making decisions
-
ఎన్నో అనుకుంటాం.. కానీ కొన్నైనా చేస్తామా?
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంత్సరం వస్తుందంటే చాలు ఓ నెల ముందునుంచే తెగ హైరానా పడిపోతుంటాం. ఈ సంవత్సరం నుంచి ఇవి మానేయాలి, అవి నేర్చుకోవాలి, కొన్ని అలవాటు చేసుకోవాలి, మరికొన్ని మానుకోవాలి.. ఇలా బోలెడు లిస్టు రెడీగా ఉంటుంది. కానీ సూర్యుడు పడమరన ఉదయించడం, చంద్రుడు పట్టపగలు కనిపించడం ఎంత అసాధ్యమో మనం రాసుకున్న లిస్టు ఫాలో అవడం కూడా జరగని పని అని చాలామంది ముందే డిసైడ్ అయిపోతారు. ఆ లిస్టులో మీరు కూడా ఉండే ఉంటారు. కొంతమంది మాత్రం పూర్తిగా కాకపోయినా అనుకున్నదాంట్లో ఒక్కటి పూర్తి చేసినా చాలు ఆస్కార్ గెలిచినంత సంబరపడిపోతారు. మరికొందరు ఏదో మొక్కుబడిగా కొత్త సంవత్సరం తొలినాడు మాత్రమే ఆచరించి తర్వాత మమ అని వదిలేస్తారు. కొందరు అపసోపాలు పడీ ఆచరిస్తారు. కానీ ఏడాది మొత్తం ముందు అనుకున్న మాటపై నిలబడేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇంతకీ అసలు కొత్త సంవత్సరం అనగానే మనకొచ్చే కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలేంటో చూద్దాం.. మద్యపానం, ధూమపానం, మాంసాహారం మానేయడం క్రమశిక్షణ, సమయపాలన పాటించడం డైరీ రాయడం పెళ్లి చేసుకోవడం ఇల్లు కట్టుకోవడం ఉద్యోగం సంపాదించడం ఏదైనా టూర్‌కి వెళ్లడం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం సెల్ఫోన్లో గడిపే సమయాన్ని తగ్గించడం వాహనాలు కొనుగోలు చేయడం బంగారం, ప్లాట్లు కొనుగోలు చేయడం పిల్లల భవిష్యత్తుపై ప్రణాళిక వేసుకోవడం డబ్బు పొదుపు చేయడం సెల్ఫీలు, టిక్‌టాక్‌లు, పబ్జీలకు దూరంగా ఉండాలనుకోవడం ఆలయాలు సందర్శించటం వ్యాయామం చేయడం కొత్త వ్యాపకాలు పెంచుకోవడం.. ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటారు. సో, మీరు ఊహల్లోనే గడిపేయకుండా నిజజీవితంలోనూ వాటిని సాధించేందుకు ప్రయత్నం చేయండి. కొన్నింటినైనా జయించండి. -
ఏఏఈవో పోస్టుల్లో ‘వెయిటేజీ’
వ్యవసాయ కోర్సుల్లో పాసైనప్పటి నుంచి ఏడాదికో మార్కు కేటాయింపు మొత్తం పోస్టులో డిప్లొమా వారికి 80 శాతం సాక్షి, హైదరాబాద్: సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఏఈవో) ఉద్యోగాల్లో అభ్యర్థులకు కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఆధారంగా వెయిటేజీ ఇవ్వనున్నారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు నిర్దేశిత వ్యవసాయ, ఉద్యాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడాదికి ఒక మార్కు చొప్పున వెయిటేజీ ఇవ్వాలని ‘నియామకపు కమిటీ’ నిర్ణయించింది. ఉదాహరణకు అభ్యర్థి సంబంధిత కోర్సులో 2010లో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇప్పటివరకు నాలుగేళ్లుగా పరిగణించి ఏడాదికి ఒక మార్కు చొప్పున నాలుగు మార్కులు వెయిటేజీగా ఇస్తారు. ఈ పోస్టులన్నింటినీ జిల్లా స్థాయిలో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తుండడంతో.. ఆ మెరిట్‌కు ఈ వెయిటేజీని కలిపి లెక్కించి నియామకాలు చేపడతారు. ఏఏఈవో పోస్టుల భర్తీ అంశంపై ‘ఏఏఈవో నియామకపు కమిటీ’ శనివారం సమావేశమైంది. ‘వెయిటేజీ’తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందుగా పేర్కొన్నట్లు ఏఏఈవో ఉద్యోగాలకు వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. కానీ తమకూ అవకాశం కల్పించాలని ఆయా విభాగాల్లో డిగ్రీ, పీజీ కోర్సులు చేసిన అభ్యర్థులు చేసుకున్న విన్నపంతో పాటు పలువురు అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను కమిటీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు ప్రకటించింది. 80 శాతం ఉద్యోగాలు డిప్లొమా వారికే: నియామకపు కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం... మొత్తం 4,442 ఏఏఈవో పోస్టుల్లో 80 శాతం వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా చేసిన అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగతా 20 శాతం పోస్టులను బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తిచేసిన వారికి కేటాయిస్తారు. ఈ మొత్తం పోస్టుల్లో 20 శాతం (888) పోస్టులను ఉద్యాన శాఖకు కేటాయించాలని నిర్ణయించారు. -
