maitripala sirisena
-
శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన ఉగ్రవాదుల మారణకాండను నిలువరించడంలో విఫలమైనందుకు మరో అధికారిపై వేటు పడింది. ఉగ్రదాడిపై నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంతో వ్యవహరించినందుకు శ్రీలంక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పుజిత్ జయసుందర శుక్రవారం రాజీనామా సమర్పించారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశాల నేపథ్యంలో రక్షణ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో ఇప్పటికే రాజీనామా చేయగా, తాజాగా ఐజీపీ జయసుందర బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇంటెలిజెన్స్ కమాండ్ ఏర్పాటు.. ‘ఈ ఉగ్రవాది చోటుచేసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వ వ్యవహారశైలీ కారణమే. దేశంలో జర్నలిస్టుల హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన కొందరు మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులను ఇటీవల అరెస్ట్ చేశాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు సంయుక్త ఆపరేషన్స్ కమాండ్‌ను ఏర్పాటుచేస్తాం. ప్రజల భద్రత దృష్ట్యా ఇంటింటిని తనిఖీ చేస్తాం’ అని సిరిసేన తెలిపారు. సూత్రధారి.. జహ్రాన్ హషీమ్ నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) చీఫ్ జహ్రాన్ హషీమ్(40) ఈ ఆత్మాహుతి దాడులకు నేతృత్వం వహించాడని సిరిసేన తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)కు ఎన్టీజే విధేయత ప్రకటించిందని వెల్లడించారు. ‘ఈస్టర్ రోజున షాంగ్రీలా హోటల్‌పై ఇల్హమ్ అహ్మద్ ఇబ్రహీం అనే ఆత్మాహుతి బాంబర్‌తోపాటు జహ్రాన్ ఈ దాడిలో పాల్గొన్నాడు. ఈ ఆత్మాహుతి దాడిలో వీరిద్దరూ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు’ అని సిరిసేన పేర్కొన్నారు. ముస్లింలపై ఉగ్రముద్ర వద్దు.. ఆత్మాహుతిదాడుల నేపథ్యంలో ముస్లిం సమాజంపై ఉగ్రవాదులుగా ముద్రవేయవద్దని అధ్యక్షుడు సిరిసేన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే)ను నిషేధించే అంశాన్ని మేం పరిశీలించాం. కానీ ఇప్పుడున్న చట్టాల ద్వారా అది సాధ్యం కాదు. ఇందుకోసం త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకువస్తాం’ అని సిరిసేన చెప్పారు. -
శ్రీలంక ప్రధానిగా మళ్లీ విక్రమ సింఘే
కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే(67) తిరిగి బాధ్యతలు చేపట్టారు. దీంతో ద్వీప దేశంలో 51 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి తొలగినట్లయింది. అధ్యక్ష పరిపాలనా భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు సిరిసేన యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)నేత విక్రమ సింఘేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. అనంతరం విక్రమ సింఘే మీడియాతో మాట్లాడారు. ‘ఈ విజయం శ్రీలంక ప్రజాస్వామ్య వ్యవస్థల విజయం, పౌరుల సార్వభౌమత్వానికి లభించిన విజయం. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయం కోసం మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా విక్రమ సింఘే ఐదోసారి ప్రమాణం చేసి చరిత్ర సృష్టించడంతో ఆయన మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. యూఎన్‌పీ, శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)లకు చెందిన 30 మందితో సోమవారం కేబినెట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అధ్యక్షుడు సిరిసేనతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూఎన్‌పీ నేత ఒకరు తెలిపారు. ‘సిరిసేనను కొందరు తప్పుదోవ పట్టించి విక్రమసింఘేకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేలా చేశారు. విక్రమ సింఘేను తిరిగి నియమించడం ద్వారా సిరిసేన సిసలైన వ్యక్తిత్వం బయటపడింది’ అని ఆయన అన్నారు. విక్రమసింఘే తొలగింపు, పార్లమెంట్ రద్దు వంటి సిరిసేన నిర్ణయాలతో అంతర్జాతీయంగా శ్రీలంక ప్రతిష్ట దెబ్బతింది. -
తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన.
-
తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన
సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం తిరుమలకు చేరుకున్నారు. సతీమణి జయంతి పుష్పకుమారి, ఇతర కుటుంబ సభ్యులు, ప్రతినిధులు మొత్తం 19 మందితో కలసి వచ్చారు. పద్మావతి అతిథిగృహాల వద్ద జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఆదివారం తొలి వేకువ 3 గంటలకు సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి పాదాలు దర్శించుకుని.. శనివారం సాయంత్రం శ్రీలంక అధ్యక్షుడు తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాలను దర్శించుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు వచ్చిన సందర్భంగా కర్ణాటక, చిత్తూరు, తిరుపతి అర్బన్‌జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రాజపక్సకు తొలగిన అడ్డంకులు..
కొలంబో: శ్రీలంకలో రాజకీయాలలో ఆశ్చర్యకర పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. దేశ ప్రధాని పదవికి పోటీ పడేందుకు మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మైత్రిపాల సిరిసేన చేతిలో రాజపక్స ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత సిరిసేన పార్టీ సంకీర్ణకూటమిలోనే రాజపక్స పార్టీ కొనసాగుతోంది. ఇప్పటివరకు రాజపక్స అభ్యర్థిత్వాన్ని ఖండిస్తూ వచ్చిన అధ్యక్షుడు సిరిసేన గత రాత్రి మనసు మార్చుకున్నారు. ఆగస్టు 17 న శ్రీలంకలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. యూపీఎఫ్ఏ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా రాజపక్స బరిలో ఉండనున్నారు.