పురమందిరంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘ, బీసీకులాల సమన్వయ కమిటీ, బహుజన టీచర్స్ అసోసియేషన్, మహిళాసాధికార సమన్వయకమిటీ, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పూలే (ఏప్రిల్11), అంబేడ్కర్(ఏప్రిల్14) జయంతులను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలు మహాత్ముల జయంతులు, ఉత్సవాలు,వర్థంతులు జరిపితే సరిపోదన్నారు. వారి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారి పిల్లలు చదివే పాఠశాలలకు ఆర్థిక సహాయాన్ని అందించి విద్యాభివృద్ధికి తోడ్పడితే వారు ప్రగతివైపు పయనిస్తారన్నారు. దక్షిణమధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జె.ఎన్.రాజు మాట్లాడుతూ పూలే, అంబేదడ్కర్లను బడుగుల దేవుళ్లుగా పేర్కొన్నారు. వారి ఆశయాలు సాధించేందుకు అందరూ కృషిచేయాల్సిన అవసరముందన్నారు. తొలుత పూలే,సావిత్రిబాయి పూలే, అంబేడ్కర్ జీవితచరిత్ర పుస్తకాలను ఎమ్మెల్యే, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ శిరీష, రాజు, ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మల్లికార్జున్‌యాదవ్, దేవరాల సుబ్రహ్మణ్యంయాదవ్, రొంపిచెర్ల శివరామయ్య ఆచారి, నాశిన భాస్కర్‌గౌడ్, డాక్టర్ మారం విజయలక్ష్మి, చదలవాడ రమణయ్య, షేక్ కాలేషా, మెతుకు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు జగన్‌కు అండగా ఉంటా : అనిల్, ఎమ్మెల్యే బలహీనవర్గాని చెందిన తాను తన పినతండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానన్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో 90 ఓట్లతో కొందరి కారణంగా ఓడానని, అయితే మళ్లీ నెల్లూరు ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. బీసీవర్గానికి చెందిన తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చి గెలుపుకోసం కృషిచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి తన ఊపిరి ఉన్నంత వరకు అండగా ఉంటానన్నారు. బీసీల ఉన్నతికి తోడ్పడిన వారిలో రాష్ట్రంలో ఎన్టీరామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అగ్రగణ్యులని, వారిని ఎవరూ మరిచిపోరని కొనియాడారు. -
జ్యోతిరావుపూలే జీవితం ఆదర్శం
► రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ► పేదల అభివృద్ధే ధ్యేయం : మంత్రి లక్ష్మారెడ్డి ► విద్య లేకపోవడమే వెనకబాటు : కలెక్టర్ టీకే శ్రీదేవి ► జిల్లావ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు ► అసృశ్యత నివారణకు కృషిచేశారు: జూపల్లి ► బడుగుల అభ్యున్నతే ఆయన ధ్యేయం: లక్ష్మారెడ్డి పాలమూరు : మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికి ఆదర్శమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పూలే 190వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్థిక అసమానత్వం, వి ద్య వివక్షత, పేదరికం వంటి వాటిని నిర్మూలించేందుకు జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదని, కుల, మ త రహిత సమాజ నిర్మాణానికి ఆయన ఎనలేని కృషిచేశారని అన్నారు. జిల్లాలోని అన్ని వనరులు ఉన్నప్పటికీ నిరక్షరాస్యత వల్ల అభివృద్ధి సాధించలేకపోతున్నామని, అం దరూ కలిసి పనిచేస్తేనే వందశాతం అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మా ట్లాడుతూ జ్యోతిరావుపూలే సమాజంలోని అన్ని వర్గాల కోసం కృషి చేసిన మహాత్ముడని అన్నారు. పూలే ఆశయా న్ని అర్థం చేసుకొని ముందుకెళ్లాలని, సమాజంలో ఉన్న 85 శాతం పేదల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. బీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విద్యా