ఆపరేషన్ డెరైక్టర్
సీఈ స్థాయితోపాటు రిటైర్డ్ విద్యుత్ ఇంజనీర్ల క్యూ పోటాపోటీగా ఆశావహుల పైరవీలు అమాత్యులతో పలువురి రాయ‘బేరాలు’ హన్మకొండ సిటీ : ఎన్పీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవడంలో డెరైక్టర్లది కీలకపాత్ర. ఇందులోనూ రూ.లక్షల్లో జీతం... మరిన్ని అలవెన్సులు. ఒక్కసారి డెరైక్టర్‌గా నియామకమైతే పొడిగింపు పేరిట మరి కొన్నేళ్లు ఈపదవిలో కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న కీలకమైన డెరైక్టర్ (ఆపరేషన్) పోస్టుపై పలువురు కన్నేశారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సీఈ స్థాయి అధికారులతోపాటు, సీఈ స్థాయిలో రిటైర్ అయిన విద్యుత్ ఇంజనీర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఆపరేషన్ డెరైక్టర్‌గా ఉన్న చంద్రశేఖర్ కాలపరిమితి ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. అప్పట్లో ప్రభుత్వం మూడు నెలల పాటు కాలపరిమితిని పొడిగించింది. ఈ మేరకు సెప్టెంబర్ 30తో ఆయన పదవీ కాలం ముగిసింది. మరోసారి కాలపరిమితిని పెంచకపోవడంతో చంద్రశేఖర్.. డెరైక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రాజెక్ట్ డెరైక్టర్ వెంకటేశ్వర్రావుకు ఆపరేషన్ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో సీజీఎంలుగా పనిచేస్తున్న ఎండీ యూనస్, రాజారావుతోపాటు విద్యుత్ శాఖలో సీఈలుగా పని చేసి రిటైర్ అయిన వారు, ఎస్పీడీసీఎల్లో సీఈ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు పలువురు రేసులో ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఎలాగైనా ఈ పోస్టును దక్కించుకునేందుకు ఆశావహులు... అమాత్యుల వద్దకు క్యూ కడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో పైరవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కుల, మత, సామాజిక, రాజకీయ సమీకరణాలను ఆసరాగా చేసుకుని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేతిలో... ఎన్పీడీసీఎల్లో ఒక సీఎండీతో పాటు, నాలుగు డైరక్టర్ పదవులున్నాయి. ఇందులో సీఎండీగా కొంటే వెంకటనారాయణతో పాటు ఫైనాన్స్ డెరైక్టర్‌గా సుదర్శన్, ప్రాజెక్ట్ డైరక్టర్‌గా బి.వెంకటేశ్వర్రావు, హెచ్ఆర్డీ డెరైక్టర్‌గా జాన్‌ప్రకాశ్‌రావు కొనసాగుతున్నారు. మరో డెరైక్టర్ (ఆపరేషన్) పదవి ఖాళీగా ఉంది. రెండేళ్ల కాలం పాటు ఉండే ఈ డెరైక్టర్ పోస్టును భర్తీ డెరైక్టర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం జూన్ మాసంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టు కోసం 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్పీడీసీఎల్ యాజమాన్యం వీటిని పరిశీలించి ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించింది. పోటాపోటీగా యత్నాలు ఆపరేషన్ విభాగం సీజీఎంగా ఉన్న యూనస్, వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సీజీఎం, ప్రస్తుతం సెలవులో ఉన్న రాజారావు డెరైక్టర్ కుర్చీ కోసం దరఖాస్తు చేసుకొన్న వారిలో ఉన్నట్లు తెలిసింది. వీరితో పాటు దరఖాస్తు చేసుకున్న వారిలో మరికొందరు ప్రభుత్వ పెద్దలతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు అమాత్యులతో రాయ‘బేరాలు’ నడుపుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి అధికారులు కేటాయింపు పూర్తి కాలేదు. దీంతో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. ఇటీవల కేంద్రం ఐఏఎస్ అధికారులను కేటాయించినట్లు జాబితా విడుదల చేసినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలాంటి శాఖలు అప్పగించలేదు. దీంతో డెరైక్టర్ (ఆపరేషన్) నియామకంలో మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఎన్పీడీసీఎల్ వర్గాలు చెబుతున్నారుు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న విధాన నిర్ణయాలే కొనసాగుతున్నాయి. ఇందులో మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తే డెరైక్టర్ పదవీ భర్తీలో తీవ్ర జాప్యం జరిగే అవకాశముందని అంచని వేస్తున్నారు.