Mahhi Vij
-
'మీ రేటు కార్డ్ సిద్ధం చేస్తాం'.. రెడీగా ఉండమని చెప్పాడు: హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. కొత్తగా సినిమాల్లోకి వచ్చేవారికి ఇలాంటి అనుభవం ఎక్కడో ఒకచోట ఎదురై ఉంటుంది. చాలామంది సెలబ్రిటీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ఏదో ఒక సందర్భంలో రివీల్ చేస్తుంటారు. అలా తాజాగా ఓ నటి తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనను పంచుకుంది. ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ నటి మహి విజ్ ఆ షాకింగ్ సంఘటనను వెల్లడించింది.తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సినిమా కోఆర్డినేటర్‌గా చెప్పుకునే వ్యక్తి నుంచి తనకు కాల్ రావడంతో ముంబయిలోని జుహూ వెళ్లానని తెలిపింది. అతని కారులోనే తన సోదరితో కలిసి వెళ్లినట్లు పేర్కొంది. ఆ సమయంలో అతను మాకు ఆల్బమ్‌లోని కొన్ని ఫోటోలు చూపించాడు. ఈ ఆల్బమ్‌లో మీ ఫోటో కూడా ఉంచుతాం.. మీ రేట్ కార్డ్ సిద్ధంగా ఉంటుందని మాతో అన్నాడని తెలిపింది.అయితే దీనిపై మొదట్లోనే నెగెటివ్‌గా ఆలోచించవద్దని.. ఒక్క రోజు షూటింగ్‌కి రేటు కార్డు ఎంత అని అడిగాను.. దానికి అతని బదులిస్తూ.. మేడం మీరు క్రూయిజ్‌కి వెళ్తారా? దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని మాతో అన్నాడు. దీంతో వెంటనే తప్పుడు వ్యక్తిని కలిశానని మాకు అర్థమైంది. కారు వెనకసీట్లో కూర్చున్న మా సోదరి అతన్ని జుట్టు పట్టి లాగింది. దీంతో వెంటనే కారు నుంచి దిగి అక్కడి నుంచి వచ్చేశామని మహి విజ్ తెలిపింది. క్రూయిజ్ షిప్లో అందరిముందు అశ్లీలనృత్యం చేసేందుకు సంప్రదించాడని మాకు అర్థమైందని మహి వెల్లడించింది.కాగా.. బాలికా వధు సీరియల్లో నందినిగా.. లాగీ తుజ్సే లగన్లో నకుషా పాత్రలతో మహి విజ్ మంచి పేరు తెచ్చుకుంది. ఢిల్లీలో జన్మించిన ఆమె 17 ఏళ్ల వయసులోనే బాలీవుడ్లో అవకాశాల కోసం ముంబయి వచ్చింది. అయితే బుల్లితెర ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించే కంటే ముందే మహి తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో కనిపించింది. తెలుగులో సిద్ధార్థ్ నటించిన తపన చిత్రంలో మహి నటించింది. -
బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..
పెళ్లయిన ప్రతి దంపతులకు ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? లేదా ఎంతమంది పిల్లలు? ఈ ప్రశ్న నుంచి తప్పించుకోని దంపతులు లేరంటే అతిశయోక్తి కాదు. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఈ తిప్పలు తప్పవు. బుల్లితెర స్టార్స్ మహి విజ్-జై భానుశాలి కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? అన్న ప్రశ్న వారికీ ఎదురైంది. ఒకరకంగా చెప్పాలంటే వారు కూడా సంతానం కోసం ఎంతో ఎదురుచూశారు. కానీ పిల్లలు కావాలన్న వారి కోరిక ఫలించలేదు. సంతానం కోసం ఐవీఎఫ్ దీంతో 2019లో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ను ఎంచుకున్నారు. ఈ విధానం ద్వారా మహి గర్భంలో కవలలను ప్రవేశపెట్టారు. తమ సంతోషం రెట్టింపు కానుందని సంబరపడేలోపే వారి ఆనందం ఆవిరైంది. ఒక పాపాయి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మరో పాప మాత్రం ఆరోగ్యంగా జన్మించింది. తాజాగా ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకుంది మహి విజ్. నాలుగో ప్రయత్నంలో సక్సెస్ ఆమె మాట్లాడుతూ.. 'సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఎంచుకున్నాం. తొలి ప్రయత్నం విజయవంతం కాలేదు. మూడుసార్లు విఫలమయ్యాక నాలుగో ప్రయత్నంలో విజయవంతమైంది. ఈ గుడ్‌న్యూస్ నాకు ముందుగా నా భర్త చెప్పాడు. అప్పటికే నేను పూర్తిగా బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. సోనోగ్రఫీ కోసం మాత్రమే బయటకు వెళ్లేదాన్ని. మిగతా సమయాల్లో నర్సే ఇంటికి వచ్చి ఇంజక్షన్స్ ఇచ్చేది. నేను అప్పుడు చాలా సైలెంట్ అయిపోయాను. బయట ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసుకున్నాను. కవలల్లో ఒకరు కన్నుమూత ఐవీఎఫ్ వల్ల కవలలు పుట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నా విషయంలోనూ అదే జరిగింది. కానీ దురదృష్టవశాత్తూ ఒక పాప ఈ లోకాన్ని చూడకముందే కన్నుమూసింది. అయితే డాక్టర్లు ఒకరకంగా మంచే జరిగిందన్నారు. చాలా సందర్భాల్లో కవలల్లో ఒకరు చనిపోయేలా ఉంటే మిగతా ఒకరు కూడా మరణించే అవకాశాలే ఎక్కువన్నారు. కానీ మిగతా పాపకు ఏం కాకపోవడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. కనీసం ఒక్కరైనా మాకు దక్కారని సంతోషించాం' అని చెప్పుకొచ్చింది. కాగా మహి-జై 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు 2019లో తారాకు జన్మనిచ్చారు. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: విజయ్ దేవరకొండ షర్ట్‌తో కనిపించిన రష్మిక.. మళ్లీ దొరికిపోయిందిగా ఈ శుక్రవారం ఓటీటీలో 22 సినిమాలు