వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా ప్రధానకార్యదర్శిగా శ్రీనివాస్‌రెడ్డి
అచ్చంపేట రూరల్ (మహబూబ్‌నగర్) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేటకు చెందిన తోకల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాం సుందర్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జిల్లా సంయుక్త కార్యదర్శిగా కారే కృష్ణను నియమించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర నేత భగవంత్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.