పరంగా బీసీల అభివృద్ధికి కృషి చేస్తుందని, హాస్టళ్లలో సన్న బియ్యంతో పాటు వెనుకబడిన వర్గాలకు వివిధ పథకాల కింద సబ్సిడీ రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు పాలమూరు-రంగారెడ్డితో పాటు వైద్య కళాశాల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నదని అన్నారు. మహిళా విద్యను ప్రోత్సహించిన మహనీయుడు కలెక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ జ్యోతిరావుపూలే కులవ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడని అన్నారు. బాలికలకు విద్య లేకపోవడం, అగ్రవర్ణాలకు మాత్రమే విద్య అందుబాటులో ఉన్న పరిస్థితులను ఎదిరించి పోరాడి మహిళా విద్యను ప్రోత్సహించడమే కాకుండా తన భార్య సావిత్రీబాయి పూలేను మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తయారుచేసిన ఘనత పూలేదే అన్నారు. వనరులు లేకపోవడం వల్ల జిల్లా వెనుకబడలేదని, విద్య లేకపోవడం వల్లనే వెనుకబడి ఉందని, జిల్లాలోని వెనుకబాటుతనం పోవడానికి కృషిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఏడాది జిల్లాలో నూటికి నూరు శాతం బీసీ యాక్షన్ ప్లాన్ అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, బీసీల అభ్యున్నతికై జిల్లాలో బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతికి జ్యోతిరావుపూలే కృషిచేశారని, వారి విధానాలకు అనుగుణంగానే రాజ్యాంగం రచించడం జరిగిందని అన్నారు. అంతకుముందు పద్మావతికాలనీలో పూలే విగ్రహానికి మంత్రులు, జెడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంధ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేందర్, మాజీ జెడ్పీటీసీ శివకుమార్, రాజేశ్వర్‌గౌడ్, బీసీ సంఘ నేతలు ప్రేమ్‌సాగర్, అశోక్, శేఖర్, పురుషోత్తం, మనోహర్, గోనెల శ్రీనివాస్, సంజీవ్ ముదిరాజ్, మున్నూరు రాజు, అశోక్‌గౌడ్, భూమయ్య ప్రసంగించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ద్వారా కులాంతర వివాహాలు చేసుకున్న 28 మందికి రూ.2.80 లక్షల చెక్కులను, కళాశాల విద్యార్థులకు రూ.11 లక్షల విలువ చేసే లైబ్రెరీ పుస్తకాలను పంపిణీ చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 52 మంది లబ్ధిదారులకు కోటి 30 లక్షల రూపాయల సబ్సిడీ రుణాల చెక్కులను అందజేశారు. -
అంబేద్కర్ గురువునే అవమానిస్తారా!
- పూలే విగ్రహాన్ని తొలగించి టాయిలెట్లో పడేస్తారా - మహాత్ముడికిచ్చే గౌరవం ఇదేనా? - అంబేద్కర్ జయంతిలో మండిపడిన దళిత సంఘాలు - బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇందూరు: ‘‘అంబేద్కర్ తనకు గురువుగా చెప్పుకున్నమహాత్మా జ్యోతిరావు పూలేవిగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించి టాయిలెట్లలో పడేస్తారా! ఎక్కడ పడితే అక్కడ అనుమతులు లేకుండా స్థాపిస్తున్నా, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోయే విగ్రహానికి మా త్రం నిబంధనలు అడ్డొస్తున్నాయా? ఇదేనా మహా త్ములకు మనం ఇచ్చే గౌరవం... ఇలాంటప్పుడు ఈ సమావేశాలెందుకు...వారి గురించి గొప్పలు చెప్ప డం ఎందుకు?’’ అంటూ దళిత సంఘాలు అంబేద్క ర్ జయంతి కార్యక్రమంలో మండిపడ్డాయి. పూలే వి గ్రహాన్ని తొలగించడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని డి మాండ్ చేశాయి. పూలే విగ్రహాన్ని వెంటనే యథా స్థానంలో నిలపకపోతే ఉద్యమ బాట పడుతామని హెచ్చరించారుు. ఈ విషయంలో బీసీ సంఘం నేత లక్ష్మీనారాయణ చాల ఉద్వేగంగా ప్రసంగించారు. ఆ యన కంట తడిపెట్టి, అందరినీ కంటతడి పెట్టిం చారు. దళిత నాయకుతు బంగారు సాయిలు, చిన్న య్య పూలేకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖం డించారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఉం డి కూడా పూలే విగ్రహ స్థాపనకు పది అడుగుల స్థలాన్ని కేటాయించకపోవడం శోచనీయమన్నారు. కుల సంఘాలు విగ్రహాన్ని స్ధాపిస్తే, దానిని తీసుకెళ్లి టాయిటెట్లలో పడేయడం అతి దారుణమని పేర్కొన్నారు. జిల్లా పరువు పోయేలా వ్యవహరించారని, ఈ పాపం ఊరికే పోదదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు కొంతసేపు మౌనంగా ఉండిపోయూరు. అనంతరం జుక్కల్ ఎ మ్మెల్యే హన్మంత్ సింధే మాట్లాడుతూ పూలే విగ్రహానికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, తిరిగి విగ్రహ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు కూడా జరిగిన సంఘటను తీవ్రంగా ఖడించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పూలే విగ్రహం తొలగింపు సరికాదన్నారు. టాయిలెట్లలో విగ్రహాన్ని పడేయడంలాంటి సంఘటన జిల్లాలో జరగడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రక టిం చారు. అసలు విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలు అడ్డొస్తున్నాయో కుల సంఘాల ఆధ్వర్వంలో కూర్చుండి సామరస్యంగా మాట్లాడుకుని సమస్యను పరి ష్కరించుకుందామని సూచించారు. విగ్రహ ఏర్పాటుకు తానే స్వయంగా పూనుకుంటానని హామి ఇచ్చారు. విగ్రహాన్ని తిరిగి నెలకొల్పండి -కాంగ్రెస్ నేత డీఎస్ నిజామాబాద్ సిటీ : జిల్లా కేంద్రంలో తొలగిం చిన జ్యోతిబా పూలే విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని మండలి విపక్ష మాజీ నేత డి. శ్రీని వాస్ కోరారు. పూలే విగ్రహం తొలగింపుపై ఆ యన మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ రొనాల్డ్ రోస్తో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహా నీయుడైన పూలే విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా అన్ని వర్గాలు కలిసి ఏర్పాటు చే సుకున్నాయని, అనుమతులు లేవన్న కారణం తో దానిని తొలగించి స్టేషన్లో ఉంచటం సరి కాదన్నారు. ఈ సంఘటన బీసీ వర్గాలకు బాధ కలిగించిందన్నారు. తొలగించిన విగ్రహాన్ని తి రిగి రెండు రోజులలో ఏర్పాటు చేయాలని కో రారు. రెండు రోజులలో సమస్యను పరిష్కరి స్తానని కలెక్టర్ డీఎస్‌కు తెలిపారు. -
హిందూ జాతి మనుగడకు నలుగుర్ని కనాలి
⇒ తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్య హైదరాబాద్: దేశంలో హిందూ జాతి మిగలాలంటే ఇంటికి నలుగురు పిల్లలను కనాలని, లేకపోతే జాతి మనుగడ సాగించదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే స్మారక పోటీల విజేతల బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సభలో స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ఏ ఇజాలు లేని రోజుల్లోనే నిజాలు మాట్లాడిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. శెట్టిబలిజ, గౌడ, కలాయి, కౌండిన్య తదితర గౌడ్ కులస్తులందరికీ ఒకే తీరు రిజర్వేషన్లు అమలుపై బీసీ కమిషన్‌కు పూర్తి వివరాలు అందజేశానని పేర్కొన్నారు. బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు డాక్టర్. కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. బహుజనులు తెచ్చుకున్న తెలంగాణలో వారిని విస్మరిస్తే మరో పోరాటం ప్రారంభమవుతుందన్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎ. రామలింగేశ్వరరావు మాట్లాడుతూ దేశ చరిత్రను పాక్షికంగానే రాశారని అందులో మహాత్ముల చరిత్రలు ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగానిని ఘనంగా సన్మానించారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.